తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అయితే.. ఇంతలోనే బీఆర్ ఎస్‌కు చెందిన అభ్యర్థి, భద్రాచలం నుంచి విజయం దక్కించుకున్న ఎస్టీ నేత తెల్లం వెంకట్రావు పార్టీ మారుతున్నట్టు ప్రకటించేశారు. నిజానికి ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రిటర్నింగ్ అధికారులు గెలిచిన వారికి ధ్రువీకరణ పత్రాలు కూడా అందించాల్సి ఉంది. అయినప్పటికీ.. తెల్లం వెంకట్రావు.. తొందరపడిపోయారు. ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎస్టీ నియో కవర్గం …
Read More »సీఎం సీటిస్తే.. తీసుకుంటా: భట్టి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం దక్కించుకున్నాక.. సహజంగా అందరి దృష్టీ.. ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠంపైనే ఉంది. ఈ సీటును దక్కించుకునేందుకు అనేక మంది ఎదురు చూస్తున్నారు. అయితే.. కొందరు తప్పుకొన్నా.. మరికొందరు నర్మగర్భంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వీరిలో తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన భట్టి విక్రమార్క ముందుకు వచ్చారు. ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన భట్టి.. మధిర నియోకవర్గం నుంచి 35 వేల ఓట్ల మెజారిటీతో విజయం …
Read More »భారీ మెజారిటీతో రేవంత్ రెడ్డి ఘన విజయం
టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. కొడంగల్ నియోజకవర్గంలో 32,800 ఓట్ల మెజారిటీతో రేవంత్ రెడ్డి విజయ దుందుభి మోగించారు. 20 రౌండ్లలో ప్రతి రౌండ్ కు 2000 మెజారిటీ సాధించిన రేవంత్ తన ప్రత్యర్థి, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి పై ఘన విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్లలో రేవంత్ కు 800 ఓట్లు దక్కాయి. దీంతో, ఓవరాల్ గా …
Read More »రేవంత్ ట్వీట్ వైరల్
కనీ వినీ ఎరుగని ఆనందం.. ఊహకు కూడా అందని విజయానందం.. తెలంగాణ ఇచ్చామని చెప్పుకోవడమే తప్ప.. అధికారంలోకి వచ్చే దిశగా ఆ మేరకు సాధన చేయలేని అంతర్గత కుమ్ములాటలతో అలసిసొలిసిన కాంగ్రెస్‌లో ఇప్పుడు అంబరాన్నంటిన ఆనందం.. రేవంత్‌రెడ్డి సారథ్యంలో కలిసి కట్టుగా ఒక్కుమ్మడిగా సాగించిన పోరు.. అందించిన విజయానందం!! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో మేజిక్ ఫిగర్ 60 ని దాటేసి మరో ఏడు స్థానాల్లో గెలుపు దిశగా దూసుకుపోతున్న …
Read More »తమ్ముళ్లూ తొందర పడొద్దు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దక్కించుకోవడం.. ఇదే సమయంలో బీఆర్ ఎస్ అధికారానికి దూరం కావడం తెలిసిందే. ఇక, బీజేపీ, దాని మిత్రపక్షం జనసేన కూడా.. దరిదాపుల్లో ఎక్కడా కనిపించలేదు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని తెలుగు దేశం పార్టీ అలెర్ట్ అయింది. తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయిన.. గెలిచిన వారిని ఉద్దేశించి ఎవరూ ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయరాదని.. పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు పార్టీ …
Read More »మూడు రాష్ట్రాల్లో హస్త వాసి చిక్కలేదు.. !
దేశవ్యాప్తంగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే.. వీటిలో ఈశాన్య రాష్ట్రం మిజోరాం మినహా.. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. ఈ ఫలితాల్లో తెలంగాణ మినహా.. మిగిలిన మూడు రాష్ట్రాల్లో బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్యే హోరా హోరీ యుద్ధం జరిగింది. ఇక, ఇప్పుడుతుది ఫలితాల్లోనూ తొలి రెండు రౌండ్లలో బీజేపీ -కాంగ్రెస్‌లు.. పోటా పోటీగా వ్యవహరించినా.. ఇప్పుడు …
Read More »ఫలించిన రేవంత్ మంత్రం.. కాంగ్రెస్ ఊపిరి పీల్చుకో!
‘మార్పు’ అంటే ఊహించేందుకే భయపడిన పరిస్థితి. పార్టీలో ఎవరు ఎగస్పార్టీ అవుతారో.. ఎవరిని అక్కు న చేర్చుకుంటే ఎవరు జారిపోతారో.. అనే బెంగ. అయినప్పటికీ.. పార్టీని బలంగా ముందుకు తీసుకువెళ్లే నాయకుడు కావాలి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెను సాహసమే చేసింది. తమ పార్టీ కాని నాయకుడిని. నిన్నమొన్నటి వరకు తమపై విరుచుకుపడిన నాయకుడిని.. తమ పార్టీలో చేర్చుకుని.. పెద్దపీట వేసింది. దశాబ్దాలుగా పార్టీలోనే ఉన్నామని.. పార్టీతో …
Read More »దెబ్బకు ఈసీ వెబ్ సైట్ క్రాష్
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గాఅభివర్ణించే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మొదలైన ఓట్ల లెక్కింపుతో అందరి చూపు ఇప్పుడు ఎన్నికల ఫలితాల మీదే ఉంది. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ ఉంది. దీంతో.. తెలుగువారంతా ఎన్నికల ఫలితాల కోసం తీవ్రమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ ఎన్నికల …
Read More »ఎగ్జిట్ పోల్సే నిజమయ్యాయి.. కేటీఆర్ ఏమంటారు!
“ఎగ్జిట్ పోల్స్‌ను మేం నమ్మం. అవన్నీ వృథా. టైం వేస్ట్. రేపు అసలు రిజల్ట్ వచ్చాక.. క్షమాపణలు చెబుతారా?“ అంటూ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబందించి పలు సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలపై బీఆర్ఎస్ కీలక నాయకుడు, మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలు ఇంకా గుర్తుండే ఉంటాయి. అయితే.. ఇప్పుడు వాస్తవ ఫలితం తెరమీదికి వచ్చేసింది. ఈవీఎం పెట్టెల్లో భద్రంగా దాగి ఉన్న ప్రజాతీర్పు.. బయటకు వచ్చేసింది. …
Read More »గులాబీ పరువు నిలిపిన గ్రేటర్
అంచనాలే నిజమవుతున్నాయి. కీలకమైన పోలింగ్ ముగిసిన తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ కు తగ్గట్లే పరిణామాలు ఉంటున్నాయి. కౌంటింగ్ మొదలైన రెండున్నర గంటల అనంతరం పరిస్థితి చూస్తే.. విజయం దిశగా కాంగ్రెస్ వెళుతోంది. ఇప్పటివరకు వెలువడిన అధిక్యత లను చూస్తే.. కాంగ్రెస్ గట్టెక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో.. తొలి గంటన్నరతో పోలిస్తే.. పదకొండు గంటల వేళకు పరిస్థితుల్లో కాస్తంత మార్పులు చోటు చేసుకుంటాయి, అయినా కాంగ్రెస్ కే …
Read More »రెండు చోట్లా.. రేవంత్ దూకుడు..
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి… తాజా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసిన విష యం తెలిసిందే. ఆయ సంప్రదాయంగా పోటీ చేసే కొడంగల్‌తోపాటు.. ఈ దఫా సీఎం, బీఆర్ ఎస్ అధినే త కేసీఆర్ పోటీ చేసిన.. కామారెడ్డి నియోజకవర్గంలోనూ పోటీకి దిగారు. అయితే..ఈ రెండు నియోజకవ ర్గాల్లోనూ రేవంత్ ముందంజలో ఉండడం గమనార్హం. కామారెడ్డి లో అయితే.. కేసీఆర్ ఘోర ఓటమి దిశగా ముందుకు …
Read More »హ్యాండిచ్చిన బీజేపీ.. జనసేనకు జీరో
పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వచ్చింది జనసేన. పార్టీ పెట్టిన పదేళ్లలో ఏ రోజు కూడా అధికార పార్టీ మీద కానీ.. కేసీఆర్ పాలన గురించి కానీ..తెలంగాణ సమస్యల గురించి కానీ మాట్లాడని పవన్ కల్యాణ్.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు రావటం అప్పట్లో ఆసక్తికర చర్చ నడిచింది. తొలుత 22 స్థానాల్లో పోటీ చేయాలని జనసేన భావించినా.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates