Political News

పిన్నెల్లి తెలివికి పోలీసులే షాక్‌

ఈవీఎం ధ్వంసం కేసులో ప్ర‌ధాన నిందితుడు, మాచ‌ర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి తెలివికి పోలీసులే షాక‌య్యారు. అవును.. తెలివి ఉప‌యోగించి పోలీసుల క‌ళ్లు గ‌ప్పి ఆయ‌న త‌ప్పించుకుని పారిపోయార‌ని చెప్పాలి. పోలింగ్ తేదీన మాచ‌ర్ల‌లో గొడ‌వ‌ల కార‌ణంగా పిన్నెల్లితో పాటు ఆయ‌న సోద‌రుడిని పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. కానీ వీళ్లు అక్క‌డి నుంచి హైద‌రాబాద్ వెళ్లిపోయారు. ఇప్పుడేమో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశాల‌తో పోలీసులు రంగంలోకి దిగారు. …

Read More »

మోడీ మిత్రుల్లో చంద్రబాబే బెస్ట్ అట

2014, 2019 సార్వత్రిక ఎన్నికలలో వరుసగా కేంద్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ..మిత్రపక్షాలతో కలిసి రెండు సార్లు సక్సెస్ఫుల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే పదేళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న మోడీపై కాస్త వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అయితే, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమిలో లుకలుకలు, ఇండియా కూటమికి నాయకత్వలేమి వంటి విషయాల నేపథ్యంలో ఈసారి కూడా …

Read More »

13 నుంచి 20 వ‌ర‌కు.. ప‌ల్నాడులో ఏం జ‌రిగింది?

ఏదైనా ఘ‌ట‌న జ‌రిగితే.. క్ష‌ణాల్లోనే బాహ్య ప్ర‌పంచానికి తెలిసిపోతోంది. అంతే వేగంగా సోష‌ల్ మీడియాలో నూ ప్ర‌చారం అవుతోంది. ఎక్క‌డో ఇరాన్‌లో అక్క‌డి అధ్య‌క్షుడు ప్ర‌మాదంలో చ‌నిపోతే.. కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే.. ప్ర‌పంచాన్ని ఈ వార్త చుట్టేసింది. మ‌రి అలాంటిది.. ప‌క్క‌నే ఉన్న మాచర్ల నియోజ‌క‌వ‌ర్గంలో చోటు చేసుకున్న ఈవీఎం, వీవీ ప్యాట్‌ల విధ్వంసం.. ఘ‌ట‌న‌లు మాత్రం బాహ్య ప్రపంచానికి వారం రోజుల ఆల‌స్యంగా తెలిసింది. ఆయా ఘ‌ట‌న‌ల‌కు సంబంధించిన …

Read More »

కేసీఆర్‌కు ఆహ్వానం.. మార్కులు కొట్టేసిన రేవంత్‌!

రాజ‌కీయాల్లో నాయ‌కులు ప‌ర‌స్ప‌ర ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం కామ‌నే. అధికారంలో ఉన్న పార్టీపై విప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంటాయి. పొద్దున లేచిన‌ప్ప‌టి నుంచి నేత‌ల‌కు ఇదే ప‌ని. కానీ రాజ‌కీయాల‌ను రాజ‌కీయాలుగానే చూస్తూ ఇత‌ర విష‌యాల్లో ప్ర‌త్య‌ర్థి పార్టీల నాయ‌కుల‌ను గౌర‌వించ‌డం ముఖ్యం. అలా అయితేనే పాలిటిక్స్ క్లీన్ అండ్ నీట్‌గా ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో సాగుతున్న‌ట్లే క‌నిపిస్తున్నారు. రాజ‌కీయాల‌ను ఓ …

Read More »

జగన్ ప్రమాణస్వీకారం లోగుట్టు ఇదేనా?

ఓవైపు సర్వేలన్నీ కూడా ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని చెప్పటం తెలిసిందే. 2019 ఎన్నికల్లో జగన్ కు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్ సైతం ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిదే విజయంగా తేల్చేశారు. అది కూడా ఒకసారి కాదు రెండుసార్లు. చివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఒక తెలుగు టీవీ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈసారి …

Read More »

కూట‌మి విజ‌యం కోరుకుంటున్న వైసీపీ అభ్య‌ర్థులు?

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికార వైసీపీ, కూట‌మి మ‌ధ్య హోరాహోరీ పోరు న‌డిచింది. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి అభ్య‌ర్థుల‌పై సీఎం జ‌గ‌న్‌తో స‌హా వైసీపీ నాయ‌కులు తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఎంత‌మంది జ‌త‌క‌ట్టినా వైసీపీ గెలుపును ఆప‌లేర‌ని అన్నారు. కానీ ఇప్పుడు అంతా త‌ల‌కిందులైంద‌నే చెప్పాలి. జూన్ 4న వెలువ‌డే ఫ‌లితాల్లో కూట‌మి గెల‌వాల‌ని వైసీపీ అభ్య‌ర్థులు కోరుకుంటున్నార‌ని స‌మాచారం. అందుకు ఓ కార‌ణం ఉంది. ఎన్నిక‌ల్లో ఉన్న‌దంతా …

Read More »

షాకింగ్‌: మోడీకి.. ఓవైసీ మ‌ద్ద‌తు.. !

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో ఉప్పు -నిప్పుగా వ్య‌వ‌హ‌రించే ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ.. తాజాగా టంగ్ మార్చారు. మోడీ గ‌త కొన్నాళ్లుగా ప్ర‌క‌టిస్తున్న పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌(పీవోకే)ను తిరిగి తీసుకుంటామ‌న్న వ్య‌వ‌హారంపై అస‌దుద్దీన్ ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. తాము కూడా మ‌ద్ద‌తిస్తామ‌ని.. తాము కూడా కోరుకుంటున్న‌ది ఇదేన‌ని తేల్చి చెప్పారు. పీవోకే.. భార‌త్‌లో అంత‌ర్భాగ‌మ‌ని తాము ఆది నుంచి చెబుతున్న‌ట్టు ఓవైసీ తెలిపారు. అయితే.. త‌మ మాట‌ల‌ను అప్ప‌ట్లో ప‌ట్టించుకోలేద‌ని …

Read More »

ఈ ఏపీ బీజేపీ లీడ‌ర్లు ఎక్క‌డ‌?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల హ‌డావుడి ముగిసింది. ఇక ఫ‌లితాల కోసం నిరీక్ష‌ణే ముగిసింది. ఎవ‌రికి వారు రిజ‌ల్ట్‌పై న‌మ్మ‌కంతో ఉన్నారు. అధికార వైసీపీ మ‌రోసారి గ‌ద్దెనెక్కుతుందా? లేదా టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి అధికారంలోకి వ‌స్తుందా? అన్న‌ది జూన్ 4న తేలుతుంది. ఈ లోగా నాయ‌కులు రిలాక్స్ అవుతున్నారు. కానీ బీజేపీలోని కొంత‌మంది లీడ‌ర్లు మాత్రం ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ అట్టిముట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్పుడు ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత …

Read More »

పిన్నెల్లికి వైసీపీ మ‌ద్ద‌తు.. !!

త‌మ్ముడు త‌న‌వాడైనా ధ‌ర్మం చెప్పాలంది మ‌హాభార‌తం. పోనీ.. మ‌నం భార‌త కాలంలో లేక‌పోయినా.. క‌నీసం.. క‌ళ్లుముందు క‌నిపిస్తున్న నిజానికి ఒప్పుకొనే క‌లికాలాన్నికూడా దాటి అధఃపాతాళానికి ప‌డిపోయామా? అని అనిపిస్తోంది. ఎందుకంటే.. క‌ళ్ల‌ముందు క‌నిపిస్తున్న‌ది.. వైసీపీ ఎమ్మెల్యే, పైగా 20 ఏళ్ల‌పాటు ఎమ్మెల్యేగా ఉన్న సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కుడు.. నేరుగా పోయి..ఒక పోలింగ్ బూత్‌లో ప్ర‌జాస్వామ్యం సిగ్గుప‌డేలా.. బ‌రితెగించి.. ఈవీఎంను, వీవీ ప్యాట్‌ను నేల‌కేసి కొట్టారు. పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా.. …

Read More »

సోనియా చేత‌.. సోనియా వ‌ల‌న‌..

తెలంగాణ ఇచ్చామ‌ని చెప్పుకొంటున్న కాంగ్రెస్ అగ్ర‌నేత‌, ప్ర‌స్తుత రాజ్య‌స‌భ స‌భ్యురాలు సోనియాగాంధీ వ‌చ్చే నెల 2న(పోలింగ్ ఫ‌లితానికి రెండు రోజుల ముందు) తెలంగాణ‌కు రానున్నారు. ఆ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పుర‌స్క‌రించుకుని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించే కార్య‌క్ర‌మంలో ఆమె పాల్గొన‌నున్నారు. 2013-14 మ‌ధ్య‌ యూపీఏ హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. తెలంగాణ ఇచ్చిన‌ప్ప‌టికీ.. సుదీర్ఘ పోరాటాల అనంత‌రం.. రాష్ట్ర …

Read More »

మాచ‌ర్ల ఘ‌ట‌న‌పై చంద్ర‌బాబు ఆందోళ‌న‌.. ఫోన్ చేసి ఆరా!

ప‌ల్నాడు జిల్లా మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో ఈ నెల 13న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ సంద‌ర్భంగా వైసీపీ అభ్య‌ర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్నారెడ్డి సృష్టించిన అరాచ‌కంపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌జాస్వామ్యంలో ఇది దిగ‌జారుడు త‌న‌మ‌ని వ్యాఖ్యానించారు. వైసీపీ మూక‌లు ఇలాంటి అఘాయిత్యాల‌కు పాల్ప‌డ‌తాయ‌ని తాము ముందు నుంచి హెచ్చ‌రిస్తూనే ఉన్నామ‌న్నారు. స్థానిక పోలీసులు త‌మ హెచ్చ‌రిక‌ల‌ను లైట్ తీసుకున్నార‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించా రు. …

Read More »

పీకే ఏమైనా బ్రహ్మనా? బొత్స లాజిక్ మిస్ ?

నచ్చినోళ్లను నెత్తిన ఎక్కించుకోవటం.. నచ్చని వారిని పాతాళానికి తొక్కేసినట్లుగా మాటలు మాట్లాడటం ఇటీవల కాలంలో అంతకంతకూ ఎక్కువ అవుతోంది. రాజకీయాల్లో ఈ ధోరణి ఎంతన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ వాతావరణం కాస్త భిన్నంగా ఉంటుంది. మరి.. ముఖ్యంగా ఏపీ సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. రాజకీయం కాస్తా వ్యక్తిగత వైరంగా మారిన వేళ.. తమకు తగ్గట్లుగా మాట్లాడితే …

Read More »