ఆయన పార్టీ అధినేత కొడుకు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన యువ నాయకుడు. ఇంతకాలం తండ్రి చాటు బిడ్డడిగానే కనిపించారు. తండ్రి పై కోపంతో ప్రత్యర్థులు ఆయనకు పెట్టిన పేరు పప్పు. ఎవరెన్ని మాట్లాడినా, ఎవరేం చేసినా సహనమే సొంత ఆయుధంగా ఆయన ముందుకు సాగారు. ఇప్పుడు యువగళం పాదయాత్ర ప్రారంభించి నెల దాటిన నేపథ్యంలో నారా లోకేష్ పరిణితి చెందిన రాజకీయ నాయకుడిలా కనిపిస్తున్నారు. పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి …
Read More »చేసిన మంచి పనులే చిరస్థాయిగా….
పార్టీలు వస్తాయి..పోతాయి…సీఎంలు వస్తారు..పోతారు.. చాలా మంది కాలగర్భంలో కలిసిపోతారు. కొందరు మాత్రమే చిరస్థాయిగా నిలిచిపోతారు. మన తన అన్న భేదం లేకుండా సహాయం చేసే వారే ఎక్కువ కాలం ప్రజల నోళ్లలో నలుగుతారు… అలాంటి వారిలో చంద్రబాబు ఒకరిని ఇటీవల జరిగిన ఘటన నిరూపిస్తోంది.. పీలేరు నియోజకవర్గం చింతలవారిపల్లి మాజీ సర్పంచ్ అశోక్ ఒకప్పుడు వైసీపీకి కొమ్ముకాశారు. టీడీపీని అనరాని మాటలు అన్నారు. జగన్ పాదయాత్ర సందర్భంగా బ్యానర్లు తెస్తూ …
Read More »‘ఎమ్మెల్సీ’ ఎన్నికలు జగన్ ఫ్యూచర్ తేల్చేస్తాయా?
ఏపీలో వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పోలింగ్‌ను పక్కన పెడితే.. పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు వైసీపీకి ప్రాణసంకటంగా మారాయి. ఇప్పటివరకు ఇలాంటి ఎన్నికల్లో ఆయా వర్గాలు.. అంటే టీచర్లు, పట్టభద్రులు మాత్రమే ప్రచారం చేస్తారు. పోటీలోనూ వారే ఉంటారు. అయితే.. ఇప్పుడు దీనికి భిన్నంగా అటు వైసీపీ, ఇటు టీడీపీ కూడా …
Read More »రాధాకు హామీ లభించిందా ?
వంగవీటి రాధాకృష్ణకు హామీ లభించిందా ? పార్టీవర్గాల్లో ఇపుడీ విషయమీదే చర్చ జరుగుతోంది. ఈనెల 14వ తేదీన జనసేనలో చేరటానికి రాధా ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. అలాంటిది హఠాత్తుగా మంగళవారం ఉదయం పాదయాత్రలో ఉన్న నారాలోకేష్ ను రాధా కలిశారు. ముందు పాదయాత్రలో పాల్గొన్న రాధా తర్వాత భోజన విరామ సమయంలో లోకేష్ తో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. పార్టీవర్గాల …
Read More »తమ్ముళ్ళపై నిఘా పెంచుతున్న చంద్రబాబు
తెలంగాణాలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్నది చంద్రబాబునాయుడు ఆలోచన. ఇందులో భాగంగానే ఆర్ధికంగా అత్యంత పటిష్టంగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ కు పార్టీ పగ్గాలను అప్పగించారు. తెలంగాణాలోని ఖమ్మంలో భారీఎత్తున బహిరంగసభ నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలనే ఉద్దేశ్యంతో అనేక కార్యక్రమాలను అమలు చేయిస్తున్నారు. కార్యక్రమాల్లో తమ్ముళ్ళు సరిగా పాల్గొంటున్నారా లేదా కార్యక్రమాలతో జనాల్లోకి నేతలు వెళుతున్నారా లేదా అనే విషయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇవి సరిపోవన్నట్లు కార్యక్రమాల అమలు, …
Read More »కవితకు ఈడీ నోటీసులు
అనుకున్నట్లే జరుగుతోంది. కల్వకుంట్ల కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గతంలో సీబీఐ ఆమెను ప్రశ్నిస్తే ఇప్పుడు ఈడీ ఆమె వెంట పడుతోంది. గురువారం ఢిల్లీలో విచారణకు రావాలని ఈడీ అధికారులు కవితకు నోటీసులు జారీ చేశారు. లిక్కర్ స్కాంలో కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్టు తర్వాత కవితకు సమన్లు ఖాయమని భావించారు. ఇప్పుడు అదే జరిగింది. కవితకు తాను బినామీనని పిళ్లై అంగీకరించిన నేపథ్యంలో …
Read More »కోడికత్తి కనిపించలేదట
వినటానికే విచిత్రంగా ఉంది ఈ విషయం. 2018లో విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కోడికత్తి దాడి కేసులో కత్తే కీలకమైన సాక్ష్యం. అలాంటిది విచారణలో అసలు కత్తే కనిపించలేదని కోర్టు గుర్తించటం మరింత ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇంతకీ విషయం ఏమింటే జగన్ పై కోడికత్తితో జరిగిన దాడి కేసు విచారణ మంగళవారం జరిగింది. ఈ కేసును ఎన్ఐఏ విచారిస్తోంది. విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో విచారణ మొదలైనపుడు దాడికి సంబందించి …
Read More »రామ్ మాధవ్ ఏమయ్యారు?
దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నా ప్రభుత్వ పదవులు కానీ చట్టసభల్లో స్థానం కానీ కోరుకోకుండా పనిచేసే నాయకులున్న రాజకీయ పార్టీ అంటే ఒక్క బీజేపీయే. ఆ పార్టీలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ కాకుండా… నామినేటెడ్ పోస్టులు కూడా చేపట్టకుండా కేవలం పార్టీ పదవుల్లో ఉంటూ పార్టీ కోసం అహోరాత్రులు పనిచేసే నాయకులు బీజేపీలో వేలాదిమంది ఉంటారు. వారిలో జాతీయ స్థాయిలో పనిచేసేవారూ ఉంటారు. …
Read More »యువగళంలో వంగవీటి రాధా
టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలో కొనసాగుతున్న ఈ పాదయాత్రకు టీడీపీ నేతల నుంచి మంచి స్పందన వస్తోంది. యువ నాయకులు అందరూ నారా లోకేష్‌తో కలిసి అడుగులు వేస్తున్నారు. తాజాగా విజయవాడకు చెందిన యువ నాయకుడు, టీడీపీ నేత వంగవీటి రాధా కృష్ణ కూడా నారా లోకేష్‌తో పాదాలు కలిపారు. …
Read More »ఉద్యోగ సంఘాల టైమింగ్ అదుర్స్
తొందరలో జరగబోతున్న ఎంఎల్సీ ఎన్నికలపై ఉద్యోగుల దెబ్బ తప్పదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈనెల 13వ తేదీన ఐదు ఎంఎల్సీ స్ధానాలకు ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. సరిగ్గా అదును చూసుకుని తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యోగసంఘాల నేతలు ఆందోళనలకు పిలుపిచ్చారు. ఈ ఆందోళనలు 9వ తేదీ నుంచి మొదలవ్వబోతున్నాయి. నేపధ్యంలోనే ఎంఎల్సీ ఎన్నికలపై ఉద్యోగుల ఆందోళన ప్రభావం ఎంతుంటుందనే విషయమై ఉత్కంఠ పెరిగిపోతోంది. మూడు గ్రాడ్యుయేట్, రెండు …
Read More »ఏపీ అప్పుల లెక్క తేల్చుతున్న కేంద్రం
ఆంధ్రప్రదేశ్ అప్పుల లెక్కలను కేంద్రం సేకరిస్తోంది. ఈ మేరకు రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక శాఖ నుంచి లేఖ చేరింది. అందులో వారికి కావాల్సిన వివరాలు అడిగారు. రాజ్యసభలో ఏపీ అప్పులపై ప్రశ్న రావడంతో అందుకు సమాధానం ఇచ్చేందుకు గాను కేంద్రం ఈ వివరాలు సేకరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ జరిగిన 2014 నుంచి వివరాలు చెప్పాలంటూ రాజ్యసభలో ఒక సభ్యుడి నుంచి ప్రశ్న రావడంతో అందుకు సంబంధించిన వివరాలు ఇచ్చేందుకు కేంద్రం …
Read More »నో ఫ్యామిలీ ప్యాకేజీ
వచ్చే ఎన్నికల్లో ఫ్యామిలీ ప్యాకేజీలకు నో చెప్పాలని కేసీయార్ గట్టి నిర్ణయం తీసుకున్నారట. నియోజకవర్గాల్లో పట్టుందన్న కారణంగా ఒకే కుటుంబంలో రెండు టికెట్లు అడుగుతున్న చాలామంది సీనియర్లకు తన తాజా నిర్ణయంతో కేసీయార్ చెక్ పెట్టినట్లు పార్టీలో టాక్ నడుస్తోంది. ఈ ఫ్యామిలీ ప్యాకేజీ విషయంలో అగ్రకులాలకు చెందిన సీనియర్ నేతలు ఎక్కవ ఒత్తిడి పెడుతున్నారట. ఒక నేతకు రెండు టికెట్లిస్తే మిగిలిన నేతలు కూడా అదే పద్దతిలో ఒత్తిడి …
Read More »