పదవి దక్కినా.. ఫలితం లేకుండా పోయిందట.. ప్రముఖ సినీ హాస్య నటుడు అలీకి! ఆది నుంచి కూడా వైసీపీకి మద్దతు దారుగా నిలిచిన అలీ.. అందరిలాగానే.. తాను కూడా రాజకీయంగా ఒక మెట్టు ఎదగాలని కోరుకున్నారు. అందుకే గత రెండు ఎన్నికల్లోనూ టికెట్ ఆశించారు. కానీ, ఆయనకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. ఇక, గత ఏడాది టికెట్ల వివాదం తలెత్తినప్పుడు.. ఇండస్ట్రీలో కొందరిని కంట్రోల్ చేసే బాధ్యతను ఆయన తీసుకున్నారు. …
Read More »17న కేసీఆర్ సంచలన ప్రకటన.. ముందస్తు ఖాయం?
తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తాజాగా కేబినెట్ సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్.. చూచాయగా.. ఒక కీలక విషయాన్ని మంత్రులకి చెప్పేసినట్టు ప్రగతి భవన్ వర్గాలు గుసగుసలాడుతున్నా యి. ముందస్తుకు వెళ్లిపోదామని.. కేసీఆర్ చెప్పినట్టు కీలక మంత్రికి సంబంధించిన పీఏ ఒకరు మీడియాకు లీకు చేసినట్టు సమాచారం. ఈ ప్రకటన ఈ నెల 17న జరగనున్న సచివాలయ ప్రారంబోత్సవం, అనంతరం సికింద్రాబాద్ లో నిర్వహించే బీఆర్ ఎస్ మూడో విడత …
Read More »కేసీఆర్‌తో జగ్గారెడ్డి భేటీ.. హీట్ పెంచేసిన పాలిటిక్స్
తెలంగాణ రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటున్నాయో.. చెప్పడం కష్టంగా ఉంది. ఇటీవల కాలంలో బీఆర్ఎస్‌ను డెవలప్ చేసేందుకు ఉన్న అన్ని మార్గాలనూ కేసీఆర్ ఎంచుకుంటున్నారు. అదే సమయంలో బీజేపీ కూడా తనదైన శైలిలో దూసుకుపోతోంది. ఇక, కాంగ్రెస్ కూడా తన దారిలో తాను ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. హాత్ సే హాత్ కార్యక్రమం జోరుగా నిర్వహిస్తోంది. మరి ఆయా పార్టీలు అలా ప్రయత్నం చేస్తున్న సమయంలో అనూహ్యంగా కాంగ్రెస్ …
Read More »బాబు మాట్లాడితే తప్పు.. జగన్ మాట్లాడితే ఒప్పా.. సజ్జల సర్!!
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని అమరావతి విషయంపై ప్రెస్‌మీట్ పెట్టి సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. విభజన చట్టం ప్రకారమే తాము అమరావతిని ఏర్పాటు చేశామని.. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వచ్చి శంకుస్థాపన కూడా చేశారని.. అలాంటి దానిని సర్వనాశనం చేశారని.. ఆయన జగన్ పై విరుచుకుపడ్డారు. అంతే కాదు.. ఇక్కడి రహదారులను కూడా తవ్వేస్తున్నారని అన్నారు. అయితే.. దీనిపై తాజాగా కౌంటర్ ఇచ్చిన ప్రభుత్వ సలహాదారు …
Read More »సునీల్ కుమార్ పై చర్యలు.. రాజుగారు సంభరాలు
ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఆయనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి చర్యలు తీసుకుని, నివేదిక సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంబేద్కర్ ఇండియా మిషన్ పేరుతో ఒక వేదక ఏర్పాటు చేసిన సునీల్ కుమార్ విద్వేషపూరిత ప్రసంగాలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని కేంద్రం ఆదేశించింది. చర్యల నివేదిక (యాక్షన్ టేకెన్ రిపోర్టు)ను తమకు సమర్పించాలని కూడా ఉత్తర్వులిచ్చింది. వైసీపీ …
Read More »విభజన చట్టం కన్నా.. జగనే ప్రమాదకారి
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. జగన్‌కి రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదని, సీఎం వైఖరి, ఆయన చేస్తున్న విధ్వంసాన్ని సరిచేయడం రాజ్యాంగ సంస్థలకూ కష్టంగా మారిందన్నారు. సైకో చేతిలో రాష్ట్ర రాజధాని ఉందని ధ్వజమెత్తారు. లేని అధికారాన్ని ఆపాదించుకుని రాజ్యాంగంపై చేసిన ప్రమాణానికి విరుద్ధంగా జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విభజన చట్టం సెక్షన్ 5లో రాజధానిపై స్పష్టంగా పేర్కొన్నా… 3రాజధానుల నిర్ణయం తీసుకున్నారని చంద్రబాబు …
Read More »గుర్తు చేసుకుంటారు..భారత రత్న మాత్రం ఇవ్వరు…
నందమూరి తారక రామారావు… ఆ పేరే ప్రభంజనం. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారానికి వచ్చిన రికార్జు ఎన్టీఆర్ మాత్రమే సాధించారని చెప్పకతప్పదు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దశదిశలా వ్యాపింపజేసిన ధీరోదాత్తుడు మన ఎన్టీఆర్. పేద, బీసీ, బడుగు వర్గాల కోసం ఎన్టీఆర్ కృషి చేశారు. మోదీ నోట ఎన్టీఆర్ మాట ఎన్టీఆర్ పరమపదించి 27 సంవత్సరాలైనా ఇంకా ఆయన మన హృదయాల్లో ఉన్నారు. బుధవారం పార్లమెంటులో ప్రధాని మోదీ …
Read More »తాళి కట్టమంటే ఎత్తుకుపోయే రకం.. జగనన్నా
వైసీపీ ఎమ్మెల్యే, ఇటీవల రెబల్‌గా మారిన నెల్లూరు రూరల్ నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తర్వాత.. రూరల్ నియోజకవర్గానికి వైసీపీ ఇంచార్జిగా నియమితులైన ఆదాల ప్రభాకర్‌రెడ్డిని నమ్మొద్దంటూ.. ఆయన సీఎం జగన్‌కు విన్నవించారు. ఆదాలను నమ్మొద్దు జగనన్నో! అని కామెంట్ చేశారు. తాను మళ్లీ వైసీపీ నుంచి పోటీచేయడంలేదని స్పష్టం చేశారు. తన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు …
Read More »యువగళంను పోలీసులు వదలడం లేదుగా!
టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో సేమ్ సీన్లు రిపీట్ అవుతూనే ఉన్నాయి. పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం 15వ రోజుకు చేరుకున్న యువగళం పాదయాత్రను అడుగడుగునా నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు రోజుల కిందట లోకేష్ కొద్ది సేపు కూర్చుని సేద దీరేందుకు ఏర్పాటు చేసుకున్న స్టూల్ సహా సౌండ్ బాక్సుల వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికీ ఇవ్వలేదు. దీంతో …
Read More »ఆ ఇద్దరు మంత్రులకు జగన్ ప్రత్యేక క్లాస్
ఏపీ కేబినెట్ తాజాగా జరిగింది. అయితే.. కేబినెట్ సమావేశం జరిగిన తర్వాత అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుంది. మంత్రులు బయటకు వెళుతున్న వేళ.. ఇద్దరు మంత్రుల్ని ప్రత్యేకంగా తన వద్దకు పిలిపించుకున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా క్లాస్ పీకిన వైనం ఇప్పుడు అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇద్దరు మంత్రులు తమ శాఖల పనుల కంటే తమ పక్కనున్న నియోజకవర్గాల్లో …
Read More »సర్వేలు తేలుస్తున్నాయ్.. సర్దుకుంటున్న ఎమ్మెల్యేలు?
ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో సర్వేలు గుబులు రేపుతున్నాయ్. పార్టీ పరంగా చేయిస్తున్న సర్వేలు.. ఎమ్మె ల్యేలకు కంటిపై కునుకు లేకుండా చేసున్నాయి. ఈ క్రమంలో ఒకవైపు.. ప్రజల నుంచి వ్యతిరేకత.. మరో వైపు.. పార్టీలో టికెట్ దక్కుతుందో లేదో.. అనే ఆవేదన ఈ రెండింటి మధ్య ఎమ్మెల్యేలు నలిగిపోతున్నార ని అనుకుంటున్నారా? అదేమీ లేదు. చాలా చక్కగా వారు చేయాల్సింది వారు చేసేస్తున్నారు. నియోజకవర్గంలోని మండలస్థాయిల నుంచి గ్రామీణ …
Read More »లోకేష్‌ను టెన్షన్ పెట్టేస్తోన్న రెండు విషయాలు..
టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 15 రోజులకు చేరిం ది. ఇప్పటికీ చిత్తూరు జిల్లాలోనే ఈ యాత్ర సాగుతోంది. ఇది టీడీపీకి ఒకప్పుడు బలమైన జిల్లా. గత ఎన్ని కల్లో కొంత తేడా కొట్టింది. అయినప్పటికీ.. పార్టీ పుంజుకునే పరిస్థితికి వచ్చింది. యాత్రకు కూడా ప్రజల నుంచి జోరుగా మంచి స్పందన లభిస్తోంది. అయితే.. ఇప్పుడు యాత్రలో ఉన్న నారా లోకేష్‌ను …
Read More »