తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. అయితే.. కొందరు మహిళలు బస్సుల్లో పూలు కట్టుకోవడం, జడలు వేసుకోవడం.. అల్లికలు అల్లడం వంటివి చేసి వార్తల్లో నిలిచారు. ఈ పరిణామాలను ఉటంకిస్తూ.. కొన్నాళ్ల కిందట బీఆర్ ఎస్ కార్యనిర్వాహ క అధ్యక్షుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మీదట బ్రేక్ డ్యాన్సులు కూడా చూడాల్సి వస్తుందేమో అని అన్నారు. …
Read More »బెయిల్ పై విడుదలయిన పిన్నెల్లి
శాసనసభ ఎన్నికల్లో ఈవీఎంల ధ్వంసం, పోలీసు అధికారిపై దాడికి యత్నం కేసులో నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైధీగా ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ రోజు షరతులతో కూడిన బెయిల్ పై విడుదలయ్యాడు. జైలు నుండి విడుదలయిన ఆయనకు మాజీ మంత్రులు కాకాణి గోవర్దన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లు స్వాగతం పలికారు. ఆయన నేరుగా మాచర్లకు వెళ్తారని సమాచారం.
Read More »అమరావతి పై చాలా నమ్మకంగావున్న వరల్డ్ బ్యాంక్
ఏపీ రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్ల సాయం చేసేందుకు ముందుకు వచ్చిన ప్రపంచ బ్యాంకు.. అమరావతికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అమరావతి అభివృద్ధి ఒక అద్భుత అవకాశమ ని తెలిపింది. రాబోయే 100 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుంటే.. ఈ నగరం అత్యద్భుతంగా ఉంటుం దని.. ఒక్క ఏపీకే కాకుండా.. భారత దేశానికి కూడా ఈ నగరం ఎంతో తలమానికమని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ఇలాంటి నగరానికి సాయం …
Read More »‘ఎన్’ కన్వెన్షన్‌పై రేవంత్ పట్టుదల ఇప్పటిది కాదు
టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ‘ఎన్ కన్వెన్షన్’ను కూల్చేయడం ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. తుమ్మడిచెరువును ఆక్రమించి కట్టిన ఈ కన్వెన్షన్ సెంటర్ అక్రమమని ఎప్పట్నుంచో ఆరోపణలు ఉన్నాయి. ఐతే చిన్న వర్షానికే హైదరాబాద్‌లో పలు ప్రాంతాలు, కాలనీలు నీటి మడుగుల్లా మారిపోతుండడానికి చెరువుల ఆక్రమణలే కారణమని.. చెరువులుండాల్సిన చోట్ల కట్టడాలు విపరీతంగా పెరిగిపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతోందని భావించి రేవంత్ సర్కారు ఆక్రమణల …
Read More »జాగ్రత్త పడుతున్న జగన్ ..!
వైసీపీ అధినేత జగన్ ముందస్తు జాగ్రత్తలో పడ్డారు. పార్టీ కార్యకర్తలు, నాయకులకు సంబంధించి జరుగుతున్న న్యాయ పోరాటంలో ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు అనేక మంది పై కేసులు నమోదయ్యాయి. చాలా మంది కార్యకర్తలు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ముఖ్యమంతైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జోగి రాజీవ్ లు మాత్రమే బెయిల్‌కు వస్తుండగా.. ఆయా కేసుల్లో చిక్కుకున్న చాలా మంది కార్యకర్తలు మాత్రం జైళ్లలోనే మగ్గుతున్నారు. దీంతో కార్యకర్తల …
Read More »‘హీ ఈజ్ జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే’
హీ ఈజ్ జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే- అంటూ.. టీడీపీ నాయకురాలు, మంత్రి వంగలపూడి అనిత లైట్ తీసుకున్నారు. వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్‌పై ఆమె విమర్శలు గుప్పించారు. అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమా ద ఘటనకు సంబంధించి బాధితులను పరామర్శించిన జగన్.. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి అనిత ఫైరయ్యారు. బాధితులకు పరిహారం అందకపోతే.. నేనే వచ్చి ధర్నా చేస్తా. నన్ను చూసి …
Read More »ఏమిటా కఠిన నిర్ణయాలు పవన్
“పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారా?”.. “ఇంక, ఆయన సినిమాల్లో నటించరా?”- ఇదీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉవ్వెత్తున సాగుతున్న పెద్ద చర్చ. అనేక మంది ఇన్ స్టా గ్రామ్‌లలో కూడా ఇదే ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే.. ఇంత పెద్ద చర్చ రావడానికి కారణం.. ఏంటి? ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు పవన్ చుట్టూ.. సినిమాలు చేయరు అని కామెంట్లు వినిపించడానికి రీజనేంటి? అనేది ఆసక్తిగా …
Read More »పరామర్శల చోట…. జగన్ పరిహార రాజకీయం!
