ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు? ఎవరు పాలన పగ్గాలు చేపడతారు? అనేది.. ఆసక్తికర విషయమే. ప్రజలు దీనికి సంబందించి తీర్పు చెప్పేశారు. తమను పాలించే వారిని ఎన్నుకొన్నారు. కేవలం ఫలితం మాత్రమే వేచి ఉంది. అది జూన్ 4న వ్యక్తమవుతుంది. జూన్ 9 నుంచి రాష్ట్రంలో కొత్త పాలన ప్రారంభం అవుతుంది. అయితే.. ఈ సారి ఏపీలో పాలన అంత ఈజీ అయితే కాదని అంటున్నరు పరిశీలకులు. దీనికి కారణం.. అనేక సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు.
ఇంటా.. బయటా.. కూడా.. ఏపీ పాలకులు.. ఇబ్బందులను అధిగమించాల్సిన అవసరం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ప్రధానంగా ప్రతిపక్షాలు చెబుతున్నట్టు 12 లక్షల కోట్ల అప్పులు ఏపీ భరిస్తోంది. దీనికి వడ్డీలు కట్టాలి. ఆదాయాన్ని పెంచుకునే మార్గాలకు ఇప్పుడు విత్తనాలు వేసినా.. అవి మొలకెత్తడా నికి రెండేళ్లయినా పడుతుంది. అప్పటి వరకు ఎదురీతతప్పదు. అప్పులకు వడ్డీలు కడుతూ.. కొత్త అప్పులు చేస్తే.. మరింతగా భారం పెరుగుతుంది.
ఇచ్చిన హామీలను అమలు చేయడం.. పార్టీలకు మరింత సంకటంగా మారింది. వైసీపీ వస్తే.. కొంతలో కొంత.. మెరుగే అయినా.. కూటమి వస్తే.. పింఛన్ల పెంపు నుంచి ప్రతినెలా మహిళలకు, నిరుద్యోగులకు.. ఇతర త్రా పథకాలు.. ఆర్టీసీ ప్రయాణం వంటివి బారీ సెగ పెట్టడం ఖాయమని అంటున్నారు. ఇక్కడ చిత్రం ఏంటంటే.. రాష్ట్రంలో కూటమి ప్రకటించిన సంక్షేమ పథకాలకు కేంద్రం నుంచి నిదులు వచ్చే పరిస్థితి ఏమాత్రం లేదు. పైగా.. ఉచితాలు తగ్గించుకోవాలని కేంద్రమే చెబుతోంది.
మరో కీలక విషయం..జూన్ 2తో ఉమ్మడి హైదరాబాద్ కాలం చెల్లుతుంది. అదేవిధంగా విభజన చట్టంలోని పలు వివాదాలను కూడా పరిష్కరించుకోవాల్సి ఉంది. వీటిని తెలంగాణతో ముడిపెడుతూ.. కేంద్రం అనే కసందర్భాల్లో చేతులు ఎత్తేసింది. సో.. ఇవి పరిష్కరించాల్సి రావడం.. పెద్ద సమస్య. వీటికితోడు.. నిరుద్యోగం.. ఉద్యోగ కల్పన వంటివి కొత్త ప్రభుత్వానికి ఇబ్బందే. ఈ విషయంలో గంపెడు హామీలు ఇచ్చిన కూటమికి.. అసలు హామీలు ఇవ్వని జగన్‌కు కూడా.. ఇబ్బందులు తప్పవు. సో.ఎలా చూసుకున్నా.. పాలన అయితే.. అంత ఈజీకాదు. అంత ఎంజాయ్ మెంటూ ఉండదు!!