రాజకీయాల్లో ఎలా ఉన్నా..పాలనలో మాత్రం పారదర్శకంగా ఉంటామని.. ప్రపంచానికి సుద్దులు చెప్పే అగ్రరాజ్యం అమెరికాలో తాజాగా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న నిర్ణయం దేశాన్ని, ప్రపంచాన్ని కూడా కుదిపేస్తోంది. ఇదేసమయంలో కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే.. ఏకంగా నిప్పులే చెరుగుతున్నారు. మరో 50 రోజుల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తన పదవి నుంచి దిగిపోవాల్సి ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ట్రంప్ విజయం దక్కించుకున్నారు. ఆయన జనవరి …
Read More »ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఘర్షణ: 100మందికిపైగా మృతి
పశ్చిమ ఆఫ్రికా దేశం గినియాలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ తీవ్ర విషాదానికి కారణమైంది. ఆ దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన జెరెకొరెలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జట్ల అభిమానుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ రక్తపాతానికి దారితీసింది. ఈ దుర్ఘటనలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. ఫుట్‌బాల్ మ్యాచ్ మధ్యలో రిఫరీ తీసుకున్న ఓ వివాదాస్పద నిర్ణయం అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. ఒక జట్టు …
Read More »సొంత గడ్డ కోసం కోట్లు వదులుకున్న తెలుగు క్రికెటర్!
నితీష్ కుమార్ రెడ్డి.. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో మార్మోగుతున్న తెలుగు క్రికెటర్ పేరిది. ప్రతిష్టాత్మక బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో టెస్టు అరంగేట్రం చేసిన నితీశ్.. తొలి మ్యాచ్‌లోనే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విలువైన పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతను ఓ వికెట్ కూడా పడగొట్టాడు. ఎనిమిది నెలల ముందు అనామకుడైన ఈ క్రికెటర్ ఇప్పుడు ప్రతిష్టాత్మక సిరీస్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడని.. జట్టు విజయంలో కీలకంగా …
Read More »పాకిస్థాన్‌లో ఆడే ప్రసక్తే లేదు.. కేంద్రం హెచ్చరిక
పాకిస్థాన్ వేదికగా 2025లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై మరోసారి వివాదం చెలరేగింది. భారత ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేస్తూ, పాకిస్థాన్‌లో భద్రతా పరిస్థితులు సరిగాలేవని, టీమిండియా అక్కడ ఆడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని తాము పూర్తిగా సమర్థిస్తున్నామని పేర్కొన్నారు. బీసీసీఐ ఇప్పటికే పాకిస్థాన్‌లో మ్యాచ్‌లు ఆడటం సాధ్యమని చెప్పలేదని గుర్తు చేశారు. …
Read More »బెయిల్ రద్దు చేయమంటారా?
కడప ఎంపీ, వైసీపీ నాయకుడు వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి, వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో ఆరోప ణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది బెయిల్ రద్దు చేయమం టారా? సీబీఐ వాదనలపై మీరు ఏం చెబుతారు? అని సుప్రీంకోర్టు నిలదీసింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు కేసు విచారణను వచ్చే ఏడాది మార్చికి వాయిదా వేసింది. ఏం జరిగింది..?వైసీపీ అధినేత …
Read More »ఐపీఎల్: పృథ్వీషా అందుకే అన్‌సోల్డ్ అయ్యాడు
ఐపీఎల్ 2025 వేలంలో టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా అన్‌సోల్డ్‌గా మిగిలి పోవడం చర్చనీయాంశంగా మారింది. 2018లో అండర్-19 వరల్డ్‌కప్ గెలిపించిన కెప్టెన్‌గానే కాకుండా, భారత క్రికెట్‌కు భవిష్యత్ సచిన్ గా భావించబడిన షా, ఐపీఎల్ వేలంలో 75 లక్షల బేస్ ప్రైస్‌తో బరిలోకి దిగినా, ఎలాంటి ఫ్రాంచైజీ అతడిని కొనుగోలు చేయలేదు. ఈ పరిణామం క్రికెట్ అభిమానుల్లో కాస్త నిరాశను కలిగించింది. 2018 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు …
Read More »ఆర్సీబీకి ‘హిందీ’ సెగ.. తెలుగు లేదా?
దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాట హిందీ భాషను బలవంతంగా రుద్దాలని చూస్తే ఊరుకోబోమని స్టాలిన్ తేల్చి చెప్పారు. ఇలా దేశవ్యాప్తంగా హిందీ భాష వ్యవహారంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెట్ జట్టు ఈ వివాదానికి ఆజ్యం పోసింది. కొత్తగా ఆర్సీబీ హిందీలో ఎక్స్ ఖాతా ఓపెన్ చేయడంతో కన్నడ ప్రజలు …
Read More »13 ఏళ్ల వైభవ్.. ఎందుకు సెలెక్ట్ చేశామంటే: రాహుల్ ద్రవిడ్
ఐపీఎల్ మెగా వేలంలో అందరి దృష్టిని ఆకర్షించిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు క్రికెట్ వరల్డ్ లో హాట్ టాపిక్ గా మారింది. అత్యంత పిన్న వయస్కుడిగా రాజస్థాన్ రాయల్స్‌కు ఎంపికైన వైభవ్ రూ.30 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి అడుగుపెట్టగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పోటీ పడ్డాయి. చివరికి రాజస్థాన్ అతడిని రూ.1.10 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ …
Read More »ఐపీఎల్-2025 వేలం..అన్ సోల్డ్ లిస్ట్ ఇదే
ఐపీఎల్-2025 మెగా వేలం ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. వేలం కోసం 577 మందిని షార్ట్ లిస్ట్ చేయగా అందులో నుంచి కేవలం 182 మంది ఆటగాళ్లను మాత్రమే 10 ఫ్రాంచైజీలు కొనుగోలు చేశారు. అయితే, ఈ వేలంలో రిషభ్ పంత్ వంటి ఆటగాళ్లు రికార్డు స్థాయి ధరకు అమ్ముడుపోగా వార్నర్, బెయిర్ స్టో వంటి విధ్వంసకర క్రికెటర్లను కొనేందుకు ఏ టీమ్ మొగ్గు చూపలేదు. శార్దూల్ ఠాకూర్, కేన్ …
Read More »ఐపీఎల్-2025..ఏ టీమ్ లో ఎవరెవరు?
ఐపీఎల్-2025 మెగా వేలం ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్ లలో అత్యంత ఆదరణ, ఆదాయం ఉన్న ఐపీఎల్ టోర్నీ 18వ ఎడిషన్ కోసం జరిగిన ఈ వేలంలో ఆంధ్రా క్రికెటర్లు మొదలు అంతర్జాతీయ క్రికెటర్ల వరకు అంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ప్రతి ఫ్రాంచైజీ తమ తమ అవసరాలను బట్టి కోట్లు కుమ్మరించి తమకు కావాల్సిన ప్లేయర్లను కొనుగోలు చేసింది. ఐపీఎల్ వేలం ముగిసిన తర్వాత ఈ మెగా ఎడిషన్ …
Read More »ఐపీఎల్ వేలంలో 13 ఏళ్ల కుర్రాడి సంచలనం
ఐపీఎల్ 2025 కోసం జరుగుతున్న ఆటగాళ్ల వేలంలో బీహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ మెగా వేలం చరిత్రలో అమ్ముడైన అతి చిన్న వయస్కుడిగా రికార్డుపుటలకెక్కాడు. 13 ఏళ్ల ఈ టీనేజ్ కుర్రాడు క్రికెట్ దిగ్గజాల సరసన వేలం అమ్ముడై ఔరా అనిపించాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు 1.10 కోట్లకు సూర్యవంశీని సొంతం చేసుకుంది. ఐపీఎల్ వేలంలో పాల్గొన్న అది చిన్న వయస్కుడిగా ఓ రికార్డు …
Read More »కునుకేస్తే ఉద్యోగం పీకేస్తారా? కోర్టు చీవాట్లు
ఈ హైటెక్ జమానాలో 24 గంటల పాటు పలు కంపెనీలు సేవలందిస్తున్నాయి. దీంతో, సాఫ్ట్ వేర్ కంపెనీలు, బీపీవోలలో నైట్ షిప్టులో పని చేసేవారి సంఖ్య పెరిగిపోయింది. ఇలా నైట్ షిప్టులు చేసే ఉద్యోగులు..పని చేస్తున్న సమయంలో ఓ చిన్న కునుకు వేయడం సహజం. చాలా కంపెనీలు కునుకు వేసే ఉద్యోగులను చూసీచూడనట్లు వదిలేస్టుంటాయి. కానీ, చైనాలోని ఓ కంపెనీ మాత్రం కునుకు వేసిన ఉద్యోగిపై వేటు వేసింది. దీంతో, …
Read More »