Political News

YCP ఎమ్మెల్యే గ్రాఫ్ సూప‌ర్‌.. కానీ ల‌క్కే లేదు!

రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులు దూకుడుగా ఉన్న‌ప్ప‌టికీ.. కొన్ని కొన్ని సార్లు.. అనుకున్న‌ది సాధించ‌డం క‌ష్ట‌మే. ఇత‌ర ఎమ్మెల్యేల క‌న్నా కూడా నేను చాలా దూకుడుగా ప‌నిచేస్తున్నాను. అయినా.. నాకు గుర్తింపు ల‌భించ‌డం లేదు! అని ఓ కీల‌క నాయ‌కుడు ప‌దే ప‌దే వాపోతున్నారు. ఇది అధిష్టానం వ‌ర‌కు కూడా చేరింది. అయిన‌ప్ప‌టికీ.. ఏం చేస్తాం.. అవ‌కాశం లేదు! అనే పెద‌వి విరుపు మాట‌లే వినిపిస్తున్నాయ‌ట‌! దీంతో స‌ద‌రు ఎమ్మెల్యే అటు …

Read More »

మ‌నోళ్ల‌ను కాద‌ని ఆంధ్రోళ్లు కాంట్రాక్ట‌ర్లా? రేవంత్ ధ్వ‌జం

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను త‌న వ్యాఖ్య‌ల‌తో టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్‌రెడ్డి.. తాజాగా మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. సీఎం కేసీఆర్కు సచివాలయం మీదున్న శ్రద్ధ.. అమరవీరుల స్థూపంపై లేదని విమర్శించారు. స్తూపం నిర్మాణ పనులపై సమీక్షించే తీరిక కేసీఆర్కు లేదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్లో అమరవీరుల స్మారకం నిర్మాణ పనులను పరిశీలించిన రేవంత్.. కాంట్రాక్ట‌ర్‌ని పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ …

Read More »

అఖండ సినిమా రివ్యూ బై చంద్రబాబు !!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వియ్యంకుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన “అఖండ” సినిమా సూప‌ర్ హిట్ రేంజ్ సాధించిన విష‌యం తెలిసిందే. దీనిపై చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. తాను కూడా ఈ సినిమా చూశానని తెలిపారు. ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ సినిమా చూస్తే చాలని హీటెక్కించే వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో “అఖండ” సినిమా చూస్తే అర్థమవుతుందని అన్నారు. ప్రస్తుతం …

Read More »

అమ్మ ‘వేద నిలయం’.. ఇక నుంచి వారిది!

తమిళనాడు ‘అమ్మ’గా అందరి మనసుల్ని ఆక్రమించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివసించిన వేద నిలయం హక్కుదారులు ఎవరన్న దానిపై స్పష్టత వచ్చింది. పోయెస్ గార్డెన్ లోని ఈ సువిశాల ఇంటి హక్కుదారులు ఎవరన్న విషయంపై తాజాగా మద్రాసు హైకోర్టు క్లియర్ చేసింది. జయలలితకు ఎంతో ఇష్టమైన ఈ ఇంటికి చట్టబద్ధమైన హక్కుదారుల్ని గుర్తించటమే కాదు.. తాజాగా ఆ ఆస్తికి సంబంధించిన తాళాల్ని జయలలిత మేనకోడలు దీపకు అప్పజెప్పారు. అనారోగ్యంతో …

Read More »

టీడీపీలో కోవర్టుల కలకలం

ఇపుడు తెలుగుదేశం పార్టీలో కోవర్టుల ఆరోపణలు కలకలం రేపుతోంది. తాజాగా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలోని నేతలతో సమీక్షలో మాట్లాడుతు పార్టీలోని కోవర్టులను ఏరిపారేస్తానంటు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది. నిజానికి పార్టీలో కోవర్టులున్నారని, వైసీపీ నేతలకు లోపాయికారీగా కొందరు తమ్ముళ్ళు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఎప్పటినుండో వినిపిస్తున్నవే. అక్కడక్కడ కొందరు నేతలు కోవర్టుల గురించి చెప్పినపుడు చాలామంది పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పుడైతే స్వయంగా పార్టీ అధినేతే కోవర్టులనే వ్యాఖ్యలు చేశారో …

Read More »

ఎన్ని టెన్షన్లున్నా కుప్పం వదలని జగన్

వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబునాయుడును ఎలాగైనా ఓడించాలని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే పెద్ద వ్యూహమే పన్నుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదేమంటే మూడు సామాజిక వర్గాల సహకారంతోనే చంద్రబాబును ఓడించేందుకు జగన్ ప్లాన్ రెడీ చేస్తున్నారట. ఈ ప్లాన్ ఇచ్చింది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే అని అందుకనే ప్లాన్ ను అమల్లోకి తెచ్చే బాధ్యతను కూడా జగన్ మంత్రి మీదే పెట్టినట్లు సమాచారం. ఇంతకీ …

Read More »

పునరాలోచనలో జగన్… చేయక తప్పదుగా !

దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పీఆర్సీని జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. పీఆర్సీ, సీపీఎస్ రద్దు తదితర విషయాలపై జగన్ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. జగన్ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. పూర్తిస్థాయి పీఆర్సీని అమలు చేయలేని పక్షంలో ప్రభుత్వం ఐఆర్ ప్రకటిస్తుంది. ప్రభుత్వం ఇపుడు అమలు చేయాల్సిన పీఆర్సీ 2018, జూలై నుండి పెండింగ్ …

Read More »

జగన్ మరో యూ టర్న్

YS Jagan Mohan Reddy

పాలకులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి తీసుకోవాలి. తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవడం తర్వాత నాలుక్కరుచుకుని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటం మంచిదికాదు. ఇపుడిదంతా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మహిళా పోలీసుల నియామకాలపై వెనక్కు తగ్గింది కాబట్టే. గతంలో గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులుగా ప్రభుత్వం 15 వేల మందిని నియమించింది. తర్వాత వీళ్లందరినీ మహిళా పోలీసులుగా మార్చాలని డిసైడ్ చేసింది. జగన్ అనుకున్నదే ఆలస్యమని ఈ 15 వేల …

Read More »

నాపై వేటేస్తే టీడీపీకే నష్టం

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేరు కొంతకాలంగా వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై వంశీ అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆ పై క్షమాపణ చెప్పడం చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ న్యూస్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన వంశీ అనేక షాకింగ్ కామెంట్లు చేశారు. తాను ఇప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేనే అని, వైసీపీలో చేరే అవకాశమే లేదని …

Read More »

మనసు విప్పి మాట్లాడుకున్న CBN – దగ్గుబాటి

దశాబ్దాల పాటు దూరంగా ఉన్న నారా, దగ్గుబాటి కుటుంబాలు ఒకే వేదికపై సందడి చేశాయి. ఓ శుభకార్యంలో ఈ రెండు కుటుంబాలు ఒకే వేదికను పంచుకున్నాయి. ఈ కుటుంబాల మద్య ఉన్న ఎడబాటును మరిచిపోయి ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఎడముఖం పెడముఖంగా ఉన్న ఎన్టీఆర్ అల్లుళ్లు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కలుసుకున్నారు. అంతేకాదు ఇద్దరూ పక్క పక్కనే నిల్చోని ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ రెండు కుటుంబాల కలయికతో నందమూరి కుటుంబం ఉబ్బితబ్బివుతోంది. …

Read More »

ఉద్యమ సెగతో మంటెక్కినట్లే ఉంది

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిస్థితి చూస్తుంటే ఈ విషయం బాగా అర్థమైపోతోంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు ఆందోళన మొదలుపెట్టినప్పుడు మోడీ అసలు లెక్కేచేయలేదు. ఆందోళన ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు పాకినపుడు కూడా మీరేమన్నా చేసుకోండి పట్టించుకునేదే లేదన్నట్లుగా వ్యవహరించారు. చివరకు ఆందోళన కాస్త రైతు సంఘాలంతా కలిసిపోయి ఉద్యమరూపం దాల్చినపుడు కూడా ఏమాత్రం లెక్క చేయలేదు. చివరకు రైతు ఉద్యమం హింసాత్మకంగా మారినపుడు కూడా వెనక్కు తగ్గేదే …

Read More »

తెలంగాణ బీజేపీకి ఇది చావు దెబ్బే

దేశవ్యాప్యంతా ఎంతో పేరు ప్రఖ్యాతలున్న సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం తెలంగాణాలోని బీజేపీపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రైవేటీకరించాల్సిన అవసరమే లేకపోయినా సింగరేణి గనులను ఎందుకు ప్రైవేటీకరిస్తోందో కేంద్రమే సమాధానం చెప్పాలి. సింగరేణి పరిధిలోని నాలుగు ఓపెన్ కాస్ట్ గనులను ప్రైవేటీకరించబోతున్నట్లు ఈ మధ్య నరేంద్ర మోడీ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రభుత్వం+ప్రభుత్వ రంగ సంస్థలను …

Read More »