ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికలకు 14 నెలలే ఉందని, గడప గడపకు కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని ఎమ్మెల్యేలకు, పార్టీ శ్రేణులకు ఆయన హితబోధ చేశారు. కార్యక్రమాన్ని ఆషామాషీగా నిర్వహిస్తే ఊరుకోబోనని కుండబద్దలు కొట్టారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనని కొందరు ఎమ్మెల్యేలపై సీఎం జగన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తిరగని వారు, తక్కువ రోజులు …
Read More »కళా వెంకట్రావుకు ఉత్తరాంధ్ర బాధ్యతలు ?
బీసీలు ఎక్కువగా ఉండే ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేసే దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం కాకలు తీరిన రాజకీయ యోధుడు కళా వెంకట్రావుకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం అందుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు తన పని చేసుకుపోతుండగా ఆయన్ను డిస్టర్బ్ చేయకుండా కొన్ని పనులను కళా వెంకట్రావుకు అప్పగించారు. ఉత్తరాంధ్రలో టీడీపీ ఇప్పుడు సామాజికవర్గం లెక్కలు చూస్తోంది. కాపు వర్గాలను పూర్తిగా తమ …
Read More »ఎల్టీటీఈ ప్రభాకరన్ బతికే ఉన్నాడా ?
శ్రీలంకలో తమిళుల కోసం 1980లలో ఏర్పడిన మిలిటెంట్ సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ). తమిళనాడులో తమిళ వీరాభిమానులంతా ఎల్టీటీఈకి మద్దతిచ్చేవారు. 1991 ఎన్నికల ప్రచారంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య తర్వాత ఎల్టీటీఈ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడినా తమిళ అభిమానులు మాత్రం ఆ ఉగ్రవాద సంస్థకు మద్దతిస్తూనే ఉన్నారు.. ఇప్పుడు నెడుమారన్.. తమిళనాడులో నెడుమారన్ అనే నాయకుడు ఉన్నారు.తొలినాళ్లలో ఆయన కాంగ్రెస్ లో …
Read More »సజ్జల కుమారుడి డామినేషన్ కూడా పెరిగిపోయిందా…!
ఏపీ అధికార పార్టీలో నెంబర్ 2గా ఉన్న ప్రభుత్వ సలహాదారు విషయంలో వైసీపీ ఎమ్మెల్యేలు.. మంత్రు లు తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఒకరిద్దరు అయితే బాహాటంగానే ఈ విషయాన్ని చెప్పు కొచ్చారు. తమకు ఎలాంటి స్వేచ్ఛ లేదని.. తాము ఏం చేయాలన్నా.. కాళ్లు చేతులు కట్టేసినట్టు ఉంటోం దని కూడా వారు వాపోయారు. దీనికి కారణం.. సలహాదారు సజ్జలేనన్న ఎమ్మెల్యేల అభిప్రాయం. ఇటీవల ఉమ్మడి ప్రకాశం జిల్లాకు …
Read More »వైసీపీలో చేరిన కైకలూరు టీడీపీ అభ్యర్థి
టీడీపీ పుంజుకొంటోందని ఆ పార్టీ నేతలంతా బలంగా నమ్ముతున్న సమయంలో కీలక నేత ఒకరు ఆ పార్టీని వీడడం సంచలనంగా మారింది. ఎమ్మెల్సీ పదవి హామీ కైకలూరు టీడీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ వైసీపీలో చేరారు. టీడీపీలో తనకు టికెట్ రాదేమోనన్న అనుమానంతో ఉన్న ఆయనకు వైసీపీలో ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేయడంతో వెంటనే పార్టీ ఫిరాయించినట్లు తెలుస్తోంది. పార్టీ కీలక నేత నారా లోకేశ్ …
Read More »రాజ్యసభలో రంగా పేరు.. జీవీఎల్ ఏమన్నారంటే!
ఇదొక అనూహ్య పరిణామం. ఎవరూ ఊహించని ఘటన. ఇప్పటి వరకు కనీసం పేరు కూడా ఎత్తని నాయకుడి గురించి.. ఏకంగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు.. ఏకంగా రాజ్యసభలోనే దివంగత వంగవీటి మోహన రంగా గురించి సుమారు 4 నిమిషాల పాటు మాట్లాడారు. ఏకధాటిగా ఆయన చేసిన ప్రసంగం ఆద్యంతం ఆసక్తిగా ఉండడంతోపాటు.. అందరినీ ఆశ్చర్యానికి కూడా గురి చేసింది. ఇంతకీ.. జీవీఎల్ ఏమన్నారంటే.. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా-మచిలీపట్నం …
Read More »కైకలూరు టీడీపీలో కుంపటి.. కీలక నేత జంప్?
వచ్చే ఎన్నికల్లో విజయం కోసం పోరాడుతున్న టీడీపీకి పంటి కింద రాళ్ల మాదిరిగా పరిస్థితులు ఇబ్బంది పెడుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో 175 చోట్ల విజయం దక్కించుకుంటామని.. నాయకులు చెబుతున్నారు. అయితే.. ఈ క్రమంలో జనసేనతో పొత్తు పెట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయని క్లూ ఇస్తున్నారు. దీంతో జనసేనతో పొత్తు పెట్టుకుంటే.. తమకు ఎక్కడ పోటీకి అవకాశం లేకుండా పోతుందనని భావిస్తున్న టీడీపీ నేతలు తమ …
Read More »మోడీ గెలిచారు.. ప్రజలు ఓడారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోడీ అంటే చాలు.. మండిపడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్, అవకాశం దక్కితే చాలు విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా అసెంబ్లీ వేదికగా కేసీఆర్.. మోడీపై విరుచుకుపడ్డారు. సుమారు గంటా 20 నిమిషాల పాటు మాట్లాడిన కేసీఆర్.. ప్రతి విషయంలోనూ మోడీని టార్గెట్ చేశారు. కేసీఆర్ వ్యాఖ్యల్లో కీలకమైనవి చూస్తే.. మోడీ గెలిచారు.. కానీ, ప్రజలు ఓడారు.. అనే కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. …
Read More »రా.. రా.. రాజేందర్….
ఈటల రాజేందర్ చాలా రోజులుగా ఫైర్ బ్రాండ్. హుజురాబాద్ వీరుడిగా అందరికీ పరిచితుడు. కేసీఆర్ తో విభేదించి మంత్రి పదవినే వదులుకున్న నేత. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కేసీఆర్ ఎంత ప్రయత్నించినా ఓడించలేని నాయకుడాయన. బీజేపీలో కూడా రాజేందర్ ఉక్కపోతను ఎదుర్కొంటున్నారన్న చర్చ జరుగుతోంది. రాజేందర్ పయనమెటు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసెంబ్లీలో పదే పదే ప్రస్తావన తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా …
Read More »జగన్ ప్రభుత్వం దివాలా దీసింది.. ఈ మాట ఎవరన్నారంటే!
ఏపీలోని జగన్ ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. న్యాయవ్యవస్థలో పనిచేసిన మాజీ న్యాయమూర్తుల నుంచి ప్రజాస్వామ్య వాదుల వరకు కూడా ప్రతి ఒక్కరూ సీఎం జగన్ సర్కారుపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవ్‌సింహ్ చౌహాన్ సైగా సీఎం జగన్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వం దివాలా తీసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పాలన …
Read More »మళ్లీ కామెడీ అయిపోయిన ఏపీ ఐటీ మంత్రి
ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఈ మధ్య కామెడీకి కేరాఫ్ అడ్రస్ అయిపోతున్నారు. ముఖ్యంగా ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసే కామెడీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏదో ఒక కామెంట్‌తో వారంలో ఒక్కసారైనా సోషల్ మీడియాలో ట్రెండ్ కాకుండా ఉండరు ఆయన. కొన్ని రోజుల కిందటే దావోస్ ఫినాన్షియల్ సమ్మిట్‌కు ఏపీ ప్రభుత్వం నుంచి ఎవరూ వెళ్లకపోవడంపై స్పందిస్తూ.. అక్కడ చలి ఎక్కువని, పెట్టుబడి దారుల్నే ఇక్కడికి రప్పిస్తామని అమర్నాథ్ …
Read More »టీడీపీ కంచుకోటల్లో ఫ్యాన్ రివర్స్‌లో తిరుగుతోందా…!
రాష్ట్రంలో టీడీపీ కంచుకోటలు సుమారు 50 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 50 నియోజకవర్గాల్లో దాదాపు 35 నుంచి 40 స్థానాల్లో పార్టీ ఓటమి పాలైంది. గత ఎన్నికల్లో గెలుపు అంచుల వరకు కూడా వచ్చి వీరంతా ఓడిపోయారు. ఇక, వచ్చే ఎన్నికలను దృష్టిలోపెట్టుకుంటే.. ఈ కంచుకోటలు పదిలమేనా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. ముఖ్యంగా కీలకమైన స్థానాల్లో గెలుపు ప్రభావం ఎలా ఉంది? అనేది కూడా …
Read More »