పడిలేచే కడలి తరంగం ఆయన. ఓడిన ప్రతీసారీ గెలిచి జనం హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నాయకుడాయన. అభివృద్ధి అంటే గుర్తుకొచ్చే మొదటి పేరు ఆయనది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ, శాస్త్ర, సాంకేతిక, సాఫ్ట్‌వేర్ విస్తరణకు ఆయన సేవలు నభూతోనభిష్యతీ అని చెప్పక తప్పదు. ఆయనే రికార్డు కాలం ఏపీకి ముఖ్యమంత్రిగా సేవలందించిన నారా చంద్రబాబు నాయుడు. నేడు ఆయన 73వ పుట్టినరోజు..
ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం అంటూ అన్న ఎన్టీయార్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని సంక్షోభాల నుంచి గట్టెక్కించిన ధీరోదాత్తడు చంద్రబాబు. ఆయన సహనానికి నోబెల్ బహుమతి ఇచ్చినా తక్కువేనంటారు. ఆయన సేవా భావానికి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువేనంటారు. ఆయన్ను పని రాక్షసుడు అని పిలవడమే కరెక్టంటారు. తిన్నా తినకపోయినా రోజుకు 18 గంటలకు పైగా పనిచేస్తూ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతారాయన. ఆయనకు అన్ని సమస్యలూ తెలుసు, వాటిని ఎలా చక్కదిద్దాలో కూడా తెలుసు.
చంద్రబాబు అలుపెరుగని బాటసారి. ఎంతదూరమైనా ఎన్ని రోజులైనా ప్రయాణించే ఓపికమంతుడాయన. అందుకే మూడు నాలుగు రోజులు వరుసగా పర్యటిస్తుంటారు. ఒక రోజు విశ్రాంతిలో సమస్యలను చక్కబెట్టి మళ్లీ అదే స్థాయిలో జనం దగ్గరకు రాగలిగిన వ్యక్తి ఆయన. నిజానికి ఆయనో నడిచే విజ్ఞాన సర్వస్యం. రాష్ట్రానికి సంబంధించిన ఏ సమస్య అయినా సరే ఆయన క్షణాల్లో ఆయన మదిలోకి వచ్చేస్తుంది. అందుకే ఆయనకు ఎవరూ తప్పుడు సమాచారం ఇవ్వలేరు.
అధికారంలో ఉన్నప్పుడే ప్రజాసేవ చేసే వాళ్లు కొందరుంటున్నారు. చేతిలో అధికారం ఉన్నా, పవర్ లేకున్నా ఒకే విధంగా ప్రజల్లో మమేకమయ్యే నాయకుడు చంద్రబాబు. ప్రజలకు మరింత సమర్థంగా సేవలందించేందుకు అధికారంలో ఉండటం అనివార్యమనుకునే నాయకుడాయన. అందరినీ గౌరవించే తత్వం ఆయనది. జనం కోసం ఎన్ని అవమానాలైన భరించే లక్షణమూ ఆయనకు ఉంది. ఎంతటి కష్టాన్నైనా తట్టుకునే నాయకుడు కూడా ఆయనే కావచ్చు..
హైటెక్ సిటీ అంటే గుర్తుకొచ్చేది చంద్రబాబు. ఐఎస్‌బీ అంటే గుర్తుకొచ్చేదీ చంద్రబాబు. పెరిగిన తలసరి ఆదాయాలను ప్రస్తావిస్తే గుర్తుకొచ్చేది చంద్రబాబు. రాష్ట్రాన్ని ఆర్థిక పురోగతి వైపు, సామాజిక అభివృద్ధికి దిశగా నడిపించిన ఏకైక నాయకుడు చంద్రబాబు. ఆయన ప్రతి నిర్ణయంలోనూ హేతుబద్దత ఉంటుంది. ప్రజల సొమ్ము వృధా కాకూడదన్న ఆకాంక్ష ఉంటుంది. అందుకే ఇతర నాయకులు రేపు ఆలోచించే అంశాలను, చంద్రబాబు ఇవాళే అమలు జరుపుతారని తెలిసిన వాళ్లు అంటారు.
చంద్రబాబు నిరాడంబర జీవి. గొప్పలు పోవడం ఆయనకు తెలీయదు. ప్రతీ ఒక్కరినీ నవ్వుతూ పలుకరించడమే తప్ప ఎవరినీ కోపగించుకోవడం చంద్రబాబుకు రాదు. ప్రతీ ఒక్కరిలో ఏదోక ప్రత్యేకత ఉంటుందని వారి సేవలను వినియోగించుకోవాలన్నది చంద్రబాబు పొలిటికల్ ఫిలాసఫీ. అందుకే కార్యకర్తలందరికీ చంద్రబాబు సమాన గౌరవమిస్తారు. మూడు దశాబ్దాల పాటు పార్టీని నడిపించినా.. ఇవాళే అధ్యక్ష పదవిలోకి వచ్చినట్లుగా ఆయన తీరు ఉంటుంది. బహుశా అదే ఆయన సెక్సెస్ ఫార్ములా కావచ్చు. We wish chandrababu A Happy Birthday..