రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ సినీ నేపథ్యం నుంచి వచ్చిన వాడని చాలామందికి తెలియదు. అతను ‘ఓయ్ నిన్నే’ అనే ఊరూ పేరూ లేని సినిమా ఒకటి చేశాడు. అలాంటి సినిమా ఒకటి వచ్చిందని కూడా చాలామందికి తెలియదు. ఐతే అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి వైసీపీ వేవ్ నడిచిన 2019 ఎన్నికల్లో రాజమండ్రిగా గెలిచేశాడు భరత్. ఎంపీ అయ్యాక కూడా భరత్ తన కెమెరా మోజును ఏమీ తగ్గించుకోలేదు. పబ్లిసిటీ …
Read More »దెబ్బకు ఠా!.. బాబు వ్యూహంతో ఆ ‘నలుగురి’కి ఉక్కిరిబిక్కిరే!!
దెబ్బకు ఠా.. దొంగల ముఠా!! అన్నట్టుగా.. చంద్రబాబు వేసిన తాజా ఎత్తుతో.. టీడీపీకి చెందిన నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు.. బిక్కచచ్చిపోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్‌తో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు ఎన్నికలు ముగిసిన తర్వాత.. వైసీపీ పంచన చేరిపోయారు. జగన్‌కు అనుకూలంగా అజెండా భుజాన వేసుకున్నారు. మరికొందరు.. ఏకంగా చంద్రబాబు కుటుంబంపైనే విమర్శలు గుప్పించారు. వీరిలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల సభ్యుడు …
Read More »ఎస్సీ, ఎస్టీ కేసుకు రెడీ అవుతున్న అనిత
టీడీపీ ఫైర్ బ్రాండ్ లేడీ అనితను వైసీపీ ఎప్పుడూ టార్గెట్ చేస్తూనే ఉంటుంది. ఆమెను ఇబ్బందిపెట్టే పోస్టులతో వ్యతిరేక ప్రచారమే వైసీపీ సోషల్ మీడియా పనిగా ఉంటుంది. ఈ సారి కూడా సరిగ్గా అదే జరిగింది. మహిళా దినోత్సవం రోజున… టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా మార్చి 8న మహిళా దినోత్సవం నిర్వహించారు. అనిత ప్రత్యేకంగా అక్కడకు వెళ్లి యాత్రలో పాల్గొన్నారు. అప్పుడు …
Read More »లోకేశ్ పాదయాత్రలో ప్రతి 100 కిలోమీటర్లకు ఏం జరుగుతోందంటే..
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 500 కిలోమీటర్ల మైలు రాయి దాటింది. రోజుకు సగటున సుమారు 13 కిలోమీటర్లు నడుస్తున్న లోకేశ్ 39 రోజుల్లో 500 కిలోమీటర్లు పూర్తి చేశారు. ప్రస్తుతం యాత్ర అన్నమయ్య జిల్లాలో కొనసాగుతోంది. యాత్ర 500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన అన్నమయ్య జిల్లా ప్రజలకు కీలక హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 100 …
Read More »టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు: ఆ రెండు సీట్లే 175 సీట్లకు ప్రీఫైనలా?
ఏపీలో రెండు టీచర్ల ఎమ్మెల్సీ స్థానాల్లో జరగుతున్న ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రెండు స్థానాల్లోనూ బహుముఖ పోటీ కనిపిస్తోంది. ఉమ్మడి కర్నూల్, కడప, అనంతపురం జిల్లాలను కలిపి పశ్చిమ రాయలసీమలో… ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలను కలిపి తూర్పు రాయలసీమ స్థానంలో పోటీ జరుగుతోంది. మార్చ్ 13వ తేదీన ఓటింగ్ జరగనుండగా, 16వ తేదీ నుండి ఓట్ల లెక్కింపు జరగనుంది. టీచర్లలో ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం ఉందన్న మాట …
Read More »నలుగుతున్నారా.. నష్టపోతున్నారా.. పవన్
ఏపీలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ప్రాణసంకటంగా పరిణమించాయనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే.. ఇటు బీజేపీ.. అటు టీడీపీ రెండూ కూడా.. జనసేన తమకంటే తమకే మద్దతు ఇస్తోందని చెబుతున్నాయి. తాజాగా పార్టీ నాయకులతో మాట్లాడిన చంద్రబాబు.. జనసేన కార్యకర్తలను, నేతలను కలుపుకొని ముందుకు సాగాలని పార్టీ నేతలకు సూచించారు. అంతేకాదు.. అవసరమైతే.. జనసేన నేతల ఇళ్లకు వెళ్లి వారిని కలుపుకొని ముందుకు సాగాలని …
Read More »ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఇంత హాటా.. గురూ!
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో పోలింగ్ కూడా జరుగుతోంది. ఎమ్మెల్యే కోటా, ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ కోటాల్లో మొత్తం 9 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే.. వీటిలో ఎమ్మెల్యే కోటాను పక్కన పెడితే.. ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ కోటాలో ఎన్నికలు మాత్రం చాలా హాట్ హాట్‌గా సాగుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. వచ్చే 2024 ఎన్నికలకు.. సెమీ ఫైనల్‌గా భావిస్తున్న ఈ ఎన్నికలను వైసీపీ, టీడీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ …
Read More »కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే.. తర్వాత తుఫానే?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే.. తర్వాత ఏదో తుఫాను వస్తుందన్నమాటే. గతం లో జరిగిన పరిణామాలు.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు గమనిస్తే.. కేసీఆర్ మౌనం.. చాలా కీలకమనే భావన రాజకీయాల్లో వినిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత చుట్టూ.. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం చుట్టుకుంది. ఆమెను కూడా అరెస్టు చేసి.. తీహార్ జైలుకు తరలిస్తారనే చర్చ కూడా సాగుతోంది. గతంలో 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం జరిగినప్పుడు.. …
Read More »కవితది బలప్రదర్శనేనా ?
మహిళా రిజర్వేషన్ పేరుతో శుక్రవారం ఢిల్లీలో కల్వకుంట్ల కవిత బలప్రదర్శనకు దిగుతున్నారా ? క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు చూస్తుంటే అవుననే అంటున్నారు అందరు. ఇంతకీ విషయం ఏమిటంటే మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించి చట్టం చేయాలని కవిత డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ఈ డిమాండ్ దశాబ్దాలుగా వినబడుతునే ఉంది. అధికారంలో ఎవరున్నా మహిళా రిజర్వేషన్ బిల్లును పట్టించుకోవటంలేదు. మళ్ళీ ప్రతిపక్షంలోకి మారగానే అందరికీ మహిళా రిజర్వేషన్ బిల్లు గుర్తుకొస్తుంది. …
Read More »లోకేష్ ఇన్నన్నా.. కిక్కురుమనలేదే..!!
రాజకీయాల్లో నేతలు ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకోవడం.. ఒకరి పై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం కామనే. పైగా వైసీపీ-టీడీపీ నేతల మధ్య ఈ వివాదాలు.. కౌంటర్లు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. ఇక, తాజాగా టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్రలో చిత్తూరు జిల్లాలో నడుస్తున్నారు. అయితే.. ఆయన ఏ నియోజకవర్గానికి వెళ్తే.. అక్కడి ఎమ్మెల్యేను టార్గెట్ చేసుకుంటున్నారు. తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. …
Read More »ఢిల్లీ లిక్కర్ స్కామ్.. కవిత చేసిన తప్పేంటి?
ప్రస్తుతం తెలంగాణకు చెందిన రాజకీయ నాయకురాలు, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత పేరు ఊరూ వాడా మార్మోగుతోంది. ఢిల్లీలో వెలుగు చూసిన.. లిక్కర్ కుంభకోణంలో ఆమె పాత్ర ఉందని.. పేర్కొంటూ.. ఈడీ ఇప్పటికే ఆమెను ఒకసారి విచారించింది. ఇప్పుడుమరోసారి విచారణకు రావాలని పిలిచింది. ఈ విచారణ తర్వాత.. ఏం జరుగుతుంది? అనేది ఉత్కంఠగా మారింది. దీంతో అసలు కవిత కు ఈ కేసుకు సంబంధం ఏంటి? అనేది సామాన్యుల ప్రశ్న. …
Read More »అమరావతి భూములు అమ్మేస్తోందా ?
రాజధానిగా అమరావతి పనికి రాదు కానీ అమ్మకానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి భూములు మాత్రం కావాలా ? ఇపుడిదే ప్రశ్న అమరావతి ప్రాంతం రైతుల నుండి ఎదురువుతోంది. వివిధ అవసరాల కోసం అమరావతి ప్రాంతంలోని 14 ఎకరాలను అమ్మేందుకు ప్రభుత్వం ఫైల్ సిద్ధం చేసింది. అమరావతి ప్రాంతంలోని రెండు గ్రామాల్లో 14 ఎకరాలను ఈ వేలం పద్దతిలో అమ్మేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ వేలం ద్వారా సుమారు రు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates