Political News

షర్మిలకు బాబు, పవన్, లోకేష్ విషెస్… మరి జగన్?

చెల్లెలికి బర్త్‌డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! పాలిటిక్స్‌లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా అడిగితే టక్కున… వైయస్ జగన్ అని సమాధానం ఇస్తారు. అన్నాచెల్లెళ్ల మధ్య దూరం అంతలా పెరిగిపోయింది. జగన్ విషెస్ చెప్పలేదు సరే… షర్మిలకు కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ శుభాకాంక్షలు చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. జగనన్నను వదిలి బాణాన్ని అంటూ ఏపీ …

Read More »

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై సంచలన నిర్ణయం

తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాక్ష్యాత్తూ సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని ఈ విషయంపై ఏదో ఒకటి త్వరగా తేల్చాలని తెలంగాణ స్పీకర్ కు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా నేడు ఆ విషయంపై తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు …

Read More »

‘రుషికొండ ప్యాలెస్ డబ్బుతో రెండు మెడికల్ కాలేజీలు కట్టొచ్చు’

వైసీపీ అధినేత జగన్ పై సీఎం చంద్రబాబు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై వైసీపీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కోటి సంతకాల సేకరణ చేసి, వాటిని గవర్నర్ కు సమర్పించి పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణాలను అడ్డుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. దీనిపై స్పందించిన సీఎం …

Read More »

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల భ‌క్తుల‌పై తీవ్ర ప్ర‌భావం కూడా చూపించింది. వీటి విలువ 70 వేలు. అయితే.. ఈ కేసులో రాజీ చేసుకోవ‌డంతోపాటు.. ఫిర్యాదు చేసిన అప్ప‌టి టీటీడీ భ‌ద్ర‌తా సిబ్బంది.. సీఐ.. స‌తీష్ కుమార్‌.. అనుమానాస్ప‌ద రీతిలో మృతి చెందారు. మొత్తంగా ఈ కేసు విచార‌ణ కొన‌సాగుతోంది. తాజాగా ఏపీ హైకోర్టు …

Read More »

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు. అయితే, పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాత్రం ఇందుకు తాను భిన్నం అంటున్నారు. అంతేకాదు, తప్పు చేస్తే కొట్టండి అంటూ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. తాను పార్టీలో ఎవరికి చెడు చేయలేదని, తన వల్ల ఎవరికీ చెడు జరగలేదని అన్నారు. ఏదైనా …

Read More »

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757 మంది ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన సందర్భంగా, శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్ల స్టైఫండ్‌ను ప్రస్తుతం ఇస్తున్న రూ.4,500 నుంచి నేరుగా రూ.12,500కు పెంచుతున్నట్లు వేదికపైనే ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సంప్రదించి ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సీఎం …

Read More »

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని చిలకలూరిపేట స్కూలుకు గ్రంథాలయానికి సరిపడా పుస్తకాలను, ల్యాబ్ కు కంప్యూటర్లను అందజేశారు. కేవలం పది రోజుల్లో వీటిని మంజూరు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ రోజు ఓ గిరిజన కానిస్టేబుల్ వేదికపై తమ గ్రామానికి రోడ్డు కోసం విన్నవించగా.. దానిని సభ ముగిసేలోగా మంజూరు చేశారు. …

Read More »

సోనియా, రాహుల్ గాంధీలపై కేసు… కోర్టు సంచలన వ్యాఖ్యలు

నేష‌న‌ల్ హెరాల్డ్ ప‌త్రిక వాటాల‌ను విక్ర‌యించ‌డం ద్వారా.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు అక్ర‌మాలకు తెర‌దీశార‌ని.. దీనిలో వారు.. మ‌నీలాండ‌రింగ్‌కు కూడా పాల్ప‌డ్డార‌ని.. పేర్కొంటూ.. సీబీఐ, ఈడీ అధికారులు కేసులు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. వీటికి సంబంధించి.. ఇద్ద‌రినీ సీబీఐ ఒక ద‌ఫా విచార‌ణ‌కు కూడా పిలిచింది. మ‌రోవైపు అరెస్టుల ప‌ర్వం కూడా కొన‌సాగుతుంద‌ని కొన్నాళ్ల కింద‌ట వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే.. తాజాగా ఈ కేసులో ఢిల్లీలోని రౌస్ …

Read More »

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు ఇంకా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నెల 13వ తేదీన మెస్సీ పశ్చిమ బెంగాల్ తో పాటు తెలంగాణలో పర్యటించారు. ఆ రోజు ఉదయం అక్కడి సాల్ట్‌లేక్ స్టేడియంలో మెస్సీ కొద్దిసేపు మాత్రమే కనిపించి వెళ్లాడని ఆయన అభిమానులు ఆగ్రహం చెందారు. పలు రాష్ట్రాల నుంచి ఆయన మ్యాచ్ చూసేందుకు …

Read More »

మొన్న టీచర్లు.. నేడు పోలీసులు.. ఏపీలో కొలువుల జాతర

ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు పోలీసు శాఖలో ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న కానిస్టేబుళ్ల భర్తీని ముగించింది. మొత్తం 6,100 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా 6,014 మంది ఎంపికయ్యారు. వీరిలో 5,757 మందిని శిక్షణకు ఎంపిక చేయగా, సివిల్ కానిస్టేబుళ్లుగా 3,343 మంది, ఏపీఎస్‌పీ కానిస్టేబుళ్లుగా 2,414 మంది ఎంపికయ్యారు. సివిల్ విభాగంలో …

Read More »

రఘురామ జైలులో ఉన్నప్పుడు ముసుగు వేసుకొని వచ్చిందెవరు?

నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్ తీరు ఇది. మాజీ ఎంపీ, ఏపీ ఉపసభాపతి రఘురామ కృష్ణమరాజుపై థర్డ్‌డిగ్రీ ప్రయోగించిన కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు. సునీల్‌కుమార్ విచారణ నిమిత్తం గుంటూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు. ఉదయం 10.45 నుంచి సాయంత్రం నాలుగు గంటల …

Read More »

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ బిజెపి ఎంపీలకు సూచించారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వాన్ని పెంపొందించాలని కూడా ఆయన చెప్పారు. నిజానికి ఏ రాష్ట్రం గురించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటివరకు ఈ విధంగా వ్యాఖ్యలు చేయలేదు. పార్టీని బలోపేతం చేయాలని లేదా నాయకుల మధ్య సమన్వయం …

Read More »