ఏపీ సీఎం జగన్ అంతర్మథనం చెందుతున్నారా? రాష్ట్రంలో ఆయన అనుకుంటున్నట్టుగా.. ఏమీ జరగడం లేదా? ప్రతి విషయంలోనూ జగన్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీలోని కీలక నాయకులు. ముఖ్యంగా గత మేనిఫెస్టో కమిటీలో ఉన్న గుంటూరుకు చెందిన సీనియర్ నాయకుడు ఒకరు ఈ విషయాన్ని బాహాటంగానే చెబుతున్నారు. “మేనిఫెస్టోలో ఉన్నవన్నీ.. అమలు చేస్తున్నాం. కానీ.. ప్రజలు ఇంకా ఏదో కోరుకుంటున్నారు. దీనిని రీచ్ కాలేక పోతున్నాం. …
Read More »ఇటు టీఆర్ఎస్.. అటు బీజేపీ
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఇంకా షెడ్యూలే విడుదల అవలేదు. అసలు ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియదు. కానీ, ఇక్కడ రాజకీయం మాత్రం.. భోగి మంటలను తలపిస్తోంది. ఇప్పటి వరకు ఎవరికి వారుగా.. బీజేపీ, టీఆర్ ఎస్ నాయకులు రాజకీయ దుమారానికి తెరదీసిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఆదివారంమాత్రం.. ఒకేరోజు.. ఈ రెండు పార్టీల అగ్రనాయకులు.. ఇక్కడ సభలు …
Read More »రాజాసింగ్ అరెస్ట్.. రగులుతున్న రాజకీయం
తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ ఎస్ రాజకీయం మరింత రాజుకుంది. మునావర్ షో ఎఫెక్ట్‌తో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను లాలాగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రేపటి మునావర్ ఫారుఖీ షోను అడ్డుకుంటాము అనడంతో.. ముందస్తుగా రాజాసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి కేటీఆర్ ఆహ్వానం మేరకే మునావర్ హైదరాబాద్ వస్తున్నారని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే.. దీనిని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ …
Read More »మారుతున్న రాజకీయాలు.. కేసీఆర్‌కు కష్టమే?
కేంద్రంలో చక్రం తిప్పడం ఖాయమని భావించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కష్టాలు ప్రారంభ మయ్యాయా? ఆయన అనుకున్నట్టుగా కేంద్రంలో చక్రం తిప్పడం అంత ఈజీకాదా? ఆయనను రాష్ట్రానికే పరిమితం చేసేలా.. సహకరించే వారిని కూడా దూరం చేసేలా.. కేంద్రంలోని బీజేపీ పావులు కదుపుతోందా? అంటే.. తాజాగా మారుతున్న పరిణామలను బట్టి ఔననే అంటున్నారు పరిశీలకులు. నిన్న మొన్నటి వరకు ఢిల్లీ టూ హైదరాబాద్.. అంటూ.. తరచుగా చక్కర్లు కొట్టిన కేసీఆర్.. …
Read More »వైసీపీ నుంచి చేజారుతోన్న ఆ నియోజకవర్గం…
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలకమైన ఎస్సీ నియోజకవర్గం.. పైగా టీడీపీకి కంచుకోట వంటి.. చింతలపూడి నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య అసంతృప్తి సెగలు రేగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే ఎలీజాకు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా ఇంకొందరు గళం విప్పుతున్నారు. ఎమ్మెల్యే అనుకూలురు కొందరు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని, దీనిని ప్రశ్నిస్తే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వాదన వినిపిస్తోంది. ఈ మధ్యనే జంగారెడ్డిగూడెం మునిసిపల్ ప్రాంతంతో పాటు కామవరపుకోట మండలంలో …
Read More »టీఆర్ఎస్ ది బలప్రదర్శనేనా?
మునుగోడు ఉప ఎన్నికల నేపధ్యంలో అన్ని పార్టీలు గెలుపును దృష్టిలో పెట్టుకుని అనేక వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగానే బలప్రదర్శనకూ దిగుతున్నాయి. ఈనెల 20వ తేదీన నియోజకవర్గం కేంద్రం మునుగోడులో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు కనీవినీ ఎరుగనంత స్ధాయిలో జనసమీకరణ చేయాలని ఇప్పటికే కేసీయార్ ఆదేశించారు. 25 ఎకరాల్లో జరగబోయే బహిరంగ సభకు లక్షలాది మందిని తీసుకురావాలని టార్గెట్ గా చాలామంది నేతలు …
Read More »అఖిలను పక్కన పెట్టినట్లేనా ?
నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్న చంద్రబాబు నాయుడు ఆళ్ళగడ్డ విషయంలో తీసుకున్న వైఖరితో ఇపుడిదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నియోజకవర్గాల సమీక్షలో కొందరికి టికెట్లు ఖరారుచేస్తున్న చంద్రబాబు నాయుడు మరికొందరి విషయంలో వాయిదా వేస్తున్నారు. గురువారం రాయలసీమలోని ఆళ్లగడ్డ, పుంగనూరు, రాజంపేట, మైదుకూరు, నందికొట్కూరు నియోజకవర్గాలపై సమీక్ష జరిపారు. కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని మరికొన్ని నియోజకవర్గాల నేతలతో కూడా భేటీ అయ్యారు. పై నియోజకవర్గాల్లోని కొందరు నేతలకు టికెట్లు దాదాపు క్లియర్ …
Read More »మా పార్టీ నేత నీచంగా ప్రవర్తిస్తున్నారు: మాజీ మంత్రి అనిల్
సొంత పార్టీ లేదు.. వైరి పక్షము అన్నది లేదు. తమకు పడని వాళ్లు ఎవరైనా సరే.. తమ మాటల తూటాల తాకిడికి విలవిలలాడేలా వ్యాఖ్యలు చేసే విషయంలో వైసీపీ నేతల తర్వాతే ఎవరైనా. ప్రత్యర్థి పార్టీల విషయంలో అస్సలు తగ్గనట్టుగా వ్యవహరించే తీరుకు ఏ మాత్రం తీసిపోని రీతిలో సొంత పార్టీ వారిపై కూడా విరుచుకుపడుతుంటారు. అధికారం చేతిలోకి వచ్చిన మూడేళ్లలోనే.. ఏపీలోని పలువురు అధికార పార్టీకి చెందిన నేతలు సొంత …
Read More »మోడీ ఆట ముగిసిందా?
అప్రతిహత విజయాలతో వరుసగా కేంద్రంలో పాగా వేసి.. తనకు తిరుగులేదని భావిస్తున్న బీజేపీ అగ్రనేత, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆట ముగిసిందా? తాను చెప్పిందే.. వేదం.. తాను చేసిందే శాసనం అనేలా.. వ్యవహరించిన.. ఆయన తీరుపై వ్యతిరేకత ప్రారంభమైందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇటీవల జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ఇప్పుడు ఇలాంటి చర్చే జోరుగా సాగుతోంది. వరుసగా జరుగుతున్న పరిణామాలు.. మోడీ శకం ముగుస్తోందని.. ఆయన ఆటకు.. …
Read More »మరోసారి బెడిసికొట్టిన జగన్ వ్యూహం
ఏపీ ఉద్యోగుల విషయంలో ముఖ్యమంత్రి జగన్ వ్యూహాలు బెడిసి కొడుతున్నాయి. కంట్రి బ్యూటరీ పింఛన్ స్కీంను ఎత్తి వేయలేమని.. ఆయన పదే పదే చెబుతున్నారు. అయితే.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దీనిని రద్దు చేయాల్సిందేనని.. ఉద్యోగులు పట్టుబడుతున్నారు. మరోసారి ఉద్యమాలకు రెడీ అవుతున్నారు. దీంతో ఎప్పటికప్పుడు.. ఉద్యోగులను తనదారిలోకి తెచ్చుకునేందుకు సీఎం జగన్ వ్యూహాలు వేస్తున్నారు. అయితే.. ఎప్పటికప్పుడు అవి బెడిసి కొడుతున్నాయి. తాజాగా మరోసారి ఉద్యోగులతో సర్కారు …
Read More »రాజధాని రైతుల పాదయాత్ర.. ఈసారి డిజిటల్ హంగులు
ఏపీ రాజధాని అమరావతి పరిరక్షణలో భాగంగా ఇక్కడి రైతులు మరోసారి పాదయాత్రకు ఉపక్రమించారు. గతంలో తిరుపతి వరకు పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పరంపరలో మరోసారి సెప్టెంబర్ 12 నాటికి రాజధాని పరిరక్షణ కోసం అమరావతి రైతుల నిరసనలు వెయ్యి రోజులకు చేరుకున్న సందర్భంగా, ఐక్య కార్యాచరణ నేతలు భవిష్యత్ కార్యాచరణ వెల్లడించారు. రైతు పరిరక్షణ సమితి నేతలు మరోమారు పాదయాత్ర చేపడతామని తెలిపారు. పాదయాత్రకు సంబంధించిన యాప్ను …
Read More »ఏపీ సర్కారు.. మరో అప్పు
ఆంధ్రప్రదేశ్ అంటే.. అప్పులు ప్రదేశ్‌గా మారిపోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నప్పటికీ.. ఇక్కడి వైసీపీ సర్కారు మాత్రం ఈ వ్యాఖ్య లను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. అయిన కాడికి.. అందిన కాడికి అప్పులు చేస్తూనే ఉంది. తాజాగా మరోసారి అప్పులు తెచ్చేసింది. ఈ సారి కూడా అందరూ విస్మయానికి గురయ్యేలా ఈ అప్పులు ఉండడం గమనార్హం. అటు కేంద్రం నుంచి అప్పులు పెరిగిపోతున్నాయంటూ.. ఆందోళన వ్యక్తం అయినా.. ఆర్బీఐ నుంచి కూడా …
Read More »