పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగం ఆరోపణలపై ఉక్కిరిబిక్కిరి అవుతున్న నరేంద్ర మోడీకి అమెరికా పెద్ద షాకే ఇచ్చింది. తమ దేశంలో పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెగాసస్ సాఫ్ట్ వేర్ కారణంగా మానవ హక్కులకు భంగం కలుగుతున్నట్లు అమెరికా వాణిజ్య శాఖ ఓ ప్రకటనలో స్పష్టంగా చెప్పింది. ఈ సాఫ్ట్ వేర్ ద్వారా జర్నలిస్టులు, ప్రతిపక్షాల నేతలు, జడ్జీలు, ఇతర రంగాల్లో నిపుణులు, సామాజిక …
Read More »కాంగ్రెస్ పుంజుకుంటోందా ?
క్షేత్ర స్థాయిలో తాజాగా జరిగిన పరిణామాలను చూసిన తర్వాత ఇదే అనిపిస్తోంది. దేశవ్యాప్తంగా జరిగిన 29 అసెంబ్లీ, 3 పార్లమెంట్ ఉపఎన్నికల్లో బీజేపీకి పెద్ద షాకే తగిలింది. బీజేపీ విషయాన్ని పక్కనపెట్టేస్తే కాంగ్రెస్ కు ఊహించని విధంగా సానుకూల ఫలితాలు దక్కాయి. గడచిన రెండున్నరేళ్ళల్లో ఎక్కడ అసెంబ్లీ, లోక్ సభ ఉప ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ కు ఎదురుదెబ్బలే తప్ప విజయం అంటు దక్కిందే లేదు. అలాంటిది తాజా ఉపఎన్నికల్లో …
Read More »బీజేపీ సీఎం అభ్యర్థిగా ఈటల?.. ఎందుకలా?
ఈటల రాజేందర్.. ప్రస్తుతం తెలంగాణా రాజకీయాల్లో మారుమోగిపోతున్న పేరిది. కేసీఆర్కు రాష్ట్రంలో ఎదురేలేదనుకుంటున్న సమయంలో.. ఆయన్ను ఎదిరించి, ఎన్నికల్లో నిలబడి విజయాన్ని అందుకున్న నేత ఈటల. ప్రస్తుతం అందరి దృష్టి ఆయనపైనే.. ప్రసంశలన్నీ ఆయనవే. ఈ సందర్భంగా ఈటల తదుపరి అడుగు ఏమై ఉంటుందనే ప్రశ్న సహజమే. దీనికి సమాధానంగా ప్రస్తుతం రాజకీయవర్గాల్లో ఓ ఆసక్తికర కథనం వైరల్ అవుతోంది. టీఆర్ఎస్ కొనసాగిన దొరకని అవకాశం..బీజేపీలో ఆయనను వరించబోతోందని రాజకీయ …
Read More »ఉప ఎన్నికల దెబ్బేనా ?
దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఉప ఎన్నికల ఫలితాల దెబ్బ నరంద్ర మోడిపై బాగానే పనిచేసినట్లుంది. పెట్రోలుపై లీటరుకు రు. 5, డీజిల్ పై లీటరుకు రు. 10 తగ్గించటమంటే మామూలు విషయం కాదు. నిజానికి తగ్గించింది చాలా తక్కువనే చెప్పాలి. అయినప్పటికీ ఈ తగ్గింపు కూడా తగ్గించటానికి నరేంద్ర మోడి ఏమాత్రం ఇష్టపడలేదు. దేశవ్యాప్తంగా జరిగిన 29 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 22 నియోజకవర్గాల్లో ఓడిపోయింది. అలాగే …
Read More »కేసీయార్ కు అసెంబ్లీ మే సవాల్
అదేనండి మామూలుగా బస్తీ మే సవాల్ అని అంటుంటారు కదా. దాన్నే కాస్త మార్చి అసెంబ్లీ మే సవాల్ అన్నాము. ఎందుకంటే కేసీయార్ నిలువెల్లా ద్వేషించిన ఈటల రాజేందర్ నే జనాలు హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో మళ్ళీ ఎన్నుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను ఈటల గెలవకూడదనే టార్గెట్ తో కేసీఆర్ చేయని పని లేదు. ప్రలోభాలు, బెదిరింపులు, కొనుగోళ్ళు, నియామకాలు, పంపకాలు, హామీలు, ఒత్తిళ్ళు దేనికి అవకాశం ఉందంటే అదంతా చేశారు. …
Read More »అయ్యయ్యో.. ఇక కాంగ్రెస్ ఇంతేనా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్. దివంగత మఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో ఆ పార్టీ ఓ వెలుగు వెలిగింది. కానీ ఆ తర్వాత పార్టీలో అంతర్గత కుమ్ములాటలు.. సీనియర్ల ఆధిపత్యం.. పదవులు పోరు.. ఇలా వివిధ కారణాలతో పార్టీ ప్రతిష్ట మసకబారింది. ఇక ఉమ్మడి ఏపీని విభజించి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేసిన తర్వాత ఏపీలో పార్టీ కనుమరుగైపోగా.. తెలంగాణాలో …
Read More »ట్రబుల్ షూటర్ కు చుక్కలు చూపిన మాస్టర్ మైండ్
టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ అన్నంతనే ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేకుండా గుర్తుకు వచ్చే పేరు హరీశ్ రావు. పార్టీకి విధేయుడిగా ఉంటూ.. ఎన్ని అవమానాలకు గురి చేసినా గమ్మున ఉంటూ.. కష్టపడతారన్న పేరు ఆయనకు ఉంది. 2018 ఎన్నికల వేళలోనూ.. ఆ తర్వాత దాదాపు ఆర్నెల్లకు పైనే హరీశ్ రావు ఫోటోను కేసీఆర్ సొంత మీడియా సంస్థలో ప్రముఖంగా చూపించకపోవటాన్ని పలువురు ప్రస్తావిస్తుంటారు. అంతేనా.. మొన్న జరిగిన ప్లీనరీ …
Read More »టీడీపీ ముందు జాగ్రత్త పడుతోందా ?
స్ధానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ముందు జాగ్రత్త పడుతున్నట్లే ఉంది. నామినేషన్లు వేయబోయే తమ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని స్టేట్ ఎలక్షన్ కమీషన్ కు కొన్ని సూచనలు చేసింది. ఇందులో ప్రధానమైనది ఏమిటంటే ఆన్ లైన్లో నామినేషన్లు సబ్మిట్ చేసే సౌకర్యం కల్పించటం. ఆ మధ్య జరిగిన స్ధానిక ఎన్నికల్లో కొన్నిచోట్ల తమ అభ్యర్థులను అధికార వైసీపీ నేతలు నామినేషన్లు కూడా వేయనీయలేదని ఆరోపించింది. కొందరు నేతలతో …
Read More »రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టిన జానారెడ్డి
హుజురాబాద్ ఉప ఎన్నికలో ఓటమిపై కాంగ్రెస్ సింహావలోకనం చేసుకుంటోంది. ఈ రోజు గాంధీభవన్ లో పొలిటికల్ ఎఫైర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశం గరంగరంగా జరిగినట్లు చెబుతున్నారు. హుజురాబాద్ ఓటమిపై నేతలు తమ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. సమావేశం ప్రారంభం కాగానే హుజురాబాద్ ఫలితాల తర్వాత ఓటమికి తానే బాధ్యత వహిస్తానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వాడివేడిగా చర్చ సాగినట్లు చెబుతున్నారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలను …
Read More »ఈటెల నెక్ట్స్ ఇదేనా…
హోరాహోరీ ప్రచారాలు.. మాటల యుద్ధాలు.. విమర్శలు ప్రతి విమర్శలు.. ఆరోపణలు.. డబ్బు ప్రవాహం.. ఇలా ఎంతో ఆసక్తిని రేపిన హుజూరాబాద్ ఉప ఎన్నిక పోరు ముగిసింది. దాదాపు మూడు నెలలకు పైగా తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ఈ ఎన్నికలో ప్రజలు ఈటల రాజేందర్కే మరోసారి పట్టం కట్టారు. అధికార పార్టీ టీఆర్ఎస్ విజయం కోసం ఎంతగానో ప్రయత్నించినా అక్కడి ఓటర్లు ఈటలకే అండగా నిలిచారు. అక్కడి ప్రజల్లో ఒకడిగా …
Read More »జగన్కు ఉద్యమ సెగ
ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల్లో ఘన విజయంతో తొలిసారి అధికారాన్ని దక్కించుకున్న వైఎస్ జగన్కు ఇప్పుడు పరిస్థితులు క్లిష్టంగా మారుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ప్రజల ఆదరణతో తిరుగులేని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న జగన్.. ఆ తర్వాత తన సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్నారు. తన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ప్రజలు తనవైపే ఉంటారనే విశ్వాసంతో జగన్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు తమను మళ్లీ …
Read More »కారు.. కారు.. హుజూరాబాద్ లో బ్రేకులు ఎందుకు పడ్డాయి?
దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా.. ఒక అంచనా ప్రకారం రూ.500 కోట్లకు మించిన ఎన్నికల ఖర్చుతో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఒక చరిత్రగా నిలిచిపోనుంది. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చరిత్రకు నాంది ప్రస్తావన జరిగినట్లుగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఈ ఉప ఎన్నిక కోసం దేశంలో ఇంకెక్కడా లేని రీతిలో దళితులకు రూ.10లక్షలు ఇస్తూ దళితబంధు పథకాన్ని షురూ చేయటం తెలిసిందే. కారణం.. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితులు ఎక్కువగా ఉండటమే. …
Read More »