వచ్చే ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175/175 సీట్లు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే.. దీనికి దీటుగా చంద్రబాబు కూడా.. 175 రాగం అందుకున్నారు. మేమేం తక్కువ అంటూ.. ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం దక్కించుకునేందుకు తమ్ముళ్లు రెడీ కావాలని పిలుపునిచ్చారు. ఇది సాధ్యమేనన్నది చంద్రబాబు టాక్. అయితే.. ఈ క్రమంలో తాజాగా అసలు రాష్ట్రంలో గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమనే నియోజకవర్గాలు ఎన్ని …
Read More »ఎన్టీఆర్ వర్ధంతి.. జగన్ ఇలా చేస్తున్నారు!
దివంగత మహానాయకుడు, తెలుగు వారి అన్నగారు.. ఎన్టీఆర్ వర్ధంతి ఈరోజు. ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరంలో ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యం ఇస్తూ.. టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వర్ధంతిని ఆర్భాటంగా చేయాలని నిర్ణయించుకుంది. దీనికి సంబందించి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు కూడా చేసుకుంది. అయితే.. అదే సమయంలో సీఎం జగన్ కూడా తనదైన శైలిలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు జరగకుండా.. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఉమ్మడి …
Read More »నందమూరి కుటుంబానికి చంద్రబాబు ‘సంక్రాంతి’ కానుక..!
నందమూరి కుటుంబానికి టీడీపీ అధినేత చంద్రబాబు సంక్రాంతి కానుక ఇచ్చారా? ఆ కుటుంబంతో ఉన్న రాజకీయ అనుబంధాన్ని మరింత పెంచుకుంటున్నారా? అంటే.. ఔననే అంటున్నారు టీడీపీ నేతలు. కీలకమైన గుడివాడ నియోజకవర్గం టికెట్ను నందమూరి కుటుంబానికి కన్ఫర్మ్ చేసినట్టు పెద్ద ఎత్తున టీడీపీలో చర్చసాగుతోంది. సంక్రాంతి సందర్భంగా చంద్రబాబు నందమూరి కుటుంబానికి ఈ కానుక ఇచ్చారని మీడియా వర్గాలకు సమాచారం అందింది. దీంతో టీడీపీ శ్రేణు్ల్లో ఉత్సాహం నెలకొంది. వచ్చే …
Read More »బండి సంజయ్కు ఫుల్ మార్క్స్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో అనూహ్యమైన ఆదరణ దక్కింది. ప్రధాని మోదీ స్వయంగా ఆయన్ను అభినందించడంతో పాటు ఆయన్ను చూస్తే వెంకయ్యనాయుడు గుర్తొస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు. సోమవారం ఢిల్లీలో ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో బండి సంజయ్ తెలంగాణలో పార్టీ పనితీరును వివరించడమే కాకుండా తాను చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర గురించి నివేదిక సమర్పించారు. దాంతో ప్రజాసంగ్రామ యాత్ర …
Read More »వైసీపీకి 40-50 సీట్లే.. ఆ ఎంపీగారి జోస్యం అదిరిందిగా!!
వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయాలని.. వైసీపీ అధినేత, సీఎం జగన్ పార్టీ నాయకులకు లక్ష్మణ రేఖ, నిర్దిష్ట లక్ష్యం కూడా ఇచ్చారు. అంటే.. రాష్ట్రంలోని 175/175 నియోజకవర్గాల్లో విజయం సాధించాలని జగన్ భావిస్తున్నారు. అంతేకాదు.. ఇప్పటికే ‘వైనాట్ 175’ నినాదంతో జగన్ ముందుకు సాగుతున్నారు. దీనిని నాయకులు కూడా నెమ్మదిగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. అయితే.. అనూహ్యంగా ఇప్పుడు అదే వైసీపీ ఎంపీ.. రెబల్ నాయకుడు, కనుమూరి రఘురామకృష్ణరాజు …
Read More »కేసీఆర్ వర్సెస్ టీమ్ఇండియా
కేసీఆర్ ఖమ్మం సభకు కొత్త కష్టమొచ్చింది. ఇప్పటికే ఖమ్మంలో సొంత పార్టీలో అసమ్మతి కారణంగా సభ అనుకున్న స్థాయిలో జరుగుతుందా లేదా అన్న అనుమానాలతో ఇతర జిల్లాల నుంచి భారీ ఎత్తున ప్రజలను తరలించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. కానీ, ఆ ప్లాన్లకు టీమ్ ఇండియా నుంచి ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేసీఆర్ ఖమ్మంలో 5 లక్షల మందితో సభ తలపెట్టిన రోజునే హైదరాబాద్లో ఇండియా, న్యూజిలాండ్ జట్ల …
Read More »కొండగట్టులో 24న పవన్ పూజలు
పవన్ కల్యాణ్ యాత్రకు సిద్ధమవుతున్నాయి. ర్యాలీలు, వీధి చివరి మీటింగులకు అడ్డుచెబుతూ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1 పై హైకోర్టు స్టే ఇవ్వడంతో పవన్లో జోష్ పెరిగింది. ఇక రయ్ రయ్ అని దూసుకుపోవడమే తరువాయి అని చెబుతున్నారు… ఈ నెల 24న ఉమ్మడి కరీంనగర్లోని కొండగట్టు ఆంజనేయస్వామిని పవన్ కల్యాణ్ దర్శించుకోనున్నారు. ఆలయ సన్నిధిలో ‘వారాహి’ వాహనానికి సంప్రదాయ పూజ జరపాలని జనసేన నిర్ణయించింది. …
Read More »కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీకి దూరమైనట్లేనా ?
బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీరుపై మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. వీర్రాజు ఎవరినీ కలుపుకుపోవడం లేదని, ఆయనతో ఉన్న నలుగురైదుగురు నేతలను మాత్రమే సంప్రదిస్తున్నారని కన్నా చాలా రోజులుగా ఆగ్రహం చెందుతున్నారు. పైగా కన్నా నియమించిన జిల్లా అధ్యక్షుల్లో 8 మందిని సోము వీర్రాజు మార్చేశారు. వీర్రాజు వర్గం ప్లాన్ ప్రకారం పార్టీని హైజాక్ చేస్తున్నారని కన్నా వర్గం బహిరంగ ఆరోపణలకు …
Read More »పుంగనూరు-కుప్పం.. వైసీపీ వర్సెస్ టీడీపీ
ఏపీ రాజకీయం మరింత వేడెక్కింది. నిన్న మొన్నటి వరకు చంద్రబాబును సీఎం జగన్ టార్గెట్ చేశారు. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్సెస్ చంద్రబాబుగా రాజకీయం మారిపోయింది. అయితే.. దీని వెనుక ఏదో ఒక వ్యూహం ఉందని అంటున్నారు. ఏమీ లేకుండా.. చంద్రబాబును ఇంతగా ఒత్తిడికి గురి చేయరని కూడా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. నిజానికి ఇప్పటి వరకు కూడా.. రాష్ట్ర …
Read More »పాత కాపులు సిద్ధం.. పవన్ ఏం చేస్తారు..?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయం కోసం.. చాలా మంది నాయకులు ఎదురు చూస్తున్నారు. మేమొస్తామంటే.. మీరురానిస్తారా!! అంటూ.. నాయకులు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరంతా పాత కాపులే. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసి ఓడిపోయిన వారే. నిజానికి గత ఎన్నికల్లో 142 స్థానాల్లో నేరుగా జనసేన తన పార్టీ అభ్యర్థులను రంగంలోకి దింపింది. ఒక్క రాజోలు మినహా.. ఇతర నియోజకవర్గాల్లో ఓడిపోయింది. తర్వాత.. ఈ …
Read More »బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడికి ఫస్ట్ టార్గెట్
ఖమ్మంలో జనవరి 18న బీఆర్ఎస్ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు శరవేగంగా జరిగిపోతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటు మరో మూడు రాష్ట్రాల సీఎంలు ఈ సభకు రానున్నారు. పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్.. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఈ సభకు వస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మరికొందరు నాయకులూ హాజరువుతున్న ఈ …
Read More »బీజేపీతో టీడీపీ కలిస్తే గెలిచేది వైసీపీయేనట
వరుస సభలు, పోటెత్తుతున్న ప్రజలు తెలుగుదేశం పార్టీలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అయితే, ఆ ఉత్సాహాన్ని చల్లార్చేలా తాజాగా ఓ సర్వే కొన్ని విషయాలను వెల్లడించింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుంది.. జనసేనతో కలిసి వెళ్తే ఎలా ఉంటుంది.. జనసేన, బీజేపీలు రెండింటినీ కలుపుకొని వెళ్తే ఎలాంటి ఫలితం ఉంటుందనేది ఆ సర్వే అంచనా వేసింది. ఈ అంచనాలు ఎంతవరకు కరెక్టు అనేది పక్కనపెడితే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates