Political News

బీజేపీ చేతిలో ‘కాంగ్రెస్ ఫైల్స్’

ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ రెండు ప్రధాన కూటములు ఎన్డీయే-యూపీఏ మధ్య యుద్ధ వాతావరణం పెరిగిపోతోంది. నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్, ప్రతిపక్షాలు ఏకమవుతున్న విషయం తెలిసిందే. వీళ్ళని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు బీజేపీ కూడా అంతే ధీటుగా అస్త్రాలను సిద్దం చేసుకున్నది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ఫైల్స్ పేరుతో ఆదివారం ఒక వీడియోను రిలీజ్ చేసింది. కాంగ్రెస్ ఫైల్స్ అంటే ఏమిటంటే యూపీఏ పదేళ్ళ పాలనలో జరిగిన అవినీతిని ఒక్కోదాన్ని …

Read More »

ఢిల్లీలో పవన్.. ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేగం పుంజుకున్నాయి. సీఎం జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతల మీటింగ్ పెట్టిన రోజే జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీలో ఉన్నారు.ఇప్పుడాయన మోదీ, అమిత్ షా అప్పాయింట్మెంట్ కోసం వేచి చూస్తున్నారు. బీజేపీ అగ్రనేతల పిలుపు మేరకే పవర్ స్టార్ ఢిల్లీ వెళ్లినట్లు తెలిసింది.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని పవన్ ప్రకటించి చాలా రోజురైంది. కాకపోతే ఆయన అడిగిన రోడ్ మ్యాప్ కు బీజేపీ …

Read More »

అంబటికి షాక్ తప్పదా ?

గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో పెద్ద సమావేశం జరిగింది. దీనికి ఆత్మీయసభ అని పేరుపెట్టినా ఇది ముమ్మాటికీ మంత్రికి వ్యతిరేకంగా నిర్వహించిన సమావేశమే అని అర్ధమైపోతోంది. సీనియర్ నేత, మంత్రికి బద్ధవిరోధి అయిన చిట్టా విజయభాస్కరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి నియోజకవర్గంలోని చాలామంది హాజరయ్యారు. చిట్టా ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఇంతమంది హాజరయ్యారంటేనే అంబటిపైన …

Read More »

బొత్స, సజ్జల: కేడర్ అయోమయం

బొత్స సత్యనారాయణ.. జనం సత్తిబాబు అని పిలుస్తారు. నచ్చని వాళ్లు చాలా పేర్లు పెడతారనుకోండి. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికీ తెలీదు. ఇక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ తరపున మీడియాలో మాట్లాడే సజ్జల కూడా అంతే. ఎప్పుడు, ఎలా, ఎందుకు మాట్లాడతారో ఎవరికీ అర్థం కాదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి పరాభవం ఎదురైనప్పటి నుంచి నేతలు రోజువారీగా స్టేట్ …

Read More »

అప్పట్లో టీడీపీ మేనిఫెస్టో రాసింది సజ్జలే..

ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీ అధికార పార్టీలో ఎలాంటి కలకలాన్ని రేపిందన్న విషయం తెలిసిందే. అనూహ్యంగా వచ్చిన ఫలితాలతో వైసీపీ సర్కారుకు ఇబ్బందికరంగా మారింది. అన్నింటికి మించి అధినేత మాటకు భిన్నంగా వ్యవహరించిన ఎమ్మెల్యేల తీరుపై ఆగ్రహం వ్యక్తం కావటంతోపాటు.. వారి పై వెనువెంటనే వేటు పడింది కూడా. అలా వేటు పడిన వారిలో సీనియర్ నేత.. నలుగురు సీఎంల వద్ద మంత్రిగా వ్యవహరించిన ఆనం రామనారాయణ రెడ్డి ఒకరు. సౌమ్యంగా …

Read More »

ఒక్క ఛాన్స్ ప్లీజ్‌.. ఇప్ప‌టికీ దారివ్వ‌ని చంద్ర‌బాబు..!

ఒక్క ఛాన్స్ ప్లీజ్‌.. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్‌. నేనేంటో నిరూపించుకుంటా! అని దాదాపు ఆరు సంవ‌త్స‌రాలుగా ఒక యువ నాయ‌కురాలు చంద్ర‌బాబుకు మొర పెట్టుకుంటున్న విష‌యం తెలుసా? అవును సార్‌.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి త‌న‌ను తాను నిరూపించుకుంటుంది. పార్టీనే న‌మ్ముకున్నాం. ఈసారి గెలుపు ఖాయం స్వ‌యంగా ఆ యువ నాయ‌కురాలు మాతృ మూర్తి సైతం చంద్ర‌బాబుకు విన్న‌వించి.. దాదాపు రెండేళ్లు గ‌డిచిపోయింది. అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు ఇప్ప‌టి …

Read More »

కలకలం సృష్టిస్తున్న రేంజ్ రోవర్

సుఖేష్ చంద్రశేఖర్ ఏ ముహూర్తంలో రు. 15 కోట్ల ముడుపులను తాను బీఆర్ఎస్ ఆఫీసులో అందించానని చెప్పాడో తెలీదు కానీ ఆ విషయం ఇపుడు సంచలనం సృష్టిస్తోంది. ఢిల్లీ నుండి హైదరాబాద్ కు 15 కోట్ల రూపాయలను తెచ్చి బీఆర్ఎస్ ఆఫీసులో పార్క్ చేసిన రేంజ్ రోవర్ కారులోని ఏపీ అనే వ్యక్తికి ఇచ్చినట్లు సుఖేష్ లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. సుఖేస్ విడుదలచేసిన లేఖ బీఆర్ఎస్ మెడకు …

Read More »

కేవీపీ నోట ఇలాంటి మాటలా?

కేవీపీ రామచంద్రరావు పేరెత్తగానే అందరికీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకొస్తారు. అందరూ వైఎస్‌ ఆత్మగా కేవీపీని చెబుతారు. వైఎస్ లాగే ఆయన కూడా కరడుగట్టిన కాంగ్రెస్ వాది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అంటే ఆయనకు కూడా పడేది కాదు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతనం చవిచూసినప్పటికీ కేవీపీ ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. అలాంటి నేత.. తాజాగా చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యలు …

Read More »

వైసీపీ నేతతో లోకేష్ చర్చలు?

ఈ వార్తలో నిజం ఎంతో తెలీదు కానీ వైసీపీ సోషల్ మీడియాలో  విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే పేర్నాటి శ్యాం ప్రసాదరెడ్డి పాదయాత్రలో నారా లోకేష్ ను కలిశారట. అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రాంతంలో పాదయాత్రలో ఉన్న లోకేష్ తో పేర్నాటి భేటీ అయ్యారనే వార్త కలకలం సృష్టిస్తోంది.  ఈమధ్యనే అధికారపార్టీ అభ్యర్ధిగా తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎంఎల్సీగా పోటీచేసి పేర్నాటి ఓడిపోయిన విషయం తెలిసిందే. …

Read More »

మోడీపై పెరిగిపోతున్న అనుమానాలు

మనదేశంలో ఏదోక అంశంపైన ప్రతిరోజూ ఏదో ఒక వివాదం ఉండాల్సిందే. తాజా వివాదం ఏమిటంటే నరేంద్ర మోడీ విద్యార్హత. నిజానికి మోడీ ఏమి చదువుకున్నారు అనే విషయంతో దేశానికి ఎలాంటి సంబంధం లేదు. మోడీ విద్యార్హతలతో దేశానికి వచ్చే లాభం కానీ నష్టంకానీ ఏమీ లేదు. కానీ ఇపుడా అంశమే బాగా వివాదాస్పదమైపోతోంది. మోడీ విద్యార్హతలు ప్రకటించాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు తీర్పు చెప్పడం వరకు ఓకేనే. అయితే …

Read More »

అభ్యర్థుల ఎంపికకు అమెరికా మోడలా?

అభ్యర్ధుల ఎంపికలో బీజేపీ కొత్తగా అమెరికా మోడల్ ను ఫాలో అవుతోంది. మే 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందుకోసం 224 నియోజకవర్గాల్లో పోటీ చేయాల్సిన అభ్యర్ధులను ఎంపిక చేయటానికి అగ్రనాయకత్వం రెడీ అవుతోంది. ప్రతి నియోజకవర్గంలోను సిట్టింగ్ ఎంఎల్ఏలతో పాటు ముగ్గురు నలుగురు నేతలు టికెట్లకోసం పోటీ పడుతున్నారు. అందుకనే గట్టివాళ్ళని ఎంపిక చేయటంలో భాగంగా అమెరికా మోడల్ ను అప్లై …

Read More »

ఏపీలో ముంద‌స్తు ఫ‌లించేనా.. గ‌తం ఏం చెబుతోంది?

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న చ‌ర్చ ముంద‌స్తు ఎన్నిక‌లు. ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని.. ఈ ఏడాది అక్టోబ‌రులో జ‌గ‌న్ త‌న ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసుకుని తెలంగాణ‌తో స‌మానంగా ఎన్నిక‌ల‌కు వెళ్లిపోతార‌ని పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో చ‌ర్చ సాగుతోంది. అంతేకాదు.. న‌వంబ‌రులో నే నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌ని.. డిసెంబ‌రు నాటికి ఎన్నిక‌లు కూడా పూర్త‌యి.. అదే నెల‌లో ప్ర‌భుత్వం కూడా ఏర్ప‌డుతుంద‌ని.. సోష‌ల్ మీడియాలో డేట్ల వారీగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే నిజ‌మ‌ని …

Read More »