రోటీన్ కు భిన్నంగా నిర్ణయాలు తీసుకునే ముఖ్యమంత్రిగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి పేరుంది. రాష్ట్రం అప్పుల కుప్పలా మారి.. ప్రభుత్వ ఉద్యోగులకు నెల మొదటి రోజు జీతాలు ఇవ్వలేని దైన్య పరిస్థితుల్లోనూ.. సంక్షేమ కార్యక్రమాల్ని బటన్ నొక్కి మరీ లబ్థిదారుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బుల్ని పంపించే సీఎంగా ఆయన పేరు గడించారు. తన పాలనకు వేరే వారు మార్కులు వేయటం ఏమిటి? మనమే వేసుకుందామన్నట్లుగా ఆయన తీరు ఉంటుందన్న …
Read More »జనసేనకు తెలియకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి?
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పడుతున్న ఎమ్మెల్సీ మాధవ్ తాను బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉన్నట్లు ప్రకటించారు. ఆయనే కాదు బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ కూడా అదే మాట చెప్పారు. ఆయన మరో అడుగు ముందుకేసి 2024 ఎన్నికల్లో జనసేనతో కలిసి తాము ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాధవ్ బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రంగంలో దిగారని …
Read More »వివేకానందరెడ్డిని చంపితే.. జగన్కు లాభమేంటి? : కొడాలి నాని
సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ ఘటనపై మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు కొడాలి నాని రియాక్ట్ అయ్యారు. వివేక హత్య పై కొడాలి నాని హాట్ కామెంట్స్ చేశారు. వివేకానందరెడ్డిని చంపితే.. జగన్కు, ఆయన కుటుంబానికి వచ్చే లాభమేంటని ప్రశ్నించారు. వైఎస్ వివేకాను చంపితే దినం ఖర్చులు.. కాఫీ, టీ ఖర్చులు తప్పితే …
Read More »కేసీఆర్ పులా? మేకా?
టైగర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాస్త బకరా కేసీఆర్ అవుతున్నారా?అవుననే అంటున్నాయి ఇటీవల ఆయనకు తగులుతున్న ఎదురుదెబ్బలు. తన వ్యూహాలన్నీ చిత్తవుతుండడంతో కేసీఆర్ మానసికంగానూ బాగా అప్సెట్ అవుతున్నారని.. మోదీని ఎలాగైనా దెబ్బతీయాలని, ఎలాగైనా మోదీపై పైచేయి సాధించాలని.. అదంతా ప్రజల ముందు ప్రదర్శించుకోవాలని ఆరాటపడుతున్న ప్రతిసారీ అనుకోని రీతిలో బీజేపీ నుంచి ఊహించని దెబ్బ తగులుతోందని భావిస్తున్నట్లు బీఆర్ఎస్లోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి. గత నెలలో సికింద్రాబాద్ -విశాఖ వందేభారత్ రైలు …
Read More »బాబు సస్పెన్స్ వారికి బీపీ పెంచేస్తోందట…!
వ్యక్తిగత జీవితంలో అయినా.. వృత్తిగత జీవితంలో అయినా.. ఇప్పుడు ఎవరూ సస్పెన్స్ కోరుకోవడం లేదు. ఏ సమస్య అయినా.. ఏ విషయం అయినా..ఫటాఫట్ తేలిపోవాలి.. ధనాధన్ సాకారం అయిపోవాలి. మరి వీటికే ఇంత ఉంటే.. మరి రాజకీయాల్లో మాత్రం నాయకులు ఎంతసేపని ఓపికగా ఉంటారు? ఎంతగా అని ఓర్పుగా ఉంటారు? కుదరదని.. స్పష్టం చేస్తున్నారు. ఇదే ఇప్పుడు చంద్రబాబుకు సెగ పెడుతుండగా.. పార్టీ నేతల్లో బీపీని పెంచేస్తోంది. ఇంతకీ విషయం …
Read More »మోడీ ఎఫెక్ట్: బీబీసీ ఆఫీసులపై ఐటీ దాడులు
ఇది ఒక ఊహించని ఘటన. ఇప్పటి వరకు తమను ఎదిరించిన రాజకీయ నేతలు.. లేదా.. తాము దారిలో కి తెచ్చుకోవాలని భావించిన వారిపైనే ఐటీ, ఈడీ, సీబీఐ వంటి వాటిని కేంద్ర ప్రభుత్వం ప్రయోగిస్తోందనే వాదన వినిపిస్తోంది. ప్రతిపక్షాలు ఇటీవల పార్లమెంటు వేదికగా కూడా మోడీపై దుమ్మెత్తి పోశాయి. రాజ్యాంగ బద్థ సంస్థలను ఇలా తన స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకుంటున్నారని కూడా విమర్శలు గుప్పించాయి. సరే.. అది రాజకీయం!! బీజేపీ …
Read More »జగన్ పప్పులు ఉడుకుతాయా?!
“ఇప్పటి వరకు ఏపీలో సీఎం జగన్.. వైసీపీ నాయకులు చేసిన పాలన వేరు. ఇక నుంచి చేయబోయే పాలన వేరు! ఎందుకంటే.. ఇప్పుడు గవర్నర్ మారిపోయారు” ఇదీ.. తాజాగా ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. నిజమే! అన్నింటికీ లెక్కలు అడగరనే ధీమా.. తాను ఏం చేసినా.. ఫర్వాలేదనే పరిస్థితి ఏపీ సీఎంలో ఉన్న మాటను తరచుగా ప్రతిపక్షాలు చెబుతూ ఉంటాయి. దీనికి కారణం.. గవర్నర్ పెద్దగా పట్టించుకోకపోవడమేనని కూడా …
Read More »కోటంరెడ్డికి ఆయనే అడ్డంకా
సీఎం జగన్పై, ఆయన సలహాదారు సజ్జలపై డైరెక్టుగా విమర్శలు చేసి ఆ పార్టీతో తెగతెంపులు చేసుకుంటున్నానని ప్రకటించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరుతారని సంకేతాలిచ్చారు. అయితే, టీడీపీలో పరిస్థితులు మాత్రం కోటంరెడ్డికి ఏమాత్రం అనుకూలంగా కనిపించడం లేదు. ముఖ్యంగా నెల్లూరు పార్టమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ నుంచి కోటంరెడ్డికి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. కోటంరెడ్డిని టీడీపీలోకి రానిచ్చేది లేదని ఆయన మండిపడుతున్నారు. ఇప్పటికే టీడీపీ పెద్దలకు …
Read More »ఏలూరు ఎంపీ సీటుపై మాజీ డిప్యూటీ సీఎం కన్ను
జగన్ కేబినెట్లో మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పనిచేసి.. కేబినెట్ విస్తరణ సమయంలో పదవి కోల్పోయిన ఆళ్ల నాని ఇప్పుడు కొత్త అడుగులు వేయబోతున్నారట. అందుకు ఆయన రంగం మొత్తం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. జగన్ మంత్రివర్గంలో మొదటి విడతలోనే ఆరోగ్య మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పెద్ద పెద్ద పదవులు అందుకున్న ఆయన మంత్రివర్గ విస్తరణ సమయంలో పదవి పోగొట్టుకున్నారు. దశలవారీగా వీలైనంత ఎక్కువ మందికి పదవులు ఇవ్వాలన్న జగన్ లెక్క …
Read More »తమిళనాడు పాలిటిక్స్ వద్దంటున్న లోకేష్
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 19వ రోజుకు చేరుకుంది. ప్రతీచోట జన ప్రభంజనం కనిపిస్తోంది. పంచ్ డైలాగులతో లోకేష్ జనాన్ని ఉర్రూతలూగిస్తున్నారు. సైకో ముఖ్యమంత్రిని గద్దె దించే రోజు వచ్చిందని అందరికీ చెబుతున్నారు. తాము అధికారానికి వస్తే చేయబోయేదేమిటో చెబుతున్నారు.. డైమండ్ పాప టు జబర్దస్త్ ఆంటీ లోకేష్ ఇప్పుడు రోజాకు టైటిల్ మార్చేశారు. ఇంతకాలం డైమండ్ రాణి, డైమండ్ పాప అని పిలిచిన లోకేష్ …
Read More »పవన్ కల్యాణ్ను జీవీఎల్ ఇరుకునపెట్టారా?
బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు రాజ్యసభలో మాట్లాడుతూ గన్నవరం విమానాశ్రాయానికి, కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని కోరడంతో జనసేనలో గుబులు మొదలైంది. ఏపీలో కాపుల ఓట్లను కన్సాలిడేట్ చేసే పనిలో పూర్తిగా తలమునకలైన జనసేన ముఖ్యనేతలకు జీవీఎల్ తాజా డిమాండ్ ఇరుకునపెట్టినట్లయింది. పవన్ కల్యాణ్ 2014 నాటి తన తటస్ఠ వైఖరిని వీడి కాపులను ఓన్ చేసుకునే దిశగా రాజకీయాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సమకాలీన …
Read More »అన్నా రాజకీయం యూటర్న్.. ఏం జరిగింది…?
అన్నా రాంబాబు. ఉమ్మడి ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయం దక్కించుకున్నారు. ఫైర్ బ్రాండ్ నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ముక్కుసూటిగా మాట్లాడే అగ్రవర్ణ నేత కూడా! అయితే.. వ్యక్తిగతంగా ఆయన మంచి వాడే అయినా.. నోరు కుదరదనే టాక్ ఉంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేయడం..వివాదాల్లోకి తనను తానే నెట్టేసుకోవడం.. అన్నాకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఆయన ఏ పార్టీలోనూ ఇమడలేక …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates