Political News

రోజా 2.0 చూస్తామా

అనూహ్యంగా మంత్రివర్గంలో ఆర్కే రోజా చోటు దక్కించుకున్నారు. మంత్రివర్గం ఆశావహుల జాబితాలో రోజా పేరు కొన్నిసార్లు కనబడి మరికొన్నిసార్లు మాయమైపోయింది. దాంతో తనకు ఇక మంత్రిపదవి యోగం లేదని నిర్ధారించుకున్న నగిరి ఎంఎల్ఏ వెళ్ళి హైదరాబాద్ లో కూర్చున్నారు. అయితే తెరవెనుక ఏమి మార్పులు జరిగిందో ఏమోకానీ చివరి నిముషంలో మంత్రివర్గంలోకి రోజా కూడా చేరిపోయారు. దాంతో రోజా అభిమానులు, రాజకీయాలకు సంబంధం లేని కొంతమంది కూడా హ్యాపీగా ఉన్నారు. …

Read More »

పృథ్వీకో న్యాయం.. అంబటికో న్యాయమా?

ఈ రోజుల్లో అవినీతి ఆరోపణల కంటే కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు రాజకీయ నాయకుల ఇమేజ్‌ను ఎక్కువ డ్యామేజ్ చేస్తుంటాయి. మహిళల్ని లైంగికంగా వేధించినా, శృంగారం జరిపినా.. లేక సరస సంభాషణలు చేసినా.. వాటి తాలూకు ఆడియోలు, వీడియోలు రిలీజయ్యాయంటే అంతే సంగతులు. ఇమేజ్ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. జనాల్లో ఏహ్య భావం కలుగుతుంది. సోషల్ మీడియాకు ఇలాంటి కంటెంట్ దొరికితే పరువు గంగలో కలిసిపోతుంది. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ …

Read More »

సజ్జలే టార్గెట్ అవుతున్నారా ?

అధికార పార్టీలో నేతల దృష్టిలో పాపాల భైరవుడు ఎవరయ్యా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి పేరే వినబడుతోంది. నెగిటివ్ గా ఎవరు టార్గెట్ చేయాలన్నా ముందుగా సజ్జలే టార్గెట్ అవుతున్నారు. మంత్రి పదవుల్లో తమ పేర్లు లేకుండా పోవటానికి సజ్జలే కారణమని కొందరు సీనియర్లు తీవ్ర అసంతృప్తిగా ఉండటమే ఉదాహరణ. గతంలో పీఆర్సీ విషయంలో కూడా ఉద్యోగ సంఘాల నేతలు డైరెక్టుగా సజ్జలపైనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం గుర్తుండే …

Read More »

మ‌ళ్లీ సీన్లోకి పెద్దిరెడ్డి..కోటంరెడ్డి ఏం పాపం చేశారో ?

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా చాలా పుణ్యం చేసుకుని ఉండాలి అందుకే ఆ జిల్లాకు మూడు మంత్రి ప‌ద‌వులు ఇచ్చి జ‌గ‌న్ స‌ర్ గౌర‌వించారు. ఇదే స‌మ‌యంలో నెల్లూరుకు అన్యాయం జ‌రిగిపోయింది. అనిల్ యాద‌వ్ ను త‌ప్పించారు. రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన కోటంరెడ్డి కి ఛాన్స్ లేకుండా పోయింది. దీంతో కోటం రెడ్డి చాలా భావోద్వేగానికి లోనయ్యారు. వైఎస్సార్ నాన్న పులివెందుల బిడ్డ రాజారెడ్డి మొద‌లుకుని, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి …

Read More »

జగన్ మీద ఒత్తిడి పెడుతున్నారా ?

మంత్రివర్గంలో చోటు దక్కలేదని ఖాయమవ్వగానే కొందరు ఎంఎల్ఏల మద్దతుదారులు గోల మొదలుపెట్టారు. జగ్గయ్యపేట, మాచెర్ల, చోడవరం, శ్రీశైలం ఎంఎల్ఏలు సామినేని ఉదయభాను, కరణం ధర్మశ్రీ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి మద్దతుదారులు రచ్చ చేస్తున్నారు. గెలిచిన ఎంఎల్ఏలందరు క్యాబినెట్లో అవకాశం ఆశించటం చాలా సహజం. కానీ ఉన్న పరిమితుల కారణంగా అందరికీ మంత్రులుగా అవకాశం ఇవ్వటం ఎవరివల్లా సాధ్యం కాదు. అసెంబ్లీ స్ధానాల సంఖ్యలో 15 శాతానికి మించకుండా …

Read More »

ఫెయిల్ అయిన జగన్ ఆలోచనలు

మంత్రివర్గం కూర్పులో జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు నూరుశాతం సక్సెస్ కాలేదనే చెప్పాలి. వివిధ కారణాల వల్ల కొందరి విషయంలో రాజీపడాల్సొచ్చింది. మూడేళ్ళ క్రితం మంత్రివర్గం ఏర్పడినపుడు రెండున్నరేళ్ళ తర్వాత 90 శాతం మందిని మార్చేస్తానని ప్రకటించారు. సరే తర్వాత జరిగిన అనేక పరిణామాల కారణంగా మూడేళ్ళవుతున్న సమయంలో కొత్త క్యాబినెట్ ఏర్పాటు కాబోతోంది. పాత+కొత్త మంత్రుల కాంబినేషన్ తో జగన్ క్యాబినెట్-2 సోమవారం ఉదయం కొలువు తీరబోతోంది. జగన్ మొదట్లోనే …

Read More »

ఈ ఆరుగురు అదృష్టవంతులే

ఈరోజు ప్రమాణస్వీకారం చేయబోతున్న జగన్ క్యాబినెట్-2 లో ఆరుగురిని అదృష్ట వంతులనే చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఎంఎల్ఏగా గెలిచిన మొదటి సారే మంత్రి పదవి వరించటం అంటే మామూలు విషయంకాదు. వారి జిల్లాల్లో సీనియర్లున్నారు, సామాజికవర్గం ఎంఎల్ఏలు కూడా ఉన్నారు. అయినా మంత్రిపదవులను దక్కించుకున్నారంటే నూరుశాతం సుడి బలంగా ఉండటమే కారణమనే సెటైర్లు పడుతున్నాయి. గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి నియోజకవర్గం నుండి 2019 ఎన్నికల్లో మొదటిసారి గెలిచారు. విడదల రజని గుంటూరు …

Read More »

మంత్రి పదవి పోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మేకతోటి?

కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ వైసీపీలో తుపాను రేపింది. అంచనాలకు మించిన అసంతృప్తి అధికార పార్టీని.. అధినాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొత్త మంత్రి వర్గ ఏర్పాటు ప్రకటనతో కొంత నిరసనలు చోటు చేసుకుంటాయని భావించినప్పటికీ.. ఈస్థాయిలో నిరసనలు.. ఆగ్రహావేశాలు వ్యక్తమవుతాయన్న అంచనా మాత్రం లేదని చెబుతున్నారు. అదే సమయంలో.. పదవులు పోయిన వారి విషయంలో అధినాయకత్వం వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు వివాదంగా మారింది. పదవులు పోయినోళ్లందరికి ఒకేలాంటి ఓదార్పు ఉండాల్సింది పోయి.. …

Read More »

జగన్ 2.0లో ఇన్ ఎవరు? ఔట్ ఎవరు? సేఫ్ ఎవరు?

పజిల్ వీడిపోయింది. మాటలు చెప్పడానికి వాటిని ఆచరించటానికి మధ్య అంతరం ఎంతలా ఉంటుందన్న విషయంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాజా పరిణామాలు ఫుల్ క్లారిటీని ఇస్తాయన్న మాట వినిపిస్తోంది. ఇప్పటివరకు జగన్ కు తిరుగులేదు.. ఆయన మాటకు ఎదురే లేదన్నట్లుగా అనుకున్న దానికి భిన్నంగా.. ఆయనకు పరిమితులు ఉన్నాయన్న విషయం తాజా పరిణామాలు స్పష్టం చేశాయి. కాబినెట్ మార్పు విషయంలో అంతా తన మాటే ఫైనల్ అన్నట్లుగా …

Read More »

కొత్త సైనికుల త‌యారీలో జ‌గ‌న్ !

Jagan

యుద్ధం ఎలా ఉన్నా ఎప్పుడు ఆరంభం అయినా మ‌న‌కు మాత్రం ఓ నిర్థిష్టం అయిన స‌మాచారం వ‌చ్చేలోగానే ప్ర‌మాద ఘంటిక‌లు మోగిపోవ‌డం ఖాయం. అసలు యుద్ధం ప్ర‌త్య‌ర్థితో అయితే బాగుంటుంది కానీ అంతఃక‌ల‌హాల దృష్ట్యా అంత‌ర్యుద్ధానికి తావిచ్చే ప‌రిణామాల కార‌ణంగా ఆంధ్రావ‌నిలో నాట‌కీయ ప‌రిణామాలు చోటుచేసుకోనున్నాయి. అంతా నేను అని రాయ‌డం బాగుంది. అంతా నేనే అని చెప్ప‌డంలోనే ఇప్ప‌టి ఇబ్బంది దాగి ఉంది. యుద్ధం లో భాగంగా టీడీపీ …

Read More »

2024 టీడీపీ గెలుపు ఆశ‌ల‌న్నీ వాళ్ల‌పైనే…!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని అధికార పీఠాన్ని అధిరోహించాలి. ఇదీ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ల‌క్ష్యం. అయితే.. దీనిని సాకారం చేసుకునేందుకు ఉన్న మార్గాలు ఏంటి? ఎలా వెళ్లాలి ? ఏం చేయాలి ? అనేది కీల‌కంగా మారింది. జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకున్న మాత్రాన‌.. అధికారంలోకి వ‌చ్చేస్తారా? అనేది ఇప్పుడు.. మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఎందుకంటే.. 2014లో బ‌య‌ట నుంచి మ‌ద్ద‌తిచ్చిన‌ప్పుడు కూడా.. అనుకున్న విధంగా మెజారిటీ రాలేదు. ఇక‌, …

Read More »

గౌతమ్ రెడ్డి ప్లేసులో వచ్చేది ఎవరు?

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్థానంలో మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలోకి దిగబోతున్నారు. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ నుండి గౌతమ్ ప్రాతినిధ్యం వహించారు. అయితే ఆయన హఠాత్తుగా మరణించటంతో ఇపుడా స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే విషయంలో ఇన్ని రోజులు సస్పెన్స్ నడిచింది. ఫైనల్ గా ఈ సస్పెన్స్ కు మేకపాటి ఫ్యామిలి తెరదించింది. గౌతమ్ సోదరుడు విక్రమ్ రెడ్డి ఆత్మకూరులో పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. మేకపాటి …

Read More »