Political News

కసిరెడ్డి ఆస్తుల జప్తు: ప్రభుత్వం కొరడా

వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై విచారణ జరుపుతున్న ఏపీలోని కూటమి ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఉరఫ్ రాజ్ కసిరెడ్డి ఆస్తులను జప్తు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఆది నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే లిక్కర్ కుంభకోణం ద్వారా …

Read More »

మరోసారి కవిత సంచలన ఆరోపణలు

సొంత పార్టీలోని కొందరు నేతలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొద్ది రోజుల క్రితం సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ కు తాను రాసిన లేఖ లీక్ కావడంపై కవిత అసహనం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. ఇక ఆ లేఖలో కవిత పేర్కొన్న విషయాలు పార్టీలోని అంతర్గత కలహాలకు అద్దంలా మారాయి. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రశ్నించేలా ఉన్న ఆ లేఖ బీఆర్ఎస్ వర్గాల్లో …

Read More »

యువనేత హోటల్‌కు రమ్మన్నాడు.. నటి ఆరోపణలు

మలయాళ నటి, జర్నలిస్ట్‌గా కూడా పనిచేసిన రినీ ఆన్‌ జార్జ్‌ సంచలన ఆరోపణలు చేసి కేరళ రాజకీయ వర్గాల్లో కలకలం రేపారు. ఒక ప్రముఖ పార్టీకి చెందిన యువ నేత తనకు అసభ్యకరమైన సందేశాలు పంపాడని, హోటల్‌కు రావాలని ఆహ్వానించాడని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని పార్టీ నాయకత్వానికి చెప్పినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని, అంతేకాక ఆ నేతకు మరిన్ని అవకాశాలు ఇచ్చారని రినీ వాపోయారు. రినీ మాట్లాడుతూ, “తమ …

Read More »

ఇక నుంచి బంగారపు అన్వేషణలో సింగరేణి

సింగరేణి సంస్థకు కొత్త బంగారు అవకాశం దక్కింది. ఇప్పటి వరకు బొగ్గు గనులకే పరిమితమైన ఈ సంస్థ ఇప్పుడు బంగారం, రాగి ఖనిజ అన్వేషణలోకి అడుగుపెట్టింది. కర్ణాటక రాష్ట్రంలోని దేవదుర్గ్‌లో గనుల అన్వేషణకు లైసెన్స్‌ పొందడం ద్వారా సింగరేణి చరిత్రలో కొత్త ఆదాయం మొదలైంది. కేంద్రం నిర్వహించిన ఆన్‌లైన్‌ వేలంలో 37.75 శాతం రాయల్టీ కోట్‌ చేసి ఎల్‌-1 బిడ్డర్‌గా నిలిచింది. ఇది సంస్థకు పెద్ద గౌరవమే కాకుండా భవిష్యత్‌లో …

Read More »

కోకాపేట రియల్ ఎస్టేట్ జోరు.. గజం ధరలు ఆకాశమే హద్దు!

హైదరాబాద్ నగరంలో భూముల ధరలు మళ్లీ చర్చకు తెరలేపాయి. హెచ్‌ఎండీఏ తాజాగా ఆన్‌లైన్ వేలానికి నోటిఫికేషన్ జారీ చేస్తూ కనీస ధరలను భారీగా పెంచింది. ముఖ్యంగా కోకాపేట నియోపొలిస్ ప్రాంతంలో చ.గజం రూ.1.75 లక్షలుగా ధర నిర్ణయించడం రియల్ ఎస్టేట్ వర్గాల్లో షాక్ ఇచ్చింది. గతంలో ఇదే ధర రూ.65 వేలుగా ఉండేది. ఇప్పుడు ఒక్కసారిగా రెండింతలు కంటే ఎక్కువ పెరగడం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. కోకాపేటలో ప్రభుత్వ భూములు …

Read More »

గోవింద గోవింద‌: ఉద‌యం టికెట్.. సాయంత్రానికే శ్రీవారి ద‌ర్శ‌నం!

అఖిలాండ కోటి బ్ర‌హ్మాండ నాయ‌కుడు, క‌లియుగ దైవం.. తిరుమ‌ల శ్రీవారి ఈష‌ణ్మాత్ర ద‌ర్శ‌నం కోసం రోజుల త‌ర‌బ‌డి వేచి ఉండే ప‌రిస్థితికి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చెక్ పెట్ట‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు శ్రీవారి ద‌ర్శ‌నం.. వివిద ఆర్జిత సేవ‌లు చేసుకోవాల‌ని ప‌రి త‌పించిపోయే భ‌క్తుల‌కు.. ద‌ర్శ‌నం నుంచి సేవ‌ల వ‌రకు వేచిచూడాల్సిన ప‌రిస్థితి ఉన్న విష‌యం తెలిసిందే. తిరుమ‌ల దేవ‌దేవుని ద‌ర్శ‌నం.. దుర్ల‌భ‌మ‌నే మాట కూడా నానుడిగా మారిపోయింది. అలాంటి …

Read More »

రష్యా, ఇండియా బాండింగ్ ఎంత బలంగా ఉందంటే?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై అదనపు సుంకాలు విధించడం ప్రపంచ వాణిజ్యంలో కలకలం రేపింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారని వైట్‌హౌస్‌ స్పష్టంచేయడం మరింత వివాదాస్పదమైంది. అయితే దీనిపై రష్యా ఘాటుగా స్పందించింది. భారతదేశానికి వ్యతిరేకంగా సుంకాలు విధించడం అన్యాయమని, ఏకపక్ష ఒత్తిడి సరైంది కాదని రష్యా ఉపమిషన్‌ చీఫ్‌ రోమన్‌ బబుష్కిన్‌ తెలిపారు. మాస్కో అధికారులు భారత్‌కు ధైర్యం చెబుతూ, అమెరికా …

Read More »

‘శ్రీవారి ప్రసాదాలు తిని మాట్లాడండి జగన్, భారతి’

తిరుమల శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యత తగ్గిపోయిందని, అన్న ప్రసాదాల్లో అసలు నాణ్యత కొరవడిందని వైసీపీ అధినేత జగన్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇది సరికాదు. భక్తులు శ్రీవారి ప్రసాదాలను ఎంతో భక్తి ప్రపత్తులతో స్వీకరిస్తున్నారు. నాణ్యత బాగుందని కూడా చెబుతున్నారు. మీరు ఏనాడైనా తిరుమలకు వచ్చారా? నిత్యాన్నదాన సత్రంలో కూర్చుని తిరుమల శ్రీవారి ప్రసాదాలు తీసుకున్నారా? చెప్పండి. ఇప్పుడు చెబుతున్నా, జగన్, భారతి లు స్వయంగా తిరుమలకు రండి. …

Read More »

దువ్వాడ రీఎంట్రి!… మడతెట్టేస్తారట!

దువ్వాడ శ్రీనివాస్… ఈ పేరుకు పెద్దగా పరిచయమే అక్కర్లేదు. తెలుగు ప్రజల కళ్ల ముందు నుదుటన నిలువు బొట్టు పెట్టి నిత్యం ఓ పోరాట యోధుడిలా కనిపిస్తూ ఉంటారు. మరో పార్శ్వంలో నుంచి చూస్తే… రెండో పెళ్లాం దివ్వెల మాధురితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడుతూ తెగ హల్ చల్ చేస్తూ ఉంటారు. మొన్నటిదాకా విపక్ష వైసీపీలో కొనసాగిన దువ్వాడ తన వ్యవహార సరళి …

Read More »

అమిత్ షాపై చిత్తు కాగితాలు

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం నాటి లోక్ సభ సమావేశాలు అత్యంత ఉద్రిక్త వాతావరణంలో సాగాయి. అధికార పక్షంపై ఓ రేంజిలో విరుచుకుపడ్డ విపక్షాలు నానా రచ్చ చేశాయి. అందులో భాగంగా ఒకానొక సమయంలో పలు కీలక బిల్లులు ప్రవేశపెడుతున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై విపక్షాల సభ్యులు ఆయ బిల్లుల ప్రతులను చించివేసి… ఆ చిత్తు కాగితాలను ఆయన మీదకే విసిరిపారేశారు. ఈ ఘటనతో …

Read More »

బాబును ప్రశాంతంగా ఉండనివ్వరా…?

అరె… అసలే ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుపోయిన నవ్యాంధ్రప్రదేశ్ ను గట్టెక్కించేందుకు టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అహరహం శ్రమిస్తున్నారు. ఇక రాజధాని లేదన్న రాష్ట్రంగా ఏపీ ఇకపై పిలబడకుండా ఉండేలా…ఈ ఐదేళ్లలోనే రాజధాని అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు మరోవైపు కసరత్తు చేస్తున్నారు. అంతేనా.. ఏపీలో కూటమి రథసాథిగా ఉన్న బాబు…మూడు పార్టీల మధ్య ఎక్కడ కూడా సమన్వయం కొరవడకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఎన్డీఏలో టీడీపీ …

Read More »

మరి అమిత్ షా కూడా అరెస్ట్ అయ్యారు గా

లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బిల్లు రాజకీయ వర్గాల్లోనే కాక దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. కనీసం ఐదేళ్ల శిక్షకు గురయ్యే నేరారోపణలపై అరెస్టయి వరుసగా 30 రోజులు కస్టడీలో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు తమ పదవిని ఆటోమేటిక్‌గా కోల్పోవాలని ఇందులో ప్రతిపాదించారు. 31వ రోజు నుంచే ఆ నిబంధన అమల్లోకి వస్తుందని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రాజీనామా చేయకపోయినా ఈ చట్టం ప్రకారం వారి …

Read More »