జనసేన సీట్లు తగ్గడం వైసీపీని బాధించిందా? చిత్రంగా అనిపించినా.. ఇది నిజమే. ఎందుకంటే, తనను తాను తగ్గించుకున్నంత మాత్రాన పోయేదేమీ లేదు. పైగా ప్రజల్లోనూ సింపతీ వస్తుంది. ఈ వ్యూహానికి ప్రధాన ప్రాతిపదిక.. బీజేపీని స్వయంగా పవనే ఆహ్వా నించడం. ఈ కారణంగానే ఆయన తనను తాను తగ్గించుకున్నారు. మొదట్లో పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు దక్కాయి. అయితే.. అనూహ్యంగా ఆ పార్టీ 21కి ఇప్పుడు తగ్గించుకోవాల్సి వచ్చింది దీనికి ప్రధానం గా బీజేపీకి త్యాగం చేయడమే.
అయితే, ఇలా తగ్గించుకున్నంత మాత్రాన జనసేనను తప్పుబట్టాల్సిన అవసరం లేదని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. కీలకమైన నియోజకవర్గాల్లో జనసేన పోటీకిదిగుతోంది. అంతకు మించి తీసుకున్నా.. వృథా ప్రయాసే అవుతుందనే అంచనాలు వున్నాయి. అంతేకాదు.. కనీసంలో కనీసం తీసుకున్న నియోజకవర్గాల్లో అయినా.. విజయందక్కించుకోక పోతే.. అసలు పార్టీపైనా మసక ముసురుకు నే అవకాశం ఉంది. అందుకే… చాలా వ్యూహాత్మకంగా పవన్ వ్యవహరించారు.
నొప్పించక.. తానొవ్వక.. అన్నట్టుగా.. జనసేన అధినేత టికెట్ల వ్యవహారంలో ఆచితూచి వ్యవహరించారని అంటున్నారు పరిశీలకులు. 21 స్థానాలకు అసెంబ్లీ ని పరిమితం చేసుకున్నా.. గెలుపు గుర్రాలకే ఆయన టికెట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో సేనంతా.. ఈ విజయంపైనే దృష్టి పెడితే.. గెలుపు ఖాయమని చెబుతున్నారు. అందుకే.. 24 సీట్లు తీసుకున్నప్పుడు.. ఉన్నన్ని విమర్శలు ఇప్పుడు లేక పోవడం గమనార్హం. అంటే.. ఒకరకంగా ఆలోచన దిశగానే జనసేన నాయకులు అడుగులు వేస్తున్నారు.
ఇక, పార్లమెంటు ఎన్నికల్లోనూ.. జనసేన రెండుకు పరిమితమైంది. మచిలీపట్నంలో వ్యక్తి ఆధారిత ఎన్ని కలు జరగనున్నాయి. ఇక్కడ నుంచి బాలశౌరి జనసేన టికెట్‌పై పోటీ చేయనున్నారు. ఈయనకు ఇక్క డ మంచి పేరుంది. సో.. ఆయన గెలుపు ఖాయం. ఇక, అనకాపల్లిలో కాపు సామాజిక వర్గం పవన్ వెంటే నడుస్తోంది. ఇది కూడా.. ఇక్కడ ప్లస్ కానుంది. ఫలితంగా తీసుకున్నది రెండే అని పెదవి విరవడం కన్నా.. తీసుకున్న అన్ని సీట్లలోనూ గెలిచామనే ట్రాక్ రికార్డు ముఖ్యమనే దిశగా పవన్ అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ సంఖ్యలకంటే.. దూరదృష్టికే ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates