Political News

సీఎం జ‌గ‌న్‌.. ఆ ఎమ్మెల్యేను కొట్టారంటూ తప్పుడు ప్రచారం

ఏపీ సీఎం జ‌గ‌న్ దూకుడు గురించి త‌ర‌చుగా వార్త‌లు వ‌స్తుంటాయి. ఆయ‌న కుటుంబ స‌భ్యుల్లో ఆయ‌న‌దే పైచేయి అని.. ఆయ‌న ఎవ‌రి మాట విన‌ర‌ని.. కూడా వార్త‌లు వ‌స్తుంటాయి. ఇక సోష‌ల్ మీడియాలో అయితే.. సీఎం జ‌గ‌న్ గురించిన చ‌ర్చ అంతా ఇంతా కాదు! ఇప్పుడు ఏకంగా.. ఆయ‌న ఒక ఎమ్మెల్యేను కొట్టారంటూ.. సోష‌ల్ మీడియాలో ఒక ఐటం.. తీవ్ర‌స్తాయిలో హ‌ల్చ‌ల్ చేస్తోంది. అయితే.. ఈ వార్త ఏపీలో కంటే.. …

Read More »

టీ కాంగ్రెస్ మార‌దు కాక మార‌దు..!

తెలంగాణ కాంగ్రెస్ ప‌రిస్థితి మ‌ళ్లీ మొద‌టికొచ్చింది. పార్టీ నేత‌ల తీరు ఇప్ప‌ట్లో మారేలా క‌నిపించ‌డం లేదు. కొంద‌రు నేత‌ల తీరుతో ఒక‌వైపు అంతా బాగున్న‌ట్లు అనిపిస్తుండ‌గా.. మ‌రోవైపు మ‌రికొంద‌రు నేత‌ల ప్ర‌వ‌ర్త‌న‌ అస్స‌లు మింగుడుప‌డ‌డం లేద‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. అధ్య‌క్షుడు రేవంత్ పార్టీ బ‌లోపేతానికి ప్ర‌య‌త్నిస్తుంటే.. కొంద‌రు నేత‌ల చ‌ర్య‌ల‌తో ప్ర‌జ‌ల్లో చుల‌క‌న అవుతున్న‌ట్లు పార్టీ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఒకానొక ద‌శ‌లో తెలంగాణ రాష్ట్ర స‌మితి దెబ్బ‌కు వ‌ల‌స‌ల‌తో …

Read More »

ఈ ఇద్దరు ఎటూ కాకుండా పోతారా ?

ఇపుడిదే విషయమై అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. జాతీయ స్ధాయిలో మారిపోతున్న రాజకీయ సమీకరణల్లో ఏపీ పాత్ర ఎక్కడా కనబడటం లేదు. ఎన్డీఏ, యూపీయేయేతర పార్టీలతో  కూటమి కట్టేందుకు ప్రయత్నాలు జోరందుకున్న విషయం అందరికీ కనబడుతోంది. ఒకవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మరోవైపు కేసీయార్ చాలా స్పీడు మీదున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ తదితరులతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు. …

Read More »

ఆదిపురుష్ సందడి అప్పుడేనా?

ప్రభాస్ కొత్త సినిమా ‘ఆదిపురుష్’ షూటింగ్  పూర్తయిపోవడం  చూసి అంతా షాకైపోయారు. ఇంత భారీ చిత్రాన్ని ప్రభాస్ ఇంత వేగంగా పూర్తి చేయడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. ‘రాధేశ్యామ్’ ఆలస్యమైనా.. ‘ఆదిపురుష్’ వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోందని సంతోషించారు ప్రభాస్ ఫ్యాన్స్. ముందు అన్న ప్రకారమే ఆగస్టు 11న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారని ఎగ్జైట్ అయ్యారు. మార్చి 11కు ‘రాధేశ్యామ్’ ఖరారైన నేపథ్యంలో ఐదు నెలల …

Read More »

కమెడియన్ అలీకి కీలక పదవిని అప్పజెప్పిన సీఎం జగన్

అంచనాలు తప్పు అయ్యాయి. రాజ్యసభ సీటు ఖాయమని కొందరు.. కాదు ఈసారి పద్మశ్రీ పురస్కారం ఖాయమని మరికొందరు.. ఇలా ఎవరికి తోచింది వారు అనుకుంటున్న వేళ.. తనకు అత్యంత విధేయుడు.. మద్దతుదారు అయిన సినీ నటుడు కమ్ కమెడియన్ అలీకి కీలక బాధ్యతలు అప్పచెబుతూ నిర్ణయం తీసుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో …

Read More »

కూట‌మి కుదిరినా.. కేసీఆర్ ప్ర‌ధాని కాలేరా?

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్ర‌క‌టించిన కేసీఆర్‌.. అందుకు మిగ‌తా ప్రాంతీయ  పార్టీల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టే దిశ‌గా వేగంగా సాగుతున్నారు. ప్ర‌ధాని మోడీని దేశం నుంచి త‌రిమికొట్టాల‌ని సంచల‌న వ్యాఖ్య‌లు చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని అంటున్నారు. జ‌నాల మ‌ద్ద‌తు ఉంటే కొత్త జాతీయ పార్టీ పెట్టేందుకూ వెన‌కాడ‌న‌ని స్ప‌ష్టం చేశారు. మ‌రోవైపు బీజేపీ, కాంగ్రెసేత‌ర పార్టీల‌తో క‌లిసి కూట‌మి …

Read More »

పోలీస్ స్టేషన్లో ఎంపీ సురేష్ హల్ చల్

విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వైసీపీ ఎంపీ నందిగం సురేష్ హల్ చల్ చేశారు. తన అనుచరులను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటూ ఎస్ ఐ, సిబ్బందితో నందిగం సురేష్, ఆయన అనుచరులు వాగ్వాదానికి దిగారు. అంతేకాదు, ఈ వ్యవహారాన్ని ఫోన్ లో రికార్డు చేస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ పై కూడా సురేష్ అనుచరులు దురుసుగా ప్రవర్తించారు. తన ఫోన్ ఇవ్వాలని కోరిన శ్రీనివాస్ పై సురేష్ అనుచరులు …

Read More »

ఎవ‌రూ శాశ్వ‌తం కాదు.. ఇదే జ‌గ‌న్ మాయ‌

అధికార ప్ర‌భుత్వానికి ఉద్యోగుల విధేయులుగా ప‌ని చేయాల్సిందే. లేదంటే అధికారంలో ఉన్న నాయ‌కుల ఆగ్ర‌హానికి గురి కావాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి అనుగుణంగా న‌డుచుకున్నా.. కొంత‌మంది ఉద్యోగుల‌పై సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాలు సంచ‌ల‌నంగా మారాయి. అధినేత‌కు కోపం వ‌స్తే ఎంత‌టి వారికైనా వేటు పోటు త‌ప్ప‌ద‌నేలా ప‌రిస్థితులు మారాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎవ‌రూ ఏ ప‌ద‌విలోనూ శాశ్వ‌తం కాదు.. అంద‌రూ జ‌గ‌న్ ఆడించే నాటకంలో పాత్ర‌లు …

Read More »

రెండు క‌త్తులు ఒకే ఒర‌లో

రాజ‌కీయాలు మ‌హా విచిత్రంగా ఉంటాయి. ప్ర‌త్య‌ర్థి పార్టీల నాయ‌కులు ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేసుకోవ‌డం స‌హ‌జ‌మే. ప‌రిస్థితుల‌ను బ‌ట్టి మ‌ళ్లీ తిరిగి ఒక్క‌ట‌వ‌డం ఎప్పుడూ క‌నిపించేది. మ‌రోవైపు ఒకే పార్టీలోని నేత‌ల మ‌ధ్య కూడా విభేదాలు వ‌స్తాయి. బ‌ద్ధ శ‌త్రువులుగా మారిపోతారు. కానీ మళ్లీ అంత‌లోనే మిత్రుల‌వుతారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లోనూ అలాంటి అరుదైన దృశ్య‌మే క‌నిపించింది. ఒక‌ప్పుడు మాట‌ల‌తో ఒక‌రిపై మ‌రొక‌రు రెచ్చిపోయిన నేత‌లు ఇప్పుడు ఒక్క‌చోట …

Read More »

సీఎం సొంత జిల్లాకు చెందిన అధికారే ఏపీ కొత్త డీజీపీ

రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డిని అద‌న‌పు బాధ్య‌త‌ల‌తో నూతన డీజీపీగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. రాజేంద్రనాథ్‌రెడ్డి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. అంతేకాదు.. సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌కు చెందిన వారు. విశాఖపట్నం, విజయవాడ పోలీస్ …

Read More »

రాజ్య‌స‌భ సీటు.. అలీ కామెంట్ ఇదే!

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముఖ్య‌మంత్రి కాకముందు నుంచే వారి కుటుంబంతో పరిచయం ఉందని  సినీ నటుడు అలీ చెప్పారు. ఇవాళ సీఎంతో భేటీ తరువాత మీడియాతో మాట్లాడారు. సోమవారం సీఎంవో నుంచి పిలుపు వచ్చిందని.. అతి త్వరలోనే పార్టీ కార్యాలయం నుంచే ప్రకటన ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. సినీనటుడు, వైసీపీ నేత అలీ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీ అయ్యారు.  అతి త్వరలో పార్టీ …

Read More »

కేసీఆర్ తొలి విజ‌యం.. దేవెగౌడ మ‌ద్ద‌తు

కేంద్రంలోని బీజేపీ, మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు మ‌ద్ద‌తు లభిస్తోంది. తాజాగా మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ… సీఎం కేసీఆర్ కు తన సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. దేశంలో మత తత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు ముఖ్యమంత్రిని అభినందించా రు. ఈ మేరకు కేసీఆర్కు దేవెగౌడ ఫోన్ చేశారు. `’రావు సాబ్… మీరు అద్భుతంగా పోరాడుతున్నారు. మతతత్వ శక్తుల …

Read More »