Political News

ట్రబుల్ షూటర్ కు చుక్కలు చూపిన మాస్టర్ మైండ్

టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ అన్నంతనే ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేకుండా గుర్తుకు వచ్చే పేరు హరీశ్ రావు. పార్టీకి విధేయుడిగా ఉంటూ.. ఎన్ని అవమానాలకు గురి చేసినా గమ్మున ఉంటూ.. కష్టపడతారన్న పేరు ఆయనకు ఉంది. 2018 ఎన్నికల వేళలోనూ.. ఆ తర్వాత దాదాపు ఆర్నెల్లకు పైనే హరీశ్ రావు ఫోటోను కేసీఆర్ సొంత మీడియా సంస్థలో ప్రముఖంగా చూపించకపోవటాన్ని పలువురు ప్రస్తావిస్తుంటారు. అంతేనా.. మొన్న జరిగిన ప్లీనరీ …

Read More »

టీడీపీ ముందు జాగ్రత్త పడుతోందా ?

స్ధానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ముందు జాగ్రత్త పడుతున్నట్లే ఉంది. నామినేషన్లు వేయబోయే తమ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని స్టేట్ ఎలక్షన్ కమీషన్ కు కొన్ని సూచనలు చేసింది. ఇందులో ప్రధానమైనది ఏమిటంటే ఆన్ లైన్లో నామినేషన్లు సబ్మిట్ చేసే సౌకర్యం కల్పించటం. ఆ మధ్య జరిగిన స్ధానిక ఎన్నికల్లో కొన్నిచోట్ల తమ అభ్యర్థులను అధికార వైసీపీ నేతలు నామినేషన్లు కూడా వేయనీయలేదని ఆరోపించింది. కొందరు నేతలతో …

Read More »

రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టిన జానారెడ్డి

హుజురాబాద్ ఉప ఎన్నికలో ఓటమిపై కాంగ్రెస్ సింహావలోకనం చేసుకుంటోంది. ఈ రోజు గాంధీభవన్ లో పొలిటికల్ ఎఫైర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశం గరంగరంగా జరిగినట్లు చెబుతున్నారు. హుజురాబాద్ ఓటమిపై నేతలు తమ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. సమావేశం ప్రారంభం కాగానే హుజురాబాద్ ఫలితాల తర్వాత ఓటమికి తానే బాధ్యత వహిస్తానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వాడివేడిగా చర్చ సాగినట్లు చెబుతున్నారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలను …

Read More »

ఈటెల నెక్ట్స్ ఇదేనా…

హోరాహోరీ ప్ర‌చారాలు.. మాట‌ల యుద్ధాలు.. విమ‌ర్శ‌లు ప్ర‌తి విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు.. డ‌బ్బు ప్ర‌వాహం.. ఇలా ఎంతో ఆసక్తిని రేపిన హుజూరాబాద్ ఉప ఎన్నిక పోరు ముగిసింది. దాదాపు మూడు నెల‌ల‌కు పైగా తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారిన ఈ ఎన్నిక‌లో ప్ర‌జ‌లు ఈట‌ల రాజేంద‌ర్‌కే మ‌రోసారి ప‌ట్టం క‌ట్టారు. అధికార పార్టీ టీఆర్ఎస్ విజ‌యం కోసం ఎంత‌గానో ప్ర‌య‌త్నించినా అక్క‌డి ఓట‌ర్లు ఈట‌ల‌కే అండ‌గా నిలిచారు. అక్క‌డి ప్ర‌జ‌ల్లో ఒక‌డిగా …

Read More »

జ‌గ‌న్‌కు ఉద్య‌మ సెగ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2019 ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యంతో తొలిసారి అధికారాన్ని ద‌క్కించుకున్న వైఎస్ జ‌గ‌న్‌కు ఇప్పుడు ప‌రిస్థితులు క్లిష్టంగా మారుతున్నాయ‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ‌తో తిరుగులేని విజ‌యం సాధించి ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చున్న జ‌గ‌న్‌.. ఆ త‌ర్వాత త‌న సంక్షేమ ప‌థ‌కాల‌తో ముందుకు సాగుతున్నారు. త‌న ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌లు త‌న‌వైపే ఉంటార‌నే విశ్వాసంతో జ‌గ‌న్ ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ప్ర‌జ‌లు త‌మ‌ను మ‌ళ్లీ …

Read More »

కారు.. కారు.. హుజూరాబాద్ లో బ్రేకులు ఎందుకు పడ్డాయి?

దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా.. ఒక అంచనా ప్రకారం రూ.500 కోట్లకు మించిన ఎన్నికల ఖర్చుతో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఒక చరిత్రగా నిలిచిపోనుంది. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చరిత్రకు నాంది ప్రస్తావన జరిగినట్లుగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఈ ఉప ఎన్నిక కోసం దేశంలో ఇంకెక్కడా లేని రీతిలో దళితులకు రూ.10లక్షలు ఇస్తూ దళితబంధు పథకాన్ని షురూ చేయటం తెలిసిందే. కారణం.. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితులు ఎక్కువగా ఉండటమే. …

Read More »

ఎమ్మెల్సీలు 6.. ఆశావహులు 60 మంది.. కేసీఆర్‌ కు ఇబ్బందే !

టీఆర్‌ఎస్ ను శక్తివంతమైన పార్టీగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ అన్ని పార్టీల నుంచి వలసలను ఆహ్వానించారు. పార్టీలో చేర్చుకునే సమయంలో నేతలకు ఆయన అనేక హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చే సమయం వచ్చింది. వలస నేతలు పదుల సంఖ్యలో ఉన్నారు. కానీ ఒకట్ల సంఖ్యలో పదవులున్నాయి. ఆశావాహులు అధికం… పదవులు మాత్రం స్వల్పం. ఇందులో ఎవరిని ఎంపిక చేయాలి.. ఎంపికలో ఏమాత్రం తేడా వచ్చిన సదరు నేతలు గోడ …

Read More »

కేసీఆర్ కు షాక్…భారీ మెజారిటీతో ఈటల గెలుపు

తనకు హుజురాబాద్ కంచుకోట అని బీజేపీ నేత ఈటల రాజేందర్ నిరూపించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 23, 865 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. దాదాపు అన్ని రౌండ్లలో ఆధిక్యం కనబరిచిన ఈటల విజయం మరో రెండు రౌండ్లు మిగిలి ఉండగానే ఖరారైంది. …

Read More »

షర్మిళ ‘కరోనా’ హామీ.. ఒక రేంజ్ ట్రోలింగ్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన షర్మిళ తెలంగాణలో వచ్చి పార్టీ పెట్టడం చాలామందికి విడ్డూరంగా అనిపించింది. తెలంగాణ కోడలినని ఎంత చెప్పుకున్నా ఆమెను ఇక్కడి జనాలు పెద్దగా ఓన్ చేసుకోలేదన్నది స్పష్టం. తన అన్నయ్య జగన్ మీద కోపం ఉంటే, ఆయన మీద అలిగితే ఏపీలో ఆయనకు పోటీగా పార్టీ పెట్టాలి కానీ.. …

Read More »

ఎంఎల్ఏలే సొంత సర్వేలు చేయించుకుంటున్నారా ?

ఇపుడిదే అంశంపై అధికార వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో తమ పరిస్థితి ఏమిటనే విషయమై జనాల నాడి పసిగట్టేందుకు ఎంఎల్ఏల్లో చాలామంది సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నట్లు సమాచారం. అందుబాటులోని సమాచారం ప్రకారం సుమారు 100 మంది ఎంఎల్ఏలు తమ నియోజకవర్గాల్లో సర్వే చేయించుకుంటున్నారట. వీటిల్లో ఇఫ్పటికే 30 నియోజకవర్గాల్లో సర్వేలు పూర్తయి వివరాలన్నీ ఎంఎల్ఏల చేతికి అందినాయట. ఈ నివేదికల ప్రకారం నియోజకవర్గాల్లో 40 శాతం …

Read More »

తొలి రౌండ్ లో టీఆర్ఎస్ కు ఇండిపెండెంట్ అభ్యర్థి షాక్

టీఆర్ఎస్ భయమే నిజమైంది. హుజురాబాద్ ఉప ఎన్నిక తొలిరౌండ్‌లో టీఆర్ఎస్‌కు ఇండిపెండెంట్ అభ్యర్థి షాక్ ఇచ్చారు. కారు గుర్తును పోలిన రొట్టెలపీట గుర్తుకు 112 ఓట్లు పోలయ్యాయి. కారు గుర్తును పోలి ఉండటం కారణంగా తమకు నష్టం జరిగినట్లు టీఆర్ఎస్ నేతలు వాపోతున్నారు. అటు హుజురాబాద్ తొలి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలిరౌండ్‌లో ఈటెల రాజేందర్ 166 ఓట్లతో ముందజలో కొనసాగుతున్నారు. ఉప ఎన్నిక …

Read More »

హుజూరాబాద్ తొలి ఫలితం..

అందరూ ఎంతో ఆసక్తిగా.. ఉత్కంటతో ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు వస్తున్నాయి. తెలంగాణ అధికారపక్షం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఉప ఎన్నికల్లో విజయం ఖాయమని భావిస్తున్న వేళ.. ఎగ్జిట్ పోల్స్ అందుకు భిన్నమైన మాట చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. అందులో కారు జోరు స్పష్టంగా కనిపించింది. మొత్తం 753పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు …

Read More »