విద్యుత్ కనెక్షన్ కావాలంటే లంచం.. మీటరు మార్చాలంటే లంచం.. బిల్లు కట్టేందుకు సమయం కోరితే లంచం.. డబుల్ ఫేజ్ నుంచి సింగిల్ ఫేజుకు మార్చాలన్నా లంచం.. చిరు ఉద్యోగి బదిలీ కోరితే లంచం.. దిగువ స్థాయి ఉద్యోగి ప్రమోషన్ కోరితే లంచం.. ఇలా అన్నింటా.. లంచం.. లంచం.. అంటూ.. అవినీతి అనకొండలా చెలరేగిన విద్యుత్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎలక్ట్రిక్స్(ఏడీఈ) అంబేడ్కర్‌ను తెలంగాణ ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. …
Read More »పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు ప్రశంసలు.. ఏమన్నారంటే!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను సీఎం చంద్రబాబు ప్రశంసించడం కొత్తకాదు. పలుసందర్భాల్లో జరిగిన కార్యక్ర మాలు.. సభల్లో పరస్పరం ప్రశంసించుకోవడం అందరికీ తెలిసిందే. అయితే.. తాజాగా రెండో రోజు కలెక్టర్ల సదస్సు లో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా పవన్ కల్యాణ్ నేతృత్వంలోని శాఖలపై సమీక్షించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చేస్తున్న కృషిని, ఆయన నిబద్ధతను ప్రత్యేకంగా ప్రశంసించారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో స్వచ్ఛాంధ్ర, అటవీ, మున్సిపల్, …
Read More »జనవరి నుంచే క్వాంటం హబ్‌గా అమరావతి!
ఏపీ రాజధాని అమరావతి.. జనవరి నుంచే క్వాంటం హబ్‌గా అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఐబీఎం సంస్థ వచ్చే జనవరి కల్లా రెండు క్వాంటం కంప్యూటర్లు ఏర్పాటు చేయనుందని తెలిపారు. కలెక్టర్ల సదస్సులో క్వాంటం కంప్యూటింగ్‌పై సుమారు 40 నిమిషాల పాటు చర్చించారు. అమరావతిని క్వాంటం కేంద్రంగా తీర్చిదిద్దేందుకు స్థిర నిశ్చయంతో ఉన్నామని చెప్పారు. గ్లోబల్ క్వాంటం డెస్టినేషన్‌గా ఏపీని మార్చాలనే దిశగా పనులు చేపడుతున్నామన్నారు. దీనికోసం రెండు …
Read More »వైసీపీ డ్రామా ఆడుతోంది: చంద్రబాబు
తాము తీసుకువచ్చిన వైద్య కళశాలలను ప్రైవేటుకు ధారాదత్తం చేస్తున్నారని.. పేర్కొంటూ వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య కళాశాలలపై చర్చకు సిద్ధమేనా? అని ప్రశ్నించారు. దమ్ముంటే.. అసెంబ్లీకి రావాలని.. అన్ని విషయాలపైనా చర్చించేందుకు ప్రభుత్వం రెడీగా ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. తాజాగా రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో సీఎం.. మెడికల్ కాలేజీల వ్యవహారంపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తన హయాంలో …
Read More »పవన్… ఈ చిరునవ్వుల భావమేమి?!
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంత ఈజీగా నవ్వరు. ఏదైనా పెద్ద సందర్భం వస్తే తప్ప.. ఆయన పెద్దగా స్పందించరు. ప్రజల సమస్యలపైనా.. వాటి పరిష్కారంపైనా మాత్రమే దృష్టిపెడతారు. ఇక, ఏదైనా కార్య క్రమంలో పాల్గొన్నా.. కూడా ఆయన మౌనంగానే ఉంటారు. ఆయా కార్యక్రమాలకు సంబంధించిన నిర్దిష్ట అంశాలపై మాట్లాడి వెళ్లిపోతారు. తాజాగా అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో రెండో రోజు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. వాస్తవానికి …
Read More »ఈ ఫొటో జూబ్లీహిల్స్ ఓటర్లను షేక్ చేసింది!
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు సమయం ఆసన్నమైన వేళ.. మంగళవారం ఉదయం సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఓ ఫొటో అక్కడి ఓటర్లను, రాజకీయ విశ్లేషకులను షేక్ చేసింది. అంతగా ఆ ఫొటోలో ఏముందన్న విషయానికి వెళితే… బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసిన తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ కీలక నేత, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డి కలిశారు. వారిద్దరూ ఏదో మాట్లాడుకుంటూ నవ్వుతూ కనిపించారు. ఈ ఫొటో చూసినంతనే జూబ్లీహిల్స్ …
Read More »జగనన్న కాలనీకి పవనన్న బ్రిడ్జి
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎలాంటి హంగూ ఆర్బాటం లేకుండానే తన పని తాను సైలంట్ గా చేసుకుపోతున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్న పవన్ ఆయా ప్రాంతాల ప్రజల మన్ననలను చూరగొంటున్నారు. అంతేకాకుండా అంతకుముందు పాలించిన నేత పనితీరు ఎలా ఉందన్న విషయాన్ని కూడా పవన్ పనితీరుతో జనం విశ్లేషించుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి ఘటనే ఒకటి పవన్ సొంత నియోజకవర్గం …
Read More »“మోహిత్ రెడ్డిని అరెస్టు చేయాల్సిందే”
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తనయుడు.. యువనేత మోహిత్ రెడ్డిని అరెస్టు చేయాల్సిందేనని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు కోర్టుకు తెలిపారు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై త్వరగా విచారణ చేపట్టాలని కోరారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో మొత్తం 3500 కోట్ల రూపాయల మేరకు చేతులు మారాయని సిట్ అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు నిందితులను అరెస్టు …
Read More »పీఎం-సీఎం.. తర్వాత కలెక్టరే: చంద్రబాబు
ప్రజలకు సేవ చేయడంలో దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత.. కలెక్టర్లకు కీలక పాత్ర ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజలకు చేరువ అయ్యేందుకు, వారి సమస్యలు పరిష్కరించేందుకు కలెక్టర్లు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. తాజాగా అమరావతి సచివాలయంలో రెండు రోజుల పాటు నిర్వహించే కలెక్టర్ల సదస్సును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర అభివృద్ధి, విజన్ 2047 లక్ష్యాలు సహా పీ-4, పెట్టుబడులు వంటి కీలక అంశాలపై …
Read More »పీకే.. మామూలోడు కాదు.. : సర్వే
పీకే.. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. వినిపించే పేరు పీకే. ఈయనే ఎన్నికల వ్యూహకర్త.. ప్రశాంత్ కిశోర్. గత 2024 ఎన్నికల్లో కూటమికి పరోక్షంగా సలహాలు ఇచ్చి.. జగన్ పరాజయం పాలయ్యేందుకు సహకరించారని రాజకీయ పరిశీలకులు అంటారు. బీహార్ రాష్ట్రానికి చెందిన పీకే.. ఇప్పుడు త్వరలోనే ఆ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కీలక రోల్ పోషించనున్నారు. గత ఎన్నికలకు ముందే.. జన్ సురాజ్ పార్టీని పీకే స్థాపించారు. …
Read More »మోడీకి కుటుంబం లేదు.. స్నేహితులు లేరు: మహిళా నేత వ్యాఖ్యలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురించి ఎవరు మాట్లాడినా.. ఆయన ఈ దేశానికి చేసిన సేవతోపాటు.. 11 ఏళ్లుగా ఆయన ప్రధానిగా ఉన్న తీరును, చేసిన పనులను ప్రస్తావిస్తారు. ఎవరూ కూడా ఆయన వ్యక్తిగత జీవితాన్ని స్పృశించే సాహసం చేయరు. కేంద్రంలో ఎంతో చనువుగా ఉండే మంత్రులు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ వంటివారు కూడా.. ఎప్పుడూ మోడీకి సంబంధించిన వ్యక్తిగత విషయాలు, ఆయన కుటుంబం గురించి.. …
Read More »యూరియాపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా అన్నదాతలకు ఇబ్బందిగా మారిన అంశం, ప్రభుత్వాలను ఇరుకున పెడుతున్న అంశం యూరియా. ఇతర దేశాల నుంచి దిగుమతి కావాల్సిన యూరియా వ్యవహారం సంకటంలో పడింది. దీంతో కేంద్రం కూడా ఆచి తూచి రాష్ట్రాలకు యూరియాను సర్దుబాటు చేస్తోంది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కావాల్సిన మేరకు యూరియా లభించడం లేదన్నది వాస్తవం. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో చేతులు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates