Political News

చంద్ర‌బాబుతోనే అంతం కాదు.. ఆరంభం ఎప్పుడూ ఉంటుంది..!

రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌స్తుతం ఈ మాటే వినిపిస్తోంది. చంద్ర‌బాబుతోనేరాజ‌కీయాలు అంతం కావు. ఏపీ రాజ‌కీయాల్లోనే కాదు.. దేశ‌రాజ‌కీయాల్లో కూడా.. ఎప్పుడూ.. ఏదో ఒక ఆరంభం ఉంటూనే ఉంటుంద‌ని చెబు తున్నారు. ఇప్పుడు ఈ చ‌ర్చ ఎందుకు వ‌స్తోందంటే.. వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ చేస్తున్న కామెంట్ల కార ణంగానే. ఆయ‌న ఇటీవ‌ల నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 26 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితిని స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా నాయ‌కుల‌కు జ‌గ‌న్ …

Read More »

‘ఈ రాష్ట్రాన్ని ఎవ్వరూ కాపాడలేరు’

వైసీపీ ప్రభుత్వ విధానాలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ పై రాళ్లేస్తే భయపడే పార్టీ కాదని వ్యాఖ్యానించారు. టీడీపీ సర్వసభ్య సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘అచ్చెన్నాయుడును వేధించడంతో ప్రభుత్వం దారుణాలకు తెర లేపింది. ఎంపీ రఘురామకృష్ణం రాజును పోలీస్ కస్టడీలో ఉండగానే చంపే ప్రయత్నం చేశారు. కోర్టులు తప్పు పట్టినా ప్రభుత్వం భయపడ లేదు. ఇవాళే కాదు.. రేపు కూడా ఉంటుందని పోలీసులు గుర్తుంచుకోవాలి. ఓ …

Read More »

పంచెకట్టులో మోడీ

మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎలాంటి ఈవెంట్స్ కు వెళ్లినా కూడా మొదట తన డ్రెస్సింగ్ స్టైల్ తోనే ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇక ఆయన ఇటీవల పంచెకట్టులో కనిపించిన విధానం అందరిని ఎంతగానో ఆకర్షించింది. గతంలో ఎప్పుడు లేని విధంగా మోడీ పంచె కట్టులో కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారని నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్‌యూ)లో కాశీ తమిళ …

Read More »

‘ఇదేం ఖ‌ర్మ‌’ టీడీపీ..

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పోరాటాలు కొనసాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో మరో కొత్త కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం చుట్టింది. ‘ఇదేం ఖర్మ’ పేరుతో మరో సరికొత్త కార్యక్రమాన్ని మొదలు పెట్టిం ది. తాజాగా మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో టీడీపీ అధినేత చంద్ర‌బా బు.. పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇదేం ఖ‌ర్మ కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న ప్రారంభించారు. అనంత‌రం చంద్రబాబు మాట్లాడుతూ… మూడున్నరేళ్లలో ఏపీలో ఎంతో …

Read More »

ఆసుప‌త్రిలో కొడాలి నాని..

ఏపీ వైసీపీ నాయ‌కుడు, పొలిటిక‌ల్ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని.. తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. కిడ్నీలో రాళ్లు చేర‌డంతో ఆయ‌న ఆసుప‌త్రిలో చేరారు. దాదాపు వారం రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. మూడు రోజుల క్రితమే ఆయన ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. శుక్ర‌వారం రాత్రి కొడాలి నానికి వైద్యులు కిడ్నీ సంబంధిత శస్త్ర చికిత్సను నిర్వహించారు. ప్రస్తుతం …

Read More »

మంత్రికి జైల్లో ‘థాయ్‌ మసాజ్’లు..

మనీలాండరింగ్ కేసులో అరెస్ట‌యి ప్ర‌స్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయ‌కుడు, ఢిల్లీ మంత్రి సత్యేందర్ కుమార్ జైన్‌కు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. తిహార్‌ జైలులో ఉంటున్న జైన్కు సకల సౌకర్యాలు అందుతున్నట్లు అందులో స్పష్టమవుతోంది. జైలులో ఆయనకు ఓ వ్యక్తి మసాజ్ చేస్తుండటం వీడియోలో కనిపిస్తోంది. కాళ్లకు నూనె రాసి మర్దనా చేస్తున్నాడు. ఇది సెప్టెంబరు 13వ తేదీ వీడియో కాగా ఆ …

Read More »

బుగ్గనను సూటిగా అడిగేసి.. కడిగేశారు

Buggana Rajender Reddy

అనూహ్య పరిస్థితి ఎదురైంది ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి. విజయవాడలో నిర్వహించిన వాణిజ్య సలహా మండలి సమావేశాన్ని వివిధ వ్యాపార సంఘాట ప్రతినిధులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వ్యాపారులు పడుతున్న కష్టాల్ని.. ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని కళ్లకు కట్టినట్లుగా చెబుతూ.. ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. జగన్ ప్రభుత్వంలో అధికారుల దాడులు తరచూ జరుగుతున్నాయని.. అదేమంటే.. ప్రభుత్వానికి నిధుల కొరత అంటున్నారని.. ప్రభుత్వం వద్ద డబ్బుల్లేకుంటే మమ్మల్ని …

Read More »

‘నా భార్య మంచిది కాదు .. నా భ‌ర్త తాగుబోతు ఓటేయొద్దు’

ఎన్నిక‌లంటే ఎన్నిక‌లే. రాజ‌కీయాలంటే రాజ‌కీయాలే. గ‌తంలో ఎవ‌రో అన్న‌ట్టుగా.. త‌మ్ముడు త‌మ్ముడే పేకాట పేకాటే అన్న‌ట్టు!! ప్ర‌స్తుతం గుజ‌రాత్ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. తొలిదశ డిసెంబ‌రు 1న జ‌ర‌గ‌నుంది. అయితే.. ఈ ఎన్నిక‌ల్లో అనేక చిత్ర విచిత్రాలుతెర మీదికి వ‌స్తున్నాయి. వీటిలో ఇప్పుడు అంద‌రినీ ఆక‌ర్షిస్తోందేంటంటే.. ఒకే స్తానం నుంచి రెండు పార్టీల త‌ర‌పున పోటీ ప‌డుతున్న భార్యా-భ‌ర్త‌లు! ఔను. నిజ‌మే. మూడు ముళ్ల బంధంతో ఏక‌మైన ఇద్ద‌రు దంప‌తులు రెండు …

Read More »

నేను క‌ను సైగ చేస్తే.. మీరు చిత్తు చిత్తు: చంద్ర‌బాబు

క‌ర్నూలు జిల్లాలో మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం వెళ్లిన చంద్ర‌బాబుకు తొలి రోజు నుంచి వైసీపీ నేత‌ల నుంచి అడ్డగింత‌లు ఎదుర‌వుతున్నాయి. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా.. హైకోర్టు విష‌యాన్ని వారు ప్ర‌స్తావిస్తున్నారు. అంతేకాదు.. చంద్ర‌బాబుపైనా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తాజాగా మూడో రోజు.. చివ‌రి రోజు ప‌ర్య‌ట‌న‌లోనూ వైసీపీ నాయ‌కుల‌, కార్య‌క‌ర్త‌లు ఆయ‌న‌ను అడ్డగించారు. ఏకంగా టీడీపీ ఆఫీస్ వ‌ద్దే హ‌ల్చ‌ల్ చేశారు. చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేప‌థ్యంలో …

Read More »

అయ్యో రాహుల్… ప్లాన్ ఫెయిలైందే !

రాజ‌కీయాల్లో ఒక్కొక్క సారి నేత‌లు వేసే అడుగులు బూమ‌రాంగ్ అయి.. త‌మ‌కే భారీ దెబ్బ‌త‌గులుతుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప‌రిస్తితి కూడా ఇలానే ఉంది. బీజేపీని ఇరుకున పెట్టి.. దేశ‌వ్యాప్తంగా గుర్తింపు పొందాల‌ని భావించిన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాందీ చేసిన వ్యాఖ్య‌లు.. ఇప్పుడు ఆ పార్టీని రోడ్డున ప‌డేశాయి. కీల‌క‌మైన మ‌హారాష్ట్ర‌లో కాంగ్రెస్‌తో ఉన్న బందాన్ని ఠాక్రే శివ‌సేన అధినేత ఉద్ధ‌వ్ ఠాక‌రే తెంచేసుకున్నారు. దీంతో వ‌చ్చే …

Read More »

జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో భారీ దెబ్బ‌..

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోప‌ణలు ఎదుర్కొంటున్న‌ హెటిరో సంస్థలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమపై కేసు కొట్టివేయాలన్న అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఏ-1గా ఉన్న జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాకే అప్ప‌టి సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హెటిరోకు భూములు కేటాయించారని.. క్విడ్‌ ప్రోకో జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తున్న ఈ కేసు కొట్టివేయదగినది కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కేసును క్వాష్ చేసేందుకు.. …

Read More »

నేను రౌడీలకు రౌడీని.. గూండాలకు గూండాను..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా కర్నూలులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 3 రాజధానులు కావాలని డిమాండ్‌ చేస్తూ వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం కార్యాలయం వద్దకు చేరుకుని నినాదాలు చేయడంతో ఘర్షణ జరిగింది. చంద్రబాబు గో బ్యాక్‌ అంటూ వైసీపీ శ్రేణులు నినాదాలు చేస్తే..సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ తెలుగుదేశం కార్యకర్తలు పోటీగా నినాదాలు చేశారు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో చంద్రబాబు అక్కడికి …

Read More »