వందేమాతరం గీతాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అవమానించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విమర్శిం చారు. స్వాతంత్య్ర సంగ్రామంలో వందేమాతరం నినాదం కీలక భూమిక పోషించిందన్నారు. అదేవిధంగా జాతి ఐక్యతకు, సంఘీభావానికి వందేమాతరం ప్రతీకగా నిలిచిందని తెలిపారు. కానీ, కాంగ్రెస్ పార్టీ దీనిని కూడా అవమానించిందని.. వందేమాతరంలోని కొన్నిపంక్తులను తొలగించిందని విమర్శించారు. దేశ మాజీ ఉప ప్రధాని, ఐక్యతా మూర్తి… సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని …
Read More »ఈ ఏపీ లీడర్లు ఆ మెజారిటీని నిలబెట్టుకుంటే చాలు ..!
గత ఏడాది ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేలు చాలా మందికి 30-50 వేల ఓట్ల మెజారిటీ లభించింది. ఈ మెజారిటీని నిలబెట్టుకుంటున్నారా? లేదా? అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే.. ఎన్నికల సమయానికి ప్రజల్లో వచ్చే భావోద్వేగాలు కీలక రోల్ పోషిస్తున్నాయి. దీంతో పార్టీలకు పార్టీలను ఓటర్లు పక్కన పెడుతున్నారు. సహజంగా ఒకప్పుడు ఓడిన పార్టీకి కూడా గౌరవ ప్రదమైన స్థానాలు దక్కేవి. కానీ, ఏపీలో పరిస్థితి దీనికి భిన్నంగా మారుతోంది. ఓడిపోయిన …
Read More »పరిస్థితి బాలేదు.. రేవంత్ గారూ.. కదలాలి మీరు!
ఈ మాట ఎవరో కాదు.. పార్టీనాయకులు, కార్యకర్తలే కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉందని.. రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారని.. కొందరు నేతలు సోషల్ మీడియాలో సంబంధిత వీడియోలను పోస్టు చేస్తున్నారు. ఇక ప్రధాన మీడియా కూడా ఇలాంటి వార్తలను ప్రస్తావిస్తోంది. దీంతో పరిస్థితి చేయి దాటకముందే… సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి.. అన్నదాతలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందనే మాట సర్వత్రా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఏం జరిగింది? …
Read More »టీటీడీ లడ్డూ: కిలో నెయ్యికి రూ.25 కమీషన్!
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం.. కల్తీ అయిందని.. జంతువుల కొవ్వు కలిసిందని.. ఇదంతా వైసీపీ హయాంలోనే జరిగిందని.. గత ఏడాది జూలై- ఆగస్టుమధ్య పెను వివాదం తెరమీదకి వచ్చిన విషయం తెలిసిందే. ఇది.. కేవలం రాష్ట్రాన్నే కాకుండా.. దేశాన్ని కూడా కుదిపేసింది. వేలాది మంది శ్రీవారి భక్తులు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. ప్రస్తుతం …
Read More »తుఫానును ఆపలేదు.. కానీ: చంద్రబాబు
తాజాగా వచ్చిన మొంథా తుఫాను, అనంతరం జరిగిన నష్టం.. కష్టంపై సీఎం చంద్రబాబు గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులతో సమీక్షలపై సమీక్షలు నిర్వహించారు. ప్రతి ప్రాంతం, మండలం సహా గ్రామాల నుంచి సమాచారం సేకరించారు. ఎంత నష్టం వచ్చింది.. ఎంత కష్టం మిగిలింది ? అనే అంశాలను ఆయన కూలంకషంగా చర్చించారు. సాగు, రహదారుల నష్టంపై పక్కా క్లారిటీని తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తుఫానును …
Read More »ఆ 40 శాతం కోసమైనా చేసిందేముంది.. జగన్ ..!
గత ఎన్నికల్లో తమకు 40 శాతం మేరకు ప్రజలు ఓట్లు వేశారని వైసీపీ అధినేత జగన్ తరచుగా చెబుతున్నారు. అందుకోసమైనా.. వారి తరఫున ప్రశ్నించేందుకైనా.. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆయన ఇటీవల కూడా ప్రభుత్వాన్ని, స్పీకర్ను కూడా కోరారు. ఇదిలావుంటే.. మొంథా తుఫాను సమయంలో జగన్ అందుబాటలో లేని విషయం తెలిసిందే. తాను బెంగళూరులో ఉన్నానని.. విమాన సేవలు నిలిపివేయడంతో రాలేక పోయానని చెప్పారు. కానీ, పార్టీ …
Read More »వాహ్… రైతులకోసం బురదను సైతం లెక్క చెయ్యని పవన్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పొలంబాట పట్టారు. తుఫాను ప్రభావంతో భారీగా కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పొలాలను ఆయన పరిశీలించారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో గురువారం పర్యటించిన పవన్ కల్యాణ్.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని రైతులను పరామర్శించారు. కోడూరు మండలం కృష్ణాపురం గ్రామంలో నేలకొరిగిన వరి పైరు పరిశీలించారు. బురదలోనే నడుస్తూ.. పొలం మధ్యకు వెళ్లి పరిశీలించారు. రైతుల సమస్యలను ఓపికగా విన్నారు. వారికి భరోసా కల్పించారు. ప్రభుత్వం …
Read More »షర్మిలకు ఏపీ గుర్తులేదా ..!
కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల తరచుగా విమర్శలు చేయడం.. తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. వైసీపీ అధినేత, తన సోదరుడు జగన్పై ఆమె అనేక వ్యాఖ్యలు చేసి.. సెంటరాఫ్ది ఎట్రాక్షన్గా న్యూస్గా కూడా మిగిలారు. అయితే.. పార్టీ అధిష్టానం చేసిన కొన్ని సూచనలతోపాటు.. స్థానిక నాయకత్వం కూడా.. షర్మిలకు కొన్ని ప్రతిపాదనలు చేయడంతో కొన్నాళ్లుగా జగన్పై విమర్శలు తగ్గించారు. అంతేకా దు.. తరచుగా ఏపీలో పర్యటించి సమస్యలు …
Read More »ఏడేళ్ల తర్వాత… కోర్టు మెట్లెక్కనున్న జగన్?
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కోర్టు మెట్లు ఎక్కక తప్పదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అక్రమ ఆస్తుల కేసులలో నిండా కొరుకుపోయి.. ఒకప్పుడు 16 నెలల పాటు జైలు జీవితం గడిపిన జగన్ ప్రస్తుతం బెయిల్ పై ఉన్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు కోర్టుకు హాజరైన ఆయన.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ హాజరు నుంచి మినహాయింపు పొందుతూ వచ్చారు. ప్రస్తుతం అక్రమ …
Read More »ఏపీలో కొత్త జిల్లాలు: అడిగినా.. అడగకున్నా తంటానే!
ఏపీలో జిల్లాల పునర్విభజన, మండలాల సరిహద్దుల నిర్ణయం అంశం ఎటూ తేలడం లేదు. గత 2024 ఎన్నికలకు ముందు.. తాము అధికారంలోకి రాగానే.. ప్రజల అభీష్టం మేరకుకొత్త జిల్లాలు, జిల్లా కేంద్రాలు, మండలాల సరిహద్దులను మారుస్తామని.. అవసరమైతే.. కొత్త జిల్లాలను కూడా ఏర్పాటు చేస్తామని ప్రస్తుత సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈనేపథ్యంలో దీనిపై తర్వాత చూద్దామని గత ఏడాది గడిపేశారు. నిజానికి ఇది మళ్లీ ఎన్నికలకు రెండేళ్ల ముందు …
Read More »పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు, హైకోర్టు ఏం చెప్పింది?
దాదాపు 10 మెడికల్ కళాశాలలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్(పీపీపీ) విధానంలో అభివృద్ధి చేయాలని ఏపీలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇది రాజకీయ దుమారానికి దారితీసింది. వైసీపీ హయాంలో మొత్తం 17 కాలేజీలు తీసుకురాగా.. వీటిలో ఐదు కాలేజీలు కొంతవరకు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. మరో రెండు కాలేజీలు నిర్వహణలో ఉన్నాయి. ఈ నేపద్యంలో మిగిలిన పది కాలేజీలను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 8,500 …
Read More »కాంగ్రెస్ ఆకస్మిక నిర్ణయం.. జూబ్లీహిల్స్ కోసమేనా?!
రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాల వెనుక చాలా నిగూఢమైన అర్ధం ఉంటుంది. అందునా.. అధికారంలో ఉన్న పార్టీలు తీసుకునే నిర్ణయాలకు మరింత అర్ధం-పరమార్థం రెండూ ఉంటాయి. తాజాగా తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ తీసుకున్న ఆకస్మిక నిర్ణయం కూడా.. ఈ తరహాలోదేనన్న వాదన వినిపిస్తోంది. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ క్రికెటర్ అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిందని తెలిసింది. పార్టీ వర్గాలు కూడా ఇదే ప్రచారం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates