Political News

చర్చ- తెలంగాణా ఎందుకు గైర్హాజరైంది ?

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల మొదటిసమావేశానికి తెలంగాణా గైర్హాజరైంది. కృష్ణా, గోదావరి నదుల యాజమాన్యాల బోర్టుల సంయుక్త సమావేశం హైదరాబాద్ లో మంగళవారం జరిగింది. సంయుక్త బోర్డుల మొదటిసమావేశానికి రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరవ్వాలని ముందే సమాచారం ఇచ్చినా తెలంగాణా జలవనరుల శాఖ ఉన్నతాధికారులు హాజరుకాకపోవటం విచిత్రంగా ఉంది. సమావేశానికి హాజరైన ఏపి ఉన్నతాధికారులు మాత్రం కొన్ని విషయాల్లో తమ వాదనను వినిపించారు. మరికొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డితో …

Read More »

బీసీ నేతనే పోటీలోకి దింపుతున్నారా ?

హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కేసీయార్ తీసుకున్న తాజా నిర్ణయంతో అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున ఎవరిని పోటీలోకి దింపుతారనే విషయంలో చాలా పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఒకసారి రెడ్డి అభ్యర్ధని, మరోసారి బీసీనే దింపుతారన్నారు. చివరకు ఎస్సీకే టికెట్టిస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఎవరిని రంగంలోకి దింపుతారనే విషయం కేసీయార్ కనీసం సూచన కూడా చేయలేదు. ఇలాంటి నేపధ్యంలోనే నియోజకవర్గానికే చెందిన కౌశిక్ …

Read More »

స‌ఖ్య‌త లేని నేత‌ల‌తో విజ‌య‌వాడ‌ వైసీపీ ప్ర‌యాణం…!

రాజ‌కీయంగా అత్యంత కీల‌క‌మైన న‌గ‌రం విజ‌య‌వాడ‌. ఇక్క‌డ ఒక‌ప్పుడు క‌మ్యూనిస్టులు, త‌ర్వాత‌.. కాంగ్రెస్ రాజ‌కీయంగా రాజ్యమేలాయి. ఇక్క‌డ ఆ పార్టీల్లో ఉన్న నేత‌లే కార‌ణం. క‌మ్యూనిస్టు, కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త‌తోనే ఇక్క‌డ వారికి ప‌ట్టు చిక్కింది. టీడీపీ 1994, 1999లో అధికారంలో ఉన్నా కూడా విజ‌య‌వాడ న‌గ‌రంలో ఆ పార్టీని శాసించే నాయ‌కులు లేరు. అయితే 2014 త‌ర్వాత మాత్ర‌మే టీడీపీ కూడా ఇక్క‌డ పుంజుకుంది. రెండు అసెంబ్లీ.. …

Read More »

జగన్ రానివ్వకపోతే బీజేపీలోకే… ?

ఏపీ రాజకీయం ఇంకా ఒక కొలిక్కి రావడంలేదు. ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార పార్టీ వరసపెట్టి గెలుస్తోంది. అది వాపో బలమో ఎవరికీ తెలుయదు. ఎందుకంటే వైసీపీ చేతిలో అధికారం ఉంది కాబట్టి అది నిజమైన గెలుపా కాదా ? అన్న దాని మీద ఎవరూ ఏమీ చెప్పలేని పరిస్థితి. అలాగని టీడీపీ పుంజుకుందా అంటే ఆ పార్టీ నాయకులే గట్టిగా చెప్పలేకపోతున్నారు. మరో వైపు చూస్తే గతంలో ఎన్నడూ లేని …

Read More »

జేసీ కుటుంబానికి జ‌గ‌న్ ‘ఫేవ‌ర్‌’.. రీజ‌నేంటి?

రాజ‌కీయాల్లో చిత్ర‌మైన ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి ప‌రిణామ‌మే వైసీపీలోనూ చోటు చేసుకుంది. రాజ‌కీయంగా ఉప్పు నిప్పుగా ఉండే.. అనంత‌పురం జిల్లాకు చెందిన జేసీ బ్ర‌ద‌ర్స్‌తో వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. నిజానికి జేసీ కుటుంబాన్ని గ‌త 2019 ఎన్నిక‌ల‌కుముందు.. పార్టీలో చేరాల‌ని జ‌గ‌న్ ఆహ్వానించారు. ఈ విష‌యాన్ని ఓ సంద‌ర్భంలో దివాక‌ర్‌రెడ్డి ప్ర‌స్తావించారు. త‌న‌ను జ‌గ‌న్ పార్టీలోకి చేర‌మంటున్నాడ‌ని.. అయితే.. క‌ప్పం …

Read More »

అఖిలకు మేనమామ అండ… ?

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ రాజకీయం డోలాయమానంలో పడింది. భూమా కుటుంబంలో కూడా పెద్దగా సఖ్యత లేదు. దాంతో భూమా ఫ్యామిలీకు అడ్డాలుగా నిలిచిన ఆళ్ళగడ్డ, నంద్యాలలో పొలిటికల్ సీన్ రివర్స్ అయింది. ఇక్కడ నుంచి టీడీపీలో పోటీ చేసేందుకు వేరే నాయకులు కూడా రెడీగా ఉన్నారు. చంద్రబాబు కూడా ఈసారి భూమా ఫ్యామిలీని పక్కన పెట్టి వేరే వారికి టికెట్లు ఇస్తారని అంటున్నారు. దాంతో అఖిలప్రియ ఏకంగా జగన్‌నే …

Read More »

హుజురాబాద్.. టీఆర్ఎస్ అభ్యర్థి కన్ఫామ్..!

హుజురాబాద్ ఉప ఎన్నిక దగ్గరపడుతోంది. ఈ హుజురాబాద్ లో విజయం సాధించాలని అన్ని ప్రధాన పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎవరికి వారు తగ్గకుండా ఈ ఉప ఎన్నిక దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ నుంచి.. ఈటల రాజేందర్ పోటీకి దిగుతుండగా… టీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ పడతారా అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. టీఆర్ఎస్ అధిష్టానం ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నిక …

Read More »

థియేటర్ల కష్టాలపై జగన్ మామ మాట్లాడలేడా?

కరోనా-లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా థియేటర్ల వ్యవస్థ దారుణంగా దెబ్బ తింది. మొత్తం ఇండియాలో కనీసం పది శాతం థియేటర్లు అయినా మూతపడి ఉంటాయనడంలో సందేహం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా చోట్ల సింగిల్ స్క్రీన్లు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే మూతపడ్డాయి. మల్టీప్లెక్సుల వెనుక పెద్ద సంస్థలు ఉండటం వల్ల అవి ఎలాగో మనుగడ సాగిస్తున్నాయి.థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో పని చేసే ఉద్యోగులు, సిబ్బంది కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే. …

Read More »

తీన్మార్ మల్లన్న అరెస్టు? ఆమె ఇచ్చిన కంప్లైంట్ తోనేనా?

ఘాటైన విమర్శలతో తెలంగాణ అధికారపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను అరెస్టు చేసినట్లుగా చెబుతున్నారు. దీనిపై స్పష్టత రాలేదు. క్యూ న్యూస్ పేరుతో యూట్యూబ్ చానల్ వ్యవస్థాపకుడిగా.. ప్రతి నిత్యం యూట్యూబ్ లైవ్ లో దినపత్రికలను విశ్లేషించటం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ అధికారపక్షంపై ఆయన తరచూ తీవ్ర వ్యాఖ్యలు.. విమర్శలు.. ఆరోపణలు …

Read More »

తూర్పు లో జ‌న‌సేన‌కు గ్రాఫ్ అంత పెరిగిందా ?

ఏపీలో రాజకీయంగా మార్పు రావాలి అంటే అంతా తూర్పు గోదావరి జిల్లానే చూస్తారు. ఈ సెంటిమెంట్ ఉమ్మడి ఏపీ నుంచి కూడా ఉంది. నాడు తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయ కదలికలు మొదలైతే చాలు మొత్తం ప్రభుత్వం మారినట్లే అనేవారు. నాడు వైఎస్సార్ కానీ, అంతకు ముందు ఎన్టీఆర్ కానీ, ఇక విభజన తరువాత చంద్రబాబు, జగన్ లు కానీ తూర్పులో భారీ మార్పు వల్లనే ముఖ్యమంత్రులు కాగలిగారు. 2014లో …

Read More »

పొత్తు పెటాకులు.. ఏపీలో బీజేపీ సోలో ఫైట్ ?

ఏపీలో బీజేపీ ఒంటరి పోరుకే మొగ్గు చూపుతోందిట. పవన్ కళ్యాణ్ పోకడలు తెలిసి అలా వ్యవహరిస్తోంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ జనసేనతో పొత్తు పెట్టుకుని యేడాదిన్న‌ర‌ గడచింది కానీ బీజేపీకి పెద్దగా లాభం ఒనకూడింది లేదు. పైగా పవన్ సినిమాలు వదలడంలేదు. ఆయన రాజకీయంగా క్రియాశీలకంగా లేరు అని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ మనసులో టీడీపీ ఉందని కూడా అనుమానిస్తున్నారు. పవన్ సైతం తిరుపతి ఉప …

Read More »

అమర్ రాజా ను మేమే పొమన్నాం

కింద పడినా పైచేయి నాదేనన్నాడంట వెనుకటి ఒకడు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు ఉన్నాయని చెప్పక తప్పదు. రాజకీయాల్ని పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే.. అందులో కనిపించే ప్రతి దాని వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. అందుకే.. ఫలానా జరిగింది కాబట్టి ఫలానా అన్నది అనుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. సాధారణంగా ఒక పరిశ్రమ ఒక ప్రాంతం నుంచి తరలి …

Read More »