Political News

నేటి నుంచి అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రారంభం

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఏపీలో గత 685 రోజులుగా రైతులు, మహిళలు, యువత ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ, అమరావతిపై ఏపీ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలోనే అమరావతి రాజధాని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు నేటి నుంచి ‘మహా పాదయాత్ర’ చేపట్టారు. ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పాదయాత్ర తుళ్లూరు నుంచి తిరుపతి వరకు కొనసాగనుంది. …

Read More »

డ్రెస్ కోడ్ పై లేడీ డాక్టర్ల నిరసన

ఏదో ఓ నిర్ణయం తీసుకోవటం తర్వాత ఆ విషయమై తీరిగ్గా చింతిచటమో లేకపోతే వాపసు తీసుకోవటమో ఏపి ప్రభుత్వానికి అలావాటైపోయింది. ఇపుడు తాజా విషయం ఏమిటంటే వైద్యులకు డ్రెస్ కోడ్. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులందరికీ డ్రెస్ కోడ్ ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు డిసైడ్ చేశారు. ఒకసారి డిసైడ్ అవ్వగానే డాక్టర్లు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, నర్సులు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో కూడా ఉన్నతాధికారులు ఓ …

Read More »

బాబు.. ఆ నాలుగు చోట్ల లీడర్లు ఎక్కడ…?

టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవ‌ల‌ పార్టీలో ఊహించని మార్పులు చేస్తున్నారు..నెక్స్ట్ ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే కొన్నిచోట్ల మార్పులు తప్పదనే దిశగా బాబు ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే బాబు ఏ మాత్రం మొహమాటం పడకుండా పనిచేయని నాయకులని పక్కనబెట్టేసి కొత్త నాయకులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇప్పటికే ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకు కొత్త ఇన్‌చార్జ్‌లని పెట్టారు. తాజాగా డోన్ నియోజ‌క‌వ‌ర్గ ప‌గ్గాల‌ను మ‌న్నె సుబ్బారెడ్డికి అప్ప‌గించారు. అలాగే పనిచేయని నాయకులని మొహమాటం లేకుండా …

Read More »

చేరిక‌లు.. ప్ర‌చారాలు.. సంద‌డి షురూ!

ప్ర‌త్య‌ర్థి పార్టీల నాయ‌కుల‌ను ఆక‌ర్షించ‌డం.. త‌మ ప్ర‌యోజ‌నాల కోసం నేత‌లు పార్టీలు మార‌డం.. హోరాహోరీ ప్ర‌చారం.. సెల‌బ్రిటీల చేరిక‌లు.. ఇలా దేశ‌వ్యాప్తంగా అయిదు రాష్ట్రాల్లో ఇప్ప‌టి నుంచే ఎన్నిక‌ల సంద‌డి మొద‌లైపోయింది. వ‌చ్చే ఏడాది కీల‌క‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌తో పాటు పంజాబ్, గోవా, మ‌ణిపూర్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్ర శాస‌న‌స‌భ‌ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ ఎన్నిక‌ల‌కు మ‌రికొద్ది నెల‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌తో …

Read More »

బ‌ద్వేల్ ఓటింగ్ త‌గ్గింది.. 20 ఏళ్ల‌లో ఫ‌స్ట్ టైం..

ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా.. క‌డ‌ప‌లోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం బ‌ద్వేల్‌కు తాజాగా జ‌రిగిన ఉప ఎన్నిక అధికార పార్టీలో గుబులు రేపుతోంది. “ఎవ‌రూ పోటీలేరు. పైగా.. ఉన్న బీజేపీ కూడా యాక్టివ్ కావ‌డం టైం పడుతుంది. సో.. భారీ మెజారిటీ మాదే” అని వైసీపీ నాయ‌కులు ప్ర‌చారంలో ఊద‌ర‌గొట్టారు. అంతేకాదు.. వైసీపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అనేక ప‌థ‌కాలు.. ఇంటికే చేరుతున్నాయని.. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాల‌న అని చెప్ప‌డం …

Read More »

‘విశాఖ ఉక్కు’ పవన్ సినిమా ఫ్లాప్

విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై నెటిజ‌న్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా విశాఖ ప‌ట్నం స్టీల్ ప్లాంట్ స‌మీపంలో జ‌న‌సేన ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌న్ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా విశాఖ ఉక్కు క‌ర్మాగారం కోసం పోరాడుతున్న వారికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. తాను అండ‌గా ఉంటాన‌ని.. ఎవ‌రూ ధైర్యం వీడ‌రాద‌ని ప్ర‌క‌టించారు. అంద‌రూ క‌లిసి క‌ట్టుగా ఉంటేనే …

Read More »

వైసీపీ ఎంపీల‌ను ఓ రేంజ్‌లో ఏకేసిన పీకే

ఏపీ అధికార పార్టీ వైసీపీ ఎంపీల‌ను జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఓ రేంజ్‌లో ఏకేశారు. పార్ల‌మెంటు ఎందుకు వెళ్తున్నారు? అని ప్ర‌శ్నించారు. కేవ‌లం క‌ప్పు కాఫీ తాగి వ‌చ్చేందుకు వారు పార్ల‌మెంటుకు వెళ్తున్నారా? అని నిల‌దీశారు. ఏపీకి సంబంధించిన ఒక్క స‌మ‌స్య‌పైనా.. వారు నోరు విప్ప‌డం లేద‌న్నారు. ఇంద‌కేనా 22 మంది ఎంపీలను ప్ర‌జ‌లు గెలిపించింది? అని నిల‌దీశారు. విశాఖప‌ట్నం ఉక్కు క‌ర్మాగారం ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ఆదివారం విశాఖ‌లో …

Read More »

ప‌వ‌న్ దూకుడు.. బీజేపీ ఏం చేస్తుందో?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ విశాఖ ప‌ర్య‌ట‌న‌తో రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు మారిపోతాయా? ఇప్ప‌టివ‌ర‌కూ పొత్తులో కొన‌సాగిన బీజేపీతో ఆ పార్టీ బంధం తెచ్చుకునేందుకు సిద్ధ‌మైందా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. బీజేపీకి జ‌న‌సేన గుడ్‌బై చెప్ప‌నుంద‌ని కొన్ని రోజులుగా సాగుతున్న ప్ర‌చారానికి ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌తో ఓ స్ప‌ష్టత వ‌స్తుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీక‌ర‌ణకు కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు వేగంగా …

Read More »

వీళ్లు ఇక మార‌రా?

దేశ రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు తిరుగులేని పెత్త‌నం చ‌లాయించి.. కేంద్రంలో అధికారాన్ని అనుభ‌వించిన కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి ఇప్పుడు ద‌య‌నీయంగా మారింది. ప్రస్తుతం దేశంలో మూడు రాష్ట్రాల్లో మాత్ర‌మే ఆ పార్టీ ఒంట‌రిగా అధికారంలో ఉంది. మ‌రోవైపు వ‌రుస‌గా రెండు సార్లు కేంద్రంలో గ‌ద్దెనెక్కిన బీజేపీపై దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌స్తున్న నేప‌థ్యంలో.. దాన్ని క్యాష్ చేసుకుని వచ్చే ఎన్నిక‌ల్లో తిరిగి విజ‌యం సాధించాల‌ని కాంగ్రెస్ భావిస్తోంది. ఆ దిశ‌గా రాష్ట్రాల్లో …

Read More »

జోరుగా ‘సమైక్యం’పై చర్చలు

కేసీయార్ ఏ ముహూర్తంలో ప్రకటించారో కానీ అప్పటి నుంచి సమైక్య రాష్ట్రంపై తెలంగాణ లో జోరుగా చర్చలు మొదలయ్యాయి. మొన్నటి ప్లీనరీ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ ఏపీలో కూడా పార్టీ పెట్టమని తనకు వేలాది విజ్ఞప్తులు వస్తున్నట్లు ప్రకటించారు. తాను కనుక పార్టీ పెడితే దగ్గరుండి గెలిపించుకుంటామని కేసీయార్ గొప్పలకు పోయి ఆర్భాటంగా ప్రకటించారు. మరి కేసీయార్ ప్రకటన వెనక ఆంతర్యం ఏమిటో గానీ అప్పటి నుండి రివర్సు తగులుతోంది. …

Read More »

ఎగ్జిట్ పోల్ రిజ‌ల్ట్‌.. ఈట‌ల‌కే మొగ్గు.. వైసీపీ గెలుపు!!

తెలంగాణ‌లోని హుజూరాబాద్ ఉప ఎన్నిక‌పై ఎన్నో ఆశ‌ల‌తో ఉన్న అధికార పార్టీ టీఆర్ ఎస్‌కు ఎదురు దెబ్బ త‌గులుతుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. శ‌నివారం ఉద‌యం 7 గంట‌ల నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన పోలింగ్ ప్ర‌క్రియ‌లో ఓట‌ర్లు పోటెత్తారు. ఏపీలోని బ‌ద్వేల్‌పై క‌న్నా.. తెలంగాణ‌లోని ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ఉన్న హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌పై రెండు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ మ‌రింత ఎక్కువ‌గా ఉంది. హుజూరాబాద్ఉప …

Read More »

జేడీ గాలి మళ్లీ పవన్ మీద మళ్లిందా?

నిజ‌మే! దాదాపు ఏడాదిన్న‌ర త‌ర్వాత‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైపు.. సీబీఐ మాజీ జేడీ.. వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ చూపు మ‌ళ్లింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. వ‌రకు ఐపీఎస్‌గా ఉన్న ల‌క్ష్మీనారాయ‌ణ వైసీపీ అధినేత జ‌గ‌న్ కేసుల విచార‌ణ బాధ్య‌త తీసుకున్న త‌ర్వాత‌.. ఆయ‌న పేరు ఒక్క‌సారిగా రాష్ట్ర వ్యాప్తం గా మార్మోగింది. అనంతర కాలంలో మ‌హారాష్ట్ర‌కు ఆయ‌న బ‌ద‌లీ కావ‌డం.. త‌ర్వాత‌.. అనూహ్యంగా.. ఉద్యోగా నికి రిజైన్ చేసి. …

Read More »