పరామర్శలు వేరు.. పరిహారం వేరు. ఈ రెండింటికి మధ్య సున్నితమైన తేడా ఉంది. అయితే.. దీనిని చెరిపేసినట్టుగా వ్యవహరించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. తాజాగా ఆయన అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో జరిగిన ఘోర దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి భరోసా ఇవ్వాల్సిన జగన్.. దానిని తగ్గించి.. మీకు పరిహారం అందిందా అని ప్రశ్నించారు. …
Read More »మంత్రదండం లేదు.. అద్భుతాలు చేయలేం: పవన్
అప్పుల్లో ఉన్న ఏపీకి చంద్రబాబు వంటి దార్శనికత ఉన్న ముఖ్యమంత్రి చాలా అవసరమని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన మార్గదర్శకత్వంలో పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అంతేకాదు.. తాను ఎంతో నేర్చుకోవాల్సింది కూడా ఉందని.. చంద్రబాబు నుంచి నేర్చుకునేందుకు అనుక్షణం తపిస్తున్నానని చెప్పారు. తాజాగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించారు. మొత్తం 13326 గ్రామాల్లో సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమయ్య …
Read More »నా ఇంటిని మీరే కూల్చండి : పొంగులేటి
హైదరాబాద్ హిమయత్సాగర్ పరిధిలో ఉన్న తన ఫాంహౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో గానీ, బఫర్ జోన్ పరిధిలో గానీ ఉన్నట్లు తేలితే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులే కూల్చివేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. తన ఫాంహౌస్ ఎఫ్ టీ ఎల్ పరిధిలో ఉందని బీఆర్ఎస్ పార్టీ బురదజల్లుతుందని ఆరోపించాడు. నిజంగా తన ఇల్లు అక్రమంగా ఉంటే కూల్చేయాలని హైడ్రా కమీషనర్ ను ఆదేశిస్తున్నానని, నేను …
Read More »ఎన్ కన్వెన్షన్ కూల్చివేత.. హైడ్రా దూకుడు!
సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌పై హైడ్రా పంజా విసిరింది. మాదాపూర్‌లో నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌ను శనివారం పొద్దు పొద్దున్నే అధికారులు కూల్చివేత పనులు ప్రారంభించారు. భారీ ఎత్తున పోలీసులు, సిబ్బందితో పహారా ఏర్పాటు చేసి.. ఐదు బుల్ డోజర్లతో పనిని చేపట్టారు. దీంతో ఒక్కసారిగా.. ఈ వ్యవహారం.. సంచలనం సృష్టించింది. మాదాపూర్‌లోని తుమ్మిడి చెరువును ఆక్రమించి.. ఈ నిర్మాణం చేశారన్నది ప్రధాన ఆరోపణ. తుమ్ముడి చెరువుకు …
Read More »వామ్మో చంద్రబాబు.. నీకో దండం సామీ!
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. విపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించే తీరు చంద్రబాబులో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఆయన తీరు ఇప్పటికి మారలేదన్న విషయం తాజా పరిణామాలు మరోసారి స్పష్టం చేస్తున్న పరిస్థితి. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడని గడ్డు పరిస్థితుల్ని చూసినట్లుగా.. వాటిని ఎదుర్కొన్నట్లుగా చంద్రబాబు తన సన్నిహితులతో చెబుతుంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గడిచిన ఐదేళ్లలో చోటు చేసుకున్న అంశాల్ని ప్రస్తావించటమే కాదు.. తన కెరీర్ …
Read More »