బెజవాడ టీడీపీలో ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. తాను ఇక ఎన్నికల్లో పోటీ చేయనని అధినేత చంద్రబాబుతో కేశినేని నాని స్ఫష్టం చేసినట్లు తెలుస్తోంది. కేశినేని అభిమానులు, కార్యకర్తలు మాత్రం 2024 లో కూడా ఎంపీగా పోటీ చేయాలని కేశినేని నానిపై ఒత్తిడి పెడుతున్నారు. బెజవాడలోని మూడు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు కేశినేని ఇంటికి చేరుకుంటున్నారు. బెజవాడలో దుర్గమ్మ ఉన్నంత వరకు.. కేశినేని భవన్ ఉంటుందని కేశినేని నాని స్పష్టం చేశారు. …
Read More »వంగవీటి రాధా – మరీ ఇంత గందరగోళమా ?
సంవత్సరాల తరబడి రాజకీయాల్లో ఉంటూ కూడా భవిష్యత్తుపై ఏమాత్రం అంచనాలు వేయలేని నేత ఎవరనా ఉన్నారంటే అది వంగవీటి రాధాకృష్ణ @ రాధా అనే చెప్పాలి. ప్రతి ఎన్నికకు పార్టీ మారటం అని కూడా ఓడిపోయే పార్టీలో చేరటం. ఇలాంటి పరిస్థితి రాధాకు ఎందుకు వస్తోందంటే భవిష్యత్ రాజకీయాలు సరిగా అంచనా చేయలేకపోవడమే కారణంగా కనిపిస్తోంది. చాలామంది నేతలకు దొరకని బ్రహ్మాండమైన ప్లాట్ ఫామ్ రాధాకు దొరికింది. అయితే మాత్రం …
Read More »పవన్.. పోసాని.. మధ్యలో ఇండస్ట్రీ
జరిగింది ఓ సినిమా ఈవెంట్. కానీ అక్కడ అనుకోకుండా రాజకీయాల గురించిన ప్రస్తావన వచ్చింది. అది కాస్తా ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద తలనొప్పిగా మారింది. సాయిధరమ్ తేజ్ రాలేని క్రమంలో సినిమాని ప్రమోట్ చేసేందుకు పవన్‌ని ఆహ్వానించింది ఆ మూవీ టీమ్. కానీ ఆయన ఆ విషయాన్ని విస్మరించి తన రాజకీయ ప్రచారానికి వాడుకున్నారనే కామెంట్స్ ఆల్రెడీ వచ్చాయి. తేజ్ యాక్సిడెంట్ గురించి మీడియా తప్పుగా ప్రచారం చేసిందనే కోపంతో …
Read More »జగన్ కి కాపు సేన వార్నింగ్
పోసాని ప్రెస్‌మీట్ తీవ్ర వివాదాస్పదం అవుతోంది. జగన్ అభిమాని అని బహిరంగంగా చెప్పుకున్న పోసాని జగన్ కి సాయం చేయబోయి గట్టిగానే ఇరికించినట్టు తదనంతర పరిణామాల ద్వారా అర్థమవుతోంది. పవన్ అభిమానులు తిట్టారు అనే నెపంతో వాళ్లు తిట్టిన తిట్లన్నీ పవన్ కళ్యాణ్ ని తిడుతూ మీడియా సమావేశం పెట్టారు పోసాని. హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ను అవమానిస్తూ మాట్లాడిన …
Read More »పవన్ పై పోసాని అగ్లీ వార్
రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ చేసిన వ్యాఖ్యల మంట ఇంకా మండుతూనే ఉంది. వైసీపీ ప్రభుత్వం మీద, జగన్ మీద పవన్ చేసిన కామెంట్స్‌కి కౌంటర్ వేసేందుకు పోసాని సోమవారం ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే దానికి కొనసాగింపుగా మరో ప్రెస్‌మీట్‌ను నిర్వహించారాయన. మొదటి రోజు ప్రెస్‌మీట్ కాస్త బ్యాలెన్స్డ్గానే ఉన్నా.. రెండో రోజు మాత్రం ఆయన కాస్త కంట్రోల్ తప్పి మాట్లాడ్డం అందరినీ షాక్‌కి గురి చేసింది. …
Read More »వైసీపీ వర్సెస్ పవన్… నష్టపోతోంది వీళ్లేనా ?
వైసీపీ వర్సెస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య మాటల మంటలు రేగాయి. సినిమా టికెట్ల విషయంలో చెలరేగిన వివాదం.. పవన్ వ్యాఖ్యలతో ఇరు పార్టీల మధ్య యుద్ధానికి దారి దీసింది. మంత్రులను సన్నాసి అని వ్యాఖ్యానించడం.. పవన్ చేసిన తప్పిదమా? లేక.. నేటిరాజకీయాల్లో కామన్ అయిపోయిన వ్యాఖ్యలనే ఆయన చెప్పుకొచ్చారా ? అనేది పక్కన పెడితే.. మొత్తాని కి ఈవిషయాన్ని అధికార పార్టీ అయితే.. సీరియస్‌గానే తీసుకుంది. దీంతో …
Read More »పోసాని నోట వినలేని రాయలేని బూతులు
నటుడు, రచయిత, వైసీపీ కార్యకర్త పోసాని కృష్ణమురళికి, పవన్ కళ్యాణ్‌కి మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. సోమవారం ప్రెస్‌మీట్ పెట్టి మరీ పవన్‌పై విరుచుకుపడిన పోసాని, మంగళవారం మరోసారి మండిపడ్డారు. గత ఇరవై నాలుగ్గంటల్లో తనకి చాలా బెదిరింపులు వచ్చాయని, అందుకే మళ్లీ మీడియా ముందుకు వచ్చానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పవన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు పోసాని. పవన్ కళ్యాణ్ ప్రజల మనిషి కాదని, …
Read More »ఆగని రగడ.. పవన్ వర్సెస్ పేర్ని.. ఎందాక!
పోకచెక్కతో నువ్వు- తలుపు చెక్కతో నేను.. అన్నట్టుగా ఉంది.. జనసేనాని పవన్ కళ్యాణ్ వర్సెస్ పేర్ని నాని వివాదం. ఒకరిపై ఒకరు.. దూషణల పర్వం పెరిగిపోయింది. పవన్ మొత్తానికి కామెంట్లు చేస్తుంటే.. పేర్ని పవన్‌ను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. రిపబ్లిక్ ఫిలిం.. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ప్రారంభమైన ఈ రగడ.. ఇప్పుడు మరింత తీవ్రంగా మారింది. ‘‘తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైకాపా గ్రామ సింహాల …
Read More »జగన్ కి ఈ సలహాదారు అవసరం ఉందా ?
సలహాదారుల విషయంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నియామకాలు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. తనకు సలహాదారులుగా తీసుకుంటున్న వాళ్ళ సలహాలను జగన్ ఎప్పుడైనా తీసుకుంటున్నారా ? సలహాలిచ్చేంత అవకాశం సలహాదారులకు జగన్ ఇస్తున్నారా ? అనేది ఎవరికీ అర్థం కాని విషయం. సలహాదారులుగా బాధ్యతలు తీసుకున్న వాళ్ళకి జగన్ కు సలహాలిచ్చింత సీన్ ఉందా అనేది కూడా అనుమానమే. ఎందుకంటే అనేక శాఖల్లో సలహాదారులుగా ఉన్న వారితో జగన్ భేటీ అయినట్లు, …
Read More »పవన్.. ఫైర్ బ్రాండ్ ట్వీట్లు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఆవేశానికి మారుపేరులా ఉండేవాడు. ప్రజారాజ్యం తరఫున రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో చాలా దూకుడుగా వ్యవహరించేవాడు. కానీ సొంతంగా పార్టీ పెట్టాక ఆయన ఆవేశం, దూకుడు చాలా వరకు తగ్గింది. ఊరికే ఆవేశపడిపోకుండా ఆచితూచి మాట్లాడ్డం వరకు ఓకే కానీ.. ప్రత్యర్థులు ఎలా పడితే అలా తిడుతుంటే, లేనిపోని ఆరోపణలు చేస్తుంటే పవన్ వారిని దీటుగా ఎదుర్కోకుండా.. మర్యాదపూర్వకంగా వ్యవహరించడం ఏంటి.. సైలెంటుగా ఉండటం …
Read More »పశ్చిమలో కొత్త మంత్రులు ఇద్దరా.. ఒక్కరా ?
ఏపీ మంత్రి వర్గ విస్తరణ ఖరారైంది. ఇప్పటికే మంత్రి వర్గంలో బెర్త్‌లను ఆశిస్తున్నవారి జాబితాతోపాటు.. పార్టీలో కీలకంగా ఉన్న నాయకుల జాబితా కూడా సీఎం జగన్ చెంతకు చేరిందని.. దీనిపై కసరత్తు ప్రారంభించారని అంటున్నారు. ఈ క్రమంలో ఉభయ గోదావరుల్లో కీలకమైన పశ్చిమ గోదావరి నుంచి ఎవరికి ఛాన్స్ దక్కుతుంది? అనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి టీడీపీ కంచుకోట వంటి ఈ జిల్లాలో వైసీపీ జెండా ఎగరేయడంలో అనేక మంది …
Read More »అక్టోబరు 2 ముహూర్తం: జగన్ సర్కారుపై పవన్ నిరసన
జనసేనాని పవన్ కళ్యాణ్.. మళ్లీ తన పాతరూట్‌లోకి వచ్చేశారా? కూర్చున్నా.. నిల్చున్నా.. ఆయన ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారా? ఇక, వైసీపీ సర్కారుకు చుక్కలు చూపించాలని నిర్ణయించుకున్నారా? వచ్చే ఎన్నికల వరకు ఇదే పంథాను కొనసాగించనున్నారా? అంటే.. తాజా పరిణామాలను బట్టి ఔననే అంటున్నారు పరిశీలకులు. అక్టోబరు 2న మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర సర్కారుపై నిరసన తెలిపేందుకు పవన్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. తనే దిగితే.. ఇక, …
Read More »