Political News

ఆసుపత్రిలో చెత్త కనిపిస్తే చంద్రబాబు ఊరుకుంటారా?

నిజమే… టీడీపీ అదినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ఏ విషయంలో అయినా అంత ఈజీ అయితే కాదనే చెప్పాలి. ఏ విషయంపై అయినా చంద్రబాబుకు సమగ్ర అవగాహన ఉంటుంది. ఈ విషయం దాదాపుగా అన్ని స్థాయిల అధికార యంత్రాంగానికీ తెలుసు. ఏ విషయం అయినా పకడ్బందీగా ఉంటే తప్పించి చంద్రబాబు ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇక ప్రజారోగ్యంలో కీలక భూమిక పోషిస్తున్న ఆసుపత్రుల్లో చెత్తా చెదారం కనిపిస్తే… చంద్రబాబు ఊరుకుంటారా? ఇలాంటి పరిస్థితే శనివారం …

Read More »

ప్రకాష్ రాజ్ కు తాడేపల్లి నుండి సంచులు?

జ‌స్ట్ ఆస్కింగ్ అంటూ.. సోష‌ల్ మీడియాలో ప్ర‌శ్న‌లు సంధించే బ‌హుభాషా న‌టుడు ప్ర‌కాష్‌ రాజ్‌ పై జ‌న‌సేన నాయ‌కుడు, మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ప్ర‌భుత్వాల‌ను బ‌ట్టి, పార్టీల‌ను బట్టి, అందుతున్న ముడుపుల‌ను బ‌ట్టి జ‌స్ట్ ఆస్కింగ్ ఉంటుందా? అని ప్ర‌శ్నించారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ హ‌యాంలో ఎందుకు జ‌స్ట్ ఆస్కింగ్ లేద‌ని ఆయ‌న నిల‌దీశారు. ఇప్పుడు కూడా జ‌గ‌న్ క‌నుస‌న్న‌ల్లోనే ప్ర‌కాష్ రాజ్ ప‌నిచేస్తున్నార‌ని.. తాడేప‌ల్లి నుంచి …

Read More »

ఎట్టకేలకు ఇంటికెళ్ళిన ప్రశ్న రావణ్

ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పై ప్రశ్న రావణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అతడిపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అంతేకాదు, హిందూ మతాన్ని కించపరిచేలా రావణ్ పలు కాంట్రవర్షియల్ కామెంట్లు చేశారని సోషల్ మీడియాలో చాలామంది నెటిజన్లు రావణ్ అరెస్టును సమర్థిస్తున్నారు. అయితే, రాజకీయ కక్షతోనే రావణ్ పై 30 కేసుల వరకు పెట్టారని విమర్శలు …

Read More »

ఒవైసీ విద్యాసంస్థ‌ల‌ను మూసేస్తారా?

హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ కుటుంబానికి చెందిన ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ‌ల‌కు హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఇదేస‌మ‌యంలో ప్ర‌భుత్వంపైనా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. హైదరాబాద్‌లోని బండ్లగూడలో ఉన్న‌ సల్కం చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఫాతిమా విద్యాసంస్థ‌ల‌ను ఏర్పాటు చేశారు. అయితే.. ఈ ప‌రిధిలో జ‌రిగిన నిర్మాణాల‌కు ఎలాంటి అనుమ‌తులు లేవ‌ని, ఇప్ప‌టికే చాలా నిర్మాణాల‌ను కూల్చి వేశార‌ని .. అలాంట‌ప్పుడు వీటిని ఎందుకు కొన‌సాగిస్తున్నార‌ని ప్ర‌శ్నిస్తూ.. విజ‌య్‌గోపాల్ …

Read More »

రేవంత్‌రెడ్డి రాజ‌కీయం… 20 ఏళ్ల చెర‌గ‌ని ముద్ర‌!

రాజ‌కీయాల్లో ఇక అంతా అయిపోయింది.. అనుకున్న ప‌రిస్థితి నుంచి ఉత్తుంగ‌త‌రంగంగా పైకెగ‌సిన నాయ‌కుడు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి. రాజ‌కీయాల్లోకి రావ‌డ‌మే గొప్ప అనుకునే రోజుల్లో పొలిటిక‌ల్ బాట ప‌ట్టిన ఆయ‌న‌.. ఇండిపెండెంటుగానే త‌న ప్ర‌యాణాన్ని కొన‌సాగించారు. అలా అలా అంచెలంచెలుగా ఎదిగి.. నేడు జాతీయ కాంగ్రెస్ పార్టీలో కీల‌క రోల్ పోషించ‌డ‌మే కాదు.. ఎంద‌రో కురువృద్ధులు ఆశించిన ముఖ్య‌మంత్రి పీఠాన్ని ద‌క్కించుకున్నారు. కాగా.. రేవంత్ రెడ్డి రాజ‌కీయ అడుగులు …

Read More »

కవిత పార్టీకి కొత్తపేరు వెతుక్కోవలసిందే..?

కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీకి భారత ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ప్రస్తుతం “టీఆర్ఎస్” పేరును కొనసాగించేందుకు అనుమతి లేదని స్పష్టం చేస్తూ పార్టీ పేరును మార్చాలని ఆదేశించింది. టీఆర్ఎస్ పేరుపై ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు అందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. తెలంగాణ అస్తిత్వం, భావోద్వేగాలకు ముడిపడిన “టీఆర్ఎస్” పేరును మరో రాజకీయ పార్టీ వినియోగించడంపై తెలంగాణ …

Read More »

లోకేష్‌నే వైసీపీ టార్గెట్ చేసిందా?

ఏపీలో విపక్షం వైసీపీ ఇటీవలి కాలంలో తిరిగి యాక్టివ్ మోడ్ లోకి వచ్చినట్టే కనిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రదాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిన వైసీపీ… చాన్నాళ్ల పాటు బయటకే రాలేని పరిస్థితి. ఆ స్థితి నుంచి ఇప్పుడిప్పుడే ఆ పార్టీ బయటకు వస్తోంది. అదే సమయంలో తన టార్గెట్ ఎవరన్న విషయాన్ని కూడా ఆ పార్టీ విస్పష్టంగానే చెప్పేస్తోంది. తమ అంతిమ టార్గెట్ టీడీపీ జాతీయ కార్యనిర్వాహక …

Read More »

రిషికొండ ప్యాలెస్ నుండి ప్రభుత్వానికి ఆదాయం ఉంటుందా?

రిషికొండ పాలెస్ లను వినియోగంలోకి తీసుకువచ్చే దిశగా ఎట్టకేలకు ఓ కీలక అడుగు అయితే.పడింది. సాగర నగరం విశాఖ పర్యాటక కేంద్రంగా ఇప్పటికే ఓ రేంజికి ఎదగగా… తాజాగా కూటమి సర్కారు చేపడుతున్న చర్యల కారణంగా నగర పరిసరాలకు మరింత మేర పర్యాటక శోభ వస్తోంది. అందులో భాగంగానే రిషికొండ ప్యాలెస్ లను ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇచ్చే దిశగా ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ఈ తంతు త్వరగానే …

Read More »

అమ‌రావతి కీల‌క అధికారి రాజీనామా… ఏం జరుగుతుంది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో కీల‌క అధికారి, మాజీ ఐఏఎస్ రాజీనామా చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఈ వ్య‌వ‌హారంపై సీఎం చంద్ర‌బాబు ఆరా తీశారు. అసలు ఎందుకిలా జ‌రిగింద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. దీంతో ప్ర‌స్తుతం స‌ద‌రు అధికారి రాజీనామా వ్య‌వ‌హారం కూడా చర్చ‌కు దారి తీసింది. ఎవ‌రాయ‌న‌? మాజీ ఐఏఎస్ అధికారి ఎస్‌వీఆర్ శ్రీనివాస్‌. ఆయ‌న‌ను కూట‌మి ప్ర‌భుత్వం ఏరికోరి తెచ్చుకుని అమరావతి గ్రోత్‌ అండ్‌ ‌ఇన్‌‌ఫ్రాస్ర్టక్చర్‌ …

Read More »

మహిళా మంత్రి గారు మళ్ళీ అలిగారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయ‌కురాలు, ప్ర‌స్తుత మంత్రి కొండా సురేఖ మ‌ళ్లీ అలిగారా? కీల‌క‌మైన మంత్రి వ‌ర్గ స‌మావేశానికి గైర్హాజ‌య్యారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. మంత్రి వ‌ర్గంలో దేవదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ‌.. గ‌త ఏడాది కాలంగా అసంతృప్తితోనే ఉన్నారు. త‌న‌కు ప్రాధాన్యం లేద‌ని.. త‌నను హైజాక్ చేస్తున్నార‌ని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ నేప‌థ్యానికి తోడు.. న‌టుడు నాగార్జున విష‌యంలో ఏర్ప‌డిన వివాదంపై తాను …

Read More »

రేవంత్ కోరి ఖర్చులు పెంచుకుంటున్నారా?

ఒక‌వైపు రాష్ట్రంలో సొమ్ములు లేవ‌ని.. ఎవ‌రూ డ‌బ్బులు డిమాండ్ చేయ‌ద్ద‌ని సాక్ష‌త్తూ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అంతేకాదు.. బీఆర్ ఎస్ హ‌యాంలో చేసిన 8.5 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల అప్పుతో రాష్ట్రం ఆ సొమ్ముల‌కు వ‌డ్డీలు క‌ట్టేందుకే ఇబ్బంది ప‌డుతోంద‌ని కూడా అంటున్నారు. ఇక‌, ఫీజు రీయింబ‌ర్స్‌మెంటు బ‌కాయిల‌పై హైకోర్టు ఇటీవ‌ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అలానే ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణానికి కూడా ప్ర‌భుత్వం అప్పులు చేస్తున్న ప‌రిస్థితి …

Read More »

మావిగన్ రచ్చలో మాజీ ఎంపీ

వైసిపి చేసిన మావిగన్ ప్రతిపాదన వల్ల ప్రయోజనం ఏంటి అని మాజీ ఎంపీ, అదే పార్టీ నుంచి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు మరో మూడేళ్లు సమయం ఉందనగా ఏపీ రాజధాని అంశంపై వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త ప్రతిపాదనను తెరమేదికి తీసుకువచ్చారు. మావిగన్ అజెండాగా తాము వచ్చే ఎన్నికలకు వెళతామని తీర్చి చెప్పారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగడమే వైసీపీకి కావలసింది. ఇప్పుడు అదే జరుగుతోంది.. …

Read More »