తొందరలో జరగబోతున్న ఎన్నికల్లో పార్లమెంటు అభ్యర్ధుల్లో ఎక్కువగా బీసీ నేతలను ఎంపిక చేయాలని చంద్రబాబునాయుడు ఆలోచిస్తున్నారు. బలమైన బీసీ నేతల కోసం అన్వేషణ తీవ్రమైంది. ఎప్పటినుండో బలమైన అభ్యర్ధుల కోసం చంద్రబాబు వెతుకుతున్నారు. వ్యూహకర్త రాబిన్ శర్మ బృందం కూడా ఇదే పనిలో నిమగ్నమైంది. ఎన్నికలు మహాయితే మరో మూడునెలల్లో జరగబోతోంది. అందుకనే ఇపుడు అభ్యర్ధుల ఎంపికలో చంద్రబాబు స్పీడు పెంచారు. 25 నియోజకవర్గాల్లో జనసేనకు ఎన్ని కేటాయిస్తారన్నది సస్పెన్సుగా …
Read More »కాంగ్రెస్ లోకి ‘కాపు’ ఖాయమా ?
కాంగ్రెస్ పార్టీలోకి వైసీపీ రాయదుర్గం ఎంఎల్ఏ కాపు రామచంద్రారెడ్డి చేరటం దాదాపు ఖాయమనే అనుకోవాలి. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో మనస్తాపం చెందిన ఎంఎల్ఏ తొందరలోనే కాంగ్రెస్ లో చేరటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు అర్ధమవుతోంది. కారణం ఏమిటంటే కాంగ్రెస్ సీనియర్ నేత, సీడబ్య్లూసీ సభ్యుడు నీలకంఠాపురం రఘువీరారెడ్డి యాదవ్ తో భేటీ అవ్వటమే. వీళ్ళిద్దరి మధ్య దాదాపు గంటసేపు భేటీ జరిగింది. వైసీపీలో కాపుకు రాయదుర్గంలో టికెట్ ఇవ్వటంలేదని జగన్మోహన్ రెడ్డి …
Read More »ప్రగతి భవన్ నుండి కంప్యూటర్లు మాయం ?
కేసీయార్ పరిపాలనలో జరిగిన వ్యవహారాలన్నీ ఒక్కోటిగా బయటపడుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ డొల్లతనం, ధరణి పోర్టల్ అక్రమాలు, వివిధ శాఖల వేల కోట్ల రూపాయల రుణాలు, లక్షల కోట్ల అప్పులన్నీ ఇపుడు అంకెలతో సహా బయటపడుతున్నాయి. కేసీయార్ పాలనలో కొందరు మంత్రులు, ఎంఎల్ఏలు పాల్పడిన భూకబ్జాలు, మోసాలు తదితరాలపై ఫిర్యాదులు వెల్లువుత్తుతున్నాయి. ఇవన్నీ సరిపోవన్నట్లుగా తాజాగా నాలుగు కంప్యూటర్లు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. అప్పట్లో మంత్రులుగా పనిచేసిన కొందరు ఆపీసుల నుండి …
Read More »జగన్.. భస్మాసురుడు: చంద్రబాబు
ఏపీకి భస్మాసురుడు ఎవరైనా ఉన్నారంటే.. అది జగనేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మంగళవారం రాత్రి నంద్యాల జిల్లాలో నిర్వహించిన రా.. కదలిరా! సభలో ఆయన ప్రసంగించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో సీమ జిల్లాలు నీరు లేక అలమటించిపోతున్నాయన్నారు. ఇదే జిల్లాలకు చెందిన ముఖ్యమంత్రి జగన్.. కనీసం ఇక్కడి వారిని ఆదుకోవాలన్న స్పృహ కూడా లేకుండా వ్యవహరిస్తన్నారని చంద్రబాబు విమర్శించారు. “ఎక్కడ చూసినా విధ్వంస పాలన. రాష్ట్రానికి మళ్లీ స్వర్ణయుగం …
Read More »వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ కాంగ్రెస్, అసలు కాంగ్రెస్
‘తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మగతనం తప్ప.. పగతనం లేదు’ అని ఆయన మేనల్లుడు, మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం బీఆర్ ఎస్ పార్టీ నాయకులతో తెలంగాణ భవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి వచ్చే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులపైనా.. పాలకులపైనా ఆయన నిశిత విమర్శలు గుప్పించారు. గతంలో కేసీఆర్ …
Read More »రాతియుగం వైపు వెళ్తారా? స్వర్ణ యుగం కోసం వస్తారా?
