రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు తెలుగు వాళ్లకు ఉండే సంబంధం మాటల్లో చెప్పలేనిది. గోంగూరతో చేసే వంటకాలు చాలానే ఉన్నాయి. వాటిలో గోంగూర పచ్చడి ఒకటి. అది ఇప్పుడు రష్యా అధ్యక్షుడికి రుచి చూపించారు.

భారత దేశ పర్యటనలో భాగంగా రెండు రోజుల కిందట ఇక్కడకు వచ్చారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో పుతిన్‌కు ఘన స్వాగతం పలికారు. ఆయన గౌరవార్ధం నిన్నటి రోజున రాష్ట్రపతి విందును ఏర్పాటు చేశారు. అందులో పసందైన వంటకాలను వడ్డించారు. ఉత్తర, దక్షిణ భారత దేశాల మేళవింపుగా ఈ విందు కొనసాగింది.

అందులో మన తెలుగు వంటకం అయిన గోంగూర పచ్చడి ఉంది. నోరూరించే గోంగూరతో తయారు చేసిన పికిల్ ను ఆయనకు వడ్డించారు. దానితో పాటు ఆవకాయ పచ్చడిని కూడా టేబుల్ పై ఉంచారట. తెలుగు వంటకాలను ఆయనకు రుచి చూపించేందుకు ఏర్పాటు చేశారు మరి. ఇందులో దక్షిణ భారత దేశానికి చెందిన స్కాక్ ఐటమ్ మురుకు కూడా ఉంది. 

రష్యా అధ్యక్షుడికి ఆతిథ్యం అంటే మామూలుగా ఉండదు కదా..! ఆయనకు ఏర్పాటు చేసిన మెనూనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ విందులో కాశ్మీరీ పుట్టగొడుగుల చట్నీ, పసుపు దాల్, బెంగాలీ స్వీట్.. ఇలా నోరూరించే వంటకాలు ఉన్నాయి. కుంకుమపువ్వుతో చేసిన పానీయం, హాక్‌ కా సాగ్‌, గులాటీ కబాబ్‌, ముర్గ్‌ ధనివాల్‌ కుర్మా, బాదాం షోర్బా, గులాబ్‌ ఖీర్‌, చీజ్‌ కేక్‌ వంటివి కూడా ఆయన మెనూలో ఉన్నాయి. అయితే పుతిన్ మితాహారి అని చెబుతున్నారు. ఆయన ఏం రుచి చూసినా.. తనకు ఇచ్చిన ఆతిథ్యానికి మాత్రం కృతజ్ఞతలు తెలిపారు.