Political News

కేంద్రంలో పెరిగిపోతున్న 4వ తేదీ టెన్షన్

జనవరి 4వ తేదీ దగ్గర పడుతున్నకొద్దీ కేంద్రప్రభుత్వంలో టెన్షన్ పెరిగిపోతోంది. ఎందుకంటే రైతుసంఘాలతో చర్చలకు నిర్ణయమైన తేదీ 4వ తేదీనే కాబట్టి. కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతుసంఘాలు గడచిన 38 రోజులుగా జరుగుతున్న ఉద్యమం అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని కావాలంటే సవరణలు మాత్రం చేస్తామని ప్రదానమంత్రి నరేంద్రమోడి తెగేసి చెప్పారు. ఈ కారణంగానే ఇటు …

Read More »

బాలయ్య డైలాగ్‌తో హైదరాబాద్ పోలీసుల పంచ్

నీట్‌గా నీతులు చెబితే ఈ తరం యువతకు ఎక్కదు. వాళ్లు పట్టించుకోరు. కొంచెం ఎంటర్టైన్మెంట్ జోడించి, ట్రెండీగా చెబితేనే విషయం వాళ్ల బుర్రల్లోకి వెళ్తుంది. ఈ విషయాన్ని బాగానే అర్థం చేసుకున్న హైదరాబాద్ పోలీస్ వర్గాలు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను నడిపే తీరు నెటిజన్లను ఆకట్టుకుంటూ ఉంటుంది. సినిమాలు, క్రికెట్ లాంటి యువతకు నచ్చే అంశాలతో ముడిపెట్టి తాము చెప్పాలనుకున్న విషయాల్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేస్తుంటారు. …

Read More »

ఆలయ ఆస్తుల ధ్వంసానికి జగన్ బాధ్యత వహించాలి: పవన్

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామతీర్థంలోని చారిత్రక రామాలయంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసం ఘటన పెను ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. రామతీర్థం ఘటన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో ప్రభుత్వం, పోలీసుల తీరు వివాదాస్పమైంది. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ విమర్శలు గుప్పించారు. ధర్మం విచ్ఛిన్నానికే శ్రీరామచంద్ర మూర్తి విగ్రహాలను దుండగులు ధ్వంసం చేస్తున్నా జగన్ సర్కార్ నిమ్మకు నీరెత్తిన …

Read More »

బీజేపీలో చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తెలంగాణలో బల్దియా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి అనంతరం టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొత్త టీపీసీసీ చీఫ్ ఎవరన్నదానిపై కాంగ్రెస్ లోని సీనియర్ నేతలు మల్లగుల్లాలు పడ్డారు. టీపీసీసీ చీఫ్ రేసులో రేవంత్ రెడ్డి ముందుండగా….మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి తర్వాతి స్థానంలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే, కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ వైపు మొగ్గు …

Read More »

జేడీయులో ముసలం..17 మంది ఎంఎల్ఏల తిరుగుబాటు ?

బీహార్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అదికార ఎన్డీయేలోని జేడీయుకి చెందిన 17 మంది ఎంఎల్ఏలు తిరుగుబాటు బాటలో ఉన్నట్లు రాజకీయాల్లో గుప్పుమన్నాయి. ఆర్జేడీ సీనియర్ నేత శ్యామ్ రాజక్ మాట్లాడుతూ నితీష్ కుమార్ పై తిరుగుబాటు చేయటానికి 17 మంది ఎంఎల్ఏలు సిద్దంగా ఉన్నట్లు చేసిన ప్రకటన బీహార్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. నిజంగానే 17 మంది ఎంఎల్ఏలు నితీష్ పై తిరుగుబాటు చేస్తారా ? లేదా ? …

Read More »

జగన్ లేఖపై జస్టిస్ రమణ వివరణ కోరిన సీజేఐ బొబ్డే

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఏపీ సీఎం జగన్ చేసిన అవినీతి ఆరోపణలు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. న్యాయవ్యవస్థ పరంగా జగన్ లేఖ సంచలనం రేపింది. దేశపు అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డేకి జగన్ లేఖ రాయడం చర్చనీయాంశమైంది. అందులోనూ, బాబ్డే తర్వాత సీజేఐ రేసులో ఉన్న జస్టిస్ రమణపై తీవ్ర ఆరోపణలు చేస్తూ జగన్ లేఖ రాయడం కలకలం …

Read More »

మీడియా ముందు వీహెచ్ పప్పులుడకలేదా ?

