అవును.. దాదాపు పదేళ్లకు పైనే అయ్యింది జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వెళ్లి. 2014లో ఎన్నికలకు ముందు ఈ రెండు పార్టీల మధ్య తొలిసారి పొత్తుల వేళలో పవన్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు.. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన ఇంటికి వెళ్లారు. అప్పట్లో పొత్తు కేవలం మద్దతు రూపంలో ఉందే తప్పించి.. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు లేదన్నది మర్చిపోకూడదు. అప్పటి పరిస్థితులకు …
Read More »ఉమ్మడి ప్రకాశంలో వైసీపీ మార్పుల ప్రకంపనలు!
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల్లో 3 స్థానాలు మినహా అన్నిచోట్లా వైసీపీ విజయం దక్కించుకుంది. ఒక్కచీరాలలో టీడీపీ అప్పటి నాయకుడు కరణం బలరామకృష్ణమూర్తి, అద్దంకిలో టీడీపీ నాయకుడు గొట్టిపాటి రవి, కొండపిలో టీడీపీ నాయకుడు డోలా బాల వీరాంజనేయస్వామి గెలుపు గుర్రాలు ఎక్కారు. వీరు మినహా అందరూ వైసీపీ నాయకులే గెలిచారు. అయితే.. టీడీపీ తరఫున గెలిచిన బలరాం కూడా తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలావుంటే.. ఇప్పుడు …
Read More »రామోజీరావు దగ్గర పని చేసిన పోసాని ఇప్పుదు తిడుతున్నాడు
మీడియా మొఘల్ రామోజీరావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు నటుడు కం ఏపీ ఎఫ్ డీసీ ఛైర్మన్ పోసాని క్రిష్ణ మురళీ. రామోజీపై తీవ్ర విమర్శలు.. ఘాటైన ఆరోపణలు చేసే వేళలో.. గతాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో తాను మార్గదర్శి చిట్ ఫండ్ లో పని చేసిన విషయాన్ని చెబుతూ.. 1985లో సికింద్రాబాద్ బ్రాంచ్ లో తాను మార్గదర్శి సంస్థలో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేశానని చెప్పారు. అప్పట్లో తాను రామోజీని …
Read More »నాగబాబు కు ఓటు కష్టాలట
జనసేన ప్రధాన కార్యదర్శి, ప్రముఖ నటుడు నాగబాబు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నావి ఓటు కష్టాలు అంటూ.. ఆయన వ్యాఖ్యానించారు. తన సొంత రాష్ట్రమైన ఏపీలో ఓటు వేసేందుకు ప్రయత్నిస్తుంటే.. వైసీపీ నాయకులు అడ్డుకుంటు న్నారని చెప్పారు. ఏపీలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఓటు వేయాలనే ఉద్దేశంతో తెలంగాణలో ఓటును తాను తన కుటుంబం రద్దు చేసుకుందని తెలిపారు. ఈ క్రమంలో మంగళగిరి పరిధిలో ఓటు హక్కు …
Read More »అభ్యర్ధుల జాబితా రెడీ అయ్యిందా ?
రాబోయే ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్ధుల జాబితాను జగన్మోహన్ రెడ్డి దాదాపు రెడీచేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. జిల్లాల ఇన్చార్జిలు, కోఆర్డినేటర్లతో ఇదే విషయమై జగన్ విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే అనేక మార్గాల్లో తెప్పించుకుంటున్న సర్వే నివేదికల ఆధారంగా ఎవరిని ఏ నియోజకవర్గంలో పోటీచేయించాలి, ఎవరిని తప్పించాలి, ఎవరిని ఎంపీ, ఎంఎల్ఏలుగా పోటీచేయించాలనే విషయమై జగన్ అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. దీని ఆధారంగానే నియోజకవర్గాల ఇన్చార్జిల మార్పులు చేస్తున్నారు. ఇలాంటి …
Read More »బీజేపీ అయోమయం పెంచేస్తోందా ?
ఏపీ రాజకీయాల్లో అయోమయం పెరిగిపోతోంది. దీనికి ప్రధాన కారణం బీజేపీయేననే చెప్పాలి. దీనికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరింత ఆజ్యం పోస్తున్నారు. అయోమయానికి ఒకరకంగా కారణం కూడా పవననే చెప్పాలి. ఎలాగంటే ఎన్డీయేలో పార్టనర్ హోదాలో బీజేపీ మిత్రపక్షంగా ఉంటూనే టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకున్నారు. నిజానికి దీన్ని అనైతికమనే చెప్పాలి. కానీ ప్రస్తుత రాజకీయాల్లో నైతికం, అనైతికమనే ప్రస్తావన పెద్దగా ఉండటం లేదు. తమకు ఏది లాభం …
Read More »‘కమ్మ’నైన ప్రేమ చాటిన తుమ్మల
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవిని దక్కించుకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా ఖమ్మం నియోజకవర్గం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పేరు ఎత్తకుండానే ఆయన బీఆర్ఎస్ పార్టీ పై విమర్శలు గుప్పించారు. కమ్మోళ్లు తలదించుకునేలా తాను ఎప్పటికీ ఎలాంటి పనీ చేయబోనని వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం రామాలయంలో శ్రీ సీతారామ కమ్మ వారి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించిన నూతన వసతి …
Read More »ఇప్పుడు కళ్లు తెరుచుకున్నా.. రేవంత్‌తో కలసి పనిచేస్తా
ఎదురు దెబ్బ తగిలితే కానీ.. నొప్పి బాధ తెలియదన్నట్టుగా.. ఓటమి చవిచూస్తేనే తప్ప.. పార్టీ విలువ, నాయకుల విలువ కొందరికి అంతగా తెలియవు. ఇప్పుడు ఇదే పరిస్థితి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఎదురైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయా రు. తాను ఓడిపోతానని కానీ.. తనను ప్రజలు ఓడగొడతారని కానీ.. జగ్గారెడ్డి అస్సలు ఊంహించలేదు. అంతేనా.. ఎన్నికలకు ముందు ఆయన సీఎం …
Read More »బీఆర్ఎస్ ను మాటలతో కుళ్ళబొడిచారా ?
మాటలతోనే కుళ్ళబొడవటం అంటే ఏమిటో తెలంగాణా అసెంబ్లీలో కేటీయార్ , హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎంఎల్ఏలందరికీ అర్ధమయ్యుంటుంది. కేసీయార్ పదేళ్ళ పరిపాలనలో జరిగిన అవకతవకలు, అక్రమాలు, అవినీతి తదితారాలపై రేవంత్ తనదైన స్టైల్లో సెటైర్లు వేస్తు సుదీర్ఘంగా మాట్లాడారు. రేవంత్ మాటలను తట్టుకోలేక కేటీయార్, బీఆర్ఎస్ ఎంఎల్ఏల్లో కొందరు అడ్డుపడ్డారు. దాంతో కాంగ్రెస్ ఎంఎల్ఏల్లో కొందరు బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసి బయటకు పంపేయమని సలహా ఇచ్చారు. దానికి …
Read More »వైసీపీకి 25 సీట్లే: నాగబాబు పంచాంగం!
ఏపీలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో జతకట్టిన జనసేన కలిసి పోటీకి రెడీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీట్ల లెక్కలు, గెలిచే గుర్రాలు.. వచ్చే లబ్ధి.. పదవులు.. పంపకాలు.. ఇలా అనేక విషయాలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఒక లెక్క ఉంది. దానినే ఆయన తరచుగా చెబుతున్నారు. సీట్ల లెక్క ఇంత అని చెప్పకపోయినా.. ఆశలు తగ్గించుకోవాలని, …
Read More »పాలకొండ ఎమ్మెల్యే మార్పు.. వైసీపీ వ్యూహం ..!
పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే మార్పు తథ్యమని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న విశ్వసరాయి కళావతి.. అనారోగ్యంతోపాటు గ్రాఫ్ పరంగా కూడా వెనుక బడ్డారని పార్టీ భావిస్తోంది. దీంతో ఇక్కడ అభ్యర్థిని మార్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. వరుస విజయాలు దక్కించుకున్న విశ్వసరాయి కళావతి.. డౌన్ టు ఎర్త్ అన్నట్టుగా వ్యవహరిస్తారు. అందరితోనూ కలుపుగోలుగా ఉంటారు. వైసీపీ కోసం ఆమె అనేక రూపాల్లో కష్టపడ్డారు. పార్టీని ముందుకు నడిపించడంలోనూ …
Read More »సీనియర్ తమ్ముళ్ళ కొంప ముంచుతున్న జనసేన
పొత్తులన్నాక కొందరికి టికెట్లు ఎగిరిపోవటం చాలా సహజం. అయితే టికెట్లు దక్కకపోవడం ఎక్కడో ఒకటి రెండు నియోజకవర్గాల్లో అయితే పార్టీలు పెద్దగా పట్టించుకోవు. కానీ చాలామంది సీనియర్లకు టికెట్లు దక్కే అవకాశాలు ఉండవని తేలితే మాత్రం సీనియర్లలో అలజడి పెరిగిపోవటం ఖాయం. ఇపుడు ఇదంతా ఎందుకంటే టీడీపీ, జనసేన పొత్తులో సీనియర్ తమ్ముళ్ళ సీట్లలో జనసేన పోటీచేయటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే టీడీపీ-జనసేన పొత్తులో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates