హటాత్తుగా దేశ రాజధాని ఢిల్లీకి వెళుతున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఆసక్తికరంగా మారుతుంది. విభజన సమస్యలపై హామీల అమలు.. పోలవరం.. తదితర అంశాలే ఎజెండా ఆయన ఢిల్లీ పర్యటన సాగుతున్నట్లుగా కథనాలు రావటం.. ఇదే అంశాల్ని ప్రముఖంగా పేర్కొంటూ ప్రకటనలు విడుదల కావటం తెలిసిందే. అయితే.. జగన్ ఢిల్లీ టూర్ల వెనుక అసలు ఎజెండా వేరే ఉందన్న మాట వినిపిస్తోంది. ఉన్నట్లుండి ఢిల్లీ టూర్ ను …
Read More »700 కిలోమీటర్లు.. ఏడు హామీలు
టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర కీలక ఘట్టానికి చేరుకుంటోంది. చిత్తూరు దాటి అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న యాత్రలో పాల్గొనేందుకు వేల సంఖ్యలో అభిమానులు తరలి వస్తున్నారు. పెనుకొండ నుంచి రాప్తాడు నియోజకవర్గంలోకి వచ్చిన యాత్రకు పరిటాల కుటుంబం ఘనస్వాగతం పలికింది. వైసీపీ తప్పిదాలను ఎండగడుతూ వెళ్తున్న లోకేష్ .. టీడీపీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారో కూడా వివరిస్తున్నారు. యువగళం ఇప్పటికే 700 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ప్రతీ …
Read More »బస్టాండ్ సెంటర్లో సవాల్ విసిరిన మేకపాటి
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పొలిటికల్ హీట్ మామూలుగా లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీకి ఓటేశారన్న ఆరోపణలతో వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గురువారం హల్ చల్ చేశారు. ఉదయగిరి వస్తే తనను తరిమి తరిమి కొడతామని వార్నింగ్ ఇచ్చిన వైసీపీ లీడర్ చేజర్ల సుబ్బారెడ్డికి ఊహించని సవాల్ విసిరారు. ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో కుర్చీ వేసుకుని కూర్చుని దమ్ముంటే రమ్మంటూ సవాల్ విసిరారు. …
Read More »జగన్‌తో గేమ్స్ ఆడుతున్నారా?
ఏపీలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఇంతకాలం జగన్‌కు వ్యతిరేకంగా ఆలోచించడానికే భయపడిన వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు జగన్నే బెదిరిస్తున్నారని.. తమకు టికెట్లు రాకపోతే రెబల్స్‌గా వేస్తామని.. వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను గెలవనివ్వకుండా చేస్తామని.. అవసరమైతే టీడీపీలో చేరుతామని ఓపెన్‌గా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. మరికొందరైతే టీడీపీతో తాము టచ్‌లో ఉన్నట్లు.. టీడీపీ నేతల నుంచి తమకు కాల్స్ వచ్చినట్లు ఫీలర్లు ఇస్తూ జగన్‌ను డిఫెన్సులోకి నెట్టే గేమ్ మొదలుపెట్టారని …
Read More »ఇంటెలిజెన్స్‌పైనే ఆధారపడుతున్న కేసీఆర్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇంటెలిజెన్స్ అధికారులకు పని పెరుగుతోంది. ఎప్పటికప్పుడు తాజా నివేదికలను సీఎం కేసీఆర్‌కు అందిస్తోంది ఇంటెలిజెన్స్ విభాగం. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ స్థితిగతులే కాకుండా విపక్ష కాంగ్రెస్, బీజేపీల బలాబలాలు ఎలా మారుతున్నాయన్న నివేదికలూ ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారు కేసీఆర్. ఇతరులపై ఆధారపడకుండా ఇంటెలిజెన్స్ నివేదికలను నేరుగా ఆయనే పరిశీలిస్తున్నారని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. బీఆర్ఎస్పై వ్యతిరేకత ఉన్న స్థానాల్లో ప్రజాభిప్రాయం ఏమిటీ..? ఏం కోరుకుంటున్నారు..? ఎందుకు …
Read More »అనకాపల్లి వైసీపీలో అమర్నాథ్కు సెగ
సాధారణ ఎమ్మెల్యే వెళ్తేనే ఆలయాల వద్ద ప్రత్యేక మర్యాదలు చేసి హడావుడిగా దర్శనాలు చేయిస్తారు. కానీ, ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను మాత్రం గంట పాటు వెయిట్ చేయించారు. దాదాపు వారం కిందట జరిగిన ఈ ఇష్యూని అమర్నాథ్ మొదట లైట్‌గా తీసుకున్నా ఆ తరువాత అసలు సంగతి తెలిసి తెగ ఇబ్బంది పడిపోయారు. అందుకు కారణమైన అధికారికి స్థాన చలనం చేయించారు. అనకాపల్లి కేంద్రంగా జరిగిన ఈ వ్యవహారం …
Read More »టీంను మార్చి.. జగన్ తప్పు చేశారట!
ఏపీ సీఎం జగన్‌కు ఒక ప్రత్యేకత ఉంది. తాను ఏం చేసినా.. చాలా కరెక్ట్ అనుకుంటారు. అదేసమయంలో ప్రతిపక్ష కూటమిలో ఎవరు ఏం చేసినా.. ఆయన తప్పులు వెతుకుతారు. అంతేకాదు.. వారంతా తప్పులే చేస్తున్నారని కూడా చెబుతుంటారు. కానీ, ఇప్పుడు తప్పులు అన్నీ కూడా.. ఆయన చుట్టూనే తిరుగుతు న్నాయని గ్రహించారట. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన తప్పులు చేస్తున్నారంటూ.. ప్రతిపక్షాలు మొత్తుకున్నాయి. అభివృద్ధి నిలిచిపోయింది. కీలకమైన రాజధానిని …
Read More »అక్కడ వైసీపీకి అభ్యర్థులు కావలెను?
వైసీపీ అనగానే ప్రతి నియోజకవర్గంలోనూ పోటీ చేయడానికి రెడీగా ఉన్న నలుగురైదుగురి పేర్లు వినిపిస్తుంటాయి. రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి ఉంటుంది. ఎవరైనా అభ్యర్థి కానీ, సిటింగ్ ఎమ్మెల్యే కానీ ఈసారి గెలవరు అనుకుంటే వారికి ప్రత్యామ్నాయం కూడా సిద్ధంగానే ఉంటుంది. కానీ… ఏపీలోని ఒక నియోజకవర్గంలో మాత్రం వైసీపీ విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. అక్కడ సిటింగ్ ఎమ్మెల్యే స్థానికంగా అందుబాటులో ఉండక ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకోవడంతో ఆ ఎమ్మెల్యేకు …
Read More »ఎంపీ చెప్పిన ‘ముందస్తు’ జోస్యం
రానున్న నవంబర్, డిసెంబర్లో ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగటం ఖాయమట. వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో జోస్యం చెప్పారు. మీడియాతో ఆయన మాట్లాడుతు తెలంగాణాలో డిసెంబర్లో జరగబోయే ఎన్నికలతోనే ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నట్లు చెప్పారు. తాజా ఢిల్లీ పర్యటనలో నరేంద్రమోడీ, అమిత్ షా తో ఈ విషయం మాట్లాడటానికే వచ్చుంటారని ఎంపీ అనుమానం వ్యక్తంచేశారు.మోడీ, అమిత్ షా తో భేటీపై అధికార …
Read More »చంద్రబాబు ప్రకటించిన దత్తత పథకం
పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబునాయుడు కొత్త పథకాన్ని ప్రకటించినట్లే ఉన్నారు. ఇంతకీ ఆ కొత్త పథకం పేరు ఏమిటంటే పేదల దత్తత పథకం. మేథావులు, ఆర్ధికంగా పటిష్టంగా ఉన్నవారు, ఉన్నతస్ధాయిలో ఉన్నవారంతా తలా ఐదు పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలని పిలుపిచ్చారు. సమాజంలో ధనవంతులు మరింత ధనవంతులవుతుంటే, పేదలు మరింత పేదరికంలో కూరుకుపోతున్నట్లు చెప్పారు. సమాజంలో అసమానతలు పోవాలంటే అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. …
Read More »వైసీపీపై బాలయ్య హాట్ కామెంట్స్
తెలంగాణలో తాజాగా నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ సదస్సులో నటుడు, అన్నగారి కుమారుడు నంద మూరి బాలకృష్ణ హాట్ కామెంట్లు చేశారు. టీడీపీ స్థాపించకపోతే.. తెలుగు వారు ఢిల్లీకి దాసోహం చేయాల్సి వచ్చేందని వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న ప్రతినాయకుడు.. టీడీపీ గూటి నుంచి ఎగిరిపోయిన పక్షే.. అని సంచలన కామెంట్లు చేశారు. ఇక, టీడీపీ స్థాపించి.. అనతికాలంలోనే అధికారం చేపట్టి తెలుగువాడు ఎక్కడున్నా సగర్వంగా తలెత్తుకునేలా చేసిన ఘనత అన్నగారు ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. …
Read More »మోదీ మొహం చాటేశారా?
ఏపీ సీఎం జగన్ పక్షంరోజుల్లో రెండో సారి ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఈ సారి అలా వెళ్లి ఇలా వచ్చారు. కేవలం అమిత్ షా ను కలిసేందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లుగా కనిపిస్తోంది. మొత్తం 13 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని సరిగ్గా రాత్రి 11 గంటల సమయంలో అమిత్ షా కు జగన్ సమర్ఫించారు. జగన్ చేసిన విన్నపాల్లో చాలా వరకు పాతవే ఉన్నాయి. పోలవరం ప్రాజెకుకు సంబంధించిన డిమాండ్లలో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates