వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం దక్కించుకుని ఏపీలో అధికారం చేపడతామని పదే పదే చెబుతున్న పవన్ కళ్యాణ్.. ఇటీవల ఒక సంచలన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగులు ఎన్నోఏళ్లు గా ఎదురు చూస్తున్న సీపీఎస్ (కంట్రిబ్యూటరి పింఛన్ పథకం)ను రద్దు చేస్తామని, తాము అధికారంలోకి రాగానే రెండో సంతకం ఈ ఫైలుపైనే పెడతామని ఆయన చెప్పారు. వాస్తవానికి ఇది పెద్ద హామీ అనే చెప్పుకోవాలి. పైగా.. ఇప్పటి వరకు అటు …
Read More »అక్కడ బలం పెంచుకుంటున్న వైసీపీ
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఇప్పుడు ఇది చాలా హాట్ టాపిక్‌గా ఉంది. టీడీపీకి కంచుకోట అనే ఈ జిల్లాపై వైసీపీ అధినేత జగన్ కన్నేశారు. ఇక్కడ ఎట్టి పరిస్థితిలోనూ పట్టు పెంచుకునేం దుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని టెక్కలిలో ఓడించి తీరాలనేది ఆయన సంకల్పంగా ఉంది. అందుకే ఇక్కడ టికెట్‌ను కూడా దువ్వాడ శ్రీనివాస్‌కు ముందుగానే కన్ఫర్మ్ చేశారు. ఇక, మిగిలిన నియోజకవర్గాల్లోనూ నాయకులను అలెర్ట్ చేశారు. …
Read More »‘మీ ప్రతీకారం రాజకీయాల్లోకి మమ్మల్ని లాగొద్దు’
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రాజధాని అమరావతిలోని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో మాజీ మంత్రి నారాయణ ముందస్తు బెయిల్ రద్దుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. విచారణకు సహకరించకపోతే దర్యాప్తు సంస్థలు న్యాయ స్థానాలను ఆశ్రయించాలని సూచించింది. ప్రతి చిన్న దానికి సుప్రీంకోర్టుకు రావడం ఏపీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం చురకలంటించింది. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్‌రోడ్డు …
Read More »జగన్‌కు బీజేపీ పెద్దల ఆశీర్వాదం.. ఉంటుందా… ఉండదా!
వైసీపీ అధినేత.. ఏపీ సీఎం జగన్… తన పాలన సూపర్‌గా ఉందని.. తన పాలనలో తీసుకువస్తున్న అనేక పథకాలను.. అనేక సంక్షేమ కార్యక్రమాలను.. ఇతర రాష్ట్రాలు సైతం అనుసరిస్తున్నాయని చెబుతున్నారు. అంతేకాదు.. తాను మేనిఫెస్టోలో 2019 ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్నామని.. ఇప్పటికి ఈ మూడున్నరేళ్లలో ఈ హామీలను 98 శాతం పూర్తిచేశామని కూడా చెబుతున్నారు. అన్ని వర్గాల వారికీ తమ ప్రభుత్వం న్యాయం …
Read More »మునుగోడు చెబుతున్న ‘నిజం’ ఏంటి?
సార్వత్రిక ఎన్నికలను తలపించే రీతిలో సాగిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి పరాజయం పాలయ్యారు. అయితే, రాజగోపాల్ రెడ్డి ఓటమిపాలైనప్పటికీ టీఆర్ఎస్పై దీటుగానే పోరాడారనే అభిప్రాయాలు వ్యక్తమమవుతున్నాయి. ఎందుకంటే.. మెజారిటీ మరీ అంత ఎక్కువగా లేకపోవడం, రాజగోపాల్ రెడ్డికి పోలైన ఓట్ల సంఖ్యే ఇందుకు తార్కాణమని విశ్లేషకులు చెబుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలను, అధికారులను సైతం మోహరించిన టీఆర్ ఎస్ అభ్యర్తి కూసుకుంట్ల …
Read More »ఇది సర్కారు వ్యతిరేకతా..? బాబు సానుకూలతా?
రాజకీయంగా ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వైసీపీ ఒక కీలకమైన పొజిషన్లో ఉంది. ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. దీంతో ఎక్కడ ఏం జరిగినా.. తమకు అనుకూలంగా ఉందా? వ్యతిరేకంగా ఉందా? అని నాయకులు తెగ చర్చించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విషయంలో ఈ చర్చ మరింత ఎక్కువగానే ఉంది. చంద్రబాబు పాల్గొంటున్న సభలకు, కార్యక్రమాలకు జనాలు వస్తున్న తీరును వైసీపీ నాయకులు నిశితంగా …
Read More »డిపాజిట్ దక్కని కాంగ్రెస్.. ఎవరు బాధ్యులు?
కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. పైగా మహిళా సెంటిమెంటు. ఇంతకుమించి పాల్వాయి ప్రభంజనం.. వెరసి ఇవన్నీ కూడా పనిచేస్తాయని.. గెలుపు తథ్యమని భావించిన కాంగ్రెస్‌కు ఇప్పుడు ఘోర పరాభవం ఎదురైంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ చరిత్రలో డిపాజిట్ దక్కలేదు.. అనే మాట ఎరుగని మునుగోడులో ఇప్పుడు డిపాజిట్ సైతం కోల్పోయిన పరిస్థితి. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు? అనేది ఇప్పటికైనా నాయకులు అంతర్మథనం చేసుకుంటే రాబోయే రోజుల్లో పార్టీ …
Read More »మునుగోడు పొలిటికల్ టాక్ ఆఫ్ ద టౌన్ కేటీఆర్
మునుగోడులో అధికార టీఆర్ఎస్ విజయం దక్కించుకుంది. అయితే.. ఈ విజయంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు పక్కా ప్లానింగ్‌తో ముందుకు సాగారు. ఇదే విజయానికి దోహదం చేసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానన్న కేటీఆర్ వ్యాఖ్యలు ప్రజలను బాగానే మలుపుతిప్పాయి. అదేసమయంలో దేశంలోనే భూగర్భ జలాల్లో ఫ్లోరిన్ ఎక్కువగా ఉన్న ప్రాంతం మునుగోడు నియోజకవర్గం. ఈ ఫ్లోరైడ్ రక్కసిని పారదోలడానికి సీఎం కేసీఆర్ మిషన్ భగీరథను నల్గొండ …
Read More »వైసీపీ మీడియా నవ్వులపాలు
మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో రెండు రోజులుగా నడుస్తున్న డ్రామాను అందరూ చూస్తున్నారు. రాష్ట్రంలో రోడ్లు దారుణాతి దారుణంగా తయారవగా.. కొత్త రోడ్లు వేయడం సంగతి అటుంచితే కనీసం గుంతలు కూడా పూడ్చకపోవడంతో ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. అలాంటిది రెండొందల ఇళ్లు ఉన్న గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో పదుల సంఖ్యలో ఇళ్లను కూల్చేయడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనసేన ప్లీనరీ సమావేశానికి తమ భూములు ఇచ్చారనే అక్కసుతో, …
Read More »‘ఆళ్ల’ మెడకు ఇప్పటం ఉచ్చు.. ఒక్కటే మాట!!
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో రహదారి విస్తరణ పేరుతో తొలగించిన ఇళ్ల వ్యవహారం ఇప్పుడు వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్నారెడ్డి మెడకు చుట్టుకుంటోంది. ఇక్కడి ప్రజలు ఆయనవైపే వేలెత్తి చూపిస్తున్నారు. ఆళ్ల వర్గానికి చెందిన నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన ఆవిర్భావ సభ మార్చి 14న జరిగిందని.. ఏప్రిల్ 22న ఇళ్లు తొలగిస్తామని నోటీసులు ఇచ్చారని …
Read More »రాజగోపాల్ రెడ్డి మెడకు ‘సన్యాసం’ స్టేట్మెంట్
ఈ సోషల్ మీడియా కాలంలో ఫిలిం సెలబ్రెటీలైనా, పొలిటికల్ లీడర్లయినా.. ఏవైనా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేటపుడు కొంచెం ముందు వెనుక ఆలోచించుకోవడం మంచిది. తొందరపడి ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చి.. ఆ తర్వాత అటు ఇటు అయితే మీడియా వాళ్లు, సోషల్ మీడియా జనాలు వారిని మామూలుగా టార్గెట్ చేయరు. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికకు ముందు చేసిన తొందరపాటు కామెంట్ వల్ల తీవ్ర ఇబ్బందిని …
Read More »కేసీఆర్ వ్యూహానికి కమలం కకావికలం!
మునుగోడు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్.. గడప దాటి రాలేదు. పైగా ఢిల్లీ వెళ్లారు. బీఆర్ఎస్ పనుల్లో బిజీబిజీగా గడిపారు. అంతేకాదు.. ఢిల్లీలో నిర్మిస్తున్న భవనం పనులను ఆయన ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఈ కీలక సమయంలో ఈయన ఇలా చేస్తున్నాడేంటని.. పార్టీ నేతలు సహా మీడియా తలపట్టుకుంది. కానీ, కేసీఆర్ గడప దాటకుండానే తన వ్యూహాలను మునుగోడులో దించేశారు. దీంతో అనూహ్యమైన విజయాన్ని కారెక్కించుకుని వెళ్లిపోయారు. …
Read More »