Political News

10 జిల్లాల్లో కాంగ్రెస్ ఓకే.. మరి వాటి సంగ‌తేంటి?

తెలంగాణ‌లో ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా.. విజ‌యం త‌మ‌దేన‌ని చెప్పుకోవ‌డం వ‌ర‌కే కాంగ్రెస్ నేత‌లు ప‌రి మిత‌మవుతున్నారా? భారం మొత్తం పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్‌పై వేసి.. తాము చోద్యం చూస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. రాష్ట్రంలోని 36 జిల్లాల్లో కాంగ్రెస్ ప‌రిస్థితి ఉగాది ప‌చ్చ‌డిని త‌ల‌పిస్తోంద‌ని చెబుతున్నారు. కేవ‌లం 10 జిల్లాల్లో మాత్ర‌మే.. పార్టీ ప‌రిస్థితి బాగుంద‌ని.. ఆయా జిల్లాల్లో ఆశాజ‌న‌మైన ఫ‌లితం వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. …

Read More »

చివ‌రి నిముషం వ‌రకు ఆగితే.. జ‌న‌సేన‌కే న‌ష్ట‌మా?

కొన్ని విష‌యాల్లో రాజ‌కీయ పార్టీలు ముందుండాలి. ఏమాత్రం తేడా వ‌చ్చినా ఫ‌లితం డిఫ‌రెంట్‌గా ఉంటుంది. అంతేకాదు.. కొన్ని కొన్ని విష‌యాల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లాలంటే.. వాటిని అంతే బలంగా ముందు నుంచి ప్ర‌చారం చేసుకోవాలి. ఇప్పుడు ఇవ‌న్నీ కూడా .. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకును చీల‌కుండా చూస్తాన‌ని, అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్న జ‌న‌సేన గురించే. వ‌చ్చే ఎన్నిక‌ల సంగ‌తిని ప‌రిశీలిస్తే.. జ‌న‌సేన‌కు ఉన్న బ‌లం …

Read More »

బీజేపీ ట్రాపులో కేసీఆర్?

క్యాబినెట్లో తీసుకున్న ఒక నిర్ణయం చూసిన తర్వాత అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. శనివారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న అనేక నిర్ణయాల్లో సెప్టెంబర్ 16,17,18 తేదీల్లో తెలంగాణా విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరిపించాలనేది కీలకమైనది. దీనికే జాతీయ సమైక్యతా దినోత్సవమని ముద్దుగా పేరుపెట్టారు. విమోచన దినోత్సవం అనేది ప్రత్యేక తెలంగాణా ఉద్యమం నుండి వినబడుతున్నదే. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నపుడు జరిగిన ఉద్యమంలో తెలంగాణా విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపటం …

Read More »

అన్నం పెడుతున్నా ఈ ఆంక్షలేంది జగన్?

నువ్వా నేనా అన్నట్లుగా ఉండే ఏపీ అధికార.. ప్రధాన ప్రతిపక్షం మధ్య నిత్యం ఏదో ఒక రభస జరుగుతూనే ఉంటుందన్న విషయం తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లా తెనాలిలో హైటెన్షన్ చోటు చేసుకుంది. తమ ప్రభుత్వ హయాంలో తెర మీదకు తీసుకొచ్చిన అన్న క్యాంటీన్లను జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసేయటం తెలిసిందే. దీంతో.. పార్టీ తరఫున అన్న క్యాంటీన్లను నిర్వహించేందుకు వీలుగా మొన్నటికి మొన్న చిత్తూరు జిల్లా …

Read More »

చంద్రబాబు విజన్ అసాధారణం

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. దాదాపు 20 ఏళ్ల క్రితమే విజన్-2020 అనే నినాదంతో ఉమ్మడి ఏపీలో ఐటీ రంగానికి పురుడు పోసిన దార్శనీకుడు చంద్రబాబు. 1998లో చంద్రబాబు అంకురార్పణ చేసిన హైటెక్ సిటీ నేడు హైదరాబాద్ లో ఐటీ సంస్థలకు మణిమకుటంగా మారింది. ఇక, చంద్రబాబు చొరవతో హైదరాబాద్ లో పాతికేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ …

Read More »

బ్రహ్మాస్త్ర ఈవెంట్ రద్దు వెనుక రాజకీయం?

బ్రహ్మాస్త్ర సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రద్దవటం సంచలనంగా మారింది. ఈ సినిమా ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ జూనియర్ ఎన్టీయార్ కావటంతో జనాల్లో ఒక్కసారిగా ఆసక్తి పెరిగిపోయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరగాల్సిన ఫంక్షన్ ను పోలీసులు చివరి నిముషంలో రద్దుచేశారు. ముందుగానే ఫంక్షన్ కు సినిమా యూనిట్ అనుమతి తీసుకున్నది. శుక్రవారం సాయంత్రం జరగాల్సిన ఫంక్షన్ కు గురువారం రాత్రి పోలీసులు అనుమతిని రద్దుచేశారు. సినిమా ఫంక్షన్ …

Read More »

TDP: కఠిన చర్యలు తప్పవా?

పనితీరు మార్చుకోని నియోజకవర్గాల ఇన్చార్జీలు, నేతలపై చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందని చంద్రబాబు నాయుడు సీరియస్ గా చెప్పారు. నిర్ణయాలు తీసుకునే సమయం వచ్చేసిందని ఇపుడు కూడా కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే ఉపయోగం ఉండదని చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు అందరికీ. నేతలు క్రియాశీలం అవుతారేమో అని మూడున్నరేళ్ళు ఎదురుచూసినా ఉపయోగం కనబడలేదని తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాను నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న విషయం గుర్తు చేస్తునే కార్యకర్తలు కూడా …

Read More »

ఈ మాట జ‌గ‌న్ చెవిలో ప‌డితే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌ధాన ఎన్నిక‌ల హామీల్లో మ‌ద్య నిషేధం ఒక‌టి. ద‌శ‌ల వారీగా మ‌ద్య‌పాన నిషేధం అమ‌లు చేస్తామ‌ని, మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌చ్చేస‌రికి ఫైవ్ స్టార్ హోట‌ళ్ల‌లో త‌ప్ప ఎక్క‌డా మ‌ద్య‌మే దొర‌క్కుండా చేస్తామ‌ని ఘ‌నంగా ప్ర‌క‌ట‌నలు చేశాడు జ‌గ‌న్. కానీ వాస్త‌వంలో జ‌రిగింది వేరు. మునుప‌టి కంటే మ‌ద్యం అమ్మ‌కాలు పెరిగాయి, కొత్త‌గా దుకాణాలు వెలిశాయి. ప్ర‌భుత్వం ప్ర‌ధానంగా …

Read More »

చిరు తరువాత ఎన్టీఆర్‌ను తగులుకున్న నారాయణ

తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీలు, వాటి నేతలు ప్రాధాన్యం కోల్పోయి చాలా కాలం అయింది. ఆ పార్టీలు, వాటి నేతలు నామమాత్రంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఐతే సీపీఐ నేత నారాయణ రాజకీయంగా అంతగా క్రియాశీలంగా లేకపోయినా సరే.. తన నోటి దురుసుతో తరచుగా వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తుంటారు. రాజకీయ పార్టీలు, నేతల విషయంలో ఆయన ఏం మాట్లాడినా చెల్లిపోతూ వచ్చింది కానీ.. ఇటీవల అకారణంగా మెగాస్టార్ చిరంజీవిని దూషించడంతో …

Read More »

కేసీఆర్ నినాదం సాధ్యమేనా?

బీజేపీ ముక్త్ భారత్ సాధించాలి అన్నది కేసీఆర్ తాజా నినాదం. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కలిసిన సందర్భంగా మీడియా సమావేశంలో కేసీఆర్ పై నినాదాన్ని ప్రకటించారు. ఒకపుడు బీజేపీ ప్రకటించిన కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదాన్ని కాస్త తిప్పి బీజేపీకి వ్యతిరేక నినాదాన్ని చేశారు. అప్పట్లో తాను ప్రకటించిన కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదాన్ని బీజేపీ దాదాపు సాధ్యం చేసి చూపించింది. దేశంలోని 29 రాష్ట్రాల్లో కాంగ్రెస్ …

Read More »

మంత్రి గారి దూకుడుతో న‌ష్ట‌మెంత.. వైసీపీ లెక్క‌లు ఇవే!

ఆయ‌న తొలిసారి మంత్రి అయిన‌.. సీనియ‌ర్ నాయ‌కుడు. ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన నేత‌. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆయ‌నే దేవ‌దాయ శాఖ మంత్రి.. కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌. ఇప్పుడు ఆయ‌న ప‌నిచేస్తున్నార‌నే వాద‌న ఒక‌వైపు వినిపిస్తున్నా.. పంటి కింద రాయిలా.. ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు మాత్రం.. దేవదాయ శాఖ‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేస్తోంద‌ని అంటున్నారు. దీనికి కార‌ణం.. ఆయ‌న అనుస‌రిస్తున్న విధానాలేన‌ని …

Read More »

కేసీఆర్.. 90 రోజుల టెన్షన్

కేసీఆర్ కొత్తగా 90 రోజుల టెన్షన్ పెరిగిపోతోందట. ఇంతకీ 90 రోజుల టెన్షన్ ఏమిటంటే దసరా పండుగకు కొత్త సచివాలయాన్ని ప్రారంభించేయాలని జ్యోతిష్కులు చెప్పారట. అంటే ఆ తర్వాత మరికొన్ని విషయాలను కూడా చెప్పారు కానీ ముందు దసరాకు కొత్త సచివాలయం ప్రారంభం కావటం చాలా కీలకం. తర్వాత చెప్పిన విషయాలు ఏమిటంటే కొత్త సచివాలయం నుండి 90 రోజులు పరిపాలన చేయాలట. 90 రోజుల పరిపాలన పూర్తయిన తర్వాత …

Read More »