ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తాజాగా అన్నమయ్య జిల్లాలోని మైసూరువారిపాలెం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం.. గ్రామస్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రస్థానంపై పవన్ స్పందించారు. తాను పనిచేసేందుకు, ప్రజల కష్టాలు తీర్చేందుకే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. “ప్రజలకు ఏదైనా …
Read More »వైసీపీకి బిగ్ రిలీఫ్.. ఒకేరోజు ఇద్దరికి బెయిల్
ప్రతిపక్ష వైసీపీకి ఒకే రోజు రెండు విషయాల్లో భారీ ఉపశమనం లభించింది. ఇద్దరు కీలక నాయకులకు సంబంధించిన కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో వైసీపీ నేతలు ఒకింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిలోనూ ప్రధానంగా ఎన్నికల పోలింగ్ సమయంలో మే 13న ఈవీఎం సహా వీవీ ప్యాట్‌ను ధ్వంసం చేసిన కేసులో జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్నారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ …
Read More »ఇది పిన్నెల్లికి పరువు సమస్య
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పేరు ఇటీవల కాలంలో రాష్ట్రాల సరిహద్దులు కూడా దాటిపోయిన విషయం తెలిసిందే. ఎన్నికల పోలింగ్ సమయంలో ఈవీఎం, వీవీ ప్యాట్‌లను ధ్వంసం చేసిన వైసీపీ నాయకుడు, అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్నారెడ్డి ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తర్వాత పోలీసులపై దాడులు.. టీడీపీ కార్యకర్తలపై దాడుల కేసులతో మాచర్ల వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఆయా కేసుల నేపథ్యంలో పిన్నెల్లి …
Read More »తమ్ముళ్లకు కిక్కు.. చంద్రబాబు మరో పాలసీ..!
అక్టోబర్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తీసుకురావాలని భావిస్తోంది. 2014-2019 మధ్య అమలైన మద్యం పాలసీనే కొద్ది మార్పులతో అమలు చేయాలని చంద్రబాబు తుది నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 2019-24 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానం పై అనేక విమర్శలు వచ్చాయి. మద్య నిషేధం చేస్తానని చెబుతూనే మద్యం ధరలను పెంచడం అదేవిధంగా నాణ్యమైన బ్రాండెడ్ లిక్కర్ స్థానంలో చీపులిక్కర్‌ను …
Read More »చంద్రబాబు @ టాప్ 5
ఇండియా టుడే – సీ ఓటర్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో దేశంలోని అత్యంత జనాదరణ కలిగిన సీఎంల జాబితాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిదో స్థానంలో నిలిచారు. మొదటి స్థానంలో యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, రెండో స్థానంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్, మూడో స్థానంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, నాలుగో స్థానంలో తమిళనాడు సీఎం స్టాలిన్ నిలిచారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ …
Read More »అలాగైతే.. అసెంబ్లీలెందుకు బొత్సగారూ.. !
వైసిపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీకి 11 అసెంబ్లీ స్థానాలు మాత్రమే దక్కాయి. దీంతో ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయింది. ఈ పరిణామాలతో ఆవేదన చెందిన వైసిపి అధినేత మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి రావడం దాదాపు మానేశారు. అసెంబ్లీ సభ్యుల ప్రమాణస్వీకారం సందర్భంగా తొలిరోజు వచ్చిన ఆయన ప్రమాణ స్వీకారం చేసి వెళ్లిపోయారు. అదేవిధంగా …
Read More »ఇవ్వకపోయినా.. ఇప్పిస్తున్నారా?: బాబు-మోడీ పాలిటిక్స్
పెట్టనమ్మ ఎలాగూ పెట్టదు.. పెట్టేవారినైనా చూపించిందన్న సామెత.. ఏపీ సీఎం చంద్రబాబు , ప్రధాని నరేంద్ర మోడీ విషయంలో నిజమవుతోందని అంటున్నారు. ఏపీకి భారీ ఎత్తున నిధులు ఇవ్వాలని.. కూటమి సర్కారు పాలన కాబట్టి.. పేరు వస్తుందని.. వచ్చే ఎన్నికల్లోనూ మేలు జరుగుతుందని చంద్ర బాబు పదే పదే చెబుతున్నారు. అయితే.. ఇలా చేయడం మోడీకి ఇష్టమూలేదు.. రాజకీయంగా అవకాశమూ లేదు. చంద్రబాబుకు ఇస్తే.. మరికొన్ని మిత్రపక్షాలు.. రెడీగా ఉన్నాయి. …
Read More »నేడు గ్రామ సభలు.. పవన్ మార్కు పడుతుందా?
ఏపీలో శుక్రవారం ఒక్కరోజే గ్రామ సభలు నిర్వహించనున్నారు. వాస్తవానికి వారం రోజుల పాటు గ్రామ సభ లు నిర్వహించాలని ముందుగానే అనుకున్నారు. కానీ, కొన్ని కారణాలతో సభలను ఒక్కరోజుకే పరిమితం చేశారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో జరిగే ఈ సభల వెనుక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముద్ర ఉంది. ఆయన ఏరికోరి ఈ సభలను నిర్వహిస్తున్నారు. వాస్తవానికి సుమారు 10 ఏళ్ల కిందట మాత్రమే గ్రామ సభలు నిర్వహించారు. …
Read More »దువ్వాడకు జగన్ వ్యూహాత్మక షాక్..
వైసీపీ కీలక నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు ఆ పార్టీ అధినేత జగన్ సింపుల్‌గా షాకి చ్చారు. పార్టీలో ఫైర్ బ్రాండ్ కావడంతో నొప్పి తెలియకుండా.. చిన్నవాత పెట్టి.. పెద్ద ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం దువ్వాడ కుటుంబ వ్యవహారం కారణంగా రోడ్డున పడ్డ విషయం తెలిసిందే. భార్య, ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్న దువ్వాడ.. వేరే మహిళతో ఉంటున్నారనే విషయం వెలుగు చూసింది. ఇది వారి వ్యక్తిగత …
Read More »ఉద్యోగ సంఘాలపై బాబు మార్కు లేనట్టే.. తాజా అప్డేట్!
ఉద్యోగుల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మార్కు వేరుగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ సంఘాలకు సంబంధించిన డిమాండ్ల విషయంలోనూ ఆయన వ్యూహాలు వేరేగా ఉంటాయి. ఎంత సేపూ.. పని-పని-పని అంటూ.. ఉరుకులు పరుగులు పెట్టించడం చంద్రబాబు ప్రధాన పాలనా మంత్రాంగం. 1995-2004 వరకు కూడా చంద్రబాబు ఇలానే వ్యవహరించారు. దీంతో రాష్ట్రంలో పరిపాలన పరుగులు పెట్టింది. ఉద్యోగుల విషయంలో ప్రజలపై నమ్మకం కూడా పెరిగింది. అయితే.. తర్వాత కాలంలో ఇది …
Read More »పొలిటికల్ పోటీలో పరిశ్రమల ‘దూకుడు’
ఏపీలోని అతి పెద్ద పరిశ్రమల్లో కేవలం ఐదేళ్ల వ్యవధిలో రెండు అతి పెద్ద దుర్ఘటనలు జరిగాయి. 2020 ప్రారంభంలో విశాఖపట్నంలోని ఎల్ జీ పాలిమర్స్ నుంచి వెలువడిన ప్రాణాంతక వాయువు కారణంగా.. పలువురు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆనాడు కూడా.. బాధితుల వ్యవహారం రాజకీయం అయింది. ఇక, అప్పటి కేసు ఇప్పటి వరకు తేలకపోగా.. బాధ్యులైన ఎల్ జీ కంపెనీ ప్రతినిధులు.. రాష్ట్రం విడిచి …
Read More »గుంటూరు లో జెండా పీకేస్తున్న వైసిపి నేతలు
మాచర్ల సహా గుంటూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వైసిపి హవా తగ్గిపోయిందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ముందు గడిచిన ఐదు సంవత్సరాలలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైసిపి జెండా ఎగిరిన విషయం తెలిసిందే. బలమైన పొన్నూరు నియోజకవర్గంలో కూడా గత ఐదేళ్లలో కిలారు రోశయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వైసిపి హవా నడిచింది. ఒకానొక దశలో అప్పటి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేయడం కూడా వైసిపి పుంజుకుందడానికి బలమైన …
Read More »