కూటమి ఎలా ఉండాలి కూటమి సభ్యులు ఏ విధంగా వ్యవహరించాలి పార్టీ నాయకులు ఎలా ఉండాలి అనే విషయాలపై తరచుగా సీఎం చంద్రబాబు పదేపదే చెబుతూ వస్తున్నారు. అందరూ కలివిడిగా ఉండాలని క్షేత్రస్థాయిలో కలిసిమెలిసి పనిచేయాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు దీనికోసం సమన్వయ కమిటీలను కూడా క్షేత్రస్థాయిలో నియమించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీ పని చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ కలివిడికి సంబంధించి కూటమి …
Read More »మోడీ ఎఫెక్ట్: ఉచితాల వైపు వడివడిగా అడుగులు!
వచ్చే రెండు మూడు మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కీలక రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు ప్రధాని మోడీ భయం పట్టుకుందా? ముఖ్యంగా ఆయన వ్యూహం, దూకుడుపై అంచనాలు వేయలేకపోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో ప్రజలను మచ్చిక చేసుకునేందుకు ఉచిత పథకాలను మరిన్ని ప్రకటించడంతో పాటు, ఇప్పటికిప్పుడు వాటిని అమలు చేస్తూ ఓటు బ్యాంకును పదిలం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వచ్చే ఏప్రిల్ మే …
Read More »‘అందుకే ఎక్కువ మంది పిల్లల్ని కనమని చెబుతున్నా’
ప్రపంచంలోని పలు దేశాల్లో వృద్ధ జనాభా ఇప్పుడు పెను సవాలుగా మారుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. మనదేశం మాత్రమే ప్రస్తుతం యువత ఎక్కువగా ఉందన్నారు. అయితే వచ్చే 20 ఏళ్ల తర్వాత ఈ పరిస్థితి కూడా తారుమారయ్యే అవకాశం ఉందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పిలుపునిస్తున్నట్టు చెప్పారు. వయోజన జనాభా సమతుల్యం కావాలంటే ఇప్పటి నుంచే సంతానోత్పత్తిపై దృష్టి పెట్టాలన్నారు. అందుకే …
Read More »అరటి దొంగకు తీహార్ జైలా?
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్టై విడుదలైన సంగతి తెలిసిందే. ఆ కేసులో ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ తో పాటు కవితకు కూడా క్లీన్ చిట్ ఇస్తూ కోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా కవిత జైలులో గడిపిన రోజులు, అక్కడి దుర్భర పరిస్థితులు, సరదా ఘటనల గురించి …
Read More »మా వల్లే గెలిచారు.. వివాదాలకు బాబు చెక్!
వివాదాస్పద నాయకులకు సీఎం చంద్రబాబు తనదైన శైలిలో చెక్ పెట్టారు. ఎవరికివారు తమంత వారు లేరని భావిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వివాదాలు కూడా అదేవిధంగా కొనసాగుతున్నాయి. గతం నుంచి వివాదాలకు దిగుతున్న నేతలు కొందరు అయితే, కొత్తగా మరికొందరు వివాదాలకు కేంద్రంగా మారుతున్నారు. దీంతో పైస్థాయిలో కూటమి నాయకుల మధ్య ఐక్యత ఉన్నప్పటికీ, గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఒకింత ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తిరువూరు, సత్తెనపల్లి, సత్యవేడు, గుడివాడ, …
Read More »ఇది.. మోడీకి ఇన్‌సల్ట్ కాదా?!
“భారత దేశం సర్వసత్తాక సార్వభౌమ దేశం. ఇతర దేశాలకు తలవొంచదు. ఎవరో చెప్పినట్టు కూడా నడుచుకోదు. ఎవరి ఆదేశాలనో పాటించాల్సిన అవసరం కూడా లేదు.” రాజ్యాంగ పీఠికను తర్జుమా చేస్తే వినిపించే మాట ఇదే. మరి ఇప్పుడు ఏం జరిగింది? ఏం జరుగుతోంది? “సరే.. పోయి పెట్రోలు తెచ్చుకోండి” అని అమెరికా ఇచ్చిన అనుమతి ఇప్పుడు చర్చకు దారితీసింది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం నేడు అమెరికా ఆదేశాల కోసం వేచి …
Read More »కూటమికి వెయ్యి ఏనుగుల బలమిస్తున్న పవన్ కల్యాణ్
వచ్చే 15 ఏళ్లపాటు కూటమి అధికారంలో ఉండాలని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బలంగా చెబుతున్న విషయం తెలిసిందే. పదే పదే ఈ విషయాన్ని చెప్పడం ద్వారా వైసీపీని బలంగా ఎదుర్కొనేందుకు కూటమిగా ఉండడం ఒక్కటే కీలక మంత్రమన్న విషయాన్ని ఆయన తేల్చేస్తున్నారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో లోపాలు కనిపిస్తూనే ఉన్నాయి. నాయకుల మధ్య కీచులాటలు కూడా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరింత కీలక దిశానిర్దేశం చేస్తూ …
Read More »2029 ఆయుధాలు రెడీ చేసుకుంటోన్న టీడీపీ – వైసీపీ…!
2029లో జరిగే ఎన్నికలకు సంబంధించి వైసీపీ, టీడీపీలు ఇప్పటి నుంచే ఆయుధాలను రెడీ చేసుకుంటు న్నాయా? వాటికి పదును కూడాపెంచుకుంటున్నాయా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. దీని లో ప్రధానంగా గత ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్గ్‌తో టీడీపీ వైసీపీని ఎలా అయితే.. దెబ్బ కొట్టిందో.. ఇప్పుడు తిరుమల లడ్డూ వ్యవహారాన్ని కూడా అదే కోణంలో చూస్తోంది. దీనిని వచ్చే ఎన్నికల వరకు.. ప్రజల మధ్య చర్చకు ఉంచాలన్నది టీడీపీ …
Read More »ఆ విషయంపై నోరు విప్పిన పవన్
వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు, ఇతర మంత్రులు మాత్రమే మాట్లాడుతున్నారు. అయితే.. తొలిసారి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ ఆర్థిక అరాచకాలపై స్పందించారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో కీలక ప్రసంగం చేసిన పవన్ కల్యాణ్.. వైసీపీ రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేసిందని.. దీంతో రాష్ట్రం 30 ఏళ్లపాటు వెనక్కి వెళ్లిపోయిందని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని వ్యాఖ్యానించారు. …
Read More »వాహ్ డిప్యూటీ సీఎం… మళ్ళీ అభినందించాల్సిందే
రాష్ట్రంలోనే కాదు.. ఒకరకంగా చెప్పాలంటే దేశంలోనే తొలిసారి.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రికార్డు సృష్టించారనే చెప్పాలి. గత 20 మాసాల కాలంలో తన శాఖలకు సంబంధించి చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ పుస్తకాలను ప్రచురించారు. అయితే.. సహజంగానే కొన్ని ప్రభుత్వాలు ఇలా తమ అభివృద్ధిపై పుస్తకాలు వేయడం తెలిసిందే. కానీ, తొలిసారి.. ఎక్కడా ఏ ప్రభుత్వం చేయని విధంగా నియోజకవర్గాల వారీగా చేపట్టిన పనులపై పుస్తకాలు ముద్రించారు. …
Read More »ప్రపంచవ్యాప్తంగా అణు ఆయుధాల లెక్కలివే.. ఏ దేశం దగ్గర ఎన్ని?
ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడుల నేపధ్యంలో మరోసారి న్యూక్లియర్ బాంబులపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 9 దేశాల దగ్గర అణు ఆయుధాలు ఉన్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. రష్యా, అమెరికా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, భారత్, పాకిస్థాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ తొమ్మిది దేశాల దగ్గర కలిపి సుమారు 12,300 కంటే ఎక్కువ అణు బాంబులు ఉన్నట్లు తాజా …
Read More »మాదిగల కర్ణుడు సీఎం రేవంత్ రెడ్డి
మాదిగ సమాజానికి తాను కర్ణుడిలాంటి వాడినని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహాభారతంలో మిత్ర ధర్మానికి కట్టుబడి కర్ణుడు కౌరవుల వెంటే తుది వరకు ఉన్నాడని ఆయన గుర్తు చేశారు. అలానే తానుకూడా మాదిగ సోదరులకు అండగా ఉంటానని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వం నుంచి అన్ని సంక్షేమ ఫలాలు సంపూర్ణంగా అందించాలన్నదే తన కృత నిశ్చయమని చెప్పారు. “గతంలో ఎవరో ఎస్సీలకు ముఖ్యమంత్రి పీఠం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates