తూర్పుగోదావరి జిల్లాల్లోని ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయం బాగా వేడి పెంచేస్తోంది. టీడీపీ నేత వరుపుల రాజా హఠాత్తుగా చనిపోవటంతో నియోజకవర్గం ఇన్చార్జిగా ఆయన భార్య సత్యప్రభను చంద్రబాబునాయుడు నియమించారు. మరీ నియామకం తాత్కాలికమా లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఈమెకే టికెట్ ఇచ్చే ఉద్దేశ్యం ఉందా అన్నది తెలీదు. ఇదే సమయంలో వైసీపీ సిట్టింగ్ ఎంఎల్ఏ పర్వత పూర్ణచంద్రప్రసాద్ యాక్టివ్ గానే ఉన్నా నియోజకవర్గంలో బాగా వ్యతిరేకత కూడా ఉంది. …
Read More »కాంగ్రెస్‌కు ఊపిరి.. కర్ణాటక తీర్పుతో చరిత్ర!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఆది నుంచి కూడా హంగ్ ఏర్పడుతుందని.. ఏ పార్టీకి పెద్దగామెజారిటీ రాదని భావించిన రాష్ట్రంలో దాదాపు 38 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ.. కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. దాదాపు 130 స్థానాలకు పైగా కాంగ్రెస్ దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. ఇది ఎలా ఉన్నప్పటికీ మేజిక్ ఫిగర్ అంటే.. అసెంబ్లీలో అధికారం దక్కించుకునేందుకు కావాల్సిన సీట్ల సంఖ్య 113 దాటిపోవడంతో కాంగ్రెస్ పార్టీ …
Read More »కర్ణాటక నాడి పట్టుకోలేకపోయిన సర్వేలు
ఎన్నికలు.. ఓట్లు.. అనగానే ముందస్తు సర్వేలు.. అంటూ.. కొన్ని మీడియా సంస్థలు సర్వేలు వండి వారుస్తా యి. అదేవిధంగా ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా ఇస్తాయి. అయితే.. ఎప్పుడు ఎలా ఉన్నా.. ఈ సారి మాత్రం సర్వే సంస్థలు కర్ణాటక ప్రజల నాడిని పట్టుకోలేక పోయాయి. హంగ్ వస్తుందని.. ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ రాదని.. అనేక సంస్థలు వెల్లడించాయి. ఒకటి రెండు సంస్థలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంచనా …
Read More »కర్ణాటక ఎఫెక్ట్: బీజేపీని తిప్పికొట్టిన దక్షిణాది!
కర్ణాటక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే.. బీజేపీ గత 2018 లో తెచ్చుకున్న 104 స్థానాలకంటే కూడా.. ఇప్పుడు ఘోరస్థానానికి పడిపోయింది. అప్పట్లో 104 స్థానాల్లో విజయం దక్కించుకున్న కమల నాథులు.. ఇప్పుడు కేవలం 78 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటల 30 నిమిషాల సమయానికి కేవలం 22 స్థానాల్లోనే బీజేపీ అభ్యర్థులు విజయం దక్కించుకున్నారు. దీంతో బీజేపీకి దక్షిణాదిలో తీవ్ర శరాఘాతం తగిలిందని …
Read More »కర్ణాటక రిజల్ట్.. హైదరాబాద్‌లో రిసార్ట్ రాజకీయాలు!
ఒకవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. అయితే.. అదే సమయంలో మరో వైపపు రిసార్ట్ రాజకీయాలకు ప్రధాన పార్టీలు తెరదీశాయనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఉదయం 11 గంటల సమయా నికి కాంగ్రెస్ 115 స్థానాల్లోను, బీజేపీ 78 స్థానాల్లోను, జేడీఎస్ 24 స్థానాల్లోనూ ముందంజలో ఉంది. దీంతో రిసార్టు రాజకీయాలు …
Read More »పుత్రోత్సాహంలో తెలంగాణ మంత్రి హరీష్‌రావు
పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జనియించినపుడు కాదు.. అన్న భర్తృహరి సూక్తిని నిజం చేస్తూ.. తెలంగాణ మంత్రి హరీష్‌రావు కుమారుడు తన్నీరు అర్చిష్‌మన్.. ప్రతిష్టాత్మక అమెరికా విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్‌లో పట్టా అందుకున్నారు. దీంతో మంత్రి హరీష్ రావు పుత్రుడి విజయాన్ని స్వయంగా వీక్షించి ఆనంద డోలికల్లో ఊగితేలుతున్నారు. నా కుమారుడు సాధించిన విజయానికి నేను సంతోషిస్తున్నాను అని హరీష్ రావు తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. అర్చిష్‌మన్ విజయానికి …
Read More »చంద్రబాబు చేయాల్సిందేంటి… చేస్తోందేంటి…?
టీడీపీ అధినేత చంద్రబాబు చేయాల్సింది.. చేస్తున్నది.. ఇప్పుడు ఇదే విషయం పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతోంది. చంద్రబాబు ప్రస్తుతం 70+ వయసులో ఉన్నారు. ఈ సమయంలోనూ ఆయన యాక్టివ్‌గా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న విషయం. అదే సమయంలో ఆయన మరింత యాక్టివ్‌గా ఉండాలని కూడా కోరుకుంటున్నారు. అయితే.. ఈ వయసులోనూ చంద్రబాబు.. ప్రజలకు చేరువ అయ్యేందుకు.. పాదయాత్రలు చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో …
Read More »వాస్తవిక ఆలోచన, ఏకమొత్తంగా కాపు ఓట్లే టార్గెట్
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇప్పుడు వ్యూహం మార్చారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కొన్ని సీట్లు గెలివాలన్న తపనతో ఆయన మాట్లాడుతున్నారు. 2019 ఎన్నికల్లో తాను రెండు చోట్ల ఓడిపోయి, పార్టీకి కేవలం ఒక సీటు సాధించుకున్న పవన్ ఇప్పుడు మాత్రం అంతటి దీనస్థితిలో ఉండేందుకు ఇష్టపడటం లేదు. వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధిస్తేనే తమకు డిమాండ్ చేస్తే సత్తా వస్తుందని పవర్ స్టార్ విశ్వాసం. అందుకే ఆయన ప్రతీ …
Read More »పవన్ నోట రజనీ డైలాగ్..
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను పవన్ కల్యాణ్ ఫోలో అవుతున్నట్లనిపిస్తోంది. మరోసారి జయలలితకు ఓటేస్తే తమిళనాడును దేవుడు కూడా కాపాడలేడని 1995లో రజనీకాంత్ వదిలిన ఒక డైలాగ్ దెబ్బకు 1996 ఎన్నికల్లో పురచ్చితలైవి ఓడిపోయారు. ఇప్పుడు అటు తిరిగి పవర్ స్టార్ కూడా అదే పంధాలో మాట్లాడుతున్నారు. మరో సారి జగన్ గెలిస్తే ఆంధ్రప్రదేశ్‌కు అధోగతేనని పవన్ అన్నారు. వరుసగా రెండు రోజులు ఆయన మీడియా ముందుకు వచ్చి.. దాదాపు …
Read More »కర్ణాటక గెలవడం.. మోడీకి ఎందుకు ఇంపార్టెంట్?
గత ఏడాది గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసినంత పనిచేసింది. వరుసగా మరోసారి బీజేపీ అధికార పగ్గాలు చేపట్టారు. అక్కడ మోడీ హవానే ఎక్కువగా నడిచింది. పేరు, ఊరు కూడా.. ఆయనవే కనిపించాయి. వినిపించాయి. ఆ తర్వాత.. హిమాచల్ ప్రదేశ్ వంటి కీలక రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. అది పెద్దగా లెక్కలోకి రాలేదు. ఇక్కడ కాంగ్రెస్ ఒకింత బొటాబొటిగానే అధికారం దక్కించుకుంది. అయితే.. ఇప్పుడు గుజరాత్‌తో సరితూగగల …
Read More »పవన్ స్టేట్మెంట్.. జనసైనికుల్లో మిక్స్డ్ రెస్పాన్స్
మొత్తానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 అసెంబ్లీ ఎన్నికల ముంగిట తన రాజకీయ వైఖరిని స్పష్టం చేసేశాడు. తెలుగుదేశం పార్టీతో పొత్తు కచ్చితంగా ఉంటుందని సంకేతాలు ఇస్తూ.. తాను సీఎం పదవికి పోటీలో లేనని స్పష్టత ఇచ్చాడు. చాలా స్పష్టతతో, నిజాయితీగా పవన్ చేసిన ప్రకటన రాజకీయంగా పెద్ద చర్చకే దారి తీసింది. పవన్ చేసిన ప్రకటన పట్ల తెలుగుదేశం మద్దతు దారులు సానుకూలంగా స్పందించారు. వైసీపీ వాళ్లు …
Read More »ఎంపీ రఘురామకు సీఐడీ టార్చర్‌పై హైకోర్టు సంచలన ఆదేశాలు
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఉరఫ్ ఆర్ ఆర్ ఆర్‌ను ఏపీ సీఐడీ పోలీసులు కస్టడీలోకి తీసుకుని.. తనను కొట్టారని.. అరికాళ్లు వాచిపోయేలా తనను చితకబాదారని.. ఆయన పదే పదే చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన హైకోర్టుకు కూడా వెళ్లారు. తాజాగా రఘురామ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. సంచలన ఆదేశాలు జారీ చేసింది. రఘురామను అదుపులోకి తీసుకున్న సమయంలో కాల్ డేటాను స్వాధీనం చేసుకొని భద్ర పరచాలని, …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates