అవును.. ఇది అర్ధం చేసుకోవాల్సిన సమయం..!- ఒక్క జనసేన మాత్రమే కాదు.. టీడీపీ నేతలే కాదు.. రాష్ట్ర ప్రజలు కూడా! ఒకవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి. ఈ రెండింటి మధ్యే ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ఒక్కడిని చేసి జగన్‌పై ఇంత మంది యుద్ధం ప్రకటించారంటూ.. వైసీపీ నుంచి సహజంగానే సెంటిమెంటుతో కూడిన కామెంట్లు వస్తున్నాయి. ఇక, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు ఒంటరిగా రాలేకపోతున్నారంటూ విమర్శలూ కామన్‌గానే వినిపిస్తున్నాయి.
అయితే..ఈ మొత్తం వ్యవహారంలో ప్రజల మాటను పక్కన పెడితే. ముందుగా టీడీపీ, జనసేన నాయకులు చాలానే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో వ్యూహాలు, ప్రతివ్యూహాలు మారుతూనే ఉంటాయి. ఈ విషయాన్ని తమ్ముళ్లు గ్రహించాలి. అంతేకాదు.. పార్టీ తీసుకున్న నిర్ణయంపై గుస్సాగా ఉంటే.. అంతిమంగా నష్టపోయేది తమ్ముళ్లే. గత ఐదేళ్లలో రాష్ట్రంలో తమ్ముళ్ల పరిస్థితి ఎలా ఉందో అర్ధం అవుతూనే ఉంది. కనీసం బయటకు కూడా రాలేని పరిస్థితి గతంలో కనిపించింది.
ఇప్పుడు ఏ పార్టీకో టికెట్లు తగ్గాయనో.. మరేదో జరిగిందనో అలిగి ఇంటికే పరిమితమైనా.. చాపకింద నీరులా వేరేగా వ్యవహరించినా.. అది మరింత మోసమే అవుతుంది. మరోసారి కనుక వైసీపీ వస్తే.. ప్రస్తుతం పరిశీలకుల అంచనా ప్రకారం.. వచ్చే 2029 ఎన్నికలకు అసలు వైసీపీకి పోటీ ఇచ్చే పార్టీలు , నాయకులు కూడా మిగలడం కష్టం. మరి ఇలాంటి పరిస్థితిని కొని తెచ్చుకుంటారా? లేక.. అర్ధం చేసుకుంటారా? అనేది ఇరు పార్టీల నాయకులు తేల్చుకోవాలి.
జనసేన విషయాన్ని తీసుకుంటే.. 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు తీసుకున్నప్పుడు యాగీ జరిగింది. అయితే.. దీనివెనుక ఉన్న రీజన్ పవన్ చెప్పారు. ఇప్పుడు మరింతగా తగ్గాయి. దీనిని అర్దం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ఉన్న బీజేపీతో ముందుకు సాగేందుకు ఆ పార్టీని మెప్పించాల్సిన అవసరం ఉంది. అందుకే కొంత తగ్గారు.
ముందు 21 స్తానాల్లో జనసేనను గెలిపించుకుంటే.. ఇక, ఆ పార్టీ పునాదులు బలంగా మారినట్టేననే విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా.. ఇటు టీడీపీ, అటు జనసేనల్లో ఇది.. అర్ధం చేసుకోవాల్సిన సమయే తప్ప.. అనర్థం చేసుకునే సమయం మాత్రం కాదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates