ఏపీలో వైసీపీ ప్రభుత్వం లెక్కలేని విధంగా నియమిస్తున్న సలహాదారుల విషయంపై రాష్ట్ర హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు సలహాదారులు ఎందుకు? అని ప్రశ్నించింది. సలహాదారులు కేవలం సలహాలకే పరిమితం కావడం లేదని.. రాజ్యాంగేతర శక్తులుగా మారిపోతున్నారని.. తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగింది. సలహాదారులను నియమించేందుకు అధికారుల కొరతేమైనా ఉందా అని న్యాయమూర్తుల ధర్మాసనం నిలదీసింది. మంత్రులకు సలహాదారులు ఉంటే అర్థం ఉందిగానీ.. శాఖలకు సలహాదారు ఏమిటని ప్రశ్నించింది. ఇలానే వదిలేస్తే …
Read More »వైసీపీ వ్యూహాలు అంతుచిక్కడం లేదే
వైసీపీ అధిష్టానం చేస్తున్న చర్యలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ఎస్సీలకు అండగా ఉంటామని పదే పదే చెప్పే పార్టీ.. ఇప్పుడు అదే ఎస్సీ నేతల మధ్య చిచ్చు పెట్టి వినోదం చూస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. గుంటూరు జిల్లా తాడికొండ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ప్రస్తుతం ఇక్కడ అధికార పార్టీలో రాజకీయా లు వేగంగా మారుతున్నాయి. తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను నియమిస్తున్నట్లు.. వైసీపీ …
Read More »కుప్పం.. చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లదాడి
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు .. తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించడాన్ని సహించలేక పోయారు. వ్యూహాత్మకంగా.. చంద్రబాబు కాన్వాయ్‌పై వైసీపీ నేతలు రాళ్లదాడితో చెలరేగిపోయారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం చంద్రబాబు కుప్పం చేరుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకు రాష్ట్ర సరిహద్దు కొంగనపల్లెలో వద్ద టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అయితే.. ఇక్కడ నుంచి చంద్రబాబు రామకుప్పం చేరుకోవాల్సి ఉంది. అక్కడ నిర్వహించే కార్యక్రమంలో ఆయన …
Read More »రాజకీయ మంటలు.. పోలీసుల మధ్య గొడవ
శాంతి భద్రతలను కాపాడాల్సిన … ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు ఇప్పుడు ఎదురు పడితే చాలు.. కొట్టుకునే పరిస్తితికి చేరుతున్నారు. నువ్వెంత .. అంటే నువ్వెంత.. అంటూ.. ఒకరిపై ఒకరు కాలు దువ్వుతున్నారు. ఇంతకీ ఇది ఎక్కడో కాదు.. మన దగ్గరే.. ఏపీ-తెలంగాణ పోలీసులే! ఒకరిపై ఒకరు కాలు దువ్వుతున్నారు. `నువ్వు నా సరిహద్దు దాటొద్దు..` అని ఒకరికి ఒకరు ఆదేశాలు జారీ చేసుకుంటు న్నారు. దీనికి కారణం.. రెండు …
Read More »కలెక్టర్లకు జగన్ హోం వర్క్
మామూలుగా హోంవర్కంటే ఇంట్లో కూర్చుని పిల్లలు చేసేది. కానీ ఇక్కడ కలెక్టర్లకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హోంవర్క్ ఏమిటంటే ప్రతి నెల గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించటమే. ప్రతినెలా ప్రతి నియోజకవర్గంలోని 6 సచివాలయాలను కలెక్టర్లు విధిగా సందర్శించాల్సిందే అని తాజాగా ఆదేశించారు. గడపగడపకు వైసీపీ ప్రభుత్వం అనే కార్యక్రమంలో కలెక్టర్లు సచివాలయాలను సందర్శించాల్సిందే అని, వాటి పరిధిలో డెవలప్మెంట్ కార్యక్రమాలను టేకప్ చేయాల్సిందే అని స్పష్టంగా చెప్పారు. ఇప్పటివరకు …
Read More »వైసీపీలో గుబులు రేపుతున్న సుప్రీం వ్యాఖ్యలు
కొన్ని కొన్ని విషయాలు ఎక్కడో జరుగుతుంటాయి. కానీ, వాటితాలూకు మూలాలు మాత్రం ఏపీలో కనిపిస్తు న్నాయి. దీంతో అధికార పార్టీ నేతలకు ఒకింత గుబులు రేగుతోంది. తమ పరిస్థితి ఏంటి? అనే చర్చ కూడా చేస్తున్నారు. ఇప్పుడు కూడా అలాంటి చర్చ తెరమీదికి వచ్చింది. తాజాగా దేశవ్యాప్తంగా.. రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఇస్తున్న ఉచిత హామీలు.. తర్వాత.. ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత సంక్షేమం వంటి అంశాలపై దేశ …
Read More »డిసెంబర్ కి టార్గెట్ పూర్తయిపోతుందా ?
అధికార పార్టీలో అభ్యర్థుల ఎంపిక దాదాపు డిసెంబర్ కల్లా పూర్తయిపోతుందని సమాచారం. నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కొన్నిచోట్ల అభ్యర్ధులను ప్రకటించేశారు. అలాగే మరికొన్ని చోట్ల సమన్వయకర్తలను కూడా ప్రకటిస్తున్నారు. మామూలుగా అయితే ఎంఎల్ఏలు లేని నియోజకవర్గాల్లో సమన్వయ కర్తలుగా నేతలనో లేకపోతే ఓడిపోయిన ఎంఎల్ఏలనో నియమించటం సాధారణం. కానీ ఇక్కడ జగన్ ఏమి చేస్తున్నారంటే ఎంఎల్ఏలున్న కొన్ని నియోజకవర్గాల్లో కూడా అదనపు సమన్వయకర్తల పేరుతో …
Read More »అందరికీ బీజేపీ వార్నింగ్ ఇచ్చిందా ?
బీజేపీ అగ్రనాయకత్వం నేతలందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందా ? గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ సస్పెన్షన్ తర్వాత అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాజాసింగ్ ను పార్టీ సస్పెండ్ చేస్తుందని ఎవరు అనుకోలేదు. సంవత్సరాల తరబడి హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో బీజేపీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఎంఎల్ఏ మాత్రమే అనేట్లుగా ఉండేది. 2018 ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో పోటీ చేసిన బీజేపీ గెలిచింది కేవలం గోషామహల్ నియోజకవర్గంలో మాత్రమే. నియోజకవర్గంలో ఎంఎల్ఏకి …
Read More »ఈ ఎంపీ సీట్లలో మార్పులు తప్పదా?
వచ్చే ఎన్నికల్లో 25కి 25 పార్లమెంటు సీట్లను గెలుచుకునే ఉద్దేశ్యంతో జగన్మోహన్ రెడ్డి పెద్ద వ్యూహాలే రచిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ కారణాలతో సుమారు 12 మంది ఎంపీలను మార్చేయాలని డిసైడ్ అయ్యారట. వ్యక్తిగతంగా ఆరోపణలను ఎదుర్కొంటున్న వారు, జనాలు, క్యాడర్ తో సరైన సంబంధాలు మైన్ టైన్ చేయని తదితరాలను కారణాలుగా చూపించి ఎంపీలను మార్చేయాలని జగన్ డిసైడ్ అయ్యారట. వీరిలో కొందరు ఎంపీలను ఎంఎల్ఏలుగా పోటీ చేయించబోతున్నారట. ఇదే …
Read More »వైసీపీకి పొంచి ఉన్న పెను ప్రమాదం.. ఎలాగంటే!
ఏపీ అధికార పార్టీలో ధీమా కనిపిస్తోంది.తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను మరోసారి గద్దెనెక్కేలా చేస్తాయని.. నాయకులు భావిస్తున్నారు. మంచిదే. అయితే.. అదేసమయంలో ఈ సంక్షేమం ఎంతమందికి అందుతోంది? ఎంత మంది హ్యాపీగా ఫీలవుతున్నారు? అనే విషయాలను పరిశీలిస్తే.. వైసీపీకి డేంజర్ బెల్స్ ఎందుకు మోగుతున్నాయని అంటున్నారో.. తెలుస్తుంది. ఏపీలో మొత్తం 4.95 కోట్ల మంది జనాభా ఉన్నారు. వీరిలో ఉద్యోగాలు చేసేవారు.. 2 కోట్ల కుటుంబాలు …
Read More »అన్న క్యాంటీన్ల సెంటిమెంట్.. ఏం జరుగుతుందో?
రాష్ట్రంలో పేదలకు పట్టెడన్నాన్ని అతితక్కువ ధరకే అందించే అన్న క్యాంటీన్ల సెంటిమెంటు అధికార పార్టీలోనూ కనిపిస్తోంది. దీంతో వైసీపీ నేతలు కూడా అన్న క్యాంటీన్ల బాట పడుతున్నారు. గత ఎన్నికలకు సుమారు ఏడాది ముందు.. అప్పటి సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు.. అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. రూ.5 కే ఉదయం టిఫిన్, రూ.5కే మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించేలా.. అక్షయ పాత్ర సంస్థతో ఒప్పందం చేసుకుని.. ఈ కార్యక్రమాన్ని ఎన్నికల …
Read More »జగన్ ఇలాకాలో టీడీపీ గెలుపు ఖాయం
వైసీపీ అధినేత, సీఎం జగన్ సొంత జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం రాజంపేట. ప్రస్తుతం ఇక్కడ నుంచి మేడా మల్లికార్జున రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ విజయం దక్కించుకుంది. కడప జిల్లా మొత్తంలో రాజంపేటలో టీడీపీ బలం ఎక్కువగా ఉంది. దీంతో ఈ నియోజకవర్గంలో రాజకీయ పవనాలు.. సంకేతాలు మారుతున్నా యని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ ఘన విజయం దక్కించుకుని తీరుతుందని.. అంచనాలు …
Read More »