వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను ఆదుకునేందుకు వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆయా ప్రాంతాలను బాగు చేసేందుకు తక్షణమే చర్యలు చేపట్టినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ క్రమంలో 2 వేల మందికిపైగా పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. మురుగు కాల్వల్లో పూడిక తీత, రోడ్డపై ఉన్న చెతను తొలగించే పనిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టామన్నారు. ఇదేసమయంలో ఇళ్ల లో పేరుకుపోయిన బురద సహా రోడ్లపై పేరుకు పోయిన బురదను …
Read More »బాబు ఆరాటం.. ప్రజల పోరాటం.. ఏం జరుగుతోంది?
వరద బాధితులను ఆదుకునే విషయంలో సీఎం చంద్రబాబు ఎంతో ఆరాట పడుతున్నారు. నీట మునిగి పోయిన ప్రాంతాల్లో స్వయంగా ఆయనే పర్యటిస్తున్నారు. ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ.. భరోసా నింపుతున్నా రు. నేనున్నానంటూ.. ఆయన బాధితుల్లో ధైర్యం నింపే పనిచేస్తున్నారు. అర్ధరాత్రి సమయాల్లో కూడా టార్చ్ లైట్లు వేసుకుని ముందుకు సాగుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అంతేకాదు.. వ్యవస్థలను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. కానీ, వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల బాధలు …
Read More »బాబు సర్కారుకు సర్టిఫికేట్ ఇచ్చిన చినజీయర్
అధ్యాత్మిక అంశాలకు పరిమితమయ్యే స్వామీజీలు అప్పుడప్పుడు రాజకీయాల్లోకి అలా వచ్చి ఇలా వెళ్లిపోవటం చూస్తుంటాం. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రతి అంశంలోనూ సలహాలు ఇచ్చేసి.. ఆ తర్వాతి కాలంలో వార్తలకు కాస్తంత దూరంగా ఉంటున్నారు. ఇంతకూ ఆయన ఎవరో చెప్పలేదు కదా? ఆయనే.. త్రిదండి చినజీయర్ స్వామి. విజయవాడకు విపత్తు విరుచుకుపడి.. వరదలో వేలాది మంది చిక్కుకున్న నేపథ్యంలో బాధితులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు …
Read More »ఇలా అడ్డంగా దొరికిపోతున్నారేంటి రోజా?
మనసుకు తోచినట్లుగా మాట్లాడే లగ్జరీ సామాన్యుడికి ఉంటుంది. ఎంత తోపు రాజకీయ నాయకులకైనా అలాంటి సౌకర్యం ఉండదు. ఎందుకంటే ఒక నాయకుడిగా, నాయకురాలిగా ఉన్నప్పుడు వారి మీద అంతో ఇంతో బాధ్యత ఉంటుంది. మాజీ మంత్రి కం మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇలాంటి విషయాల్ని పూర్తిగా మర్చిపోతున్నట్లుగా కనిపిస్తోంది. అప్పుడప్పుడు మాత్రమే స్పందిస్తూ.. లిమిటెడ్ గా రియాక్టు అవుతున్న రోజా.. బెజవాడ వరదలపై స్పందించాలని డిసైడ్ అయ్యారు. అదేమీ …
Read More »హైకోర్టులో వైసీపీ నేతలకు షాక్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి కేసులోనూ నేతలకు ముందస్తు బెయిలు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ కేసుల్లో మాజీ మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగాం సురేష్, వైకాప నేత దేవినేని అవినాష్ తదితరులు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో …
Read More »ఏం జరిగినా ఇంతే.. జగన్ మౌనం వెనుక.. !
వైసీపీ అధినేత జగన్ మౌనంగా ఉంటున్నారు. భూకంపం వచ్చినా స్థితప్రజ్ఞతనే ప్రదర్శిస్తున్నారు. ఎక్క డా నోరు విప్పడం లేదు. రచ్చచేయడం లేదు. ఇప్పటి వరకు ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. మరింత మంది ఈ బాటలో ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే.. జగన్ ఎక్కడా మీడియా ముందుకు రాలేదు. వెళ్లిపోయిన వారికి అది చేశాను.. ఇది చేశాను..అ ని కామెంట్లు చేయలేదు. ఎక్కడా తొందర పడడం …
Read More »వరద ప్రాంతాలకు ఎందుకు వెళ్లలేదో రివీల్ చేసిన పవన్
గడిచిన రెండు.. మూడు రోజులుగా ఒక అంశం మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. వరదల కారణంగా విజయవాడ నగరం మునిగిపోవటం.. అధికారులు పెద్ద ఎత్తున పరామర్శలు.. సహాయక చర్యలు చేపట్టినట్లుగా చెప్పటం ఒక ఎత్తు అయితే.. ముఖ్యమంత్రి చంద్రబాబు పగలు.. రాత్రి అన్న తేడా లేకుండా పర్యటిస్తుండటం తెలిసిందే. వీటితో పాటు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం పరామర్శలకు వెళ్లకపోవటాన్ని పలువురు వేలెత్తి …
Read More »తెలంగాణలో ‘వరద’ రాజకీయం.. ఎవరూ తగ్గడం లేదుగా!
తెలంగాణలోని ఖమ్మం సహా పలు జిల్లాలు వరద నీటిలో చిక్కుకుని నానా తిప్పలు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే.. వీరిని ఆదుకునే విషయంలో ప్రభుత్వం శాయ శక్తులా పనిచేస్తోంది. దీనిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ.. బీఆర్ ఎస్ నాయకులు రేవంత్రెడ్డిని కెలుకుతూనే ఉన్నారు. వరదలు, వర్షాలతో అతలాకుతలమైన ప్రాంతాలను ఆదుకునేందుకు సాయం చేసేందుకు.. ఇరు పక్షాలు ఉమ్మడిగా ముందుకు సాగుతాయని అందరూ ఆశించినా.. దీనికి భిన్నంగా వరద రాజకీయాలు …
Read More »పులివెందుల పర్యటన.. జగన్ సాధించిందేంటి?
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్.. మూడు రోజుల పాటు పులివెందులలో పర్యటించారు. శనివారం ఉదయం ఆయన పులివెందులకు వెళ్లి.. సోమవారం సాయంత్రం తిరిగి వచ్చారు. మరి ఈ మూడు రోజుల్లో ఆయన సాధించిందేంటి? అంటే.. కేవలం వైఎస్ వర్థంతిని పురస్కరించుకుని ఆయన నివాళులు అర్పించేందుకు ఇడులపాయకు వెళ్లినట్టు తెలుస్తోంది. కానీ, పర్యటనకు వెళ్లే ముందు మాత్రం ప్రజల నుంచి వినతులు తీసుకునేందుకు, వారి సమస్యలు పరిష్కరించేందుకు.. అని …
Read More »అమరావతి మునిగిందా? లేదా? క్షేత్రస్థాయిలో ఎలా ఉంది?
అబద్ధాన్ని నిజంగా.. నిజాన్ని అబద్ధంగా చెప్పటానికి మించిన దుర్మార్గం మరొకటి ఉండదు. విజయవాడను వరద ముంచెత్తిన వేళ… ఏపీ రాజధాని అమరావతిలో పరిస్థితి ఎలా ఉంది? రాజధాని ప్రాంతం మొత్తం మునిగిపోయిందా? అని ఆసక్తికర డిబేట్ జరుగుతోంది. వరదల నేపథ్యంలో రాజధాని అమరావతి మొత్తం మునిగిపోయిందన్న ప్రచారం మొదలైంది. అయితే.. దీనికి కౌంటర్ గా పలువురు సెల్పీ వీడియోలు తీస్తూ.. గ్రౌండ్ రిపోర్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి వాదన …
Read More »పాపం జగన్.. అడ్డంగా బుక్కయ్యారు!
వైసీపీ అధినేత జగన్.. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సమయంలో ఆయన చంద్రబాబు సర్కా రుపై ఏవో విమర్శలు చేయాలని అనుకున్నారు. ప్రజలకు ఏమీ చేయలేదని.. చంద్రబాబు సర్కారుకు దూర దృష్టి లేదని అందు కే ప్రజలకు ఇన్ని కష్టాలు వచ్చాయని.. ఆయన చెప్పుకొనే ప్రయత్నం చేశారు. విమర్శలు కూడా గుప్పించారు. వాస్తవా నికి సోమవారం కడప పర్యటన నుంచి నేరుగా విజయవాడ వచ్చిన.. జగన్ ఆ …
Read More »జగన్ నోట.. వలంటీర్ల మాట.. ఎన్నికల తర్వాత ఫస్ట్ టైమ్
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత.. తొలిసారి మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ నోటి నుంచి వలంటీర్ల గురించి ప్రస్తావన వచ్చింది. మూడు మాసాలకు ముందు జరిగిన ఎన్నికల సమయంలో వలంటీర్ల వ్యవహారం.. తీవ్ర రచ్చగా మారిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తాను మరోసారి ముఖ్యమంత్రి అయితే.. వలంటీర్లను పునరుద్ధరించే ఫైలుపైనే తొలి సంతకం చేస్తానని జగన్ చెప్పారు. అదేసమయంలో వలంటీర్ల విషం చిమ్ముతున్నారని కూడా.. ఆయన వ్యాఖ్యానించారు. …
Read More »