Political News

ఏపీలో బెట్టింగ్ మార్కెట్ ఏం చెబుతోంది?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ తెలుగువారి చూపంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీదనే. అక్కడ జరుగుతున్న అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై పెద్ద ఎత్తున జరుగుతోంది. ఏ ఇద్దరు తెలుగు వారు కలిసినా వారి మాటల్లో మొదట వచ్చేది ఎన్నికల అంశమే. అంతలా తెలుగువారి జీవితాల్లో భాగంగా మారిన ఈ ఎన్నికలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వనున్నది ఓటర్లు ఈ రోజు తీర్పు ఇవ్వనున్నారు. ఈవీఎంలలో నిక్షిప్తమయ్యే ఓటర్ల తీర్పు …

Read More »

ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన ఓటరు !

నాయకుడు అంటే నలుగురికి ఆదర్శంగా నిలవాలి. అందునా ప్రజాప్రతినిధి అంటే మరింత బాధ్యతతో వ్యవహరించాలి. ఎమ్మెల్యే అయినంత మాత్రాన తాను అందరికీ అతీతం అనుకుంటే తెనాలి ఎమ్మెల్యేకు జరిగిన పరాభవమే ఎదురవుతుంది. ఓటు వేయడానికి వెళ్లిన తెనాలి సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌ అక్కడ లైన్లో నిలబడిన ఓటర్లను పట్టించుకోకుండా నేరుగా లోపలికి వెళ్తుండగా అక్కడ ఉన్న ఓటరు అభ్యంతరం చెప్పాడు. ఇంత మంది క్యూలో నిల్చుంటే …

Read More »

ప‌ల్నాడులో ఆ 4 నియోజ‌క‌వ‌ర్గాలు హాట్ హాట్‌!

కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారుల వ‌ర‌కు కూడా.. అనేక జాగ్ర‌త్త‌లు తీసుకున్నా రు. అధికారుల‌ను మార్చేశారు. అంతేకాదు.. చీమ చిటుక్కుమ‌న్నా ప‌ట్టేసేలా వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చారు. అన్ని పోలింగ్ బూతుల‌ను వెబ్ క్యాస్టింగ్ చేశారు. అంటే.. ఇక్క‌డ ప్ర‌తిదీ రికార్డు చేశారు. అయినా.. ఆగ‌డాలు.. ఆగ‌లేదు. దాడులకు బ్రేక్ ప‌డ‌లేదు. అదే.. ఎప్పుడూ.. హాట్ టాపిక్‌గా ఉండే.. ప‌ల్నాడు ప్రాంతం. ఇక్క‌డి నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల‌ను కేంద్ర ఎన్నికల …

Read More »

కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట‌ర్ల బారులు…. సంకేతం ఏంటి?

Andhra Pradesh

రాష్ట్రంలో కీల‌క నాయ‌కులు పోటీ చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో అనూహ్య‌మైన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఉద‌యం 6 గంట‌ల నుంచే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని అన్ని పోలింగ్ బూతుల్లోనూ పెద్ద ఎత్తున ఓట్లర్లు బారులు తీరారు. కొన్ని కొన్ని బూతుల్లో అయితే.. రెండేసి వ‌రుస‌ల్లో ఓట‌ర్లు బారులు తీరారు. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి ఆస‌క్తిగా మారింది. పిఠాపురం: జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇక్క‌డ పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచివంగా గీత పోటీలో …

Read More »

చంద్ర‌బాబు మాస్ వార్నింగ్‌… ఎవ‌రిని ఉద్దేశించి?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఉండ‌వ‌ల్లిలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన త‌ర్వాత‌.. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు జిల్లాలోని ఒక‌టి రెండు నియోజ‌క‌వ‌ర్గాలు స‌హా.. క‌డ‌ప‌లోని క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గంలోనూ.. స్వ‌ల్ప ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా రెంటచింత‌ల‌(ప‌ల్నాడు)లో వైసీపీ, టీడీపీ పోలింగ్ ఏజంట్లు గాయ‌ప‌డ్డారు. ఇక్క‌డ స్వ‌ల్ప ఉద్రిక్త‌త‌లు కూడా చోటుచేసుకున్నాయి. ఈ ప‌రిణామాల‌పై చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దాడులు స‌రికాద‌ని.. ప్ర‌జాస్వామ్య పండుగ‌ను …

Read More »

క‌డ‌ప‌లో రికార్డు స్థాయి పోలింగ్‌.. అక్క చెల్లెళ్ల ఎఫెక్టేనా?

ఏపీలో జ‌రుగుతున్న పార్ల‌మెంటు, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒక‌టి రెండు జిల్లాలు మిన‌హా.. మిగిలిన జిల్లాల్లో పోలింగ్ ప్ర‌క్రియ ఆశాజ‌న‌కంగానే సాగుతోంది. ఉద‌యం 5-6 మ‌ధ్యే పోలింగ్ బూతుల ముందు ఓట‌ర్లు బారులు తీరారు. నిర్దేశిత స‌మ‌యం ప్ర‌కారం ఉద‌యం 7 గంట‌ల‌కు.. పోలింగ్ ప్రారంభ‌మైంది. కొన్ని కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మిగిలిన చోట ఇబ్బందులు లేకుండానే ప్ర‌క్రియ సాగిపోయింది. అయితే.. చిత్రంగా గ‌త 2019 ఎన్నిక‌ల స‌మయంలో ఉద‌యం …

Read More »

ప‌వ‌న్ ఫ‌స్ట్ టైమ్‌.. స‌తీస‌మేతంగా ఓటేశారు..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అయితే.. గ‌తానికి భిన్నంగా ఆయ‌న ఈ సారి భార్య‌తో క‌లిసి పోలింగ్ కేంద్రానికి వ‌చ్చి ఓటేయ‌డం విశేషం. మంగ‌ళ‌గిరిలోని పోలింగ్ కేంద్రంలో ఆయ‌న ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పోలీసుల‌కు, పోలింగ్ సిబ్బందికి కొన్ని సూచ‌న‌లు చేశారు. తాగునీటి వ‌స‌తి క‌ల్పించాల‌ని.. టెంట్లు ఇంకా ఎక్కువ వేయాల‌ని సూచించారు. అదేవిధంగా కేంద్రాల ముందు ప్ర‌జ‌లు బారులు …

Read More »

ఓటేసిన బాబు దంప‌తులు.. స్పెష‌ల్ ఏంటంటే!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆయ‌న స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి దంప‌తులు.. త‌మ ఓటు హ‌క్కును విని యోగించుకున్నారు. అయితే.. ఇందులో స్పెష‌ల్ ఏంటంటే.. చంద్ర‌బాబు దంప‌తులు త‌మ కుమారుడు, పార్టీ యువ నాయ‌కుడు నారా లోకేష్ కోసం తొలి ఓటు వేయాల‌ని అనుకున్నారు. కానీ, స్వ‌ల్ప ఆల‌స్యంతో మూడో ఓటు వేయాల్సి వ‌చ్చింది. మొత్తానికి సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కే పోలింగ్ ప్ర‌క్రియ ప్రారం భం కావ‌డంతో ఇక్కడ భారీ …

Read More »

చంద్ర‌బాబు పేరిట త‌ప్పుడు ప్ర‌చారం.. స్ట్రాంగ్ వార్నింగ్‌

ఏపీలో పోలింగ్ ప్ర‌క్రియ‌కు మ‌రికొన్ని గంట‌ల ముందు.. సంచ‌ల‌నం చోటు చేసుకుంది. కూట‌మి పార్టీల ముఖ్య నేత‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఈ ఎన్నికల్లో అనేక హామీలు సంధించారు. తాము అధికారంలోకి వ‌స్తే.. ప్ర‌జ‌ల‌కు సూప‌ర్ సిక్స్‌ పేరుతో సంక్షేమాన్ని అమ‌లు చేస్తామ‌న్నారు. వీటిలో ప్ర‌ధానంగా ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం.. మూడు సిలిండ‌ర్లు, పింఛ‌ను ను రూ.4000ల‌కు పెంపు, 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రైతులకు …

Read More »

జ‌గ‌న్ చేయాల్సిన ప‌ని.. బాబు చేస్తున్నారు..

ఏపీలో చిత్ర‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. శ‌నివారం సాయంత్రంతో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిపోవ‌డంతో నాయ‌కులు, పార్టీల అధినే త‌లు ఎక్క‌డిక‌క్క‌డ సేద దీరుతున్నారు. ఇది త‌ప్పుకాదు. 55 రోజుల పాటు నిర్విరామంగా ప్ర‌చారం చేసి.. ఎండ‌ల్లో మ‌ల‌మ‌ల మాడిన నాయ‌కుల‌కు ఇప్పుడు ఒకింత రిలాక్స్ అయ్యే చాన్స్ లభించింది. కానీ, ఇది ఇత‌ర పార్టీలు,నాయ‌కుల విష‌యంలో ఒకింత సేద‌దీరేందుకు అవ‌కాశం ల‌భించింద‌ని అనుకున్నా.. బాధ్య‌తా యుత‌మైన ముఖ్య‌మంత్రి(ఆప‌ద్ధ‌ర్మ కొవొచ్చు) స్థానంలో ఉన్న …

Read More »

పవన్‌కు ప్రాణం, జగన్‌కు ఓటు.. మారుతుందా?

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో యూత్‌లో పవన్‌కు ఉన్నది మామూలు క్రేజ్ కాదు. సినిమాల్లో సూపర్ స్టార్ ఇమేజ్ వల్ల పవన్ యువతలో భారీగా క్రేజ్ సంపాదించుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చాక కూడా యూత్‌లో తన క్రేజ్ ఉపయోగపడుతుందని ఆశించారు. కానీ పవన్‌ను చూడగానే వెర్రెత్తిపోయి కేకలు పెట్టే అభిమానులు.. ఎన్నికల్లో మాత్రం ఆయనకు ఆశించిన స్థాయిలో అండగా నిలవలేదు. ఈ విషయమై పవన్‌ స్వయంగా ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తం చేశారు. …

Read More »

జగన్‌ సీట్లపై పీకే లేటెస్ట్ అంచనా

ఆంధ్రప్రదేశ్‌లో గత పర్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ 151 సీట్లతో ఘనవిజయం సాధించడంలో ఆ పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిశోర్ పాత్ర కూడా కీలకమే. ఆయన వ్యూహాలను అనుసరించే ఎన్నికల్లో పోటీ పడింది వైసీపీ. చంద్రబాబు ప్రభుత్వం మీద జనాల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచడంలో, వైసీపీ గ్రాఫ్ పెరగడంలో పీకే అండ్ టీం వేసిన ప్రణాళికలు బాగా పని చేశాయి. ఐతే అప్పట్లో ఐప్యాక్ టీంకు ప్రశాంత్ కిశోరే …

Read More »