గ్యాంగ్ స్టర్లకు టెర్రర్ గా మారిన యోగి

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి గ్యాంగ్ స్టర్లు, మాఫియా నేతలకు టెర్రర్ గా మారిపోయారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఇప్పటివరకు సుమారు 300 ఎన్ కౌంటర్లయినట్లు సమాచారం. ఈ ఎన్ కౌంటర్లలో కరడుగట్టిన గ్యాంగ్ స్టర్లు, మాఫియా డాన్లుగా ప్రచారంలో ఉన్న సుమారు 210 మంది చనిపోయారు. దాంతో చిన్నా, చితకా రౌడీలు, నేరగాళ్ళుగా ముద్రపడిన వాళ్ళు సుమారు 25 వేలమంది లొంగిపోయారు.

వీళ్ళు కాకుండా మరికొన్ని వేలమంది పొరుగురాష్ట్రాలకు పారిపోయారు. మొత్తంమీద చూడాల్సింది ఏమిటంటే యూపీలో నేరసామ్రాజ్యం కంట్రోల్ అవుతున్నట్లుంది. యోగా లాగ ఇంత గట్టిగా నిలబడే ముఖ్యమంత్రులు లేకే రాష్ట్రం నేరగాళ్ళకు అడ్డగా మారిపోయింది. 2012-17 మధ్య రాష్ట్రంలో ఒకమోస్తరు నుండి పెద్ద నేరాలవరకు 700 జరిగాయట. అయితే వాటిపై విచారణా లేదు, నిందితులను పట్టుకున్నది లేదు, శిక్షలు పడిందీ లేదు. అలాంటిది యోగీ సీఎం కాగానే ఆ కేసులన్నింటినీ రివ్యూ చేశారు.

వాటిల్లో హత్యలు, మానభంగాలు, కిడ్నాపులు, బెదిరింపులు, కబ్జాలకు పాల్పడిన కేసులంటు దేనికదీ విడదీశారు. వీటిల్లో పాల్గొన్న నేరగాళ్ళ వివరాలను తయారుచేశారు. వాళ్ళకున్న నేరచరిత్రను స్టడీచేశారు. దాంతో ఒక లిస్టు తయరుచేసుకుని వేట మొదలుపెట్టారు. నేరగాళ్ళను వేటాడటం కోసం మెరికల్లాంటి ఎస్పీలను, యువ పోలీసు అధికారులను బృందాలుగా ఏర్పాటుచేశారు. ఇలా కొన్ని వందల టీమ్ లు ఏర్పాటవ్వగానే ఎన్ కౌంటర్లు మొదలుపెట్టారు.

తనపై రాజకీయంగా ఎలాంటి ఒత్తిళ్ళు లేవుకాబట్టే తాను అనుకున్నది అనుకున్నట్లుగా స్వేచ్చగా చేసుకుపోతున్నారు. జైళ్ళల్లో ఉన్న నేరగాళ్ళల్లో కొందరికి కుటుంబసభ్యులు బెయిళ్ళు తీసుకొచ్చినా బయటకు రావటానికి నేరగాళ్ళు ఇష్టపడటంలేదంటేనే అర్ధంచేసుకోవచ్చు యోగీ ఎంత టెర్రర్ అయిపోయారు.

తాము జైళ్ళల్లోనే ఉంటామని తమకిచ్చిన బెయిళ్ళని రద్దు చేయాలని నేరగాళ్ళు తమ లాయర్లతో మొత్తుకుంటున్నారట. ఎస్పీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడే యూపీ నేరగాళ్ళకు స్వర్గదామంగా మారిపోయిందని కమలనాదులు ఆరోపిస్తున్నారు. అలాంటి స్వర్గదామమే ఇపుడు నేరగాళ్ళను వణికించేస్తోంది. వ్యాపారస్తులు, రియాల్టర్లు, పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా నేరగాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదని తాజాగా యోగీ భరోసాయే చెబుతోంది నేరగాళ్ళ పరిస్ధితి ఏమిటో ?