Political News

అదేంటో… మోడీ స‌ర్‌కి ఎన్నిక‌ల‌ప్పుడే అన్నీ గుర్తుకొస్తాయి!

అదేంటో కానీ.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీకి ప‌లు కీల‌క విష‌యాలు సాధార‌ణ రోజుల్లో ఎక్క‌డా గుర్తుకు ఉండ‌వు… రావు. ఎన్నిక‌ల వేళ మాత్రం అన్నీ దొంత‌ర‌లు దొంత‌ర‌లుగా గుర్తుకు వస్తుంటాయి. అంతేకాదు.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప‌క్క‌నే ఉన్న‌వారి యోగ‌క్షేమాలు కూడా పెద్ద‌గా ప‌ట్టించుకోరు. కానీ, ఎన్నిక‌లు అనగానే.. ఎక్క‌డాలేని ఆప్యాయ‌త కురిపించేస్తారు. – ఇవ‌న్నీ సోష‌ల్ మీడియాలో జ‌నాలు.. ఆయా సంద‌ర్భాల్లో చేసిన వ్యాఖ్యలే!. ఇటీవ‌ల కాలంలో మోడీ …

Read More »

మళ్లీ ‘టీఆర్ఎస్’ గా గులాబీ సేన?

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి… తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చుకుంది. అయితే ఈ పరిణామం ఆ పార్టీకి తీరని నష్టం చేసిందనే చెప్పాలి. అసలు పార్టీ పేరులోని తెలంగాణ పదాన్ని తొలగిస్తున్న తీరును ఆ పార్టీ కేడర్ ఓ రేంజిలో వ్యతిరేకించినా పార్టీ అధిష్ఠానం పట్టించుకోలేదు. పార్టీ పేరు మారిన తర్వాత జరిగిన …

Read More »

చెప్పుతెగుద్ది… సీత‌క్క బ్లాస్ట్‌!

తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న నాయ‌కురాలు.. గిరిజ‌న నేత సీత‌క్క‌(అన‌సూయ‌) ఒక్క‌సారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని బ‌హిరంగ స‌భ‌లోనే వ్యాఖ్యానించారు. ములుగు జిల్లాలో నిర్వ‌హించిన ఓ అధికారిక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సీత‌క్క‌.. ఇటీవ‌ల త‌న‌పై బీఆర్ ఎస్ నేత‌లు చేసిన అవినీతి ఆరోప‌ణ‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. మ‌హిళా శిశుసంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సీత‌క్క‌.. రాష్ట్ర వ్యాప్తంగా అంగ‌న్ వాడీ కేంద్రాల్లోని మ‌హిళా ఉద్యోగుల‌కు స్మార్టు …

Read More »

నియోజకవర్గాల పెంపు: ఒరిగేదేంటి.. జరిగేదేంటి?

దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి మొగ్గు చూపుతున్నాయి. నాయకులు, కార్యకర్తల సంఖ్య ఎక్కువగా ఉండటంతో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలు పార్టీలు కూడా దీనికి ఆసక్తి చూపుతున్నాయి. అయితే విభజన విషయంలో మాత్రం ఒక శాస్త్రీయ విధానాన్ని పాటించాలని సూచిస్తున్నాయి. గతానికి భిన్నంగా వాస్తవానికి దేశంలో నియోజకవర్గాల పెంపు అనేది కొత్త విషయం కాదు. …

Read More »

జ‌మిలికి జై కొట్టాలా?.. కాంగ్రెస్ అంత‌ర్మ‌థ‌నం!

దేశంలో రెండు కీల‌క అంశాల‌ను తేల్చేసేందుకు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ సర్కారు సిద్ధ‌మైంది. 1) జ‌మిలి ఎన్నిక‌లు. 2) పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌. ఈ రెండు అంశాల‌ను తేల్చేందుకు.. ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌లు ప్ర‌త్యేకంగా భేటీ అవుతున్నాయి. వీటిని తేల్చ‌డంలో ఇప్ప‌టికే ఆల‌స్య‌మైంద‌ని.. ప్ర‌ధాన మంత్రి మోడీ ఇటీవ‌ల కూడా పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌త్యేక పార్ల‌మెంటు స‌మావేశాల్లో దీనిని …

Read More »

అమ‌రావ‌తి ఆగ‌ద‌ని తెలిసీ.. జ‌గ‌న్ `రాజ‌కీయం`

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. చాలా వేగంగా కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత 2014 -19 మధ్య జరిగిన పొరపాట్లను, జరిగిన ఆలస్యాన్ని ఇప్పుడు పూర్తిగా నివారించి రాజధాని నిర్మాణాలను వడివడిగా పూర్తి చేయడం ద్వారా వైసీపీకి అవకాశం ఇవ్వకూడదనే ధోరణితో వ్యవహరిస్తోంది. ఫలితంగా రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. ప్రతి 15 రోజులకు ఒకసారి ముఖ్యమంత్రి …

Read More »

జగిత్యాల టాక్: జీవన్ రెడ్డి రాంగ్ స్టెప్..!

జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తాజాగా బీఆర్ ఎస్ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన కారెక్కారు. అయితే ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని వీడడాన్ని జగిత్యాలలో మెజారిటీ రాజకీయ వర్గాలు తప్పుబడుతున్నాయి. ఇదే సమయంలో పార్టీ ఆయనకు తక్కువ చేయలేదని, అనేక పదవులు ఇచ్చిందని కాంగ్రెస్ నేతలు ప్రచారం ప్రారంభించారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ తనకు అన్యాయం …

Read More »

వెయ్యి కోట్ల ఒప్పందం… ముస్లిం ఓట్ల కోస‌మేనా?

దేశవ్యాప్తంగా మరో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో ప్రధానంగా బిజెపి ఎక్కువగా ఆశలు పెట్టుకున్న రాష్ట్రం పశ్చిమబెంగాల్. దాదాపు 15 సంవత్సరాలుగా ఇక్కడ మమతా బెనర్జీ పాలన సాగిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సహా వామపక్షాలు బలహీనంగా ఉన్నాయి. దీనితో ఇక్కడ పాగా వేయాలన్నది బిజెపి నాయకులు పెట్టుకున్న భారీ లక్ష్యం. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి బిజెపి అగ్ర నేతల వరకు కూడా …

Read More »

ఫ్యూచర్ లేని నేత.. ఫ్యూచర్ సిటీ: కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ సెటర్లు గుప్పించారు. రాష్ట్రంలో ఫ్యూచర్ లేని పార్టీకి ఫ్యూచర్ లేని ముఖ్యమంత్రి ఉన్నారని వ్యాఖ్యానించారు. అలాంటి ఫ్యూచర్ లేని ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ కడుతున్నారట అని ఎద్దేవా చేశారు. దీనికిగాను 16 వేల ఎకరాలను సేకరించి తన వారికి పంపిణీ చేయాలని భావిస్తున్నారంటూ ఆరోపించారు. తన కుటుంబ సభ్యులు, తన అనుకూల పెట్టుబడిదారుల కోసం పేదల భూములను …

Read More »

బెంగాల్ దంగ‌ల్‌: దీదీ 1500-బీజేపీ 3000..!

ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పాగా వేయాల‌ని కృత నిశ్చ‌యంతో ఉన్న బీజేపీ.. వ‌డివ‌డిగా ప‌రుగులు పెడుతోంది. ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకునే విష‌యంలో స్థానిక అధికార పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఉర‌ఫ్ దీదీతో పోటీ ప‌డుతోంది. 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న బెంగాల్‌లో ఈ నెల 23, 29 తేదీల్లో రెండు విడ‌తలుగా ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల మేనిఫెస్టోలను కీల‌క పార్టీలు …

Read More »

మీడియాలోకి సాయిరెడ్డి.. పక్షపాతం లేకుండా…!

అవును, నిజమే.. విజయ్ సాయి రెడ్డి మీడియా రంగంలోకి వస్తున్నారట.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారు. త్వరలో డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫాం ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.  వైసీపీలో ఒకప్పుడు కీలక వ్యక్తిగా, వైయస్ జగన్ కు అత్యంత ఆప్తుడిగా గుర్తింపు పొందారు, ఆ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా పదవులను అనుభవించి.. తర్వాత జరిగిన పరిణామాలతో పార్టీ నుంచి బయటికి వచ్చిన విజయసాయిరెడ్డి ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటున్నారు. పార్టీకి, …

Read More »

పెన్షన్లు ఇవ్వలేని ప్రభుత్వానికి ఉచితాలు ఎందుకు

ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున నిధులను వెచ్చించాల్సిన పరిస్థితి. తప్పనిసరి కోటాకు చెందిన ఈ నిధులను కూడా పలు రాష్ట్ర ప్రభుత్వాలు దారి మళ్లిస్తూ ఉంటాయి. అప్పుడు వేతనాల చెల్లింపు ఎలాగోలా చేసినా… పెన్షన్ల చెల్లింపులను మాత్రం వాయిదా వేస్తూ… ఎప్పుడో నిధులు అందుబాటులోకి వచ్చినప్పుడు చెల్లిస్తూ ఉంటాయి. మళ్లించిన నిధులను ఉచిత పథకాల అమలుకు వినియోగిస్తూ ఉంటాయి. …

Read More »