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు మరికొద్ది రోజుల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సన్నాహాలను ముమ్మరం చేశారు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘రా కదలిరా’ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా కనిగిరిలో మొదలైన ఈ కార్యక్రమం ఈ రోజు నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆళ్లగడ్డలో ఏర్పాటు చేసిన చంద్రబాబు బహిరంగ సభకు వేల సంఖ్యలో …
Read More »రేవంత్ కంటే కేసీఆర్ బలవంతుడన్న కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, కాంగ్రెస్ నేతల విమర్శలకు దీటుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రతి విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అనే రెండు అక్షరాల కంటే …
Read More »జగన్‌ను శపిస్తా: పాల్ వారి కామెంట్స్
ఏపీ సీఎం జగన్‌ను శపిస్తానంటూ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు.. ప్రముఖ సువార్తీకులు కిలారి ఆనందపాల్ హెచ్చరించారు. మంగళవారం ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు తాడేపల్లి రోడ్ల మీదే హల్చల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీతో పొత్తు పెట్టుకుని.. మరోసారి జగన్ ను ముఖ్యమంత్రి చేయాలన్న కాంక్షతో .. ఆశయంతో .. తాను తాడేపల్లికి వచ్చినట్టు చెప్పారు. అయితే.. తాడేపల్లి పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్న పోలీసులు.. పాల్‌ను …
Read More »నగరాలపై నజర్.. వైసీపీ ఎన్నికల స్ట్రాటజీ ఇదే!
ఏపీలో మరో రెండు మాసాల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా లోక్‌సభ ఎన్నికలు కూడా జరుగుతాయి. గ్రామీణ స్థాయిలో వైసీపీకి గ్రాఫ్ బాగానే ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇంటింటి కీ పింఛన్లు, రేషన్, వైద్యం, ఇంటి డాక్టర్ కాన్సెప్టు, ఆరోగ్యశ్రీ వంటివి పార్టీకి మేలు చేస్తున్నాయని నాయకులు లెక్కలు వేసుకున్నారు. దీంతో గ్రామీణ స్థాయిలో పార్టీకి ఇబ్బంది లేదని భావిస్తున్నారు. ఇక, ఎటొచ్చీ.. కీలకమైన నగరాలు.. పట్టణాల్లో ఓటు …
Read More »ఏపీలో దళితులు నామినేషన్ వేసే పరిస్థితి లేదు: పవన్
విజయవాడలో పర్యటటిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. చంద్రబాబుతో కలిసి సంయుక్తంగా సీఈసీ అధికారులతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకుంటే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, హింస పెరిగిపోతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో జరిగిన స్థానిక ఎన్నికలలో దళిత యువకుడు కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేదని అధికారులకు …
Read More »కేంద్ర పోలీసులు పంపండి…సీఈసీకి చంద్రబాబు రిక్వెస్ట్
ఏపీలో మరో 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతుంది ఈ క్రమంలోనే టీడీపీ, జనసేన లకు చెందిన ఓట్లను వైసీపీ నేతలు తొలగిస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గతంలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కుమార్ నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం బృందం విజయవాడలో పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలోనే విజయవాడలోని సీఈసీ అధికారులతో …
Read More »గుంటూరు ఎంపీగా ఆలపాటి ?
రాబోయే ఎన్నికల్లో సీనియర్ తమ్ముడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గుంటూరు ఎంపీగా పోటీ చేయబోతున్నారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. నిజానికి ఆలపాటి తెనాలి అసెంబ్లీ సీటును దాటి ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి ఏమాత్రం ఇష్టపడరు. కానీ ఇపుడు పరిస్ధితులు మునుపటిలా లేవు. ఎందుకంటే తెనాలిలో టికెట్ దక్కేది దాదాపు అనుమానమే. కారణం ఏమిటంటే జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ ఇక్కడి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates