Political News

బీసెంట్ రోడ్డులో సీఎం సందడి

దీపావ‌ళి పండుగ వేళ సీఎం చంద్ర‌బాబు త‌న అధికారిక ప్రొటోకాల్‌ను ప‌క్క‌న పెట్టి సామాన్యుల‌తో క‌లిసి పోయారు. ముఖ్యంగా వీధి వ్యాపారులు, చిరు వ్యాపారుల‌ను ఆయ‌న ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు. అత్యంత ర‌ద్దీగా ఉండే.. విజ‌య‌వాడ‌లోని బీసెంట్ రోడ్డులో సుమారు గంట‌న్న‌ర‌పాటు ఆయ‌న క‌లియ దిరిగారు. ప్రతి వీధి దుకాణ దారుడిని ఆయ‌న ప‌ల‌క‌రించారు. జీఎస్టీ 2.0 వ‌ల్ల క‌లుతున్న మేలును, అదేవిధంగా ప్ర‌భుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మాల తీరును కూడా తెలుసుకున్నారు. …

Read More »

జూబ్లీహిల్స్ పోరు: దూకుడు పెంచిన బీఆర్ ఎస్‌!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ దూకుడు పెంచింది. ముఖ్యంగా రెండు కీల‌క అంశాల‌ను ప్రాతిప‌దిక‌గా చేసుకుని మాజీ మంత్రి కేటీఆర్‌.. త‌న ప్ర‌చారాన్ని కొన‌సాగిస్తున్నారు. ప్ర‌చారం అంటే.. ఆయన నేరుగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రాక‌పోయినా.. తాను ఎక్క‌డున్నా.. కామెంట్లు చేస్తున్నారు. త‌ద్వారా.. ప్ర‌భుత్వ తీరు.. ముఖ్యంగా హైడ్రాను ప్ర‌జ‌ల‌కు ప‌దే ప‌దే గుర్తు చేయ‌డం వంటివి రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. ఆదివారం …

Read More »

యాద‌వుల‌ను మెప్పించేలా సీఎం హామీలు

స‌మాజంలో కీల‌క‌మైన స్థానంలో ఉన్న యాద‌వ సామాజిక వ‌ర్గాన్ని కూడా మాజీ సీఎం కేసీఆర్ తీవ్రంగా అవ‌మానించార‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. వారికి గొర్రెలు, బ‌ర్రెలు మేపుకునేవారిగానే చూశార‌ని.. అన్నారు. వారి పిల్ల‌ల చ‌దువుల‌కు ఏమాత్రం స‌హ‌క‌రించ‌లేద‌న్నారు. ఏటా దీపావ‌ళి పండుగకు ముందు జ‌రుపుకొనే యాద‌వుల అతి పెద్ద పండుగ స‌ద‌ర్‌ను రాష్ట్ర పండుగ‌గా గుర్తించాల‌న్న విజ్ఞ‌ప్తినికూడా ప‌దేళ్ల పాల‌న‌లో ఏనాడూ కేసీఆర్ ప‌ట్టించుకోలేద‌ని విమ‌ర్శించారు. తాము …

Read More »

వారు న‌యా ‘న‌ర‌కాసురులు’: ప‌వ‌న్ అన్నది వారినేనా?

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ నేత‌ల‌పై ఆయ‌న ప‌రోక్షంగా విరుచుకుప‌డ్డారు. `వారంతా న‌యా న‌ర‌కాసురులు` అని పేర్కొన్నారు. దీపావ‌ళి పండుగను పుర‌స్క‌రించుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. న‌యా న‌ర‌కాసురుల‌ను ప్ర‌జ‌లు ప్ర‌జాస్వామ్య యుద్ధంలో మ‌ట్టుబెట్టార‌ని అన్నారు. అయినా.. కొన ప్రాణంతో ఉన్న వారు.. ఇంకా అరాచ‌కాలు సృష్టిస్తున్నార‌ని తెలిపారు. ప్ర‌జ‌ల మ‌ధ్య …

Read More »

ఆ రాక్ష‌సుడిని ప్ర‌జ‌లే ఓడించారు: చంద్ర‌బాబు

ప్ర‌జ‌ల‌ను ప‌ట్టి పీడించిన ఆ రాక్ష‌సుడిని(వైసీపీ అధినేత జ‌గ‌న్‌) ప్ర‌జ‌లే గ‌త ఎన్నిక‌ల్లో మ‌ట్టిక‌రిపించార‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. కూట‌మికి దిగ్విజ‌యం క‌ట్ట‌బెట్టార‌ని తెలిపారు. అందుకే.. రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి ప‌థంలో ముందుకు సాగుతోంద‌న్నారు. రాష్ట్రంలో వైకుంఠ‌పాళి రాజ‌కీయాల‌కు ప్ర‌జ‌లు చెక్ పెట్టాల‌న్నారు. గుజ‌రాత్‌లో ఒకే ప్ర‌భుత్వం ఉండ‌డంతో అక్క‌డ అభివృద్ధి సాకారం అవుతోంద‌న్నారు. అనేక పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌న్నారు. అదేవిధంగా ఏపీలోనూ ఒకే ప్ర‌భుత్వం కొన‌సాగితే.. పెట్టుబ‌డులు సాకారం అవుతాయ‌ని.. …

Read More »

ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌దులుకోం: లోకేష్‌

త‌మ పెట్టుబ‌డుల‌ను, కంపెనీల‌ను ఏపీ ఎగ‌రేసుకుపోతోంద‌ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం వ్యాఖ్యానిస్తున్న నేప‌థ్యంలో ఏపీ మంత్రి నారా లోకేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎవ‌రు ఏమ‌నుకున్నా.. ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌దులుకునేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రాల మ‌ధ్య పోటీ ఉంటేనే పెట్టుబ‌డుల‌కు, పెట్టుబ‌డి దారుల‌కు అవ‌కాశాలు మెరుగు అవుతాయ‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న క‌ర్ణాట‌క పేరుఎత్త‌కుండానే.. ఆ రాష్ట్రంపై వ్యాఖ్య‌లు చేశారు. కీచులాడుకుంటేనో.. సౌక‌ర్యాలు మెరుగు ప‌ర‌చ‌కుంటేనో.. పెట్టుబ‌డులు …

Read More »

పెట్టుబ‌డుల వేట‌: తండ్రి లండ‌న్ – కొడుకు ఆస్ట్రేలియా.. !

ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు, మంత్రి నారా లోకేష్ పెట్టుబ‌డుల వేట‌లో క‌స‌ర‌త్తు చేస్తున్నారు. కూటమి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన 16 మాసాల్లోనే కీల‌క‌మైన 10 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మేర‌కు పెట్టుబ‌డులు తీసుకువ‌చ్చారు. ఆ త‌ర్వాత‌.. 15 బిలియన్ డాలర్ల మేర‌కు పెట్టుబ‌డి పెట్టే గూగుల్ డేటా కేంద్రాన్ని కూడా తీసుకువ‌చ్చారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలలోని ప‌లు సంస్థ‌లు.. అక్క‌డి ప‌రిస్థితులు బాగోక వెళ్లిపోయేందుకు రెడీ అయితే.. వాటిని …

Read More »

`సంస్థాగ‌త సైన్యం`.. ప‌వ‌న్ కీల‌క నిర్ణ‌యం.. !

ఏపార్టీకైనా.. నాయ‌కుల‌తోపాటు సంస్థాగ‌తంగా ఉండే నేత‌లే కీల‌కం. పార్టీ జెండా ప‌ట్టాల‌న్నా.. పార్టీ త‌ర‌ఫున బ‌లోపేతం చేయాల‌న్నా.. సంస్థాగ‌తంగా ఉన్న బ‌లం.. కీల‌కం. ఈ విష‌యంలో ఇత‌ర పార్టీల‌కు భిన్నంగా టీడీపీకి బ‌ల‌మైన సంస్థాగ‌త సైన్యం ఉంది. పార్టీ అనేక సంద‌ర్భాల్లో ఎత్తుప‌ల్లాలు చవి చూసింది. రాష్ట్ర విభ‌జ‌నకు ముందు వైఎస్ ధాటికి.. ఆ త‌ర్వాత‌.. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలోనూ పార్టీకి పెద్ద ఎత్తున పరీక్ష‌లు ఎదురయ్యాయి. అలాంటి స‌మ‌యంలో …

Read More »

బాబు మ‌రో రికార్డ్‌: పండ‌గ పూట అంద‌రూ హ్యాపీస్‌..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌రో రికార్డు సాధించారు. గ‌త కొన్నాళ్లుగా నిప్పులు చెరుగుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఆయన పండ‌గ పూట సంతోష ప‌రిచారు. ఇది నిజంగానే రికార్డ‌ని చెప్పాలి. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉద్యోగ సంఘాలు.. నిప్పులు చెరిగాయి. త‌మ‌కు వెంట‌నే డీఏ బ‌కాయిలు ఇవ్వాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టాయి. అదేస‌మ‌యంలో పీఆర్సీ వంటివాటిని కూడా వెంటనే ఇవ్వాల‌ని కోరారు. నిజానికి ఈ విష‌యాన్ని సీఎం చంద్ర‌బాబు మంత్రి వ‌ర్గ ఉప‌సంఘానికి అప్ప‌గించేశారు. …

Read More »

సీబీఐకి ల‌క్ష్మ‌ణ రేఖ‌: సుప్రీంకోర్టు సంచ‌ల‌న ఉత్త‌ర్వులు

కేంద్ర దర్యాప్తు సంస్థ‌(సీబీఐ)కి ల‌క్ష్మ‌ణ రేఖను విధిస్తూ.. సుప్రీంకోర్టు సంచ‌ల‌న ఉత్త‌ర్వులు జారీ చేసింది. సీబీఐ ద‌ర్యాప్తును ఎలా ప‌డితే అలా వేయ‌డానికి వీల్లేద‌ని స్ప‌ష్టం చేసింది. కేవ‌లం అత్యంత‌కీల‌క‌మైన కేసులు.. రాష్ట్రాల ప‌రిధిలో ఉన్న‌ పోలీసుల‌పై  విశ్వాసం స‌న్న‌గిల్లుతున్న ప‌రిస్థితులు ఏర్ప‌డిన‌ప్పుడు మాత్రమే సీబీఐ ద‌ర్యాప్తునకు ఆదేశించాల‌ని స్ప‌ష్టం చేసింది. అంతేకాదు..  సీబీఐకి ఇవ్వాల్సిన కేసుల‌ను స‌మ‌గ్రంగా అధ్య‌య‌నం చేయాల‌ని సూచించింది. ఆయా కేసుల్లో రాజ‌కీయ ప‌రిణామాలు.. కీల‌క …

Read More »

సీఎం రేవంత్‌కు ఆగ్ర‌హం వచ్చిన వేళ‌.. ఏం జ‌రిగింది?

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి స్థిమితంగా ఉంటారు. ఎప్పుడూ ఆలోచ‌నాత్మ‌కంగా నిర్ణ‌యాలు తీసుకుంటారు. ప్ర‌తిప‌క్షాల‌పై మాత్ర‌మే ఆయ‌న స‌మ‌యం, సంద‌ర్భం చూసుకుని విమ‌ర్శ‌లు గుప్పిస్తారు. అలాంటిది ఆయ‌న తొలిసారి ఉద్యోగులు, ఉన్న‌తాధికారులు, శాఖ‌ల అధిపతుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ ప‌రిణామంతో ఉన్న‌తాధికారుల నుంచి ఉద్యోగుల వ‌ర‌కు కూడా ఉలిక్కిప‌డ్డారు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? అంటే.. తాను చెప్పిన ప‌నుల‌ను కూడా అధికారులు చేయ‌క‌పోవ‌డ‌మే. ఆశ్చ‌ర్యంగా ఉన్నా ..నిజం. …

Read More »

ఏపీపై పొరుగు రాష్ట్రాల్లో జెల‌సీ.. ఏం జ‌రుగుతోంది?

1) “మీరు ఉదాసీనంగా ఉంటున్నారు. క‌నీసం మౌలిక సదుపాయాలు కూడా క‌ల్పించ‌డం లేదు. నిలువెత్తు లోతు గుంతల్లో మేం కూరుకుపోతున్నాం.“ – క‌ర్ణాట‌క స‌ర్కారును ఉద్దేశించి ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌లు చేసిన విమ‌ర్శ‌లు. 2)  “మ‌న పెట్టుబ‌డులు పొరుగు రాష్ట్రాల‌కు వెళ్లిపోతున్నా.. సిద్ద‌రామ‌య్య సినిమా చూస్తున్నారు. ఇలాంటి ప్ర‌భుత్వాన్ని త‌ట్టుకోలేక పారిశ్రామిక‌, ఐటీ దిగ్గ‌జాలు వెళ్లిపోతున్నారు.“ క‌ర్ణాట‌క విప‌క్షాల మాట‌. 3) “త్వ‌ర‌లోనే బెంగ‌ళూరు ఖాళీ అవుతుంది. ఇలానే వ్య‌వ‌హ‌రించండి.. …

Read More »