ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి పాలకులు ఏం సాధిస్తారని జనసేన అధినేత పవన్ ప్రశ్నించారు. ఎన్టీఆర్ బదులు వైఎస్ఆర్ పెడితే వసతులు మెరుగవుతాయా అని నిలదీశారు. వసతుల కల్పన వదిలేసి పేర్లు మార్చడం అర్థంలేని చర్య అని వ్యాఖ్యానించారు. కొత్త వివాదాలు సృష్టించేందుకు ycp ప్రభుత్వం ఈ పని చేసిందని మండిపడ్డారు. ఎన్టీఆర్ బదులుగా వైఎస్సార్ అని పెడితే విశ్వ విద్యాలయంలోనూ, రాష్ట్రంలోనూ వసతులు మెరుగవుతాయా అని ప్రశ్నించారు. …
Read More »సీఎం జగన్కు కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్
సీఎం జగన్కు కేంద్ర ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. పార్టీలో శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నిక చెల్లదని సీఈసీ స్పష్టం చేసింది. ఏ పార్టీలోనూ శాశ్వత పదవులు అనేవి ఉండకూడదని, అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంది. అలాంటి ఎన్నిక.. నియమాలను ఉల్లంఘించినట్లేనని సీఈసీ పేర్కొంది. వైసీపీ జనరల్ సెక్రటరీకి కేంద్రం ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఎంపిక చెల్లదని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. పార్టీ …
Read More »టార్గెట్ 250 ఓట్లు
మునుగోడు ఉపఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా పావులు కదుపుతోంది. ఉపఎన్నిక ప్రచారంలో కానీ తర్వాత పోలింగ్ రోజు అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎల్పీ నేత బట్టి విక్రమార్క కీలకమైన సమావేశం నిర్వహించారు. బట్టి చెప్పినదాని ప్రకారం ప్రతి పోలింగ్ బూత్ కమిటి కచ్చితంగా 250 ఓట్లను తక్కువ కాకుండా పార్టీకి వేయించాలని టార్గెట్ పెట్టారు. మునుగోడు నియోజకవర్గంలో 45 బూత్ కమిటీలున్నాయి. అంటే బూత్ కమిటీల నుండే సుమారుగా 11500 …
Read More »పాత ఆలోచనకే పవన్ ఓటు
వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడ నుండి పోటీ చేస్తారు ? పార్టీలో నేతలతో పాటు ఆయన అభిమానుల్లో విపరీతంగా వినిపిస్తున్న ప్రశ్నిదే. తమ నియోజకవర్గం నుంచి పోటీ చేయమంటే కాదు తమ దగ్గరే పోటీ చేయాలని డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గాలివే అని చాలా నియోజకవర్గాల పేర్లు వినబడ్డాయి. ఒకసారి భీమిలి అని, మరోసారి పిఠాపురం అని, కాదు కాదు మళ్ళీ …
Read More »రహదారుల కోసం.. మహిళా ఎమ్మెల్యే రోడ్డుమీదే స్నానం
ఏపీలో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయని.. వాటికి కనీసం మరమ్మతులు కూడా చేయడం లేదని.. కొత్త రోడ్ల మాట ఎలా ఉన్నా.. కనీసం గుంతలైనా పూడ్చాలని.. రాజకీయ నాయకులు.. స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక, ఆటోవాళ్లు.. విద్యార్థులు.. గ్రామస్థులు.. చందాలు వేసుకుని.. మరీ కొన్ని చోట్ల రహదారులు బాగుచేసుకున్న పరిస్థితిని మనం గమనించాం. ఇక, జనసేన నాయకులు.. వినూత్న నిరసనలు వ్యక్తం చేశారు. అయితే.. ఇప్పుడు …
Read More »బాబు కన్నా.. నాకే ఎన్టీఆర్ అంటే.. గౌరవం: జగన్
ఏపీలోని విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తూ.. వైసీపీ ప్రభుత్వం అసెం బ్లీలో బిల్లును ప్రవేశ పెట్టింది. దీనిపై ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ను తానుకానీ, పార్టీ నాయకులు కానీ.. ఎక్కడా .. ఎప్పుడూ.. కించపరచలేదన్నారు. ఆయనపట్ల తనకు ఎఫెక్షన్ ఉందని తెలిపారు. పాదయాత్ర సమయంలో కూడా.. ఎన్టీఆర్ పట్ల ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. అంతేకాదు.. ఆ సమయంలో కొందరు జిల్లాకు …
Read More »రేవంత్ రాంగ్ టైమింగ్
తానేం చేస్తున్నాడో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కైనా అర్ధమవుతోందా లేదా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. పీసీసీ ఆఫీసు బేరర్ల సంఖ్యను పెంచటంతో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటిల్లో మార్పులు చేయాలని డిసైడ్ అయ్యారు. సరిగా పనిచేయని డీసీసీ అద్యక్షులను మార్చేసి కొత్తవారిని నియమించాలని రేవంత్ అనుకున్నారు. ఇందుకనే కేరళలో పాదయాత్రలో ఉన్న రాహుల్ గాంధీని కలిసి గ్నీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ అసలు రేవంత్ …
Read More »మూడేళ్లలో జగన్ దోపిడీ 2 లక్షల కోట్లు: నారా లోకేష్
ఏపీ సీఎం జగన్పై టీడీపీ యువ నాయకుడు.. మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డా రు. గడిచిన మూడేళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్ ప్రజాధనాన్ని దోచేశారని ఆయన విమర్శలు గుప్పించారు. దీని విలువ దాదాపు 2 లక్షల కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. తాజాగా బుధవారం ఉదయం.. నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ శాసనసభ పక్షం నిరసన తెలిపింది. రాష్ట్రంలో సహజ వనరులైన.. భూమిని, ఇసుకను.. వైసీపీ నాయకులు …
Read More »వైసీపీకి తొలి దెబ్బ.. ఎన్టీఆర్ పేరు మార్పుపై.. యార్లగడ్డ రాజీనామా!
వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న తలతోకలేని నిర్ణయాలపై కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తితో ఉన్న వారు చాలా మంది ఉన్నారు. అయితే.. వీరు వైఎస్పై అభిమానంతో సర్కారుకు మద్దతు ఇస్తున్నారు. అయితే.. ఈ దూకుడు మరింత దారుణంగా మారిపోవడంతో విసుగు చెందిన వారు.. పార్టీ నుంచి.. పదవుల నుంచి కూడా బయటకు వస్తున్నారు. తాజాగా కీలకమైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ను మారుస్తూ.. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన అభిమానులు …
Read More »జగన్ పిచ్చి ఆలోచనలు మానుకో
విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చేందుకు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించడాన్ని.. టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. 1986లో ప్రారంభమైన హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు జగన్ ప్రభుత్వ దివాళాకోరుతనమన్నారు. తెలుగు దేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారని ఆయన …
Read More »‘ఎన్టీఆర్’ తో పెట్టుకున్న జగన్.. రాంగ్ ఐడియా
సంస్ధలకు, వ్యవస్థలకు పాలకులు తమ పేర్లు పెట్టుకోవటం మామూలైపోయింది. తమ హయాంలో ఏర్పాటుచేసిన వాటికి తమిష్టమొచ్చిన పేర్లు పెట్టుకోవటంలో తప్పులేదు. అంతేకానీ అంతకు ముందు ప్రభుత్వం పెట్టిన పేర్లను తీసేసి తమిష్టం వచ్చిన పేర్లు పెట్టుకోవటం మాత్రం తీవ్ర అభ్యంతరకరమనే చెప్పాలి. ఇంతకీ విషయం ఏమిటంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటిగా పేరు మార్చటానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెడీ అవుతోంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకముందు …
Read More »ఢీ అంటే ఢీ.. టీడీపీదే పైచేయి..!
అసెంబ్లీలో టీడీపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఒక్క అసెంబ్లీలోనే కాదు.. శాసన మండలిలోనూ.. టీడీపీ చాలా వరకు దూకుడుగానే ఉంది. నిజానికి అసెంబ్లీలో రెండు ప్రధాన ఇబ్బందులను టీడీపీ ఎదుర్కొంటోంది. ఒకటి.. పార్టీకి నాయకుడు లేకపోవడం. అంటే.. పార్టీ అధినేత చంద్రబాబు.. సభకు రాకుండా.. దూరంగా ఉండడం ఒక పెద్ద మైనస్. రెండోది.. ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 12 లేదా 13 మంది ఎమ్మెల్యేలే సభకు హాజరుకావడం. దీంతో …
Read More »