Political News

ముందడుగు- కొత్త జిల్లాల కోసం కమిటీ

ఏపీ లో కొత్త జిల్లా ఏర్పాటుకు ముందడుగు పడింది. 25 జిల్లాల ఏర్పాటుకు కమిటీ ఏర్పాటైంది. అధ్యయనం కోసం ఏర్పాటైన ఈ కమిటీ కొత్త జిల్లాల ఏర్పాటులో ఎదురయ్యే ఆటంకాలు, పరిష్కరాలు, రాజకీయ సామాజిక పరిస్థితులను కూలంకుషంగా పరిశీలించనుంది. ఈ అధ్యయన కమిటీలో ఆరుగురు సభ్యులున్నారు. సీఎస్ నీలం సాహ్ని అధ్యక్షత వహిస్తారు. సభ్యులుగా సీసీఎల్ఏ కమిషనర్, జీఏడీ కార్యదర్శి, ప్రణాళికశాఖ కార్యదర్శి, సీఎంవో అధికారి, ప్రిన్సిపల్ ఫైన్సాన్స్ సెక్రటరీ …

Read More »

రఘురామ కృష్ణం రాజు కోరిక నెరవేరింది

తాను ఎంపీగా ఎన్నికైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేసి కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తున్నారు రఘురామ కృష్ణంరాజు. ఎవరినీ లెక్క చేయని, ఉపేక్షించని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఆయన మీద క్రమశిక్షణ చర్యలు చేపట్టలేని ఇబ్బందికర పరిస్థితిని ఆయన కల్పించారు. చర్చనీయాంశంగా మారిన అనేక అంశాలపై ఆయన పార్టీని ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్నారు. తాజాగా రాజధాని మార్పు విషయంలోనూ అలాంటి వ్యాఖ్యలే …

Read More »

వైసీపీలోకి ప్రభాకర్ రెడ్డి…కానీ షరతు!

బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 మార్చి విక్రయించిన కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న జలాధర కంపెనీ మేనేజర్ నాగేశ్వర్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని పోలీసులు కూడా పోలీసులు దాదాపు రెండు నెలల క్రితం అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలు …

Read More »

సెక్యూరిటీ వచ్చింది.. దాడి పెరిగింది

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, జగన్ సర్కారును అంత తేలిగ్గా వదిలేలా లేరు. కొన్ని నెలల నుంచి పార్టీ మీద, ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతున్న రఘురామ.. ఈ మధ్య కొంచెం నెమ్మదించినట్లు కనిపించారు. కానీ మళ్లీ ఆయన గళం ఊపందుకుంటోంది. ఇటీవలే ఆయనకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ రక్షణ కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ ఉత్సాహంలో ఆయన మరింత వాడిగా …

Read More »

కేసీఆర్ కలల పంట ఎంత భారీగా.. మరెంత రిచ్ గా ఉండనుందంటే?

గడిచిన నెల రోజులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న అంశాల్లో ఒకటి.. తెలంగాణ సచివాలయం. ఇంతకాలం న్యాయపరమైన అంశాల్లో ఉండిపోవటంతో.. తనకున్న ఆలోచనల్ని వాస్తవరూపం దాల్చకుండా ఆగిపోవటంతో.. సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ ఉండిపోయారు. కోర్టు నుంచి చిక్కులు వీడిపోవటం.. తాను అనుకున్న పని అనుకున్నట్లుగా పూర్తి చేసేందుకు అవకాశం లభించటంతో.. కొత్త సచివాలయానికి సంబంధించి ప్లానింగ్ ను ముమ్మరం చేశారు. రికార్డు సమయంలో …

Read More »

అమరావతి కోసం వైసీపీ ఎంపీ మనోధైర్య యాత్ర

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహార శైలి కొంతకాలంగా ఏపీతొపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఓ వైపు వైసీపీని విమర్శిస్తూనే….మరోవైపు, సీఎం జగన్ కు విధేయుడిని అంటున్న రఘురామకృష్ణంరాజు వ్యవహారం వైసీపీ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. నిమ్మగడ్డ వ్యవహారం నుంచి మూడు రాజధానుల బిల్లు ఆమోదం వరకు సందర్భానుసారంగా విమర్శలు గుప్పిస్తోన్న రఘురామకృష్ణంరాజు తాజాగా జగన్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ కు అమరావతి గతంలోనూ కలిసి …

Read More »

సుజనా మౌనం వెనుక మర్మం ఏమిటో?

ప్రస్తుతం ఏపీలో 3 రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సీఆర్డీఏ రద్దు, అధికార వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ ఆమోదం…..ఆ తర్వాత ఆ బిల్లులపై హైకోర్టు స్టేటస్ కో కోరడం వంటి వ్యవహారాలపైనే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న ‘తెలుగు’ పొలిటిషియన్లంతా చర్చించుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో గతంలో 3 రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి స్పందన ఏమిటన్నదానిపై సర్వత్రా ఆసక్తి …

Read More »

వారు వేటకుక్కులై మీ ప్రభుత్వంపై పోరాడుతారు – RRR

ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణ రాజుకు వై కేటగిరి భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. మరో మూడు రోజుల్లో కేంద్ర భద్రతా బలగాలు ఏపీకి వచ్చి ఆయనకు రక్షణ కల్పించనున్నాయి. తనకు భద్రత కల్పించాలని కోరుకున్న అందరికి ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. అమరావతిలో …

Read More »

బాబు పై కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

2019 ఎన్నికల్లో వైసీపీ హవాను తట్టుకొని మరీ విజయం సాధించారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. పీవీపీపై విజ‌యం త‌ర్వాత నాని వైఖ‌రిలో పూర్తి మార్పు వ‌చ్చింద‌ని టీడీపీ నేతలు అంటున్నారు. మరోవైపు, పార్టీ వైఖరి త‌న‌కు న‌చ్చడం లేద‌ని సోషల్ మీడియా వేదికగా టీడీపీపై కేశినేని నాని విమర్శలలలు గుప్పిస్తున్నారు. పార్టీలో గెలిచిన నాయ‌కుల కంటే కూడా ఓడిన నేత‌ల‌కే చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యం, ప‌ద‌వులు క‌ట్టబెడుతున్నారంటూ సంచలన …

Read More »

జేసీ ప్రభాకర్.. ఆస్మిత్ లకు బెయిల్.. కానీ ట్విస్టు ఉందట

అనంతపురం జిల్లాలో తిరుగులేని రాజకీయ బలం జేసీ ఫ్యామిలీ సొంతం. తామేం అనుకుంటే అది జరిగిపోతుందన్న నమ్మకం వారికి చాలా ఎక్కువ. ఉమ్మడి రాష్ట్రంలో అనంతపురం జిల్లాలోనే కాదు.. హైదరాబాద్ మహానగరంలోనూ వారి హవా ఓ రేంజ్లో సాగేది. అలాంటి వారిప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.బాబు హయాంలో వారు చేసిన పనులకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తోంది. జేసీ సోదరుడు ప్రభాకర్ రెడ్డి.. ఆయన కుమారుడు ఆస్మిత్ రెడ్డిలు ఈ …

Read More »

కోట్లాది మాటల్ని ఈ ఫోటో ఒక్కటి చెబుతుంది?

పై ఫోటోను చూశారుగా. వందలాది మంది ఫ్రేములో ఉన్నా.. అందరి చూపు మాత్రం ఫోటో మొదట్లో పెద్దగా.. స్పష్టంగా కనిపించే ఆ వ్యక్తి వద్ద నిలిచిపోతాయి. నెత్తిన ఎర్రటి టవల్.. కళ్లకు నల్లటి కళ్లజోడు.. నల్లటి గడ్డంతో సీరియస్ గా అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని చూస్తున్నవ్యక్తి.. 29 ఏళ్ల తర్వాత.. తానే ముఖ్యఅతిధిగా రామజన్మభూమి అయిన అయోధ్యలో నిర్మించే రామాలయానికి భూమిపూజ చేస్తానని ఆ ఫోటోలోని నరేంద్ర మోడీ కూడా …

Read More »

కేసీఆర్ తాజా నిర్ణయంతో హైదరాబాద్ సీన్ మారనుందా?

గడిచిన పదిహేనేళ్లుగా హైదరాబాద్ డెవలప్ మొంట్ ను చూస్తే.. నగరం మొత్తం ఒక పక్కకు ఒరిగిపోతున్నట్లుగా అనిపించక మానదు. నగరం డెవలప్ అవుతున్నా.. ఎక్కువ మాత్రం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఎక్కువగా సాగుతున్నట్లుగా చెప్పాలి. ఐటీ కంపెనీల రాకతో పాటు.. పలు ప్రాజెక్టులు పైప్ లైన్ తో ఉండటంతో.. మిగిలిన మహానగరానికి పశ్చిమభాగం ఒక మణిపూసలా మారింది. ఇదే పరిస్థితి మరికొంతకాలం సాగితే.. నగరానికి ఇబ్బందే. ఈ విషయాన్ని …

Read More »