వైసీపీ అధినేతకు పాదయాత్ర సంకటం పట్టుకుందా? ఆయనకు పాదయాత్ర తలనొప్పిగా మారిందా? అంటే.. తాజాగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నవారు ఔననే అంటున్నారు. అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా ఆయన అడిగిన వారికి అడిగినట్టు హామీలు కుమ్మరించారు. ఒక్క కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ తప్ప.. మిగిలిన అనేక వర్గాలకు ఆయన హామీలు ఇచ్చారు. దీనిలో ప్రధానంగా కీలకమైన ఉద్యోగ …
Read More »జగన్‌కు బిచ్చం ఎత్తుకునే పరిస్థితి: తెలంగాణ మంత్రి
మాటకు మాట! నువ్వు రెండంటే.. నే నాలుగంటా!! నువ్వు తమలపాకుతో అంటే.. నేను తలుపుచెక్కతో అంటా!!- ఇదీ… ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తాజాగా చోటు చేసుకున్న ఘటన. ఇటీవల కాలంలో ఎడ మొహం.. పెడమొహంగా ఉంటున్న ఈ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సామరస్యం చేకూరుతుందని.. అందరూ అనుకుంటున్న నేపథ్యంలో మరోసారి ఇరు రాష్ట్రాల మధ్య భగ్గున అగ్గి రాజుకుంది. తాజాగా.. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత.. …
Read More »జగన్ కోపం.. భయంగా మారుతోందా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అమరావతి అంటే ఎంత కోపమో అందరికీ తెలుసు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఏరికోరి రాజధానిగా ఎంచుకున్న ఈ ప్రాంతాన్ని కక్షగట్టి దెబ్బ కొట్టారనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. ముందు నుంచి రాజధానిగా అమరావతిని వ్యతిరేకించినా సరేలే అనుకోవచ్చు. కానీ రాజధానిగా ఆ ప్రాంతానికి మద్దతునిచ్చి, తాను అధికారంలోకి వచ్చాక కూడా అమరావతే రాజధానిగా ఉంటుందని నమ్మబలికి.. ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించగానే స్వరం మార్చేశారు వైకాపా …
Read More »ఈ ఓవర్ యాక్షన్ అవసరమా ?
కుప్పంలో పోలీసుల ఓవర్ యాక్షన్ పై హైకోర్టు మండిపడింది. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్ధులు ముందస్తుగా తమ నుండి అనుమతి తీసుకోవాలని పలమనేరు డీఎస్పీ నోటీసులివ్వటం బాగా వివాదాస్పదమైంది. దారినపోయే చెత్తను నెత్తినేసుకున్నట్లుంది పోలీసుల వ్యవహారం. అవసరం లేనిచోట బాగా ఓవర్ యాక్షన్ చేసి చివరకు హైకోర్టు దగ్గర అంక్షితలు వేయించుకుంటే కానీ పోలీసులకు తృప్తి తీరలేదేమో. నిజానికి ఎన్నికల్లో ప్రచారం చేయడానికి పోలీసులకు అసలు …
Read More »పీఆర్సీపై ఎందుకింత వివాదం ?
లక్షలాది ఉద్యోగులు ఎదురుచూస్తున్న పే రివిజన్ కమిటి (పీఆర్సీ) నివేదిక సిఫారసులు అమలు చేయటం బాగా వివాదాస్పదమవుతోంది. పీఆర్సీ నివేదికను అమలు చేయటం అన్నది ప్రభుత్వం విధి. దానికన్నా ముందు ఉద్యోగసంఘాల నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో లేదా ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటితో మాట్లాడి బేరసారాలు చేయడం కూడా మామూలే. ఎందుకంటే నివేదికలో సిఫారసు చేసినట్లు ఫిట్ మెంట్ ను ఉద్యోగ సంఘాలు అంగీకరించవు. అలాగే ఉద్యోగసంఘాల డిమాండ్ …
Read More »కేసీఆర్ తో అమీతుమీకి సిద్ధమవుతున్న కేంద్రం!
కేంద్రంపై సీఎం కేసీఆర్ యుధ్దాన్నే ప్రకటించారు. శుక్రవారం నుంచి కదన రంగాన్ని సిద్దమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు వ్యతిరేకంగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. తప్పంతా కేంద్ర ప్రభుత్వానిదేనని కేసీఆర్ స్పష్టం చేస్తున్నారు. ఇక కేంద్రం కూడా కేసీఆర్‌తో అమీతుమీ తేల్చుకోవాడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ వ్యాఖ్యలను కేంద్రం సీరియస్ గా తీసుకుందని, ఆయనను కట్టడి చేసేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ధాన్యం కొలుగోలు, కృష్ణా జలాలు …
Read More »మోడీ ప్రశాంతంగా ఉండలేకపోతున్నారా ?
ఉత్తరప్రదేశ్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ నరేంద్రమోడీ ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. యూపీలో లఖింపూర్ ఖేరీలో రైతులపైకి కేంద్రమంత్రి మిశ్రా కొడుకు వాహనం దూసుకుపోయిన ఘటనలో నలుగురు రైతులు మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అసలే రైతు సంఘాల దెబ్బకు అంతంత మాత్రంగా ఉన్న బీజేపీ పరిస్థితి లఖింపూర్ ఖేరి ఘటనతో మరింత దిగజారిపోయింది. ఈ నేపధ్యంలోనే యూపీలో మళ్ళీ అధికారంలోకి వచ్చే విషయంలో మోడీ టెన్షన్ పెరిగిపోతోందట. సరిగ్గా ఇలాంటి …
Read More »డీఎస్ తో ఈటల భేటీ..
తెలంగాణ రాజకీయాల్లో ఊహించిన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎంపీ డి. శ్రీనివాస్ తో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. ఈటలను డీఎస్ వద్దకు ఆయన తనయుడు ఎంపీ అర్వింద్ తీసుకెళ్లారు. ఈటల, డీఎస్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే అదేమీ లేదని ఈటల సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు. ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని మర్యాద పూర్వకంగా కలిశారని చెబుతున్నారు. గత కొంతకాలంగా డీఎస్ టీఆర్ఎస్ కు దూరంగా …
Read More »పంచ్ ప్రభాకర్‌కు ఉచ్చు బిగిస్తున్న సీబీఐ
ఢిల్లీ: న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా, న్యాయమూర్తులను కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన పంచ్ ప్రభాకర్‌కు సీబీఐ ఉచ్చు బిగిస్తోంది. పంచ్ ప్రభాకర్ అరెస్ట్‌కు సీబీఐ రంగం సిద్ధం చేస్తోంది. పంచ్ ప్రభాకర్‌పై ఇంటర్ పోల్ ద్వారా బ్లూ నోటీసు సీబీఐ జారీ చేసింది. పంచ్ ప్రభాకర్‌తో పాటు విదేశాల్లో ఉన్న మరో నిందితుడికి బ్లూ నోటీసులిచ్చారు. ఏపీ జడ్జీలపై, న్యాయాధికారులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన …
Read More »డైవర్ట్ చేయడంలో కేసీఆర్ సక్సెస్
కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు ఓటమి తప్పలేదు. ఈ ఉప ఎన్నికలో విజయం కోసం స్వయంగా ముఖ్యమంత్రే అన్ని రకాలు వ్యహాలు సిద్ధం చేసి.. పార్టీని గెలిపించే బాధ్యత తన మేనళ్లుడు హరీష్ రావుపై పెట్టారు. కానీ ప్రజలు మాత్రం ఈటల రాజేందర్‌కే జై కొట్టారు. దీంతో పార్టీ మొత్తం దృష్టి పెట్టినా హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గెలవలేదని.. ఇది ఆ పార్టీపై వ్యతిరేకతను చాటుతుందని …
Read More »ఏపీలో బీజేపీ అధికారం.. అదెలా రాజుగారు?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు.. 2019 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. మెజారిటీ చోట్ల ఆ పార్టీకి క్యాడర్ కూడా సరిగ్గా లేదు. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం అధికారం తమదే అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఇంతకీ ఆ పార్టీ ఏది అంటే.. అది బీజేపీ. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తమ పార్టీనే అని కొన్ని రోజులుగా బీజేపీ …
Read More »అచ్చిరాని ఆరోగ్యశాఖను హరీష్‌కు కట్టబెట్టారేంటి..
తెలంగాణ ఆరోగ్య శాఖ అంటే హడలెత్తిపోతున్నారు.. బాబోయ్.. ఆ శాఖకే సుస్తీ చేసింది.. దీర్ఘకాల వ్యాధితో భాదపడుతోందనే టాక్ ఉంది. 2014 నుంచి ఇప్పుటి వరకూ అంటే ఏడేళ్లు ఆనారోగ్యంతో ఆపసోపాలు పడుతోంది. ఇప్పటికి ఆరోగ్యశాఖకు దీర్ఘకాల వ్యాధి నుంచి రక్షించే వారే కరువయ్యారు. ఆది నుంచి ఈ శాఖ బాధ్యతలు చేపట్టిన నేతలందరికీ ఊహించని షాకులే తగిలాయి. ఒక్క మాటలో చెప్పాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ ఒక్కరంటే ఒక్కరికీ …
Read More »