నోటికొచ్చినట్లు మాట్లాడేయటం తర్వాత సీన్ రివర్సవ్వగానే మీడియా తన మాటలను వక్రీకరించిందని గోల చేయటం నేతలకు బాగా అలవాటైపోయింది. ఒకపుడు ప్రింట్ మీడియా మాత్రమే ఉన్న కాలంలో అయితే తాము ఏమి చెప్పినా తర్వాత ఎంత అడ్డం తిరిగినా నేతలకు చెల్లుబాటయ్యేది. కానీ ఇపుడు టీవీ ఛానళ్ళు వచ్చేసిన తర్వాత నేతలు మాట్లాడే ప్రతి మాట ఆడియో, వీడియోతో సహా రికార్డయిపోతోంది. కాబట్టి నోటికొచ్చింది మాట్లాడేసి తర్వాత అడ్డం తిరిగి …

Read More »

ఇంతకీ రజినీ ఎవరి వైపు?

‘‘ఓన్లీ రజినీకాంత్ ఎగ్జిట్ పాలిటిక్స్ వితౌట్ ఎంటరింగ్ ఇట్’’.. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్న జోక్ ఇది. తాను రాజకీయాల్లోకి రావడం గురించి ఎప్పట్నుంచో ఊరిస్తున్న రజినీ.. ఇదిగో ఇదిగో అంటూనే చివరికి తన అభిమానులకు తీవ్ర నిరాశ మిగిల్చారు. తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రాజకీయాల్లోకి రావొద్దని ఆయన నిర్ణయించుకున్నారు. ఇందుకుగాను అభిమానులను క్షమాపణ కూడా కోరారు. కొంతమంది అభిమానులు పరిస్థితిని అర్థం చేసుకున్నారు కానీ.. …

Read More »

రజనీ నిర్ణయంతో హ్యాపీగా ఫీలవుతున్నారట

పొలిటికల్ ఎంట్రీ నుండి రజనీకాంత్ బ్యాక్ స్టెప్ వేయటం వల్ల మిగిలిన రాజకీయపార్టీలు చాలా హ్యాపీగా ఫీలవుతున్నాయట. పార్టీల్లో కూడా ముఖ్యంగా డీఎంకే నేతలు మాత్రం ఫుల్లుగా ఖుషీగా ఉన్నారు. ఎందుకంటే తమిళనాడులో మే లో షెడ్యూల్ ఎన్నికలు జరగాలి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమదే విజయం అన్నంత ఊపులో ఉన్నారు డీఎంకే నేతలు. ఇలాంటి సమయంలో హఠాత్తుగా కొత్త రాజకీయపార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు రజనీకాంత్ చేసిన ప్రకటన …

Read More »

వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా సోకింది

కాలిఫోర్నియాలో కరోనా వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత కూడా ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకటం సంచలనంగా మారింది. కాలిఫోర్నియాలోని రెండు ఆసుపత్రుల్లో డబ్య్లూ. మాథ్యూస్ నర్సుగా పని చేస్తున్నారు. డిసెంబర్ 18వ తేదీన మాథ్యూస్ కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా మొదటి డోసు తీసుకున్నారు. టీకా వేయించుకున్న చేతిపై కాస్త ఎర్రగా అవటం తప్ప మరే సమస్య ఎదురుకాలేదని అనుకున్నారు. అయితే టీకా వేయించుకున్న ఆరు రోజులకు సరిగ్గా క్రిస్తిమస్ …

Read More »

జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు

తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పై దాఖలైన డిక్లరేషన్ కేసును హైకోర్టు కొట్టేసింది. ఈమధ్యనే తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఆ సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండానే స్వామివారి ఆలయంలోకి ప్రవేశించారంటూ గోల మొదలైంది. ఈ విషయంపై జగన్ తో పాటు మంత్రులు కొడాలినాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఈవో అనీల్ కుమార్ సింఘాల్, టీటీడీ ట్రస్టుబోర్డు ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డిలను పదవుల నుండి తొలగించాలంటు …

Read More »

ఫుల్లుగా క్లాసు పీకితే కానీ కదలరా ?

అనంతపురం జిల్లాలో తెలుగుదేశంపార్టీ నేతల గురించి ఇపుడిదే అనుకుంటున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ బ్రదర్స్ కు వైసీపీ ఎంఎల్ఏ కేతిరెడ్డి పెద్దారెడ్డికి మధ్య పెరిగిపోతున్న గొడవలు అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఈనాటివి కావు సర్దుబాటు అవ్వటానికి. అలాంటిది నాలుగు రోజుల క్రితం జేసీ ఇంటి మీదకు ఎంఎల్ఏ హఠాత్తుగా దాడి చేశారు. ఆ సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ కొడుకు అస్మిత్ రెడ్డి కానీ ఇంట్లో …

Read More »