ఔను.. సీఎం చంద్రబాబు పాలన అంటే.. పారదర్శకతకు పెద్దపీట వేస్తారన్న పేరుంది. బయట ఎలా మాట్లాడినా.. అసెంబ్లీలో మాత్రం ఖచ్చితంగా లెక్కలు చూపుతారని అంటారు. అదేసమయంలో సభ్యులు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడతారన్న పేరు కూడా ఉంది. కానీ, ఇప్పుడు అదే అసెంబ్లీలో సభ్యులు దారి తప్పుతున్నారు. కేవలం సభ్యులే కాదు.. మంత్రులు కూడా.. తప్పుడు దారిలో నడుస్తున్నారని స్వయంగా చంద్రబాబు హెచ్చరించే పరిస్థితి వచ్చింది. ఇది ఆయన పాలనకు …
Read More »షర్మిల దూకుడు.. వైసీపీని దాటేస్తారా ..!
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల దూకుడు పెంచారు. ఒక్కసీటు లేకపోయినా.. ప్రజల తరఫున, అదేసమయంలో రైతుల తరఫున తాము పోరాటం చేస్తున్నామని చెబుతున్న ఆమె.. శుక్రవారం అచ్చంగా అదే పని చేశారు. చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. రైతులు, ప్రజల పక్షాన సీఎం చంద్రబాబును నిలదీస్తామని ఆమె పేర్కొన్నారు. అయితే.. పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. చిత్రం ఏంటంటే.. ఈ విషయాలపై పెద్ద ఫోకస్ రాలేదు. అయినా. . కూడా షర్మిల తన …
Read More »నటుడు విజయ్ సభలో తొక్కిసలాట.. 39 మంది మృతి
తమిళనాడులో ఘోరం జరిగింది. తమిళ యువహీరో, తమిళగ వెట్రి కగళం(టీవీకే) పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన ప్రచారం సభలో భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. ప్రాథమిక సమాచారం మేరకు.. తొలుత 10 మంది చనిపోయారని అనుకున్నా.. తర్వాత తర్వాత.. మృతుల సంఖ్య 39కి పెరిగింది. వీరిలో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. మరింత మంది ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో …
Read More »అ’భాగ్య నగరం’: కనీవినీ ఎరుగని పరిస్థితి!!
భాగ్యనగరం.. హైదరాబాద్.. చిన్న చినుకునే ఓర్చుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఏ చిన్నపాటి వర్షం కురిసినా… భాగ్యనగరం వీధులన్నీ జలమయం అవుతున్నాయి. ఇక, లోతట్టు ప్రాంతాల్లో మోకాల్లోతు నీరు చేరుతోంది. అయితే.. ఇది ఇప్పుడు పరాకాష్ఠకు చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో భాగ్యనగరం అభాగ్య నగరంగా విలపిస్తోంది. అక్కడ, ఇక్కడ అనే తేడాలేకుండా.. దాదాపు అన్ని ప్రాంతాలూ నీట మునిగాయి. జంట జలాశయాలకు నీటి వరద …
Read More »కామినేని తీసేయమన్నారు, గొడవ పోయినట్టేనా?
బీజేపీ సీనియర్ నేత, కృష్ణాజిల్లా కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు.. యూటర్న్ తీసుకున్నారు. గురువారం సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. దీనిపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బాలకృష్ణ జో్క్యం చేసుకుని.. మరింత కాకపుట్టించారు. ఈ వివాదంపై అటు సినీ రంగంలోని ప్రముఖులు.. ఇటు రాజకీయ రంగంలోని ప్రముఖు లు కూడా ఆగ్రహంతోనే ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా కామినేని వ్యాఖ్యలను తప్పుబట్టారు. దీనిపై …
Read More »‘లోకల్’ బరిలో రేవంత్ కు చిక్కులు షురూ!
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఎట్టకేలకు అడుగు పడిందన్న ఆనందం ఒక్కరోజులోనే ఆవిరి అయిపోయింది. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారంటూ రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు బుట్టెంగారి మాధవ రెడ్డి నేరుగా హైకోర్టుకు ఎక్కారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో తన పిటిషన్ ను లంచ్ మోషన్ పిటిషన్ గా విచారించాలని ఆయన కోర్టును కోరారు. మాధవ …
Read More »పేదలకు పండగ: చంద్రబాబు దసరా ప్రకటన!
ఏపీ సీఎం చంద్రబాబు.. పేదలకు సంబంధించి సంచలన ప్రకటన చేశారు. “దసరా కానుకగా.. వారికి నేను ప్రకటిస్తున్నాను..” అని పేర్కొన్న ఆయన.. త్వరలోనే ‘పేదలందరికీ ఇళ్లు’ పథకాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. 2029 నాటికి రాష్ట్రంలో పేదలకు అందరికీ ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న కృత నిశ్చయంతో ఉన్నామని చెప్పారు. తాజాగా శనివారం సాయంత్రం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. పేదలకు కూడు-గూడు-గుడ్డ ఇవ్వాలన్న సంకల్పంతోనే టీడీపీ అనేక కార్యక్రమాలు చేపట్టిందని వివరిం చారు. …
Read More »ఏపీ పోలీసులపై సీబీఐ విచారణ: జగన్ రియాక్షన్ ఇదే!
ఏపీ పోలీసులపై సీబీఐ విచారణకు ఆదేశిస్తామంటూ.. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు చేసిన వ్యాఖ్యలు.. హోం శాఖలో తీవ్ర కలకలం రేపాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులతో పాటు.. దీనికి సంబంధించిన పాత్ర ఉన్న అందరు పోలీసులపైనా సీబీఐ విచారణకు ఆదేశిస్తామని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే..ఈ వ్యవహారాన్ని వచ్చే నెల 13కు వాయిదా వేసింది. ఇక, హైకోర్టు వ్యాఖ్యలపై హోం శాఖ వర్గాలు మౌనంగా ఉన్నాయి. ప్రభుత్వం …
Read More »మోడీ సేఫ్ : వారు-వీరు తేడా లేదు!
ఏపీ రాజకీయాల్లో మరి చిత్రమైన ఘటన తెరమీదకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీని పనిగట్టుకుని ఆకాశానికి ఎత్తుతున్న కూటమి పాలకులు ఒకవైపు అయితే.. నిన్న మొన్నటి దాకా.. తెరచాటు మాత్రమే మద్దతు పలికిన వైసీపీ ఇప్పుడు బహిరంగ వేదికలపై కూడా.. మోడీ నామస్మరణ స్వరాన్ని పెంచింది. వాస్తవానికి టీడీపీ.. బహిరంగంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంది. కాబట్టి.. మోడీనికి పొగడ్డం, కేంద్రం బాగా పనిచేస్తోందని కీర్తించడం సహజమే. కానీ, ఎంత అభిమానం …
Read More »‘లీడర్ షిప్’కు కొత్త అర్థం చెప్పిన చంద్రబాబు!
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే విజనరీ ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నాయకత్వానికి తిరుగు లేదన్న వాదన కూడా ఉంది. అయితే.. తాజాగా ఆయన నాయకత్వ లక్షణం సహా నాయకుడికి సంబంధించి కొత్త అర్థం చెప్పారు. సింహం-గొర్రెలతో పోలుస్తూ.. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. విజయవాడలో జరిగిన స్వదేశీ బీఎస్ఎన్ఎల్ -4జీ నెట్వర్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ రోజు.. …
Read More »బొత్స గారూ…టీ, కాఫీల మీదా కంప్లైంటేనా?
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం నాటి శాసన మండలి సమావేశాల్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వాదనను ప్రస్తావించారు. ఎమ్మెల్యేలకు నాణ్యమైన టీ, కాఫీ ఇస్తున్న సిబ్బంది… ఎమ్మెల్సీలకు మాత్రం నాసిరకం టీ, కాఫీ ఇస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణ విన్నంతనే సభలో ఉన్న మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల …
Read More »తెలంగాణ వరద బాధితులను ఆదుకోండి: పవన్
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శని, ఆదివారాల్లో తెలంగాణలో మరింత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే ఇప్పటికే శుక్రవారం కురిసిన భారీ వర్షానికి మూసీ నది పొంగిపొరలుతోంది. ఫలితంగా మూసీ పరిసర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వరద బాధితుల సహాయార్థం జనసేన అధినేత,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పార్టీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates